చాలా మంది జీవితాలలో లాగే నా వేదన కూడా నవయవ్వన దశ లోనే మొదలయింది. సంవత్సరాల బాధ. ఏమి చేసినా పోదు, ఎల్లప్పుడూ బాధపెడుతూనే ఉంటుంది, కాలం అన్ని సంయలకి పరిష్కారం అంటారు కాని ....అది నిజం కాదు.
ఇన్ని సంవత్సరాలుగా నాతోనే ఉంది. ప్రతి క్షనమ్ నేను ఉన్నా అని గుర్తు తెస్తూనే ఉంటుంది. సరిగ్గా అలోచిన్చుకోలేను, అర్థ రాత్రి లేచి బాధ పడిన రోజులున్నాయి. అందరితోను చెప్పుకోలేను, అర్థం కాక పోవచ్చు కూడా. ఆప్తమిత్రులు అడిగే వారు , మాట దాటేసే వాడిని మొదట్లో, కాని మన గురించి బాగా తెలిసిన స్నేహితులని , రోజు చూసే స్నేహితులని మోసం చెయ్యలేం, గుర్తుపట్టి అడిగే వారు , అంత ఏమి లేదులే అని చెప్పెసేవాడిని. అదో పెద్ద సమస్యే కాదు అన్నట్టు మాట్లాడేవాడిని.
చాలా మందికి తప్పదనుకుంటా ఇది, కాని బయటకి కనిపియ్యకుండా ఎలా మేనేజ్ చేస్తున్నారో అనిపించేది. హడావిడిగా ఉన్నప్పుడు , పని ఒత్తిడి లో ఉన్నప్పుడు తాత్కాలికంగా బాధ తెలియకపోయినా , కాస్త విరామం దొరకగానే మళ్ళి తెలిసేది. తీవ్రత ఎక్కువయ్యేసరికి , నేను పెద్దగా తెలియని వాళ్ళకి కూడా విషయం అర్థం అవడం మొదలయ్యింది. చాలా మంది చాలా సలహాలు ఇచ్చారు, ఉపశమనం తాత్కాలికంగా లభించినా , పూర్తిగా పోలేదు. నెమ్మదిగా అలవాటు అవ్వసాగింది , ఇలా వదిలేస్తే జీవితాంతం బాధ పడుతూనే ఉంటా అని చివరికి మెడికల్ హెల్ప్ తీసుకుంటున్నాను.
మాకి కిరి కిరి ఈ చుండ్రు ఎప్పటికి వదులుతుందో ఏంటో .