If a person wants to be remembered, he must do good deeds for the society, be selfless, live life with honesty and integrity blah blah blah ...all crap. All those things might bring an award and a title in his generation. Can't expect more than that. After two or three generations he will be mocked, insulted and will become a joker by the ordinary citizens. You need proof? Just check the opinions people hold on gandhi or nehru or Lincoln. If the expression " turning in the grave" is true, then we could attach turbines to their dead bodies and generate electricity. And what about the people who were called villains in their generation? It's likely that they might become heroes with two are three conspiracy theories attached to their stories defaming heroes of that time. Example is our beloved Hitler Still there are fans for Hitler . There might be cultural or religious or ideological reasons for the hero worship they get, but people forget that Hitler killed people in concentration camps. So, what happens after few generations? The dead guys are dead so we can't blame them for the change of public opinion after few generations. So the opinions take u turn in an attempt to prove that this generation is wiser than the old generation?
Wednesday, March 21, 2012
Sunday, March 11, 2012
Corporate corruption
This is the corruption story i faced in non-govt organization.
Last month i have appeared for ISQTB certification test. The question paper is prepared by international software testing board and the test is conducted by Indian testing board. The exam center is MindQ coaching center at ameerpet.
I wrote it well ( At least i thought so). They said the results will be announced in one week or 10 days. Exactly after one week, at 9 pm i have received a call from one of the invigilator, informing that i have scored only 23 where i need to get 26 out of 40 to clear the test. And he assured me not to worry, as he has got a friend who will manage those 3 marks for some money. I stopped picking up his calls and when the results were announced i have failed the test with just 3 marks.
I was really pissed off and sent a mail to ISQTB but didn't get any reply so far.
And we always think corruption is only in govt sector.
Sunday, March 04, 2012
ప్రజల మనిషి అనిపించుకోడం ఎలా ?
1. సామాన్యప్రజనీకానికి కొంచం తెలిసి పూర్తిగా అర్థం కాని విషయాల మీద మాట్లాడాలి, అనగా , ఆర్ధిక శాస్త్రం , రూపాయి విలువ పడిపోడం , జన్ లోక్పాల్ బిల్ ఇలాంటివి అన్నమా, మనకి పెద్దగా తెలియక పోయినా పర్లేదు, కై ఎదుటివాడికి మాత్రం మనకు మించి తెలియకూడదు
2. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని తెగతిట్టాలి, అలా ప్రభుత్వాన్ని మాత్రమే తిట్టివదిలేస్తే ఎగస్పార్టీ మనిషి అనుకుంటారు, అందుకే చివర్లో అన్ని పార్టీలని తిట్టేయ్యాలి
3. అన్నీ కల్తీ అవుతున్నాయని, ఉప్పులు, పప్పులు, నూనెలు ఎక్కడా క్వాలిటీ ఉండటం లేదని గోల చెయ్యాలి. ( పొరపాటున కూడా జేబులో ఉన్న pendrive లో ఉన్న పైరసీ మూవీస్ గురించి మాట్లాడకూడదు )
4. మాటల మధ్యలో సిస్టం, సొసైటీ, సమాజం, వర్గాలు, కుల పిశాచి, వ్యవస్థ , ప్రజాస్వామ్యం లాంటి పదాలు వాడితే మస్తుంటుంది. సామాజిక న్యాయం అని చిరంజీవి మొత్తుకోలా ? అలా అన్నమాట .
5. సమస్య గురించి మాత్రమే మాట్లాడాలి, దానికి గల కారణాలు, సమస్యని నివారించడానికి ఎం చెయ్యొచ్చు అన్న అభిప్రాయాలు లాంటివి మాట్లాడకూడదు, అసలు సమస్యకి పరిష్కారం లేదని నిరుత్సాహ పరచాలి, ఏ సమస్య అయినా ఇదే ట్రిక్ .... విశ్లేషణ చేయకూడదు, పరిష్కారం ఉందనుకూడదు
6, ప్రభుత్వం ఎం చేసినా ప్రైవేటు రంగం లాభాల కోసమే చేస్తోందని చెప్పాలి, ఈ ట్రిక్ కూడా బాగా పనిచేస్తుంది, కాని ఏవి ప్రభుత్వ సంస్థలు ఏవి ప్రైవేటు సంస్థలు అన్నా తెలిసి ఉండాలి, కొంతమంది పెద్దమనుష్యులు అసలు పెట్రోలు ధరలు పెరగడానికి కారణం కి ఈ ట్రిక్ వాడారు, కాకపోతే మనదగ్గర ఉన్న HP, BP , Indian Oil అన్ని ప్రభుత్వానివే, రిటైల్ పెట్రోల్ మార్కెట్ లో ప్రైవేటు సంస్థల వాటా చాలా చాలా తక్కువ.
7. రాహుల్ గాంధీ లా రెండు రకాల ఇండియా గురించి ఎప్పుడు మాట్లాడుతుండాలి, ఒకటేమో మున్నాభాయి MBBS లో ఆ చైనా వాడు అరిచినట్టు , real india, poor india, hungry india. ఇంకోటి Pixar graphics వాళ్ళు చేసిన Imaginary India.
8. ఒక ఖద్దరు చొక్కా ( తెల్లది కాదు, తెలుపు ఖద్దరు మీద రాజకీయనాయకులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు పేటెంట్ తీసుకున్నారు ), ఒక మాములు పాంటు , హవాయి చెప్పులు , చేతిలో గుడ్డ సంచి....అంటే గమ్యం మూవీ లో లొంగిపోయిన నక్సల్ లా తయారయితే మంచి impression వస్తుంది. అంత కష్టం అనుకుంటే , కనీసం చంకలో హిందూ పేపర్ అన్నా పెట్టుకుని తిరగాలి.
9. కొన్ని శ్రీ శ్రీ కవితలు, మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే, ప్రజలకి మతంనల్లమందు లాంటిది, ఏ దేశ చరిత్ర చూసినా etc etc లాంటివి కొన్ని నాలిక మీద ఎప్పుడు ఉండాలి . నిజానికి ఈ పాయింట్ 5 th point కి extension. Project no analyzation to understand the problem, no discussion to solve the problem, give only depressing statements.
10. ప్రభుత్వ ఉద్యోగులు చాల మంది ఖాళీగా ఉన్నారు వాళ్ళని తీసేయ్యాలి, వీళ్ళు నెమ్మదిగా పని చేస్తారు, ప్రైవేటీకరణ చెయ్యాలి అనాలి, తర్వాత నిరుద్యోగం పెరుగుతోంది ప్రభుత్వం ఉద్యోగాలు పెంచాలి అనాలి, మళ్ళి ఏ కంపెనీ అయినా ఇక్కడ ఇన్వెస్ట్ చెయ్యడానికి రాగానే వ్యతిరేకంగా గోల చెయ్యాలి.
11. సునామీకి కారణం గ్రహన్తవాసులు సముద్రంలోకి ఈతకి కోసం దూకడం అనే వాడు హాలీవుడ్ డైరెక్టర్, దానికి కారణం అమెరికా వాడు వైట్ హౌస్ లోని చెత్తని రాకెట్ ద్వారా సముద్రం లో పడేసాడు, అందుకే అంత పెద్ద అల వచ్చింది అనే వాడు ప్రజల మనిషి.
12. ఏదయినా ఫంక్షన్ లో తినలేక ఎవరైనా ప్లేట్ పడేస్తుంటే "భారతదేశం లో చాలా మంది ఆకలి తో అలమటిస్తున్నారు, నువ్వేమో పరేస్తున్నావ్ " అనాలి, అప్పుడు మాత్రం చేతులు జేబుల్లో పెట్టుకునే ఉండాలి, చేతికున్న బ్రాస్లెట్ కనిపియ్యకూడదు, జేబులో i-phone మోగితే సైలెన్స్ చెయ్యడానికి పనికి వస్తుంది .
13. ఇక ఆర్కుట్ లోను ఫసుబూక్ లోను, ఈ ఫోటో షేర్ చేస్తే ఒక పిల్లాడికి భోజనం పెడతాం, ఈ ఆట ఆడితే ఒకడికి బొంగరం కొంటాం లాంటి వాటి మీద బాగా క్లిక్ చేస్తూ ఉండాలి, ఇంకా ముంబై ధారవి పిక్స్ , ఆఫ్రికా లో పేగులు ఎముకుల కనిపించే చిన్న పిల్లల పిక్స్ కొన్ని ఉన్నాయి...అవి బాగా షేర్ చేస్తూ ఉండాలి,
ఇవి కొన్ని టిప్స్ .... వీటిల్లో 5th చాలా ముఖ్యమైనది .