Thursday, April 21, 2011

నా జీవితం ...........పంచుల మయం

నాకు కొంతమంది గట్టిగా పంచులు ఇచ్చారు.... వాటిలో కొన్ని మీతో share చేసుకుందామని.....

"ప్రతి అమ్మాయికి తల్లి అవ్వాలనే కోరిక ఉంటుంది సంజీవ్...ఒక్క అమ్మాయికినా అలంటి కోరిక తీర్చడం కోసమే నేను పెళ్లి చేసుకున్దామనుకుంటున్నా " .... నా స్నేహితుడు

"i have inquired re....i know lot of IAS people...i think i can get the paper leaked and i am really sure we can bribe the interview panel " Civils కి prepare అవుతున్న ఒక అమ్మాయి.

"షాప్  వాడితో మాట్లాడాను...నా iphone motherboard replace చెయ్యడానికి 4000 అవుతుంది అన్నాడు ....చీప్ కదా "...ఒక iphone owner

ఏదో టాపిక్ లో ఆ రోజు పౌర్ణమి అన్న విషయం మాట్లాడుకుంటూ ఉంటె ...ఒక MBA చదువుతున్న అమ్మాయి అడిగింది " Wont there be a fullmoon next week ?"

"Mains లో content సరిగ్గా ఉన్నా లేకపోయినా flowery language వాడితే చాలంట , మా సర్ చెప్పారు "----ఇంకో civils aspirant

"Mother Theresa ప్రజలకి మంచి కన్నా చెడె ఎక్కువ చేసింది " ...ఒక RSS కార్యకర్త



"పౌర్ణమి చంద్రుడు ఇలా ఎన్ని రోజులు ఉంటాడు ?" .. అమాయకంగా ఒక M.A student

"OU లో విద్యార్థుల మీద BSF (Border security force) use చేసారు " .... update from Facebook "jai telangana group" ...BSF కి CRPF కి confuse అయ్యాడు పాపం BSF కాదు అన్నా వాళ్ళు వినడం లేదు .

అడవిలోని  క్రూరమృగాలు చుట్టుపక్కల గ్రామస్థుల మీద దాడి చేయడానికి కారణం ఈ సామ్రాజ్యవాద వ్యవస్థే ----ఒక కమ్యునిస్ట్

"Electronic voting machine లోని chip ని hack చేసి అమెరికా మన ఎన్నికల ఫలితాలని నియంత్రిస్తోంది"--- ఒక ప్రముఖ బ్లాగర్

గుర్రం  జాషువా గురించి, ఆయన రాసిన పుస్తకం "గబ్బిలం" గురించి ఒక batch కి వివరిస్తే ....వాళ్ళు గుర్రం జాషువా జన్మదినోత్సవ సభ ని "గబ్బిలం షో " గా refer చేయడం మొదలుపెట్టారు.

"నీ  మొబైల్ టాప్ చేసారు ...నువ్వు ఎవరితో ఎం మాట్లాడుతున్నావో  అంతా రికార్డు అవుతోంది " --- ఒక తొక్కలో గొడవ తర్వాత కాల్ చేసిన వ్యక్తి

FDI's వల్ల చాలా మంది వూరినుంచి వచ్చిన వాళ్ళకి software ఉద్యోగాలు  వచ్చేసాయి ....pubs లో ఆ వూరోల్లని భరించలేకపోతున్నాము  ...అందుకే FDI అసలు ఉండకూడదు  ------ సిటీ లో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి


 కాలుష్యానికి  కారణం capitalism --- ఇంకో కమ్యునిస్ట్


 "ఒరేయ్ ఎక్కడున్నావ్ రా " -- landline కి కాల్ చేసిన నా friend

"మట్టితో సరస్వతి దేవి బొమ్మ తయారుచేస్తే ఏమి రాయకపోయినా నాకు first rank వచ్చింది "--- చిన్నప్పుడు నా తమ్ముడు

"అంటే చిన్నపటినుంచి నా చదువు విషయం లో ఎప్పుడు hindu gods help చేసారు ...ఇప్పుడు Jesus help తీసుకుంటే వీళ్ళంతా ఏమన్నా feel అవుతారేమో అని ఆలోచిస్తున్నా " ---- ఒక వీర భక్తురాలు  

"sister sentiment song వల్లనైనా అన్నవరం మూవీ 200 days ఆడుతుంది " ---- ఒక పవన్ కళ్యాన్ అభిమాని

"మగవాళ్ళు ఎప్పుడు ఆడవాళ్ళని తొక్కిపెట్టారు ....ఒక ఆడది అలా చేస్తే వచ్చిన నష్టం ఏమి లేదు "---- ఇందిరా గాంధీ emergency విధించడాన్ని సమర్థిస్తూ ఒక అభినవ యువతీ 



Wednesday, April 06, 2011

రుద్రవీణ

అన్నా హజారే అవినీతి పై పోరాటం చేపట్టారు....దేశం లో పెరుగుతున్న అవినీతి....పేరుకుపోయిన నల్లధనం  మీద ఈ పోరాటం. ప్రపంచ కప్ గెలిచినందుకు సంబరాలలో మునిగిఉన్న ఒక సగటు భారతీయుడు ఎంత వరకు  అన్న హజారే కి సపోర్ట్ ఇస్తాడు అన్నది సమస్య. పాకిస్తాన్ తో గెలిచిన మాచ్  CWG అవినీతిని మర్చిపోయేలా చేసింది. ....ఇక కప్ గెలిచినతర్వాత భారతీయులు అన్ని మర్చిపోయారు....ఇప్పుడు సగటు భారతీయుడు గర్వంగా ఉన్నాడు. ఆనందం లో ఉన్నాడు. Facebook , twitter లో ప్రపంచ కప్ వీడియోలు చూసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు అన్నా హజారే వచ్చి అవినీతి మీద పోరాటం అంటే ....ప్రజలు ఎంత వరకు స్పందిస్తారు అనేది ఒక పెద్ద doubt. 

దేశం  లో పెరుగుతున్న అవినీతిని ఎదుర్కోడానికి ప్రభుత్వం అధీనం లో లేని ఒక సంస్థ అవసరాన్ని First Administrative reform commission గుర్తించింది. Judiciary and election commission లాగా ప్రభుత్వం తన అధికారం చేలయించలేని ఒక సంస్థ ఆలోచనే లోక్ పాల్ . లోక్ పాల్ కేంద్రస్థాయిలో అయితే లోకాయుక్త రాష్ట్ర స్థాయిలో.
1966 లో లోకపాల్ బిల్  మొదలయింది. దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు...లోక్ సభ ఆమోదిన్చేసింది...రాజ్యసభ చెయ్యలేదు...తర్వాత ప్రభుత్వం మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ బిల్ ఎప్పుడు పాస్ కాలేదు. ఇటీవలే NAC (National advisory committee headed by Sonia Gandhi ) lokpal draft ని తిరస్కరించింది.

ప్రతీ ప్రభుత్వం అవినీతి మీద పోరాటం అంటూనే ఉంటుంది. 2G scam ఇష్యూ లో చిదంబరం కూడా లోక్పాల్ బిల్ మీద కాసేపు గొణిగారు. కానీ ఎవరు పెద్దగా  పట్టించుకోలేదు.

ప్రపంచ కప్ సంబరాలలో కొంతమంది ఉన్నారు ..జయలలిత గెలుస్తుందా కరుణానిధి గెలుస్తాడా అని కొంతమంది ఆలోచిస్తున్నారు.... సత్యసాయి అర్యోగ్య పరిస్థితి గురించి కొంతమంది ఆందోళన సాగుతోంది...IPL లో ఎవరు గెలుస్తారు అని  ప్రజలు చూస్తున్నారు....అసలు పూనం పాండే బట్టలు విప్పుతుందా విప్పదా అని కొంతమంది చూస్తున్నారు....ఇవన్ని కాదని అనా హజారే అవినీతి మీద పోరాటం అంటున్నాడు...ఏంటో అయన!!! ఆయన స్పూర్తిగా తీసిన రుద్రవీణ సినిమా చూస్తూ కొంతకాలం ఆగి ...ప్రజలకి excitement news ఏది లేని టైం లో అయన ఉద్యమిస్తే బాగుండేదేమో....అప్పుడు అతనికి మంచి సపోర్ట్ కచ్చితంగా దొరికేది. కపిల్ సిబాల్ ఏదో పిచ్చివాగుడు మళ్ళి వాగితే తప్ప ఈ ఉద్యమాన్ని మీడియా కూడా పెద్దగ కవర్ చేసేలా అనిపియ్యడం లేదు.



Friday, April 01, 2011

అసలు మా తాతని అనాలి !!

మనలో ఉండే లోపలకి కారణం తల్లిదందండ్రుల ద్వారా మనకొచ్చిన  జీన్సు వల్లే అని అన్త్రోపోలోజి లో  ఒక థియరీ ఉంది. 'వీడికి వీడి తాత పోలికోచ్చింది ', ' మేనమామ పోలిక , మేనత్త చాలిక  ' .....ఇలాంటివి అన్నమాట.

ఇప్పుడు  నేను మా తాతని ఎందుకు అనాలి అన్న అంటే...అయన కాని, అయన పిల్లలు కాని, అయన మనవలలో కాని ఎవరు కళాకారులు కారు. మా తాతయ్య చిన్నతనం లోనే అయన తండ్రి చనిపోడం వల్ల మా ముత్తాత గురించి పెద్దగా సమాచారం ఏమి లేదు కాబట్టి వదిలేస్తున్నాను.

మా  మొత్తం కుటుంబం లో  కళాభిమానులు, కళాపోషకులు ఉన్నారు కాని, కళాకారులు మాత్రం లేరు. మా తాత, మా నాన్న, మా బాబాయిలు, మా అత్త , మా  కసిన్సు , నేను ......ఎవ్వరం కళాకారులం కాదు.  బయాలజీ లో బొమ్మలేయడం తప్ప ఎవ్వరు చిత్రలేఖనం లోకి ప్రవేశించలేదు.  మా కుటుంబం మొత్తం భయనకరంగా పాటలు పాడతారు. ఒక కూనిరాగం తియ్యడం కూడా సరిగ్గా రాదు, అసలు ముందు కనీసం ఒక్క పాట లిరిక్సు కూడా గుర్తు ఉండవు..మహా అయితే ఒక నాలుగు లైన్లు గుర్తుంటాయి అంతే ...నచ్చిన పాట ట్యూన్ కూడా గుర్తుండదు. సాహిత్యం, సంగీతం గుర్తు లేవు కదా అని మేము పాటలు పాడటం ఎప్పుడు ఆపలేదు. we might be the horrible singers, but still we sing. ఒక పాట లిరిక్ లోంచి ఇంకో పాట లిరిక్ లోకి వెళ్ళిపోయి, ఒకపాట ట్యూన్ ని ఇంకో పాట లిరిక్ కి జత చేర్చి మరీ పాడటం మాకు అలవాటు. చిన్నగా పాడటం కాదు, గొంతెత్తి పెద్దగా , అవే పాటలని ఇష్టం వచ్చినట్టు మళ్ళి మళ్ళి పాడుతూనే ఉంటాం. ఆ అలవాటు అందరికి ఉంది...మొత్తం కుటుంబానికి....ఎవరికీ వారికీ వారి సొంత పాటలు ఉంటాయి....ఒక నాలుగయిదు అలా ఉంటాయి...గత 20 సంవత్సరాలుగా అవే పాటలు పాడుతున్నారు. దాదాపుగా మంచి జోరు మీద ఎప్పుడు ఉంటారు కాబట్టి, ఎప్పుడు అలా పాటలు పాడేస్తూనే ఉంటారు. ఈ కళ మా అన్నయ్యకి  కొంచం ఎక్కువ  వచ్చింది....మా అన్న...మూవీ డయలాగులు కూడా అలానే పడేస్తూ ఉంటాడు ( ఒక్కసారి ఊహించుకోండి ...మగధీర మూవీ లోని "శత్రువులని చండాడే ధీరుడు భైరవ " అన్న ఒక్క లైను మీ బైక్ వెనకాల ఎవరినా కూర్చుని ...35km drive లో ప్రతి 20 సేకాన్లకి ఒకసారి అంటూ ఉంటె )...

పాటల గురించి వదిలెయ్యండి...అసలు ఈ పోస్టు నేను రాయడానికి ముఖ్య కారణం....నేను డాన్సు చేయలేకపోడం వల్ల పడ్డ కష్టాల గురించి....అసలు సరిగ్గా సంగీతం ఎంజాయ్ చేయలేనివాడు నాట్యం ఎం చేయగలడు చెప్పండి. (నాట్యం అంటే మొత్తం శరీరం తో పాడటం అని Happy feet మూవీ లో చెప్తారు ). గణేష్ నిమజ్జనానికి తీన్ మార్ ట్రై చేసాను....రాలేదు, కాలేజీ లో డిస్కో పెడితే ట్రై చేసాను...రాలేదు...ఆఖరికి ఒక చిన్న గ్రూప్ ముందు కూడా ట్రై చేసాను...రాలేదు...ఈ జీవితానికి డాన్సు చేయడం రాదు అని అనుకున్నాను. ఇంతలో DJ night ఒక దానికి వెళ్ళాం .... నాలాగా డాన్సు రాని వాళ్ళందరిని ఒకచోట పోగేసి ఒకళ్ళ మీద ఒకళ్ళం జాలి  చూపిస్తున్న సమయం లో ....నన్ను dance floor మధ్యలోకి లాక్కుపోడం జరిగింది....ముందు ఎం చెయ్యాలో అర్థం కాలే....నాకు తెలిసిన వాళ్ళలో కనిపించిన వాళ్ళందరికి  వాళ్ల డాన్సు మీద compliments ఇచ్చేస్తునపుడు ...Hitch మూవీ లో will smith తన client కి నేర్పిన steps గుర్తొచ్చాయి....కాసేపు అవి చేశా పాటలు నేను కూడా గట్టిగా పడేస్తూ ...కాసేపు ఎదుటి వాళ్ళని అనుకరించా ...కాసేపు Eminem లా చేతులు వూపా ...నేను చేస్తున్న దానికి నాకే నవ్వు ఆగడం లేదు ....ఇంతలో కొంత మంది ట్రైన్ ఆట మొదలు పెట్టారు...కాసేపు అది ....ఇంతలో "సంతోషం మూవీ " సునీల్ ప్రభుదేవ కి నేర్పిన steps గుర్తోచాయి ...(అదే టాప్ తిప్పడం, సిగరెట్ ఆర్పడం, బల్బు పెట్టడం )...అసలు తలచుకుంటేనే నాకు పిచ్చిగా నవ్వొస్తోంది....వాటిని చేయడం నా వల్ల కాలేదు ఆ టైం కి ....చివరికి Hitch movie steps కే fix అయిపోయా....కాసేపు చిటికలు వేస్తూ ...కాసేపు చప్పట్లు కొడుతూ పాడాను....మొత్తానికి అటు ఇటు గా రెండు గంటలు ఇలా గడిపేసి వచ్చేసాం....చివర్లో ఒక అమ్మాయి వచ్చి....you are not dancing ....but you are singing a lot sanjeev ..అనేసి వెళ్ళిపోయింది!!

అసలు  డాన్సు చేయడానికి మ్యూజిక్ లో రిథం తెలియాలి...అలా తెలుసుకోడం ఒక కళ ...ఆ కళ మా  జీన్సు లో అసలు లేవు...మా నాన్న కి కానీ, మా బాబాయిలకి కాని, మా అన్నయ్యకి, అక్కకి , అత్తకి ...అస్సలు లేవు....మా నాయినమ్మ కాస్త పాటలు పాడేది ....కాబట్టి కచ్చితంగా మా తాతయ్య నుంచి వచ్చిన జీన్సు ప్రభావమే ఇదంతా.....అందుకే ఆయనని అనాలి అసలు .