చాలా కాలం పాటు నేను అనుకున్నది ఏంటంటే ...కవిత అనేది మనిషిలో ఉందొ భావ వ్యక్తీకరణలో ఒక రకం అని. కొంత మంది ఫోటోలు తీస్తారు, కొంతమంది అలా చూసి ఆనందిన్స్తారు ...కాని కవి మటుకు భావ వ్యక్తీకరణకి పదాలు వాడుకుంటాడు అనుకున్నా..
కాని చాలా మందికి అసలు భావుకత లేదని , అందరిలో ఒక కవిగా పేరు కోసం ...యమలీలలో తోటరాముడిలా కవిత భావం తో సంబంధం లేకుండా ప్రాస కోసం పదాలు వాడుకుంటూ ఒక బ్యాచ్ ఉంటారని. పోనీ తోటరాముడి కవితలు , చంటబ్బాయ్ లో శ్రీ లక్ష్మి కవితలు కనీసం నవ్వన్నా తెప్పించాయి ...వీళ్ళవి చిరాకు తెప్పిస్తాయి ... అర్థం కాని బండ పదాలు వాడేస్తూ ... అమ్మాయిలని మందారం , మకరందం , మల్లెపూవు అని రాసేసి ....భావుకతతో ఉండడం అంటే భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలని గౌరవించడం అనుకుని ...అసలు అమ్మాయంటే పెద్ద వాలు జడతో, లంగా వోని వేసుకుని , ఒక మేక పిల్లని చంకలో వేసుకుని పొలం గట్ల మీద టింగు టింగు అని గెంతుతూ ఉండాలని .... అదేమీ ఆనందమో నాకర్థం కాదు ..
ఇక ఆ కవితలలో పదాలు చూస్తె ఇంకా చిరాకేస్తుంది ...ఆనందం, ప్రేమామృతం, అధరం , హృదయవేదన, వేచి చూస్తున్న కనులు, గుండె లోతులు, కన్నుల్లో/గుండెలో వేదన , రోదన, కంటి పాప , చిరు దీపం , మధురం, కన్నుల్లో/జీవితం లో వెలుగు/చీకటి నింపడం, స్నేహం, ప్రేమ , స్నేహ హస్తం, ఆశ , చిరునామా .. ఇలా ఇంకొన్ని standard words ఉన్నాయి .. కవితలో ఈ పదాలు తప్ప ఇంకేం కనిపియ్యవు ... సిటీ లో పుట్టి పెరిగిన వాడు కూడా కవిత రాయాల్సి వచ్చేసరికి పొలం గట్లు, గోదావరి గట్టు , ఆ గట్టు పక్కన చెట్టు అంటాడు ..నిజానికి ఇవి వాడేప్పుడు చూసి ఉండదు ...చిన్నప్పటినుంచి చదివిన కవితల ప్రభావం వల్ల ....ఇలా గట్టులు, పుట్టలు రాస్తే తప్ప ప్రజలకి నచ్చదు అని fix అయిపోయుంటాడు . ఒక అభినవ కవి రామాయణం మీద కవిత లో ఇలా రాసాడు "సీతని విలపించి వలపించిన రాముడు" ... అసలు ఆ లైన్ చాలా చిరాగ్గా అనిపించింది... రాముడు ఏమి నాకు పెళ్ళాం కావాలి కావాలి అని ఏడిచి సీతని పెళ్లి చేసుకుని ...అమ్మయ్య ఎవరో ఒకరు నన్ను పెళ్లి చేసుకున్నారు చాల్లే అని సీతని ప్రేమించలేదు కదా ... సీతని స్వయంవరం లో గెలుచుకుని ...పెళ్లి చేసుకుని ...ప్రేమించి ...రావణుడు ఎత్తుకుపోయాక తన వియోగం భరించలేక విలపించాడు ( అంటే రాముడు నిజంగా ఎడి చాడా లేదా అని తెలియదు కానీ...కవి అలా అనుకున్నాడు) . ఇక్కడ సమస్య విలపించడంకి వలపించడం కి తేడ తెలీకుండా .....అలా రాసేసి వినిపించేసాడు మాకు. ఇలా అర్థం తెలీకుండా పదాలు అడ్డ దిడ్డంగా వాడితే ...నాకు గాయం మూవీ లో కోట గుర్తొస్తాడు ... ఎం చేస్తం ? ఖండిస్తం!
ఇక ఇంకో కవి అయితే ... ఎవర్నో పొగడడం లో "ఆయన స్వరం భాస్వరం" అన్నాడు ప్రాస కోసం ....
అటు ఇటుగా ఈ అభినవ కవులంతా కలిసి అసలు ఆనందం , సంతోషం ఆప్యాయత లాంటివి పల్లెటూర్లో మాత్రమే ఉంటాయి , సిటీ లో కాలుష్యం తప్ప ఏమి ఉండదు , అసలు సిటీ లో ఉండటం వల్ల మనం ఏదో కోల్పోయిన ఫీలింగ్ తీసుకొస్తారు ...మళ్ళి వేల్లంతా సిటీ లో వాళ్ళే ..
భావ వ్యక్తీకరణ మామూలు భాషలో ఉంటె తప్పా ? సిరివెన్నల మూవీ వల్ల సీతారామశాస్త్రి కి మంచి పేరు వచ్చింది...కాని కొంతమందికి తప్ప ఆ విరంచి, విపంచి , విరచించడం అంటే ఏంటో అర్థం కాదు , ....అసలు పదమే అర్థం కానప్పుడు ఇంక పాట ఏమి ఎంజాయ్ చేస్తారు, ఏదో తమిళ పాటలు విన్నట్టే ఉంటుంది ...అదే మనీ లోని భద్రం బి కేర్ ఫుల్ బ్రోదరు కాని, చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకీ ..పాటలు ఎంత బాగున్నాయి, వింటే అర్థం అవుతాయి...దాన్లో సీతారామశాస్త్రి చెప్పదలచుకున్న భావం కూడాఅర్థం అవుతుంది.
ఒకసారి ఈ కవిత చూడండి ...నాకు బాగా నచ్చింది ...
http://subhashiniporeddy.blogspot.com/2010/09/orkut-friend-ship.html
కాని ఇలాంటి కవితలకి పెద్దగా కామెంట్స్ రావు ... అదే కవితని
అంతర్జాలం లో నా స్నేహ హస్తాన్ని చాచగానే అందుకున్నావు ..
అందుకున్న వెంటనే మొదలయిన మన సంభాషణ ..
అంతర్జాలం లో ఉన్నామనే కాని , అన్తరిక్షమ్ లో ఉన్న అన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం ..
నువ్వేక్కడో ...నేనెక్కడో...మనల్ని కలిపిన ఆ ఆర్కుట్ సర్వర్ ఎక్కడో ?
ఆ తర్వాత ...
అంతర్జాలం లో నీ మాయాజాలం లో పడి నా మార్జాలన్ని మరిచాను ..
దాని మరణం తో మూర్చ వచ్చాక ... నీ వలపు లో పడి మతి పోగొట్టుకున్నాను ..
మీ మామ మూతి పళ్ళురాలగోదతాడనా ? మాటలు తగ్గించేసావు ?
ఓ నేస్తం ... మాట్లాడటం అలవాటయింది నిత్యం ....
ఇప్పుడు నాకు పట్టినట్టుంది పత్యం ...ఇది సత్యం ..
అంకోపరి ( laptop) మోస్తూ నా నీకోసం వొడి ....కాని చాలా కాలం అయింది నువ్వు అంతర్జాలం లో కనబడి ..
ఓ మందారం .... నీకోసం ఆర్కుట్ లో వెతికా ప్రతి దారం(thread ) ..
ఇలా రాస్తే మటుకు భలే నచ్చుతాయి ప్రజలకి (అంటే ఈ చెత్త ప్రాస ని తగ్గించి ....ఈ కవితని ఇంకొంచం బండ పదాలతో నింపి వేస్తె అప్పుడు )