Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Monday, December 15, 2014

వీటిని పట్టించుకోమా మనం ?

Industrialization , globalization వల్ల ఆదివాసులు తమ ఆదాయాన్ని , సంస్కృతిని కోల్పోతున్నారు కాబట్టి , అవి చాలా చెడ్డవని ఈ మధ్య ప్రచారం బాగా జరుగుతోంది. Avatar , ఉరిమి కధాంశాలు కూడా అవే . ఇప్పుడు మీడియా , మూవీస్ పెరిగి మనకి ఈ సమస్య గురించి ఎక్కువగా వినడం జరుగుతోంది అని, పరిశ్రమలలో వచ్చిన మార్పుల వల్ల పూర్వం కూడా ఇలాంటి బాధలు సమాజం లో కొందరు పడ్డారని, చాలావాటిని మనం నిర్లక్ష్యం చేసామని  నా గట్టి నమ్మకం  . ఉదాహరణకి ...

paperless office కోసం తాపత్రయ పడుతూ , మనం కాగితం పరిశ్రమని దెబ్బ కొడుతున్నాం 
ఈమెయిలు వాడకం ఎక్కువయిపోయి , పోస్టల్ డిపార్టుమెంటు ని దెబ్బ కొట్టాం 
వాహనాలు ఎక్కువగా వాడటం వల్ల , ఎడ్లబడ్ల తాయారు చేసే వారు నష్టపోతున్నారు 
మొబైల్ ఫోను  ల్యాండ్ లైన్ ని,  ల్యాండ్ లైను ఫోను టెలిగ్రాఫ్ ని, టెలిగ్రాఫ్ పావురాల్ని నాశనం చేసేసాయి , 
చైనా నుంచి వచ్చిన కాగితాన్ని బాగా వాడుతూ , దేశి పరిశ్రమ అయిన తాళపత్ర పరిశ్రమని నాశనం చేసారు మన పూర్వీకులు.
మొబైల్ ఫోన్లు ఎక్కువయ్యాక , డబ్బా రేడియోలు కొనడం మానేసారు 
బ్రాడ్బాండ్ నెట్ చవకగా రావడంతో , ఇంటర్నెట్ కేఫ్ లు మూత పడుతున్నాయి 
డిష్ టీవీ , కేబుల్ టీవీ పరిశ్రమని తోక్కిపెట్టాలని చూస్తోంది 
రెడీమేడ్ బట్టల పరిశ్రమ , సందు చివరి టైలర్ కడుపు కొట్టింది 
టూత్ బ్రుష్ ల వల్ల , వేప పుల్లలకి, బొగ్గు పొడికి  ఆదరణ తగ్గింది 
హోమియోపతి , అలోపతి హడావిడిలో మనం అయోర్వేదాన్ని , పసరు మందులని మర్చిపోయాం , అలాగే భూత వైద్యుల్ని కూడా 
తుపాకి పరిశ్రమ  కత్తి పరిశ్రమని, బాణాల పరిశ్రమని , ఈటెల పరిశ్రమని మాయం చేసేసింది 
టీవీ , మూవీలు వచ్చాక నాటకరంగాన్ని పట్టించుకోడం బాగా తగ్గింది 
చైనా నుంచి తెచ్చుకున్న పట్టు ని , మన భారతీయ దేవుళ్ళకి కూడా తొడిగి అదే మన సాంప్రదాయం , సంస్కృతి అన్న భ్రమ లో బ్రతుకుతున్నాం
కంప్యూటర్ పిచ్చి లో పడి  Typewriters ని పట్టించోకవట్లేదు ఎవరు ..
అసలు వాహనాల ఉత్పత్తి పెంచి , ప్రజలకి నడిచే అవసరం తగ్గించి, తద్వారా చెప్పులు తక్కువుగా  అరిగేల చేసి , చెప్పులు కుట్టేవాళ్ళ కడుపు కొడుతున్నాయి Honda, Hundai, Bajaj లాంటి సంస్థలు.

రోడ్డు మీద కుక్కలని , అడివిలో పులుల్ని , పశ్చిమ కనుమలలో అంతరించుకుపోతున్న కప్పల గురించి ఆలోచించే మనం , వీటి మీద ఎందుకు మౌనం గా ఉంటున్నాం ?



 


Wednesday, February 06, 2013

YSR దీక్ష చేయు విధానంబు ఎట్టిదనిన ....

అట్టి విధముగా , చెరసాలలో ఉండిపోయి బయటకు రాలేక , లోపల ఉండలేక , ఎన లేని బాధలు పడుతున్న మన అన్న జగన్ అన్న దగ్గరకి, ఒక తింగరోడు వచ్చి ఉన్నాడు.  అప్పుడు దీనమయిన మొహం పెట్టుకుని ఆ జైలు పక్షి ఈ విధముగా అడిగెను " అయ్యా, తింగరి , ఒక టీవీ ఛానల్ పెట్టి, రెండు సంవత్సరాలుగా దాన్లో మా తండ్రి గారి నెత్తి మీద పూల వర్షం కురిపిస్తున్నా, నాకు ఈ కష్టములు తప్పుట లేదు, ఇక ఈ కష్టములని నేను భరింప జాలను, తమ తింగరి బుర్రని ఉపయోగించి నాకు ఒక పరిష్కారం సూచించమని " యాచించినాడు.

అప్పుడు ఆ తింగరి వాడు, కాసేపు గడ్డం గోక్కుని, కాసేపు గజ్జలు గోక్కొని, ఆలోచించి, జగన్ కి ఇలా సెలవిచ్చెను . " బాబు, మద్రాసు నుంచి ఆంద్ర రాష్ట్రము విడిపోయాక, ఆంధ్రులలో పిచ్చి తగ్గుతూ వచ్చింది.  ఒకానొక కాలములో NTR వచ్చి వోట్లేయ్యమని అడిగితే వేలం వెర్రిగా వేసిన జనం, మొన్న మెగాస్టార్ కి అంత అదృష్టం ఇవ్వలేదు . కాని , మన సహోదరాలు అయిన అరవం వాళ్ళు మటుకు అప్పటికి ఇప్పటికి సిని తారలకలే వోట్లు వేస్తూ, వాళ్ళకి గుళ్ళు కడుతూ తరతరాలుగా తమకున్న పిచ్చిని కాపాడుకుంటూ వస్తున్నారు. అదే విధముగా, తెలుగు వాళ్ళలో కూడా పిచ్చిని పునరుద్దనిచవలసిన సమయము ఆసన్నమయినది.

అది విన్న జగను, " అయ్యా మీరు చెప్పినది సత్యము వాలే తోచుచున్నది, మరి తెలుగు వారిలో కూడా పిచ్చిని పెపొందిన్చావలనేన్న విధానమును సెలవియ్యుడి " అని ప్రాధాయే పడిన పిమ్మట, ఆ తింగరోడు ఈ విధముగా పలికెను " జగనా , మీ తండ్రి గారి పేరు మీద ఒక వ్రతమును ప్రారంభిమ్పుడి , అయ్యప్ప మాల వాలే. ". ఆ ఆలోచన విన్న జగనుడు " ఈ ఆలోచన కొత్తగా , చెత్తగా తోచుచున్నది కావున, పిచ్చి వాళ్ళ మీద పని చెయ్యవచ్చును. ఆ వ్రత విధానమును కూడా సెలవిచ్చి నన్ను ధన్యుడ్ని చేయవలసిందిగా కోరుతున్నాను " అని మిక్కిలి ప్రాధేయ పడినాడు.

అప్పుడు ఆ తింగరి వ్రత విధానమును ఇట్లు వివరించెను " పిచ్చివాళ్ళు, శుచిగా స్నానం చేసి, రాత్రి తాగిన మందు వాసన వదిలించుకుని , తెల్ల బట్టలు వేసుకుని, మేడలో YSR పటము ఉన్న ఒక మాలని ధరించి, నెత్తి మీద అటుకులు బెల్లం మూట పెట్టుకుని , కాలి నడకన మీ తండ్రి గారి సమాధి వరకు నడుచుకుంటూ వెల్లవలె . బయలు దేరే ముందు సాక్షి చానెల్ కి పరిస్తితిని వివరించి, కెమెరా ముందు "స్వామియే YSR " అని అయ్యప్ప భక్తుల తీరులో అరిచి, మీ తండ్రిగారిని పొగిడి, వారి పిచ్చితనమును చాటుతూ , సమాధి చేరిన పిమ్మట , అటుకులు ఉప్మా , బెల్లం తో పాయసం చేసుకుని తిని, మంచి నీటికి బదులు బీరుని తాగవలె . ఇట్టి విధముగా చేసిన, తెలుగు వారి  పిచ్చను ప్రపంచానికి నిరూపించిన ఘనత లభించును " అని సెలవిచ్చెను.

అటు పిమ్మట జగనుడు, తింగరి కి పాదాభివందనం చేసి, తాను బయటకు రాగానే, తన సలహాదారుగా ఉండమని ప్రదేయపడెను . తింగరి , జగనుడి కోరికను మన్నిస్తానని మాట ఇచ్చిన వాడై నిష్క్రమించెను.

Saturday, December 22, 2012

ఛత్తీస్గఢ్ స్కూటర్ యాత్ర by పరవస్తు లోకేశ్వర్

ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శన లో కొన్నా ఈ పుస్తకాన్ని .  ఈ పుస్తకం పేరు చూసి స్టాల్ లోకి వెళ్లి మిగతా పుస్తకాలు చూస్తుండగా, అక్కడి వ్యక్తీ తో మాటలు మొదలయ్యి, ఆయనే పరవస్తు లోకేశ్వర్ అని తెలిసాక ఆనందించా చాలా. ఇదే మొదటి సరి ఒక రచయితని కలవడం. పుస్తకం కొని అయన autograph తీసుకుందామనుకున్న మొదట్లో, కాని, మాటల మధ్యలో ఆయన నా పేరు అడగడం, వెంటనే నా ఇంటిపేరు అడగడం తో కాస్త చిరాకేసింది. ఇంటి పేరు ఎందుకు అసలు ? నా కులం గురించి ఎందుకు అసలు? ఫలానా కులం అయితే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారా ?

నిజం చెప్పాలంటే, కాస్త అదే చిరాకు మీద పుస్తకం మొదలు పెట్టా.  ఒకసారి అటు ఇటు తిరగేస్తే కమ్యూనిస్ట్ కంపు కాస్త అనిపించింది. సర్లే, కొన్నాం కదా అది చదవడం మొదలు పెట్టాక పుస్తకం చాల నచ్చింది. రచయిత , అతని స్నేహితుడు , ఒక Honda Activa మీద ఛత్తీస్గఢ్ లో పది రోజుల పాటు తిరిగినప్పటి అనుభవాలు , ఆ తర్వాత మరో స్నేహితుడితో రెండు సంవత్సరాల తర్వాత మరల తిరిగిన అనుభవాలు.

ఛత్తీస్గఢ్ చరిత్ర, సాంఘిక స్తితిగతులు, నక్సల్ ఉద్యమం , కొత్తగా ఏర్పడిన రాష్ట్రము పట్ల ప్రజల ఆనందం., గిరిజనులు , ఎక్కడి నుంచో వచ్చి అక్కడ స్థిరపడి పోయిన వాళ్ళు, భూత వైద్యుల మధ్య ఒక అలోపతి డాక్టర్ కస్టాలు, చాలా బాగా కవర్ చేసారు.

ఇదే నేను చదివిన మొదటి travelogue. నచ్చింది. కాకపోతే రచయిత భాష విషయం లో కాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేది అనిపించింది. కాసేపు తెలంగంగా యాస, కాసేపు text book లాంగ్వేజ్,  కాసేపు నాటకాల భాష, కాసేపు ఉర్దూ, మధ్య మధ్య లో ఇంగ్లీష్ సూక్తులతో కాస్త వింతగా అనిపించింది. హిందీ , ఉర్దూ వాక్యాలకి పక్కన అనువాదం కూడా ఇస్తే బాగుండేది. 

ఇక, మధ్య మధ్య లో రచయితే ఆలోచలనలు కాస్త చిరాకు పెట్టాయి, తెలంగాణా ఉద్యమం జరుగుతున్నతీరుమీదకాని,గిరిజనులలోదొంగతనాలు లాంటివి ఉండవు అన్న ఉద్దేశ్యాలు ముఖ్యంగా నాకు నచ్చలేదు . Of course ,అయన పుస్తకం అయన ఇష్టం, నా బ్లాగు నా ఇష్టం .

కాకపోతే,  రచయిత  ఎంత  చిరాకు పెట్టినా  ,  పుస్తకం  లో  చెప్పిన  విషయాలు  చాల  విలువయినవి ,  పుస్తకం బోర్ కొట్టలేదు.  అన్నిటికి  మించి కేవలం 6 లీటర్లు  tank capacity ఉన్న , Honda Activa మీద చత్తీస్ఘడ్ లాంటి వెనక బడిన రాష్ట్రాన్ని చుట్టారంటే ,  రచయిత ధైర్యానికి నా సలాం .

Wednesday, June 20, 2012

అసమర్థుని జీవయాత్ర

అదేంటో, ఈ చిన్న పుస్తకాన్ని ఎన్ని సార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. మొదటిసారి చదివాకా కాస్త confusion వచ్చింది, ఈ పుస్తకం బాగుందా బాలేదా అని. రెండో సారి చదివాకా ఇది చాలా గొప్ప పుస్తకం అనిపించింది. కాకపోతే ఏమిటా గొప్ప అన్న విషయం లో clarity లేదు. మూడో సరి చదివాక కొంచం వచ్చింది.

రచయిత గోపీచంద్ గారు,ఈ పుస్తకాన్ని చాప్టర్లు గా విడగొట్టారు కాని, మొత్తం పుస్తకం లో చివరి 20 పేజెస్ వరకు ఒక భాగం , మిగతా 20 పేజెస్ ఒక భాగం గా చూస్తా నేనెప్పుడు.

మొదటి  భాగం అంతా ఒక ధనవంతులఇంట్లో పుట్టి, తాను చేసిన సాయాలకి అందరు పొగుడుతూ ఉంటె అది అలవాటయ్యి, పేదరికం వచ్చి ఆ పొగడ్తలు లేకపోవడం వల్ల బాధపడుతున్న ఒక వ్యక్తీ గోల.  పేదరికపు కష్టం కన్నా ,ధనం లేకపోవడం వల్ల పొందలేకపోతున్న సుఖాలని, మర్యాదలని తలచుకుని బాధపడుతూ, ఆ బాధని భార్య మీద, కూతురి మీద ఆగ్రహం రూపం లో ప్రవహిమ్పజేస్తూ , భార్యాపిల్లల మీద కోపం వాళ్ల మీద ఉన్న ప్రేమ వల్లే వస్తోందని, కోపం వచ్చేంత ప్రేమ పుట్టడానికి తనకున్న మెత్తటి మనసే కారణం అనుకుంటూ, తన తప్పుల్ని మర్చిపోడానికి, వేదాంతం, ఆధ్యాత్మికం, మనవ సంబంధాలు అన్న విషయాల గురించి ఆలోచిస్తూ, వాటినే తన స్నేహితులతో మాట్లాడుతూ, కనీసం అలా అన్న తన తెలివిని సమాజం గుర్తించి , ఒక గుర్తింపు ని, కాస్త పొగడ్తని పడేస్తుంది అనుకుంటూ, అలా జరగకపోవడంతో, బహిరంగం గా అందరి తప్పుల్ని బయటపెట్టి, అందర్ని విమర్శిస్తే , అప్పుడయినా గుర్తింపు వస్తుంది అని ప్రయత్నాలు మొదలు పెడతాడు.

అలా అని కథానాయకుడు వెధవ కాదు, తన ప్రవర్తన వాళ్ల ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు అని మధ్య మధ్య అర్థం అవుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే ప్రేమ ప్రదర్శిస్తాడు. వెంటనే వాళ్ళు కూడా ప్రేమని చూపించాలని ఆశిస్తాడు.  ఇతను చూపిస్తున్న ప్రేమ, నిజమయిన ప్రేమ అని, దానిని అర్థం చేసుకుని, అంతకు ముందు అతను తిట్టిన, కొట్టిన సంఘటనలు మర్చిపోయి, ఇతని పట్ల ప్రేమ పుట్టడానికి పట్టే సమయాన్ని ఇంట్లో మనుష్యులకి ఇవ్వకుండా, నేను ప్రేమగా ఉన్నా, వెళ్ళు నా పట్ల ప్రేమగా ఉండరు అని కోపం తెచ్చేసుకుని ఇంకాస్త రచ్చ చేస్తుంటాడు.

ఇటువంటి ప్రవర్తన , మనకేప్పుడన్నా ఉందా లేక  మన స్నేహితులలో ఎవరికీ ఉందా అన్న ఆలోచన పూర్తయ్యేలోపే, అతని స్నేహితుల స్వభావాల మీద చర్చ మొదలవుతుంది. మన హీరో కి ఉండే స్నేహితులు మనందిరికి ఉన్నారు. స్నేహితుల గురించి రాసిన పేజెస్ బాగా ఎంజాయ్ చేస్తా ఎప్పుడు చదివినా.

భార్యని కొట్టాక ,మన హీరో కి ఉన్న వేప  కాయంత వెర్రి, పుచ్చాకయంత పిచ్చి అవుతుంది. పిచ్చి వాడిలా మాట్లాడటం మొదలు పెట్టడం , అందరి పిచ్చి ప్రశ్నలు వేయడం మొదలు పెడతాడు. ఇది అంతా మొదటిభాగం. ఈ భాగం గొప్పతనం ఏమిటంటే, ఇంకోళ్ళ కన్నా తను మెరుగు, అని నిరూపించడానికి మనిషి చేసే ప్రయత్నాలన్నీ దీన్లో ఉన్నాయి.

ఇప్పుడు రెండో భాగం మొదలవుతుంది. దీన్లో మొత్తం గా రామయ్య తాత మన హీరో కి పీకే క్లాస్సే ఉంటుంది. కాని సమాజాన్ని అర్థం చేసుకోడానికిఈ భాగం బాగా పనికి వస్తుంది. ముఖ్యంగా సంఘం కుల్లిపోయింది అని నమ్మే వాళ్ళు చదవాల్సిన పార్ట్ ఇది.  చెంప మీద గట్టిగా కొట్టినట్టు చెప్పే పాయింట్ ఏంటంటే " change in the society is never linear and never uniform" .  ప్రస్తుతం సమాజం లో ఉండే విభిన్న ధ్రువాల్ని అర్థం చేసుకోడానికి ఈ పాయింట్ బాగా పనికి వస్తుంది.

తరువాత, సమాజం లో  "మార్పు " అనుసరించే మార్గం వివరిస్తారు. మార్పు కావాలి అన్నప్పుడు మొదటగా మనం చేసేది, అప్పటి దాగా ఉన్న దాన్ని తెగ తిట్టడం. మార్పు రాగానే , ప్రపంచం పూలవనం లా తయారవుతుంది అని ప్రచారం చెయ్యడం. కొన్ని పేజెస్ వీటి మీదే చర్చ సాగింది.

తర్వాత, ప్రక్రుతినుంచి తప్పించుకోడానికి సమాజం ఏర్పడటం, సమాజం ని నిలబెట్టడం కోసం, దానికొక దిశ కల్పించాదానికి మనిషి ప్రయత్నించడం, సమాజం వ్యక్తీ స్వభావాన్ని ఎలా మారుస్తుంది,అన్న విషయాలు వివరిస్తాడు. ఈ వివరణ లో బాగా గుర్తుపెట్టుకోవలసిన లైన్ " సంఘాన్ని ముక్కలుగా కాకుండా , మొత్తం గా చూడటం నేర్చుకో " .

ఈ  పీకిన క్లాసుకి , మన హీరో నమ్మకాలు ఎర్రగా కాలాయి,తర్వాత మన హీరో నీడ, తల్లి దండ్రుల ఆత్మలు, ఇంకొన్ని ఊహలు, దెయ్యాలు అన్ని కలిసి, ఎర్రటి ఇనుప కద్దీల్లా ఉన్న నమ్మకాల మీద సమ్మెట దెబ్బలు వెయ్యడం మొదలు పెడతాయి. తను నమ్మింది తప్పు అని తెలుసు, కాని సరి అయిన దారిలో వెళ్ళాలంటే, నమ్మకాన్ని వదిలిపెట్టాలి, అలా వదిలి పెట్టడం కష్టం, ఈ కష్టం కి కారణం తనే తండ్రే అని, ఆయన్ని కాసేపు తిడతాడు, కాని , నమ్మకాలని మార్చుకోడానికి మనసు వెంటనే అంగీకరించదు. ఈ హడావిడిలో మన హీరో బాల్చి తన్నేస్తాడు. అదీ కథ.

ఏంటో, ఈ పుస్తకం ఎన్ని సార్లు చదివినా, మళ్ళి కొత్తగానే ఉంటోంది, ఎంత ఆలోచించినా, ఇంకో కొత్త ఆలోచన వస్తూనే ఉండుంది.



 

Monday, June 18, 2012

అంతర్ముఖం ..... చెత్తముఖం

ఎప్పటినుంచో  చదువుదాం అనుకున్న పుస్తకం, ఒకసారి కొన్నా కూడా, మా ఫ్రెండ్ కొట్టేసాడు నా దగ్గర నుంచి. చివరికి ఇంకోళ్ళ దగ్గర అప్పు తీసుకుని చదివా.

May be, ఒక పదేళ్ళ క్రితం చదివితే బాగా నచ్చి ఉండేదేమో. అంటే అప్పట్లో నేను "మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే ", "అందరు స్వార్థపరులే", "ప్రజలంతా శ్రుంగారాన్ని, ఆకర్షణని , మొహంని  ప్రేమ అని అంటారు ", "మనిషిని మనిషి పీక్కుని తినే రోజులివి " , "అనుబంధం ఆప్యాయత అంతా ఒక బూటకం  " అని తెగ నమ్మే వాడిని. ఈ పుస్తకం చదువుతుంటే అప్పట్లో నా ఆలోచలనలు గుర్తొచ్చి నవ్వుకున్నా. ఒక మనిషిలోని చెడుని మాత్రమే చూసి, ఒక్క సంఘటనకే కదిలిపోయి, ఆవేశం లో మానవాళి మొత్తం అంతా ఇంతే అని generalize చేసే రోజులవి.

సరే పుస్తకం విషయానికొస్తే, ఒక్కోచెడు సంఘటన తీసుకోడం, అందరు అంతే చెబుతూ ఒక generalization. దాని మీద ఒక quotation.  ఒక పుస్తకం చదువుతూ , పెన్ను తో  underline చేసే అలవాటు ఉన్నవాళ్ళకి, కనీసం రెండు పెన్నుల్లో ఇంకు అయిపోతుంది. అన్ని quotations ఉన్నాయి.

అలా  మన హీరో గారు, ఒక సంఘటనని సిగరెట్ తాగుతూ కిటికీ లోంచి చూస్తూ, అయన విశ్లేషణ అయన చేసేస్తూ, ప్రజలకి బోధిస్తూ , ఎవరు తనని ప్రేమించకుండా తనకు దగ్గరకి రాకుండా జాగ్రత్త పడుతూ ఉన్న సమయం లో , అయన తల్లి మరణించడం, తర్వాత ఒక ముర్దర్ కేసు లో ఇరుక్కోడం, కోర్ట్ లో వాళ్ళు కూడా అచ్చం ఈయన లాగే, అసలు కథ ఏంటి అని పక్కన పెట్టేసి, తల్లి మరణిస్తే ఏడవలేదు, తల్లి మరణిస్తే సిగరెట్ తాగాడు, అన్న విషయాలు పట్టుకుని, ఈయన పర్సనాలిటీని విశ్లేషించేందుకు  ప్రయత్నిస్తూ  వాదోపవాదాలు చేసేసుకుంటూ ఉంటారు. ఆ కేసు లోంచి బయటపడతాడు, పిల్లలు సంసారం సాగుతూ ఉంటాయి, ముసలితనం వచ్చేస్తుంది, ఆయన్ని బ్రతికుండగానే కొడుకులు ఎలా వదిలించుకున్నారు ( అప్పట్లో ఈ థీమ్ బాగా సాగేది, ముసలితనం లో తల్లిదండ్రులని పట్టించుకోని కొడుకుల గురించి ), ఎలా ఆయన్ని శవం అని చూపించి ఒక బిచ్చగాడు లాభ పడ్డాడు ఇలా ఇలా ఇలా సాగింది. సరే, ప్రపంచం లో ఉన్న చెత్త అంతా చూపించేసి , ప్రపంచమే ఒక చెత్త బుట్ట అన్న పాయింట్ చెబుదామని అనుకున్తున్నదేమో అనుకుంటే, చివర్లో , అంతా తూచ్, ప్రణవి కనబడి నా కళ్ళు తెరిపించింది, ప్రపంచం చేత్తమయం కాదు, ప్రేమమయం అనేస్తాడు, పోన్లే చివర్లో అన్నా కాస్త పాజిటివ్ గా రాసాడు అనుకుంటే , ఒక పారాగ్రాఫ్ తో మళ్ళి చిరాకు తెప్పించాడు.

" ఒకప్పుడు మనుషులు ఇలా ఉండేవారు కాదు, కొంచం ప్రేమ, కొంచం ఆప్యాయత, కొంచం నిస్వార్థం ఉండేవి. నీ ప్రతినిధిగా నేను వెళ్లి చూసిన ఆ ప్రపంచం ఎంత దారుణంగా ఉందొ దేవుడువి అయిన నీవే వూహించాలేవు. అందుకే ....నాకు ఇస్తున్న వరంగా...నా పట్ల ప్రణవి చూపించిన ప్రేమని మనుషులందరి మనస్సులో ప్రవేశపెట్టు. ఏ నిస్వార్థంతో ఆమె మరణించినదో ...ఆ 'అంశ' ని మనుష్యులల్లో కొద్ది కొద్దిగా నింపు " ....

 దేవుడు ఒప్పుకుంటాడు, వెంటనే ప్రక్రుతి పులకిస్తుంది. 

ఒకప్పటి ప్రజలు ఇప్పటి కన్నా నీతి మంతులు, మంచి వారు, ప్రేమించే గుణం ఉన్నవారు, ఏంటో ఈ చెత్త మాటలు అనిపిస్తుంది. ప్రస్తుతం సమాజం లో ఉన్న చెడుని చూసి, ఆ చెడు ఈ కాలం లోనే పుట్టింది అనడం సరి కాదు అనిపిస్తుంది. చెడు అనేది ఎప్పుడు ఉంది, అలాగే మంచి కూడా.  మంచిని చెడుని కాలం విడదీయలేదు కదా. 2012 వరకు అంతా మంచి , 2012 తర్వాత అంతా చెడు అంటూ. వాటి రూపం మారుతూ ఉండొచ్చు. మాదకద్రవ్యాల సమస్య నల్లమందు కాలం నుంచి ఉంది. ఒక వ్యక్తిని చంపడం, దొంగతనం, మోసం చెయ్యడం అనేవి నాగరికతో పాటు మొదలయినవే. నిత్యానంద లాంటి దొంగ స్వాముల గురించి గురజాడ ఎప్పుడో కన్యాశుల్కం లోనే రాయడం జరిగింది. అలాగే illicit relationships కూడా అదే పుస్తకం లో చెప్పడం జరిగింది. భరతం లో ఇలాంటి వాటి మీద పిట్ట కథలు ఉన్నాయి. ప్రస్తుతం మన జీవితం దుర్భరంగా ఉంది, ప్రస్తుత సమాజం కుళ్ళి పోయింది లాంటివి నచ్చుతయనుకుంటా, ఇదే పాయింట్ మన న్యూస్ చానల్స్ కూడా బాగా వాడుకుంటున్నాయి.

ఏది ఏమయినా , దీనికన్నా యండమూరి ఆనందో బ్రహ్మ చాలా మంచి పుస్తకం అనిపించింది. 

Friday, May 25, 2012

Thursday, May 17, 2012

జొ గబ్బర్ సింగ్ కొ గయా ... సంజొ మర్గయా

నాలుగేళ్ల తర్వాత మా వాడు కలిసి, బ్రతిమలాడి , టికెట్లు తీసుకొచ్చి నన్ను హాల్ లో  కూర్చోబెట్టాడు. పూర్తిగా ఫాన్స్ కోసమే తీసిన మూవీ, మొత్తమంతా ' pawanism ' , అనగా ముక్కడం, స్టేట్ రౌడి కాలం లోని చిరంజీవి హావభావాలు కాస్త మార్పు చేసి చూపించడం, ఇంకా మెడ రుద్దుకోడం.



ప్రతి మూవీ లో సవితి తల్లి పోరు ఉంటుంది కదా...దీన్లో సవితి తండ్రి పోరన్నమాట. దాన్ని భరించలేక మెడ రుద్దుకుంటూ ఇంట్లోంచి పారిపోతే పట్టుకుని హాస్టల్ లో వేస్తె , పోలీసు అవుతాడు. వాళ్ళ వూరికే ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. వూరి పేరు కొండవీడు ( ఏదన్న చిరంజీవి మూవీ గుర్తొస్తోందా ? ) .

  'మోసగాళ్ళకి మోసగాడు ' కాలం నాటి ఒక బ్యాంకు ని కొంతమంది దొంగలు దోచుకుంటారు. అప్పుడే పవన్ కళ్యాణ్ ఎంట్రి, గుర్రమెక్కి వచ్చి, దొంగల్ని పట్టేసుకుంటాడు. ఆ దొంగల్ని పంపించింది లోకల్ యువనాయకుడు ( రక్తచరిత్ర విల్లన్ ) . తర్వాత గబ్బర్ సింగ్ పోలీసు స్టేషన్ కి వస్తాడు, పొలిసు స్టేషన్ పేరుని "గబ్బర్ సింగ్ స్టేషన్ " గా మార్చేసి, మూవీ మొత్తం అయన తుపాకుల్ని ముద్దుపేర్లతో పిలుచుకుంటూ, అయిదేళ్ళ పిల్లాడు  దీపావళి తుపాకీ కాల్చినట్టు , కాల్చేస్తు ఉంటాడు. కూర్చొని మెడ రుద్దుకుంటాడు, కాసేపు నిలబడి రుద్దుకుంటాడు, కాసేపు చిరంజీవి ని కాపీ చేస్తాడు, కాసేపు టపాకి తీసి గోడల్ని, నేలని కాలుస్తూ ఉంటాడు, కాసేపు కుళ్ళు జోకులు, కాసేపు అయన "పవనిసం" మీద ఆయనే జోకులు, కాసేపు హీరోయిన్ కి సైట్ కొట్టడం, కాసేపు విల్లన్ ని బెదిరించడం, కాసేపు జీప్ ని స్కిడ్ చేయించడం, కాసేపు కుటుంబ సెంటిమెంటు, కాసేపు పాటలు, కాసేపు ఓవర్ ఆక్షన్ ,  కాసేపు ఆ వూరి రౌడీలతో కబడ్డీ, అంత్యాక్షరి లాంటి ఆటలు, మిగిలిన టైం లో ముక్కడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇంత బిజీ గా ఉన్నాడు కాబట్టే, ఒక సీన్ లో అయన రాలేక అయన కటౌట్ రిక్షా లో పంపిన్స్తాడు. ఇన్ని విడ్డూరాలు భరించలేక ఆ గుర్రం పారిపోయింది, నేను మాత్రం దొరికిపోయాను.

కథ అంటూ పెద్దగా ఏమి లేదు, స్క్రీన్ ప్లే అస్సలు లేదు, దేనికి లింక్ దొరకదు, వీటి మధ్యలో స్టేషన్ లో అంత్యాక్షరి అనే గొప్ప సీన్. నిజానికి మొదటి మూడు నిమిషాలు బాగానే ఉంది, తర్వాత సాగదీసి పెంట పెట్టాడు. రక్తచరిత్ర విల్లన్ ని మూవీ మొత్తం ఒక సైకో లో చూపించడానికి ట్రై చేసి, అది పండక చివరికి సుహాసినిని చంపించడం లో ఆ పిచ్చి అంటా చూపించారు. డైరెక్టర్ ప్రతిభ ముందు, హీరోయిన్ , అలీ , బ్రహ్మానందం అంతా కొట్టుకుపోయారు. 

మూవీ చూసాక అనిపించింది ... మేము పవన్ కళ్యాణ్ ఫాన్స్ అని చెప్పుకునే వారంతా, నిజంగా పవన్ కళ్యాణ్ కి అభిమానులా లేక , "పవనిసం" కి అభిమానులా అని. నాకు ఖుషి , తొలిప్రేమ పర్లేదు అనిపించాయి కాని, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన జానీ , ఇంకా జల్సా బాగా నచ్చాయి. కాని జానీ , పవన్ కళ్యాణ్ ఫాన్స్ కే సరిగ్గా నచ్చలేదు. ఏదో ఆక్టింగ్ బాగుంది ఫాన్స్ అంటే అర్థం చేసుకోవచ్చు కానీ, మెడ రుద్దుకున్తున్నాడు కాబట్టి ఫాన్స్ అంటే ...ఏంటో . అయినా ఎవరి అభిమానం వాళ్లది.

Wednesday, May 16, 2012

మలక్పేట్ పోలీసు గారండి ... ఫోను పోయిందండి

మా ఫ్రండ్ ది ఫోన్ పోయింది, నోకియా ఫోను, పదహారు వేల ఫోను, ఏడుస్తుంటే iphone కొనుక్కోమని, పోయిన ఫోను ఈ పాటికే జగదీష్ మార్కెట చేరిపోయి ఉంటుందని, దిగులు వొద్దని ,  వోదరుస్తున్నాం.  పోలీసు కంప్లైంట్ ఇవ్వమని వాళ్ళ అమ్మగారు చెప్పారని , ఇవ్వాల్సిందే అని గోల చేస్తుంటే , అది భరించలేక మలక్పేట్ పోలీసు స్టేషన్ కి పోయాం. 

పొలిసు స్టేషన్ మెట్ల మీదే ఒక వీధి కుక్క దర్జాగా కూర్చోండి,  ప్రజలకి పోలీసులు , పోలిసులకి కుక్కలు రక్షణ అని అనుకుని, అక్కడే ఒక పెద్ద గుంపులో నున్చిని మమ్మల్ని సాదరంగా పలకరించి మాట్లాడిన పోలీసు మాట ప్రకారం, పొలిసు స్టేషన్ లో రెండో అంతస్తుకి వెళ్ళాం, పెద్ద పెద్ద ఇనుప పెట్టలు, పెద్ద పెద్ద పొట్టలు ఉన్న పోలీసులని దాటుకుని.

మలక్పేట్  పోలీసు స్టేషన్ రెండో అంతస్తు లోనే, పోలీసులు కాపురం ఉంటున్నారు, వెళ్ళగానే ఆరేసిన డ్రాయర్లు, చొక్కాలు, లుంగీలు కనిపించాయి,వాటి పక్కనే ట్రాఫిక్కు పోలీసుల విభాగం, ఒక పది పదిహేను వాకీ టాకీలు బల్లమీద పెట్టుకుని, ఏదో తెగ రాసేస్తూ కనిపించారు, వాళ్ళ సెక్షన్ పక్కన రూం లోనే ఫోన్ మిస్సింగ్ కేసెస్ రిజిస్టర్ చేస్తారన్నారు, చిన్న గది, ఆ గది లోంచి లాకప్ కి దారి, చిన్న గదిని ఇంకొంచం చిన్నది చేస్తూ రెండు బల్లలు ఒక బెంచి, బెంచి మీద ఒక దిట్టమయిన పోలీసు బాబాయి, అయన చేతిలో తళతళా మెరుస్తూ ఒక చైను, ఆ చైను కి అటువైపు కింద కూర్చొన్న ఒక డిగ్రీ చదివే వయసున్న కుర్రాడు, అంత చైను వేసారంటే వాడెం శాడిస్టు గాడో అనుకుంటూ ఉంటె, బల్ల వెనక పొలిసు "అబ్బా ఫోను మిస్సింగ్ కేసా , బిజీ గా ఉన్నాము వేరే పనిలో" అన్నాడు, పాపం కంప్యూటర్ తో ఏదో కుస్తీ పడుతున్నాడు, ఒకతన్ని పిలిచి మా సంగతేంటో చూడమన్నాడు, ఇంతలో బెంచి మీద కూర్చున్న పొలిసు బాబాయి ఫోను ఎంత అని అడిగాడు, పదహారు వేలు అని చెప్పగానే, మాకు పని చూడటం మొదలు పెట్టినయాన్ని పిలిచి , "పదహారు వేలంట, మంచి గిరాకి పో " అనేసాడు, అందరం నవ్వుతు ఉంటె, ఆ పొలిసు అడిగాడు, అందరి ఫోన్లు పోయాయా, లేక ఒక్క ఫోనుకి ఇంతమంది వచ్చారా  అని, ఇక చేసేది లేక , నేను ఇంకో ఫ్రండ్ బయటకి వచ్చేసాం , ఈ హడావిడిలో లాకప్ కి ఏడు వూచలు ఉన్నాయో లేదో లెక్క పెడదామనుకున్న సంగతి మర్చిపోయాను.

బయట ట్రాఫిక్కుపొలిసు సెక్షన్ దగ్గర నున్చోన్నాం, ఒక వాకీ టాకీ లోంచి ఒక బండ గొంతు తెగ గోల పెడుతోంది, ఎవరు పట్టించుకోట్లా, మాకు మొదట్లో సరిగ్గా అర్థం కూడా అవ్వాలా, జాగ్రత్తగా వింటే తెలిసిందేమిటంటే, ట్రాఫిక్కు పొలుసులు ట్రాఫిక్ను పట్టించుకోడం మానేసి, అంబ్రెల్లా ల కింద కూర్చుంటున్నారని, దీని వాళ్ళ ట్రాఫిక్ జామ్స్ పెరిగే అవకాశం ఉందని , ఇలాంటి అలవాట్ల వాళ్ళ ట్రాఫిక్ వ్యవస్థ కి నష్టం జరుగుతుందని ఒక పెద్ద పొలిసు గొంతును తెలుగులో ఇంగ్లీషులో చించుకుని చెబుతున్నాడు. అయన ఎప్పుడు ఇలానే క్లాసు వాకీ టాకీ లో పీకుతుంటాడు అనుకుంటా , ఎవరు పట్టించుకోట్లా .

కాసేపటికి మిగతా వాళ్ళు బయటకి వచ్చారు. ఏమయిందిరా అంటే, FIR బుక్ చెయ్యలేదు, కంప్లైంట్ బుక్ చేసి నెంబర్ ఇచ్చడుట, బెంచి బాబాయి అయితే, ఇవన్ని కాదు కాని, నాకో అయిదు వేలు ఇవ్వండి, రేపటికల్లా ఫోన్ సంపాదించి ఇస్తా అని బంపర్ ఆఫర్ కూడా చేశాడుట.

ఇంకేం చేస్తం , స్మార్ట్ ఫోను పోయి డబ్బా ఫోను వచ్చే అని పార్టీ చేసుకుని వచ్చేసాం

Wednesday, May 09, 2012

అందమైన మందమైన మధ్యతరగతి

ఆహ్ మధ్యతరగతి బ్రతుకులు, మధ్యతరగతిలో ప్రేమలు ఆప్యాయతలు , మధ్యతరగతి కలలు , మధ్యతరగతి ఉదాసీనత , middle class mentality ఇలా బోలెడు చదివా .

అసలు అందర్ని వదిలేసి, ఈ మధ్యతరగతి వెనకాలే ఎందుకు పడతారు ? ముందు కార్ల్ మార్క్స్ పడ్డాడు, capitalism లో మధ్యతరగతి కుచించుకు పోతుంది అని, కానీ మధ్యతరగతి పెరిగి, పెద్దదయ్యి ఒక దుప్పటి కప్పుకుని పడుకుంది. నిద్రపోవట్లేదు, కేవలం ముసుగుతన్ని పడుకుని , బారిస్టర్ పార్వతీశం లండను వెళ్ళకముందు చేసినట్టు, దేశాకాలవైపరిత్యాల గురించి తన పగటి కలల మధ్యలో ఆలోచిస్తూ ఉంటుంది. మంచం మీద నల్లులు ఉన్నాయా, పక్కలో కప్పలు ఉన్నాయా, దుప్పటి వాసన వేస్తోందా లాంటి విషయాలు పట్టించుకోకుండా అలా ఉంటది. మధ్యలో అన్న హజారే లాంటి వాళ్ళు, సత్యమేవ జయతే ప్రోగ్రాం తో అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు, లేపి, దుప్పటి కంపుకోడుతోంది, మార్చుకో అని చెప్తారు, వెంటనే ఒకసారి దుప్పతిలోంచి మొహం బయట పెట్టి,  ఎవరా అని చూసి, దుప్పటి వాసన చూసి, అర్రే ఇంత కంపులో కులాసాగా కునుకు తీస్తున్నాన అని బుడుగు లెవెల్లో బోలెడంత హాశ్చర్యపోయి , కాసేపు దుప్పటి మొత్తం తేరి పార చూసుకుని , ఈ తీగని సవరించాలి, ఈ అపశ్రుతి సరిచెయ్యాలి  అని  పాడుకుంటూ లేచి, ఎన్నాళ్ళు ఈ కంపులో మేముండాలి, అని నారాయణమూర్తి లెవెల్ లో అరిచి, ఒకసారి చుట్టూ చూసి, సామజిక అసమానతలు ఉన్నాయి, ఇలా ఉంటె ఎలా అని ఒక ప్రశ్న వేసేసి, తనకన్నా ధనికులు, తనకన్నా పేదవాళ్ళకి డబ్బు పంపిణి చేసేస్తే సమాజం లో అందరు తనలనే తయారయ్యి నిద్ర లోకి ప్రశాంతంగా జరుకోవచ్చని సెలవిచ్చి, మొబైల్ లో వచ్చిన ఫార్వర్డ్ SMS ఒకసారి చూసుకుని, మిగతావాళ్ళకి అది ఫార్వర్డ్ చేసి, ఎలాగు మొబైల్ చేతిలో ఉంది కాబట్టి, అవినీతి అంతం అవ్వడానికి , అన్న హజారే కి సపోర్ట్ గా ఒక మిస్సేడ్ కాల్ చేసి, ఎన్నికలలో వోటు కాదు, న్యూస్ ఛానల్ వాడి SMS సర్వేలు కి వోట్లు వేస్తె సమాజం బాగుపదిపోతుందని వాళ్ళకో SMS పంపి, అర్రెర్రె ఆవేశం లో పంపించేసనే, 3 రూపాయలు వదిలింది , ఇది SMS package లో రాదే అని నాలిక కరుచుకుని, చ్చా దుప్పటి తీస్తే ఇలాంటి వాయిమ్పే అవుతుంది, నేను ఇక తియ్యను అని ముసుగుతన్నేస్తుంది.

మళ్ళి ఎవరో వచ్చి లేపుతారు.




Tuesday, April 03, 2012

The దురద

అటు ఇటు గా ఎనిమిదేళ్ళ క్రితం మొదలయ్యింది. ఏంటది అనగా ... చెవుల్లో దురద , వాటి వల్ల నేను పడ్డ బాధలు. రకరకాల వస్తువులు దూర్చే వాడిని , cotton ear buds తప్ప.  ఎందుకంటే వాటిని షాప్ కి వెళ్లి తెచ్చుకోవాలి, మరియు  హాస్పిటల్ లో వాది పారేసిన దూదితో అవి తాయారు చేస్తారు అన్న పుకారు కూడా ఉంది. స్క్రూ డ్రైవర్లు, టూత్ పిక్స్ , పెన్ను రిఫిల్స్ ,  పెన్ను కాప్స్ ( రేనాల్డ్స్ మాత్రమే పడుతుంది చెవిలో), న్యూస్ పేపర్స్ ( అన్నిటి మీద ప్రయోగాలూ  చేసాను, టైమ్స్ అఫ్ ఇండియా బెస్ట్ చెవిలో పెట్టుకుని తిప్పుకోడానికి , తెలుగు పేపర్స్ అస్సలు సౌకర్యంగా ఉండవు, ఇంగ్లీష్ పేపర్స్ లో వరస్ట్ అంటే హిందూ, డెక్కన్ క్రోనికాల్ ), హెయిర్ పిన్స్ , అగ్గిపుల్లలు ( wax వి కావు)   చిన్న చిన్న వైరు ముక్కలు , చీపురు పుల్ల, mobile stylus,  బైకుల తాళం చెవులు ( వీటిలో బెస్ట్ హోండా ఆక్టివా తాళంచెవి, సన్నగా పొడుగ్గా, లోపల గోక్కోడానికి బాగుంటుంది, బజాజ్ బైక్ల తాళాలు బాగుండవు, హోండా బైక్ తాళాలు అయితే ఓకే ) . అన్నిటికన్నా జాగ్రత్తగా రిఫిల్స్ విషయం లో ఉండాలి, రేఫిల్ వెనకవైపు చెవిలో పెట్టుకోవాలి కానీ, నిబ్ ఉన్నవైపు పెట్టుకుంటే , చెవి పైన కూడా గీతాలు పడే అవకాశం ఎక్కువ. అదే సమయం లో గొంతు-చెవి-ముక్కు వైద్యుడి దగ్గరకి వెళ్తే, అతను కంగారు పడే అవకాశం కూడా ఉంది.

ఈ దురదలు మొదలయిన దగ్గర నుంచి , నాకు మనుష్యుల ఆలోచనా విధానం , వ్యసనం గురించి చాల విషయాలు అర్థమయ్యాయి. మొదట్లో దురద ఉంటేనే చెవిలో ఏదన్న పెట్టె వాడిని...నెమ్మదిగా అదొక వ్యసనం అయ్యింది. మందు దొరక్క, సిగరెట్ దొరక్క ప్రజలు ఎందుకంత  బాధ పడతారో అర్థం అయ్యింది.

ఇలా చెవుల్లో అవి ఇవి పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరాలు వచ్చేవి, క్రోసిన్ , నైస్ టాబ్లెట్స్ సేల్స్ పెంచాను బాగా, తర్వాత కొంతకాలం హోమియోపతితో ఉపశమనం లభించినా , ఎక్కువకాలం పని చెయ్యలేదు అది. పోయిన నెల బాగా నొప్పి, జ్వరం ఎక్కువయ్యి ఇక లాభం లేదని, సికింద్రాబాద్ లో Dr. దీన్దయాళ్ ని దీనంగా దర్శించాను, అయన దయతో నా ముక్కులో , నోట్లో, చెవుల్లో కెమెరాలు పెట్టి చూసి ( రూం లో ఉన్న అన్ని అయిదు స్క్రీన్స్ లోను అదే, నా ముక్కులో చెత్త, ఇన్ఫెక్షన్ ఉన్న చెవి, నా నాలిక దాని మీద అంతకు ముందు తాగిన లస్సీ ), వాటిని ప్రింట్ తీసి నా చెతిలో పెట్టి,  నీది ఆయిలీ స్కిన్, దాని మీద చుండ్రు ఉండడం వల్ల ఇలా జరుగుతోంది అని చెప్పి, మందులిచ్చి, చెవిలో ఒక క్లాంప్ పెట్టి,  మళ్ళి ఒక వారం తర్వాత రమ్మన్నాడు, ఈ వారం రోజుల పాటు, ఆ క్లాంప్ వల్ల నా మాటలు నాకే చెవిలో ప్రతిధ్వనించి, ఎదుటి వాడు గట్టిగా మాట్లాడుతుంటే ప్రతిఘటిస్తూ, నాకు కుడి వైపు కూర్చిన మాట్లాడే వాళ్ల మాటలు సరిగ్గా వినబదకపోయినా వినబదినట్టు తలకాయ ఊపుతూ, ఛాన్స్ దొరికినపుడు, అటు వైపు వచ్చి కూర్చొని, చెవిలో ఒక కీచురాయిని మైంటైన్ చేసాను. తర్వాత మళ్ళి డాక్టర్ దగ్గరకి వెళ్తే, అతను రెండు గంటలు లేటుగా Audi కార్ లో వచ్చి, "leave your ears alone" అని చెప్పి పంపించేసాడు.

నిన్నటినుంచి చేతులు చెవుల దగ్గరకి వెళ్ళకుండా చాలా కష్టపడుతున్నాను. చిత్రంగా క్లాంప్ లేకపోవడం వల్ల లేని ఆ గుయ్ మనే శబ్దాన్ని మిస్ అవుతున్నా . 

Sunday, March 04, 2012

ప్రజల మనిషి అనిపించుకోడం ఎలా ?

అలా అనిపించుకోవాలి అంటే , 

1. సామాన్యప్రజనీకానికి కొంచం తెలిసి పూర్తిగా అర్థం కాని విషయాల మీద మాట్లాడాలి, అనగా , ఆర్ధిక శాస్త్రం , రూపాయి విలువ పడిపోడం , జన్ లోక్పాల్ బిల్ ఇలాంటివి అన్నమా, మనకి పెద్దగా తెలియక పోయినా పర్లేదు, కై ఎదుటివాడికి మాత్రం మనకు మించి తెలియకూడదు

2. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని తెగతిట్టాలి, అలా ప్రభుత్వాన్ని మాత్రమే తిట్టివదిలేస్తే ఎగస్పార్టీ మనిషి అనుకుంటారు, అందుకే చివర్లో అన్ని పార్టీలని తిట్టేయ్యాలి

3. అన్నీ కల్తీ అవుతున్నాయని, ఉప్పులు, పప్పులు, నూనెలు ఎక్కడా క్వాలిటీ ఉండటం లేదని గోల చెయ్యాలి. ( పొరపాటున కూడా జేబులో ఉన్న pendrive లో ఉన్న పైరసీ మూవీస్ గురించి మాట్లాడకూడదు )

4. మాటల మధ్యలో సిస్టం, సొసైటీ, సమాజం, వర్గాలు, కుల పిశాచి, వ్యవస్థ , ప్రజాస్వామ్యం లాంటి పదాలు వాడితే మస్తుంటుంది.  సామాజిక న్యాయం అని చిరంజీవి మొత్తుకోలా ? అలా అన్నమాట .

5. సమస్య గురించి మాత్రమే మాట్లాడాలి, దానికి గల కారణాలు, సమస్యని నివారించడానికి ఎం చెయ్యొచ్చు అన్న అభిప్రాయాలు లాంటివి మాట్లాడకూడదు, అసలు సమస్యకి పరిష్కారం లేదని నిరుత్సాహ పరచాలి, ఏ సమస్య అయినా ఇదే ట్రిక్ .... విశ్లేషణ చేయకూడదు, పరిష్కారం ఉందనుకూడదు

6, ప్రభుత్వం ఎం చేసినా ప్రైవేటు రంగం లాభాల కోసమే చేస్తోందని చెప్పాలి, ఈ ట్రిక్ కూడా బాగా పనిచేస్తుంది, కాని ఏవి ప్రభుత్వ సంస్థలు ఏవి ప్రైవేటు సంస్థలు అన్నా తెలిసి ఉండాలి, కొంతమంది పెద్దమనుష్యులు అసలు పెట్రోలు ధరలు పెరగడానికి కారణం కి ఈ ట్రిక్ వాడారు, కాకపోతే మనదగ్గర ఉన్న HP, BP , Indian Oil అన్ని ప్రభుత్వానివే,  రిటైల్ పెట్రోల్ మార్కెట్ లో ప్రైవేటు సంస్థల వాటా చాలా చాలా తక్కువ.

7. రాహుల్ గాంధీ లా రెండు రకాల ఇండియా గురించి ఎప్పుడు మాట్లాడుతుండాలి, ఒకటేమో మున్నాభాయి MBBS లో ఆ చైనా వాడు అరిచినట్టు , real india, poor india, hungry india. ఇంకోటి Pixar graphics వాళ్ళు చేసిన Imaginary India.

8. ఒక ఖద్దరు చొక్కా ( తెల్లది కాదు, తెలుపు ఖద్దరు మీద రాజకీయనాయకులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు పేటెంట్ తీసుకున్నారు ), ఒక మాములు పాంటు , హవాయి చెప్పులు , చేతిలో గుడ్డ సంచి....అంటే గమ్యం మూవీ లో లొంగిపోయిన నక్సల్ లా తయారయితే మంచి impression వస్తుంది. అంత కష్టం అనుకుంటే , కనీసం చంకలో హిందూ పేపర్ అన్నా పెట్టుకుని తిరగాలి.

9. కొన్ని శ్రీ శ్రీ కవితలు, మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే, ప్రజలకి మతంనల్లమందు లాంటిది, ఏ దేశ చరిత్ర చూసినా  etc etc లాంటివి కొన్ని నాలిక మీద ఎప్పుడు ఉండాలి .  నిజానికి ఈ పాయింట్ 5 th point కి extension. Project no analyzation to understand the problem, no discussion to solve the problem, give only depressing statements.

10. ప్రభుత్వ ఉద్యోగులు చాల మంది ఖాళీగా ఉన్నారు వాళ్ళని తీసేయ్యాలి, వీళ్ళు నెమ్మదిగా పని చేస్తారు, ప్రైవేటీకరణ చెయ్యాలి అనాలి, తర్వాత నిరుద్యోగం పెరుగుతోంది ప్రభుత్వం ఉద్యోగాలు పెంచాలి అనాలి, మళ్ళి ఏ కంపెనీ అయినా ఇక్కడ ఇన్వెస్ట్ చెయ్యడానికి రాగానే వ్యతిరేకంగా గోల చెయ్యాలి.

11.  సునామీకి కారణం గ్రహన్తవాసులు సముద్రంలోకి ఈతకి కోసం దూకడం అనే వాడు హాలీవుడ్ డైరెక్టర్, దానికి కారణం అమెరికా వాడు వైట్ హౌస్ లోని చెత్తని రాకెట్ ద్వారా సముద్రం లో పడేసాడు, అందుకే అంత పెద్ద అల వచ్చింది అనే వాడు ప్రజల మనిషి.

12. ఏదయినా ఫంక్షన్ లో తినలేక ఎవరైనా ప్లేట్ పడేస్తుంటే "భారతదేశం లో చాలా మంది ఆకలి తో అలమటిస్తున్నారు, నువ్వేమో పరేస్తున్నావ్ " అనాలి, అప్పుడు మాత్రం చేతులు జేబుల్లో పెట్టుకునే ఉండాలి, చేతికున్న బ్రాస్లెట్ కనిపియ్యకూడదు, జేబులో i-phone మోగితే సైలెన్స్ చెయ్యడానికి పనికి వస్తుంది .

13. ఇక ఆర్కుట్ లోను ఫసుబూక్ లోను, ఈ ఫోటో షేర్ చేస్తే ఒక పిల్లాడికి భోజనం పెడతాం,  ఈ ఆట ఆడితే ఒకడికి బొంగరం కొంటాం లాంటి వాటి మీద బాగా క్లిక్ చేస్తూ ఉండాలి, ఇంకా ముంబై ధారవి పిక్స్ , ఆఫ్రికా లో పేగులు ఎముకుల కనిపించే చిన్న పిల్లల పిక్స్ కొన్ని ఉన్నాయి...అవి బాగా షేర్ చేస్తూ ఉండాలి,

ఇవి కొన్ని టిప్స్ .... వీటిల్లో 5th చాలా ముఖ్యమైనది .

Tuesday, February 14, 2012

ప్రేమికుల రోజంట ....జల్ది లేవుండ్రా !!

లెగు లెగు .... తెల్ల సోక్కా వేసుకొని బయలు దేరు .... నెక్లెస్ రోడ్ కి పోవాలె . .. బండి కాడ మనోళ్ళకి నెత్తికి కట్టుకోనీకి  గుడ్డలు ఇయ్యి ..నడు ఇంక ..

న్యూ ఇయర్ పార్టీ కి ఇట్లానే తీసుకుపోయినావ్ .... రాత్రి పోలీసోళ్ళు పట్టుకున్నారు , ఇయాల నేను రాను తాగనీకి

ఈ రోజు తాగుడు కాదు బె , బడ్లమీద పోతూ  , ప్రేమికుల రోజు జరుపుకోనీకుండా సేయ్యలె , భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పాలే

న్యూ ఇయర్కి అడ్డురాని సంప్రదాయాలు ఇప్పుడు వచ్చిందా

మస్తు  తాగితే సాంప్రదాయం కనిపించదు కాని , లెగు ఇంక బయట మనోడు వెయిట్ చేస్తుండు ఆల్రెడీ ..
ఎవడు ?
మా చిన్నాన్న కొడుకు,, ఆనికి ఆని పోరి కి గొడవలు వచ్చినాయి  అంట...ఇంకో లవర్స్ ని చూస్తె ఆడికి మండుతా ఉందంట , వస్తా అన్నాడు , సరే రమ్మన్నా

గ్రీటింగ్ కార్డు షాపులు , పువ్వులమ్మే షాపులు , ఇంకా బేగంపేట్ , నెక్లెస్ రోడ్ , ట్యాంక్బండ్ రోడ్ల మీద తిరిగే లవర్స్ మన టార్గెట్

పువ్వులమ్మే టోల్లు దేనికన్నా... పోరీలు పోరగాళ్ళు చాలు కదా ,

అట్లంతవేమ్రా  , మన సంస్కృతి నాశనం అయిపోతుంటే, రోడ్లమ్బడి పువ్వులు అమ్ముతున్నారు వాళ్ళు ,

అమ్ముకోనీరాదే , అమ్ముతున్నది పువ్వులు కాని గుడుంబా పాకెట్లు కాదు కదా

అవి అమ్మినా పర్లే, ఈ రోజు మటుకు పువ్వులు అమ్మొద్దు

 నీయయ్య ,  నన్ను పరేషాన్ చేస్తున్నావ్ అప్పటిసంది , ఇప్పుడు ఆళ్ళని చేస్తానంటున్నావ్

హహ .. .. సాయంత్రం సిట్టింగ్ వేద్దాం లే , ఇప్పుడు లే ఇంక

Sunday, February 05, 2012

మతం Vs సంస్కృతి

మతం అనగా చాలా మందికి confusion లేదు, మతం అంటే అటు ఇటు గా  మనిషికి దేవుడికి మధ్యన ఉండే అమ్బికాదర్బార్ బత్తి అని అందరికి ఒక ఐడియా ఉంది. ఇక సంస్కృతి దగ్గర గొడవ వొస్తోంది.

 సంస్కృతి ని మనకి ఉండే కామన్ అలవాట్లు, ఆచారాలు, నమ్మకాలు, విలువలు, భాష , విధానాలు etc etc . గా చెప్పొచ్చు. మతాల ప్రపంచకీకరణ జరగక ముందు , ఒక మతం ఒక భూభాగానికే పరిమితమయిన కాలంలో సంస్కృతి మీద మతం అధికారం చాలా ఉండేది. అప్పట్లో ఒక వ్యక్తి ఒక పని చేసాడు అంటే మతం ఆదేశించడం వల్ల చేసాడా లేక అక్కడి సంస్కృతి వల్ల చేసాడా అని చెప్పడం కుదిరేది కాదనుకుంటా , of course ఇప్పటికి చెప్పడం కొంచం కష్టమే.

గమనిస్తే ఒకప్పటి తెలుగు పేర్లు అన్ని దేవుడి పేర్ల నుంచో , భారత రామాయణాల నుంచో  direct గా కాపీ కొట్టినవే, వెంకటేశ్వర్లు, వెంకటాచలపతి, అప్పన్న, సింహాచలం, భద్రాచలం, సరస్వతి , లక్ష్మి, హనుమంతు, హనుమాన్లు, రామయ్య, రాముడు, లక్ష్మయ్య , గణపతి ఇలా ఉండేవి, తర్వాత రావులు మొదలయ్యారు బాగా, సుబ్బారావు, అప్పారావు, నాగేశ్వర రావు ... ఇక్కడ పేర్లు direct గా కాపీ కొట్టడం కాస్త తగ్గి , కొంచం complicated అయ్యాయి, తర్వాత రాజేష్, విజయ్ ఇలాంటి పేర్లు మొదలయ్యాయి, ఇది సంస్కృతి ... వెంకటేశ్వర్లు అని ఉంటేనే హిందువు, రాజేష్ అని ఉంటె హిందువు కాదు అని చెప్పలేము.  పేర్లు పెట్టడమనేది సంస్కృతి లోకి వస్తుంది, మతం లోకి కాదు. మన దగ్గర తాత పేరు మనవడకి పెట్టడం సంస్కృతి, రాముడు తన కవల పిల్లలకి తండ్రుల పేర్లేమి పెట్టలేదు, అలా అని రాముడు హిందూ కాదు అని కాదు, తెలుగు వాళ్ళు మొత్తం హిందువులు కాదు అని కాదు, అలాగే మొత్తం భారత దేశం లో కేవలం తెలుగు వాళ్ళు మాత్రమె ఇంటి పేరు ముందు రాసుకుని , తర్వాత అసలు పేరు రాసుకుంటారు ( చివర్లో కులం పేరు వస్తుంది అది వేరే సంగతి) అలా అని తెలుగు వాళ్ళు హిందూ మతం ని follow అవ్వడం లేదు, అని కాదు కదా...అది మన సంస్కృతి అంతే.

అలాగే మనం వాడే దుస్తులు కూడా , సల్వార్ కమీజ్ తెలుగు వస్త్రధారణ లోకి రాదు , సికింద్రాబాద్ మెట్టు గూడా దగ్గర ఉన్న చర్చి ముందు రోడ్ మీద మేరీ మాత కి ఒక చిన్న గుడి లాంటిది కట్టారు, దాన్లో ఆవిడకి పట్టు చీర కడతారు , ఆంధ్రా లో ఉండే చాలా మంది ముస్లిం మహిళలు నల్లపూసలు వేసుకుంటారు,  పెళ్ళికి ముందు engagement లో ఉంగరాలు మార్చుకోడం, పెళ్లి తర్వాత reception , పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్ల తమ్ములు శేర్వాని వేసుకోవాలన్న పద్దతి ఇవన్ని ఒక సంస్కృతి ఇంకోదాని దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నవే. నిజానికి హిందూ సాంప్రదాయాలలో భాగమయిన పట్టు వస్త్రం చైనా నుంచి అరువు తెచ్చుకున్నదే .  ఇలా అని వీళ్ళందరూ వాళ్ల వాళ్ల మతాలని సరిగ్గా నమ్మడం లేదు అని కాదు కదా. సంస్కృతి , ఆచారాలు ,సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి కాని మతం మారదు.

కాకపోతే చాలామంది దృష్టిలో మతం, సంస్కృతి ఒకటే. ఒక ముస్లిం అనగానే మీసం లేకుండా గడ్డం పెంచుకుని, తెల్లటి బట్టలు వేసుకుని, నెత్తి మీద skull cap తో ఉండే మగవాడో, లేక బురఖా వేసుకున్న ఆడదే గుర్తొస్తుంది. బ్రాహ్మణుడు అనగానే విభూతి, గుండు , పిలక, చొక్కలేకుండా ధోతి కట్టుకున్న వ్యక్తే గుర్తొస్తాడు.  ఒక క్రిస్టియన్ అనగానే ఆ వ్యక్తీ పేరు మేరి, జేమ్స్ , జాన్ ఇలా పాశ్చాత్య పేర్లు ఉంటాయని, వాళ్ళు బొట్టు పెట్టుకోరని అనుకుంటాము. బొట్టు పెట్టుకొని వారందర్నీ ఆ మతానికి చెందిన వారే అనుకుంటాము. కాని మన వేషభాషలు మన సంస్కృతి మీద depend అయ్యి ఉంటాయి కాని మతం మీద కాదు.

మతం కి సంస్కృతికి ఉన్న తేడా కి నాకు తెలిసిన ఒక వ్యక్తీ పరాకాష్ట. ఒక గట్టి హిందూ వాది , ముస్లిమ్స్ వల్ల భారతదేశానికి నష్టం జరుగుతోంది అని నాతో వాదిస్తూ " jesus christ sanju, why cant u understand my point" అన్నారు. 

సంస్కృతి మీద మతం అధికారం తగ్గుతూ వస్తోంది. ఇంకా తగ్గుతుంది అనే అనుకుంటున్నాను .



Saturday, January 28, 2012

నా వేదన

చాలా మంది జీవితాలలో లాగే నా వేదన కూడా నవయవ్వన దశ లోనే మొదలయింది. సంవత్సరాల బాధ. ఏమి చేసినా పోదు, ఎల్లప్పుడూ బాధపెడుతూనే ఉంటుంది, కాలం అన్ని సంయలకి పరిష్కారం అంటారు కాని ....అది నిజం కాదు.

ఇన్ని సంవత్సరాలుగా నాతోనే ఉంది. ప్రతి క్షనమ్ నేను ఉన్నా అని గుర్తు తెస్తూనే ఉంటుంది. సరిగ్గా అలోచిన్చుకోలేను, అర్థ రాత్రి లేచి బాధ పడిన రోజులున్నాయి. అందరితోను చెప్పుకోలేను, అర్థం కాక పోవచ్చు కూడా. ఆప్తమిత్రులు అడిగే వారు , మాట దాటేసే వాడిని  మొదట్లో, కాని మన గురించి బాగా తెలిసిన స్నేహితులని , రోజు చూసే స్నేహితులని మోసం చెయ్యలేం, గుర్తుపట్టి అడిగే వారు , అంత ఏమి లేదులే అని చెప్పెసేవాడిని. అదో పెద్ద సమస్యే కాదు అన్నట్టు మాట్లాడేవాడిని.

చాలా  మందికి తప్పదనుకుంటా ఇది, కాని బయటకి కనిపియ్యకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారో అనిపించేది. హడావిడిగా ఉన్నప్పుడు , పని ఒత్తిడి లో ఉన్నప్పుడు తాత్కాలికంగా బాధ తెలియకపోయినా , కాస్త విరామం దొరకగానే మళ్ళి తెలిసేది. తీవ్రత ఎక్కువయ్యేసరికి , నేను పెద్దగా తెలియని వాళ్ళకి కూడా విషయం అర్థం అవడం మొదలయ్యింది. చాలా మంది చాలా సలహాలు ఇచ్చారు, ఉపశమనం తాత్కాలికంగా లభించినా , పూర్తిగా పోలేదు. నెమ్మదిగా అలవాటు అవ్వసాగింది , ఇలా వదిలేస్తే జీవితాంతం బాధ పడుతూనే ఉంటా అని చివరికి మెడికల్ హెల్ప్ తీసుకుంటున్నాను.

మాకి కిరి కిరి ఈ చుండ్రు ఎప్పటికి వదులుతుందో ఏంటో .


Friday, January 13, 2012

సిటి లో సంక్రాంతి ...

 కోళ్ళ పందాలు , ధాన్యం ఇంటికి రావడం కథల్లోను మూవీస్ లోను ఏవో చూపిస్తారు  . సిటి లో పెరిగితే సంక్రాంతి డిఫరెంట్ గా అనిపిస్తుంది.

అసలు సంక్రాంతి అనగా ...

1. పతంగులు , రకరకాల ఆకారాల్లో దొరుకుతాయి, ఎగురుతాయా లేవా అన్నది వేరే సంగతి. న్యూస్ పేపర్ తో వాటిని తయారు చెయ్యడం , మాన్జాలు కొనడం , లేకపోతే దారాలకి అన్నం, గుడ్డు, ఏవో నూనెలు రాయడం.  పతన్గికి సరిగ్గా కన్నాలు పెట్టి దారం కట్టడం , వాటికి తోకలు పెట్టడం, పోటీలు పెట్టుకోడం, తెగిపోయిన పతంగి వెనుక పోలో మని పరిగెట్టడం , గాలి ఎటు ఉందా అని చూసుకోడం, పతంగి ఎగారేయ్యడానికి, దారం చరక కి చుట్టడానికి ఒక assistant ,  ఇంకోడి పతంగి తెగ్గొట్టి "కాటే " అని గొంతు చించుకుని అరవడం, మన పతంగి తెగ్గోట్టినవాడితో గొడవలు పాడటం, కక్ష సాధించడానికి వాడు ఎగరేసిన పతంగి మీద concentrate చెయ్యడం,  మా బిల్డింగ్ మీద పడింది కాబట్టి మాదే అన్న వాడితో ఇంకో గొడవ ..... పెద్ద తతంగం ఇది..బేసికల్ గా బద్ధకం ఉంది కాబట్టి నేను వీటికి దూరంగా ఉండే వాడిని.

2. చిన్నప్పుడు భోగి మంట పెట్టె వాడిని, ఇప్పుడు GHMC వాళ్ళు రెగ్యులర్ గా చెత్త తీసుకెళ్లడం వల్ల కాల్చడానికి చెత్త లేక బద్ధకం వయసుతో పాటు ఇంకొంచం పెరగడం వల్ల మానేసాను

3. పొద్దునే తలపాగా పెట్టుకుని పీ పీ పీ పీ అని ఊదుతూ, ఒక దూడ వీపు మీద పట్టు చీర కప్పి, దాన్ని తోలుకుంటూ ఒకడు వచ్చేవాడు. డబ్బులిస్తే కాని ఆ వూదడం ఆపడు అని వెంటనే డబ్బులు ఇచ్చి పొమ్మనే వాడిని. మా తాతయ్య డబ్బులిచ్చి ఇంకాసేపు వూదమనే వారు. అక్కడ గొడవ వచ్చేది నాకు ఆయనకీ.

4. అసలే మా కాలనీ రోడ్లు చెండాలంగా ఉంటాయి అని ఏడుస్తూ ఉంటె , సరిగ్గా ఉన్న కాస్త రోడ్డు మీద ముగ్గులేసేసి, ఆ వేసిన ముగ్గుని కాపాడటానికి చుట్టూ ఇటుక రాళ్ళు , కంకర రాళ్ళు పెడ్తున్నారు , ఇదో బాధ.

5. ఇక టీవీ లో , సంక్రాంతి గొప్పదనం, అసలు మకరం అంటే ఏంటి, హరిదాసు, ఇప్పటి వాళ్ళకి ఇవేవి పట్టవు అని ఒకటే గోల.

6. ముగ్గు బొమ్మలు ఉండే SMS లు వస్తాయి. ఒకమ్మాయి ముగ్గు వేస్తూ ఉండే image file తో మెయిల్స్ వస్తాయి. వచ్చిన వాటిని ఇంకోళ్ళకి forward చెయ్యడం.

సంక్రాంతి వ్యవసాయదారుల పండుగ , పంట చేతికొచ్చింది అని వాళ్ల ఆనందం. వారం రోజులు సెలవులు వచ్చాయి అని పిల్లలకి ఆనందం. ఒక హాలిడే వచ్చింది అని మనకి ఆనందం.

Tuesday, November 29, 2011

FDI & భారతదేశ స్వతంత్రం

"వర్తకం పేరుతో వచ్చి భారత దేశాన్ని బానిసత్వపు సంకెళ్ళతో కేట్టేసిన తెల్ల కుక్కలు " --------- అసలు కత్తి డయలాగు ఇది. కాని దీన్లో మొత్తం నిజం ఉందా ?

FDI , international trade అనగానే , మళ్ళి మిగతా ప్రపంచంతో వర్తకం చేయడం వల్ల భారతదేశం తన స్వయంప్రతిపత్తిని కోల్పోతుందా అనే అనుమానాలు  చాలా మందికి ఉన్నాయి అని నాకు ఈ మధ్యనే అర్థం అవుతోంది.

వర్తకం చేయడం వల్ల మనం స్వతంత్రాన్ని కోల్పోలేదు . మిరియాలు, ఏలకులు , నల్ల మందు వర్తకం జరిగినంత కాలం బాగానే ఉంది. ఎప్పుడయితే బ్రిటిషు వారికి , ఫ్రెంచు వారికి , కోటలు కట్టుకోడానికి,  ఇక్కడ వాళ్ళు సైన్యం మైంటైన్ చేయడానికి అనుమతి ఇవ్వబడిందో , ఎప్పుడయితే ఇంకో భారత దేశ రాజుని ఓడించడానికి వాళ్ల సహాయం తీసుకుని, తమ రాజ్యం లో కప్పం వసూలు చేసుకోడానికి అనుమతి ఇవ్వడం మొదలు పెట్టారో అప్పుడు భారత దేశం స్వతంత్రం కోల్పోడం మొదలు పెట్టింది.

కాని ఇప్పుడు అదే పరిస్థితి ఉందా ? వచ్చిన MNC's కి tax వసూలు చేసే అధికారం , వారి సొంత ఆర్మీ పెట్టుకునే అధికారం లేనంత కాలం , FDI అనేది బానిసత్వంని  భారతదేశం మీదకి రుద్దుతుంది అని భయపడక్కర్లేదనుకుంటా .

అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి , ఒప్పుకుంటా . కాని సరయిన పాఠం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి మోసం చేసాడు అని , ఇక ఎవరితోను మాట్లాడను, ఎవరి మాటా వినిపించుకోకుండా చేవుల్లు దూదులు పెట్టుకుని మాత్రమే తిరుగుతా అనడం సరి కాదు , ఎదుటి వాడు నిజం చెబుతున్నాడా లేదా అని తెలుసుకోగలిగే విజ్ఞత తెచ్చుకోవడం సరి అయిన పాఠం

Friday, November 25, 2011

వాల్మార్ట్ కిరాణా & జనరల్ స్టోర్స్

వాల్మార్ట్ వస్తే మన కిరాణా & జనరల్ స్టోర్స్ మూత పడతాయా ? ఇన్ని మోర్ సూపర్ మార్కెట్స్ ఉన్నా చావని కిరాణా కొట్టు , వాల్మార్ట్ కి తల వంచుతుందా ?

pepe jeans, reebok , nike , adidas , peter england , van heusen and pan america brands రావటం వల్ల , మన చర్మాస్ , kumar shirts, jc brothers, bommana brothers, neerus , పుచ్చల సిల్క్స్ , రాజమండ్రి లో సినిమాలు , టీవీ సీరియల్ పేర్లతో చీరలు అమ్మే దుకాణాలు నడవడం మనేసాయా?

పది సంవత్సరాల క్రితం కంపూటర్లు వల్ల ఉన్న ఉద్యోగాలు పోయి, నిరుద్యోగం పెరుగుతుంది అన్న వాదన నిజమయినదా ? అప్పుడు ప్రజలు భయపడినట్టే  జరిగిందా ?

ఇలా వాల్మార్ట్ రాగానే అలా ప్రజలంతా అక్కడికి వెళ్లి ఉప్పులు పప్పులు కొంటారా ? ఎక్కడో ఉండే వాల్మార్ట్ కి వెళ్లి VAT తో కలిపిన బిల్ కడతారా లేక ఇంటిదగ్గర కిరాణా కొట్టులో బిల్ లేకుండా కొంటారా ?


Thursday, November 17, 2011

అసలు ప్రభుత్వం ఏం చెయ్యాలి అంటే ......

ప్రభుత్వం పనుల్లో ముఖ్యంగా సైన్యాన్ని , law and order ని మైంటైన్ చెయ్యడం . ఇవి కాకుండా ప్రభుత్వం చాలా చేయ్య్యాలి .

బుర్ర పగలకుండా హెల్మెట్ పెట్టుకోమని ప్రభుత్వమే చెప్పాలి, పిల్లలకి పోలియో రాకుండా మందులు ప్రభుత్వమే పంచాలి , దోమలు ఎక్కువకకుండా ఉండటానికి నీళ్ళు నిలువ ఉంచకండి అని ప్రభుత్వమే చెప్పాలి, అలా కాకుండా దోమలు ఎక్కువయితే దోమల మందు ప్రభుత్వమే కొట్టాలి . తక్కువ ధరకే విత్తనాలు, ఎరువులు , కరెంటు , నీళ్ళు ఇచ్చి , ఒకవేళ సరయిన మద్దతు ధర మార్కెట లో లభించకపోతే ప్రభుత్వమే ఆ పంటని కొని, గోదాముల్లో పెట్టుకోవాలి . చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయొద్దని ప్రభుత్వమే చెప్పాలి, పిల్లల్ని చదివించమని చెప్పాలి, వాళ్ళకి ఉచితంగా స్చూల్స్ కట్టాలి,  వాళ్లకి స్కూల్ లో భోజనాలు పెట్టాలి, ఆడపిల్లలని చంపోద్దని చెప్పాలి, మగ పిల్లలని అమ్ముకోవద్దని చెప్పాలి, తాగి డ్రైవ్ చెయ్యొద్దని, ఎయిడ్స్ రాకుండా కండోమ్స్ వాడమని కూడా ప్రభుత్వమే చెప్పాలి, కరువు వరదలు వచినపుడు రుణాలు మాఫీ చెయ్యాలి , NREGA లాంటి ప్రోగ్రామ్స్ మైంటైన్ చెయ్యాలి, నిమ్న కులస్తులకి చదువుకోడానికి స్కాలర్షిప్స్ ఇవ్వాలి, వాళ్ల చదువు పూర్తీ అయ్యాక ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలి, ఇంకా ఫ్రీ గా టీవీలు , తక్కువ ధరకే టాబ్లెట్ ఫోన్స్  అందించాలి, మనం వంట చేసుకుని తినడానికి గ్యాస్ , నడపడానికి కార్లో డీసిల్,  తక్కువ సబ్సిడి కే ఇవ్వాలి ,   ఇవి కాకుండా ఆస్పత్రి వసతులు, గ్రంధాలయాలు , పార్కులు కట్టాలి, మరుగు దొడ్లు కట్టాలి, ఆనకట్టలు కట్టాలి, పేద వారికి ఇళ్ళు  కట్టివ్వాలి, ప్రభత్వ ఉద్యోగులకి కూడా కట్టివ్వాలి , స్థలాలు పంచాలి , ఆడవారికి ముసలి వారికి పన్నులో రాయితి ఇవ్వాలి, అర్తికపన్ను తగ్గించుకోడానికి చిన్నమొత్తాల పొదుపు, ఇందిరా వికాస పత్రం లాంటి ప్రోగ్రాములు పెట్టాలి , యునివేర్సిటీలు , కళాశాలలు పెట్టాలి, అక్కడ రిసెర్చ్ చేసే వాళ్ళకి ఆర్ధిక సహాయం చెయ్యాలి , బస్సులు రైళ్ళు నడపాలి, వాటిలో ముసలివారికి వికలాంగులకి రాయితి కల్పించాలి , వార్డ్ దగ్గరనుంచి , లోక్ సభ దాకా ఎన్నికలు నిర్వహించాలి ....ఇంకా ఇలాంటివి బోలెడు చెయ్యాలి .

ప్రజలుగా మనమేం చెయ్యాలి ? పన్ను కట్టాలి, వోటు వెయ్యాలి . 2009 లో వోటు వేసినవారు 59.7%, మొత్తం పన్ను కట్టే వారు అటు ఇటు గా 2.5% .  అదీ  సంగతి.


Monday, October 31, 2011

గెలిచినోడికేం తెలుసు ....

పోరాడి గెలిచిన వాడికేం తెలుస్తుంది. పోరాటం అయిపోయాక బహుమతులు, సన్మానాలు , పొగడ్తలు, కొత్త స్నేహాలు, పేరు , కొత్తగా వచ్చే మర్యాద , పెద్దల ఆశీస్సులు , చిరునవ్వులు , మందహాసాలు , గెలవడానికి ఎంత కష్టపడ్డాడో కధలుగా చెబుతూ ఉంటె పైకి కిందకి ఆడించే తలకాయలు , సలహాలు సంప్రదింపుల కోసం వచ్చే ప్రజలు , పండగ చేసుకోడాలూ , వాడి మీద వాడికి నమ్మకం ఉంది కాబట్టి అంత రిస్క్ తీసుకున్నాడు అనే ప్రశంసలు , "ఆ గెలిచాడు చూడు వాడిలా " అని పిల్లలకి ఒక రోల్ మోడల్ అవ్వడం , పార్టీ ఎప్పుడు మామా అనే పలకరింపులు , నీకేంట్రా సక్సెస్ కొట్టావు అనే మాటలు, ....

అదే ఓడిన వాడికి అయితే , పోన్లే మామ ఇంకోసారి చూసుకోవచ్చు బాధపడకు అనే జాలి మాటలు , తర్వాత ఎం చేద్దామనే ప్రశ్నలు , అదిగో వాడిలా అవి ఇవి అంటూ సమయం వృధా చెయ్యకు అని మిగత వాళ్ళకి ఒక ఉదాహరణ అవ్వడాలు , కోరిక ఉండగానే సరి పోదు కదా , తెలివి తేటలు కూడా ఉండాలి కదా అనే వెనక మాటలు , నీకు ఇంక రాదేమోరా ఓడిలేయ్య కూడదా అంటూ  డయలాగులు , ఏమయింది ఏమయింది అంటూ అత్యుత్సహపు ప్రశ్నలు , ఎందుకు పోయిన్దంటావు అంటూ ఎంక్వయిరీలు. వీటన్నింటికి సమాంతరంగా ఉండే  ఓడిపోయామన్న బాధ , తన మీద తనకున్న నమ్మకానికి పడిన దెబ్బ ,గెలిచిన వాడు నాకన్నా బెట్టర్ అని ఒప్పుకోడానికి అడ్డొచ్చే ego ,  గెలిచిన వాడి మీద మంట , ప్రజలని దూరం పెట్టాలి అనుకోడం , అలా ఎలా ఓడిపోయాం అని వెంటాడే ప్రశ్న ,  తర్వాత ఎం చెయ్యాలో అర్థం కాకపోవడం , ప్రజలు ఓటమి గురించి మాటల్డటం మానేస్తే బాగుండు అనుకోడం  , ' గెలుపు ఓటమి సమానంగా చూడాలి ' అనే ముష్టి  డయలాగులు కొట్టడం , వెధవ నవ్వులు నవ్వడం, నాలా ఎంత మంది ఓడిపోయారు అని వెతుక్కోడం ,  ఓటమి లోంచి బయటపడటానికి, ' జీవితం , ప్రపంచం చాలా పెద్దవి ' అన్న జ్ఞానోదయం తెచ్చుకోడం.

గెలిచిన వాడికేం తెలుసు, వాడి చుట్టూ తిరిగే ప్రజలకేం తెలుసు ఓడినోడి బాధ . గెలిచిన వాడికన్న,  ఓడిన తర్వాత ఇన్ని బాధలు తట్టుకుని మాములుగా ఉండే ఓడినవాడే గొప్ప .  అవును ...నేనే గొప్ప :D

Thursday, October 20, 2011

పులులతో పోటి పడుతున్న ఏనుగు కథ

అనగనగా ఒక దట్టమైన అడివిలో ఒక ఏనుగు ఉంది . ఒకప్పుడు ఆ ఏనుగే ఆ అడివికి పెద్ద. ఆ ఏనుగు మీద చాలా కథలున్నాయి. అడివిలో ఎవరికీ సహాయం కావాల్సి వచ్చినా ఏనుగు దిక్కే చూసే వారు . ఎక్కడ చూసినా  ఏనుగు గురించి గొప్పగా మాట్లాడుకునే వారు. కొంతకాలానికి ఏనుగుకి ఆ గొప్పదనం అలవాటు అయ్యిపోయింది. ఇంకోళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ , తత్వం మాట్లుడుతూ  కాలం వెళ్ళబుచ్చుతోంది.

. ఏనుగు గొప్పదనం విన్న ఒక  సింహం దాడి చేసి ఏనుగుని ఓడించింది. కొంతకాలానికి సింహం ఆ అడవి వొదిలిపెట్టి వెళ్ళిపోయింది. సింహం చేతిలో ఓడిపోయాక కూడా , ఏమి జరగనట్టు , తన పాత గొప్పదనాల గురించి మిగతా జంతువులులకి చెబుతూ , తత్వం మాట్లాడేస్తూ కూర్చోనేది. ఇంకోల్లతో ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఏమి పెట్టుకోకుండా , ఎక్కడికి వెళ్ళకుండా , తన దగ్గరకి ఎవరోస్తే వాళ్ళకి తన పాత గొప్పలు చెబుతూ ఇంకా అడివికి దిక్కు తనే అన్నట్టు ఉండసాగింది. గతం గురించి తప్ప వర్తమానం లో తన గురించి తాను పట్టించుకోక పోవడం వల్ల, ఏనుగు మీద మట్టి , దుమ్ము బాగా పేరుకు పోయాయి. కొవ్వు కూడా పెరగసాగింది. అలా ఏనుగు ఆకారం కొంచం గా పెద్దది అయినట్టుగా అనిపించసాగింది అందరికి . దానికి ఏనుగు పెరుగుదల రేటు అని ముద్దు పేరు కూడా పెట్టుకున్నాయి మిగతా జంతువులు.

ఇంతలో నాలుగు పులుల ప్రభావం అడివి మీద పెరగడం మొదలయ్యింది. అన్ని జంతువులు ఆ పులుల దగ్గరికే వెళ్లడం , వాటి తోనే మాట్లాడటం ఎక్కువయిపోయింది. అడివిలో ఏనుగు ప్రభావం తగ్గిపోతోంది.  అంత పెద్ద ఆకారంతో ఉంది కాబట్టి ఏనుగు ప్రభావం  కాస్తో కూస్తో ఉంటోంది. మిగతా జంతువులు ఏనుగు దగ్గరికి రావడం తగ్గించేసాయి. ఏనుగుకి పరిస్తితి అర్థం కావడం లేదు. గతం లో తన గొప్పదనం చూసి కూడా ఎవరు తన దగ్గరికి ఎందుకు రావట్లేదో అర్థం చేసుకోలేకపోతోంది. 

ఏనుగు ఆరోగ్యం బాగా పాడయిపోయింది. ఇక తనువు చాలిస్తుందేమో అని మిగతా అందరు అనుకుంటూ ఉండగా,  ఒక డాక్టర్ వచ్చి ఏనుగుకి సలహా ఇచ్చాడు. లేచి అందరితో కలవాలని, మిగతా జంతువులతో ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు తనకే మేలు చేస్తాయని, లేకపోతే తన్నడానికి ఒక పెద్ద బకెట్ తెప్పించుకోమని. ఏనుగుకి భయం మొదలయ్యింది, గతం గురించి గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన వర్తమానం లో తను గొప్పది కాలేదని గ్రహించింది. డాక్టర్ సలహా పాటించడం మొదలెట్టింది. ముందుగా నది దగ్గరికి వెళ్లి తొండం నిండా నీళ్ళు తీసుకుని ఒంటి మీద ఉన్న కుళ్ళు వదిలిన్చుకోడం మొదలెట్టింది. ఇంకోళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం తగ్గించి, అందరిలో ఒకడిలా ఉండటం మొదలెట్టింది. మిగతా జంతువులతో సంబంధాలు మెరుగయ్యాయి., కొవ్వు తగ్గి కండ పెరగసాగింది., ఏనుగు నడక వేగం  పెరిగింది. అడివిలో అన్ని జంతువులు నోళ్ళు తెరిచి చూస్తున్నాయి దూసుకెళ్తున్న ఏనుగుని .


అంతే , అది స్టొరీ , ఇదేమి పంచతంత్రం కథ కాదు , ఇక్కడ ఏనుగు మన దేశం, సింహం బ్రిటన్ , నాలుగు పులులు ఆసియన్ టైగర్స్ , డాక్టర్ మన మన్మోహన్ సింగ్ , ఏనుగు వంటి మీది కుళ్ళు లైసెన్స్ రాజ్, ఏనుగు పెరుగుదల రేటు ఏమో Hindu rate of grwoth.   ఇది  శశి తరూర్ గారి "Panchatantra 2007: The Elephant who became a tiger" వ్యాసం ఆధారంగా రాసాను. అయన వ్యాసం లో , ఏనుగు వంటి మీద పులి చారలు వచ్చాయి అని ముగిస్తారు, మనకి తెలుగులో పులిని చూసి వాత పెట్టుకున్న నక్క సామెత వల్ల , పులితో పోటి పడుతున్న ఏనుగు అని ముగించా. అసలు వ్యాసం " The elephant, the tiger and the cellphone" అనే పుస్తకం లో మొదటి వ్యాసం, ఇది చదివాకా నేనా పుస్తకం కొన్నాను. ఈ వ్యసం మీద వచ్చే comments అన్ని అసలు వ్యాసకర్త కే అంకితం. కాకపోతే ఆయన ట్విట్టర్ లో బిజీ బిజీ ...

ఆ వ్యాసం కూడా 2007 లో రాసింది...ఇప్పుడు అయితే "డ్రాగన్ తో పోటి పడుతున్న ఏనుగు కథ " అనో "  డ్రాగన్ ని చిరాకు పరుస్తున్న ఏనుగు కథ " అనో రాయాలి నిజానికి .