Friday, May 25, 2012

Tuesday, May 22, 2012

Political cartoons...!!


Most of the op-ed writers in last week opinionated that the fuss on political cartoons in textbooks is inane and the govt decision to remove them is silly. They thought the issue is over political cartoons but the real issue about "political cartoons in textbooks".

As somebody quoted,  cartoons and sarcasms are for matured mind. And textbooks which are for kids knowledge is the wrong place for them. Already because of the movies and comedy-cartoon shows in news channels we got the impression that 'all our' politicians are uneducated crooks. Reflecting the same opinion in the form cartoons and printing them in textbooks only gives authentication to that view. After going through a bunch of cartoons will make kids to lose their trust in the political system. Once the trust is lost..then its hard to find a reason to move the body from the couch for voting.

Even the the cartoonist have trust in the political system and thats why he worked on that subject but have chosen a funny pictorial way to express it.

 If you dont believe in my argument...make fun of your best friend before your kids when your friend about to visit home and see how your kid receives him. He might be having some of the traits which are laughable but has many qualities which are admirable. But because of the fun you made he will form an opinion and will be reluctant to change it.

Its the same thing with political cartoons in textbooks. 

Saturday, May 19, 2012

The new land acquisition bill.

After the Mining bill, which made the mining companies to cough up 27% of the their profits to the local, i was very eagerly waiting for the land acquisition bill,  which should be the answer for singur like situations.

According to this bill, minimum 80% of the land owners should agree to sell their land, before acquiring land in a particular area. That is a nice move.

But there is another clause, the acquired land should only used for social welfare and there is no question of public private partnership. . If the bill is passed, no private industry can depend on the govt to acquire land for factories. so land can be acquired only by govt.

Is it good for the economy or our industry? So far, as the govt worked as a middleman in the land deals, the farmers at least got a reasonable compensation for the land. Now local politicians and goons will become the middlemen and no body can expect a reasonable compensation. 


Because of our land reforms , even to purchase a 100 acres of land, one had to deal with many land owners, as no body is allowed to hold such vast land, imagine a situation where thousands of acres are needed to setup an industry.

This bill is good for the situations where govt struggled to get land for a project or for road but what about private industry? 

Lets see how this bill will change the industry in India.


Thursday, May 17, 2012

జొ గబ్బర్ సింగ్ కొ గయా ... సంజొ మర్గయా

నాలుగేళ్ల తర్వాత మా వాడు కలిసి, బ్రతిమలాడి , టికెట్లు తీసుకొచ్చి నన్ను హాల్ లో  కూర్చోబెట్టాడు. పూర్తిగా ఫాన్స్ కోసమే తీసిన మూవీ, మొత్తమంతా ' pawanism ' , అనగా ముక్కడం, స్టేట్ రౌడి కాలం లోని చిరంజీవి హావభావాలు కాస్త మార్పు చేసి చూపించడం, ఇంకా మెడ రుద్దుకోడం.



ప్రతి మూవీ లో సవితి తల్లి పోరు ఉంటుంది కదా...దీన్లో సవితి తండ్రి పోరన్నమాట. దాన్ని భరించలేక మెడ రుద్దుకుంటూ ఇంట్లోంచి పారిపోతే పట్టుకుని హాస్టల్ లో వేస్తె , పోలీసు అవుతాడు. వాళ్ళ వూరికే ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. వూరి పేరు కొండవీడు ( ఏదన్న చిరంజీవి మూవీ గుర్తొస్తోందా ? ) .

  'మోసగాళ్ళకి మోసగాడు ' కాలం నాటి ఒక బ్యాంకు ని కొంతమంది దొంగలు దోచుకుంటారు. అప్పుడే పవన్ కళ్యాణ్ ఎంట్రి, గుర్రమెక్కి వచ్చి, దొంగల్ని పట్టేసుకుంటాడు. ఆ దొంగల్ని పంపించింది లోకల్ యువనాయకుడు ( రక్తచరిత్ర విల్లన్ ) . తర్వాత గబ్బర్ సింగ్ పోలీసు స్టేషన్ కి వస్తాడు, పొలిసు స్టేషన్ పేరుని "గబ్బర్ సింగ్ స్టేషన్ " గా మార్చేసి, మూవీ మొత్తం అయన తుపాకుల్ని ముద్దుపేర్లతో పిలుచుకుంటూ, అయిదేళ్ళ పిల్లాడు  దీపావళి తుపాకీ కాల్చినట్టు , కాల్చేస్తు ఉంటాడు. కూర్చొని మెడ రుద్దుకుంటాడు, కాసేపు నిలబడి రుద్దుకుంటాడు, కాసేపు చిరంజీవి ని కాపీ చేస్తాడు, కాసేపు టపాకి తీసి గోడల్ని, నేలని కాలుస్తూ ఉంటాడు, కాసేపు కుళ్ళు జోకులు, కాసేపు అయన "పవనిసం" మీద ఆయనే జోకులు, కాసేపు హీరోయిన్ కి సైట్ కొట్టడం, కాసేపు విల్లన్ ని బెదిరించడం, కాసేపు జీప్ ని స్కిడ్ చేయించడం, కాసేపు కుటుంబ సెంటిమెంటు, కాసేపు పాటలు, కాసేపు ఓవర్ ఆక్షన్ ,  కాసేపు ఆ వూరి రౌడీలతో కబడ్డీ, అంత్యాక్షరి లాంటి ఆటలు, మిగిలిన టైం లో ముక్కడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇంత బిజీ గా ఉన్నాడు కాబట్టే, ఒక సీన్ లో అయన రాలేక అయన కటౌట్ రిక్షా లో పంపిన్స్తాడు. ఇన్ని విడ్డూరాలు భరించలేక ఆ గుర్రం పారిపోయింది, నేను మాత్రం దొరికిపోయాను.

కథ అంటూ పెద్దగా ఏమి లేదు, స్క్రీన్ ప్లే అస్సలు లేదు, దేనికి లింక్ దొరకదు, వీటి మధ్యలో స్టేషన్ లో అంత్యాక్షరి అనే గొప్ప సీన్. నిజానికి మొదటి మూడు నిమిషాలు బాగానే ఉంది, తర్వాత సాగదీసి పెంట పెట్టాడు. రక్తచరిత్ర విల్లన్ ని మూవీ మొత్తం ఒక సైకో లో చూపించడానికి ట్రై చేసి, అది పండక చివరికి సుహాసినిని చంపించడం లో ఆ పిచ్చి అంటా చూపించారు. డైరెక్టర్ ప్రతిభ ముందు, హీరోయిన్ , అలీ , బ్రహ్మానందం అంతా కొట్టుకుపోయారు. 

మూవీ చూసాక అనిపించింది ... మేము పవన్ కళ్యాణ్ ఫాన్స్ అని చెప్పుకునే వారంతా, నిజంగా పవన్ కళ్యాణ్ కి అభిమానులా లేక , "పవనిసం" కి అభిమానులా అని. నాకు ఖుషి , తొలిప్రేమ పర్లేదు అనిపించాయి కాని, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన జానీ , ఇంకా జల్సా బాగా నచ్చాయి. కాని జానీ , పవన్ కళ్యాణ్ ఫాన్స్ కే సరిగ్గా నచ్చలేదు. ఏదో ఆక్టింగ్ బాగుంది ఫాన్స్ అంటే అర్థం చేసుకోవచ్చు కానీ, మెడ రుద్దుకున్తున్నాడు కాబట్టి ఫాన్స్ అంటే ...ఏంటో . అయినా ఎవరి అభిమానం వాళ్లది.

Wednesday, May 16, 2012

మలక్పేట్ పోలీసు గారండి ... ఫోను పోయిందండి

మా ఫ్రండ్ ది ఫోన్ పోయింది, నోకియా ఫోను, పదహారు వేల ఫోను, ఏడుస్తుంటే iphone కొనుక్కోమని, పోయిన ఫోను ఈ పాటికే జగదీష్ మార్కెట చేరిపోయి ఉంటుందని, దిగులు వొద్దని ,  వోదరుస్తున్నాం.  పోలీసు కంప్లైంట్ ఇవ్వమని వాళ్ళ అమ్మగారు చెప్పారని , ఇవ్వాల్సిందే అని గోల చేస్తుంటే , అది భరించలేక మలక్పేట్ పోలీసు స్టేషన్ కి పోయాం. 

పొలిసు స్టేషన్ మెట్ల మీదే ఒక వీధి కుక్క దర్జాగా కూర్చోండి,  ప్రజలకి పోలీసులు , పోలిసులకి కుక్కలు రక్షణ అని అనుకుని, అక్కడే ఒక పెద్ద గుంపులో నున్చిని మమ్మల్ని సాదరంగా పలకరించి మాట్లాడిన పోలీసు మాట ప్రకారం, పొలిసు స్టేషన్ లో రెండో అంతస్తుకి వెళ్ళాం, పెద్ద పెద్ద ఇనుప పెట్టలు, పెద్ద పెద్ద పొట్టలు ఉన్న పోలీసులని దాటుకుని.

మలక్పేట్  పోలీసు స్టేషన్ రెండో అంతస్తు లోనే, పోలీసులు కాపురం ఉంటున్నారు, వెళ్ళగానే ఆరేసిన డ్రాయర్లు, చొక్కాలు, లుంగీలు కనిపించాయి,వాటి పక్కనే ట్రాఫిక్కు పోలీసుల విభాగం, ఒక పది పదిహేను వాకీ టాకీలు బల్లమీద పెట్టుకుని, ఏదో తెగ రాసేస్తూ కనిపించారు, వాళ్ళ సెక్షన్ పక్కన రూం లోనే ఫోన్ మిస్సింగ్ కేసెస్ రిజిస్టర్ చేస్తారన్నారు, చిన్న గది, ఆ గది లోంచి లాకప్ కి దారి, చిన్న గదిని ఇంకొంచం చిన్నది చేస్తూ రెండు బల్లలు ఒక బెంచి, బెంచి మీద ఒక దిట్టమయిన పోలీసు బాబాయి, అయన చేతిలో తళతళా మెరుస్తూ ఒక చైను, ఆ చైను కి అటువైపు కింద కూర్చొన్న ఒక డిగ్రీ చదివే వయసున్న కుర్రాడు, అంత చైను వేసారంటే వాడెం శాడిస్టు గాడో అనుకుంటూ ఉంటె, బల్ల వెనక పొలిసు "అబ్బా ఫోను మిస్సింగ్ కేసా , బిజీ గా ఉన్నాము వేరే పనిలో" అన్నాడు, పాపం కంప్యూటర్ తో ఏదో కుస్తీ పడుతున్నాడు, ఒకతన్ని పిలిచి మా సంగతేంటో చూడమన్నాడు, ఇంతలో బెంచి మీద కూర్చున్న పొలిసు బాబాయి ఫోను ఎంత అని అడిగాడు, పదహారు వేలు అని చెప్పగానే, మాకు పని చూడటం మొదలు పెట్టినయాన్ని పిలిచి , "పదహారు వేలంట, మంచి గిరాకి పో " అనేసాడు, అందరం నవ్వుతు ఉంటె, ఆ పొలిసు అడిగాడు, అందరి ఫోన్లు పోయాయా, లేక ఒక్క ఫోనుకి ఇంతమంది వచ్చారా  అని, ఇక చేసేది లేక , నేను ఇంకో ఫ్రండ్ బయటకి వచ్చేసాం , ఈ హడావిడిలో లాకప్ కి ఏడు వూచలు ఉన్నాయో లేదో లెక్క పెడదామనుకున్న సంగతి మర్చిపోయాను.

బయట ట్రాఫిక్కుపొలిసు సెక్షన్ దగ్గర నున్చోన్నాం, ఒక వాకీ టాకీ లోంచి ఒక బండ గొంతు తెగ గోల పెడుతోంది, ఎవరు పట్టించుకోట్లా, మాకు మొదట్లో సరిగ్గా అర్థం కూడా అవ్వాలా, జాగ్రత్తగా వింటే తెలిసిందేమిటంటే, ట్రాఫిక్కు పొలుసులు ట్రాఫిక్ను పట్టించుకోడం మానేసి, అంబ్రెల్లా ల కింద కూర్చుంటున్నారని, దీని వాళ్ళ ట్రాఫిక్ జామ్స్ పెరిగే అవకాశం ఉందని , ఇలాంటి అలవాట్ల వాళ్ళ ట్రాఫిక్ వ్యవస్థ కి నష్టం జరుగుతుందని ఒక పెద్ద పొలిసు గొంతును తెలుగులో ఇంగ్లీషులో చించుకుని చెబుతున్నాడు. అయన ఎప్పుడు ఇలానే క్లాసు వాకీ టాకీ లో పీకుతుంటాడు అనుకుంటా , ఎవరు పట్టించుకోట్లా .

కాసేపటికి మిగతా వాళ్ళు బయటకి వచ్చారు. ఏమయిందిరా అంటే, FIR బుక్ చెయ్యలేదు, కంప్లైంట్ బుక్ చేసి నెంబర్ ఇచ్చడుట, బెంచి బాబాయి అయితే, ఇవన్ని కాదు కాని, నాకో అయిదు వేలు ఇవ్వండి, రేపటికల్లా ఫోన్ సంపాదించి ఇస్తా అని బంపర్ ఆఫర్ కూడా చేశాడుట.

ఇంకేం చేస్తం , స్మార్ట్ ఫోను పోయి డబ్బా ఫోను వచ్చే అని పార్టీ చేసుకుని వచ్చేసాం

Wednesday, May 09, 2012

అందమైన మందమైన మధ్యతరగతి

ఆహ్ మధ్యతరగతి బ్రతుకులు, మధ్యతరగతిలో ప్రేమలు ఆప్యాయతలు , మధ్యతరగతి కలలు , మధ్యతరగతి ఉదాసీనత , middle class mentality ఇలా బోలెడు చదివా .

అసలు అందర్ని వదిలేసి, ఈ మధ్యతరగతి వెనకాలే ఎందుకు పడతారు ? ముందు కార్ల్ మార్క్స్ పడ్డాడు, capitalism లో మధ్యతరగతి కుచించుకు పోతుంది అని, కానీ మధ్యతరగతి పెరిగి, పెద్దదయ్యి ఒక దుప్పటి కప్పుకుని పడుకుంది. నిద్రపోవట్లేదు, కేవలం ముసుగుతన్ని పడుకుని , బారిస్టర్ పార్వతీశం లండను వెళ్ళకముందు చేసినట్టు, దేశాకాలవైపరిత్యాల గురించి తన పగటి కలల మధ్యలో ఆలోచిస్తూ ఉంటుంది. మంచం మీద నల్లులు ఉన్నాయా, పక్కలో కప్పలు ఉన్నాయా, దుప్పటి వాసన వేస్తోందా లాంటి విషయాలు పట్టించుకోకుండా అలా ఉంటది. మధ్యలో అన్న హజారే లాంటి వాళ్ళు, సత్యమేవ జయతే ప్రోగ్రాం తో అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు, లేపి, దుప్పటి కంపుకోడుతోంది, మార్చుకో అని చెప్తారు, వెంటనే ఒకసారి దుప్పతిలోంచి మొహం బయట పెట్టి,  ఎవరా అని చూసి, దుప్పటి వాసన చూసి, అర్రే ఇంత కంపులో కులాసాగా కునుకు తీస్తున్నాన అని బుడుగు లెవెల్లో బోలెడంత హాశ్చర్యపోయి , కాసేపు దుప్పటి మొత్తం తేరి పార చూసుకుని , ఈ తీగని సవరించాలి, ఈ అపశ్రుతి సరిచెయ్యాలి  అని  పాడుకుంటూ లేచి, ఎన్నాళ్ళు ఈ కంపులో మేముండాలి, అని నారాయణమూర్తి లెవెల్ లో అరిచి, ఒకసారి చుట్టూ చూసి, సామజిక అసమానతలు ఉన్నాయి, ఇలా ఉంటె ఎలా అని ఒక ప్రశ్న వేసేసి, తనకన్నా ధనికులు, తనకన్నా పేదవాళ్ళకి డబ్బు పంపిణి చేసేస్తే సమాజం లో అందరు తనలనే తయారయ్యి నిద్ర లోకి ప్రశాంతంగా జరుకోవచ్చని సెలవిచ్చి, మొబైల్ లో వచ్చిన ఫార్వర్డ్ SMS ఒకసారి చూసుకుని, మిగతావాళ్ళకి అది ఫార్వర్డ్ చేసి, ఎలాగు మొబైల్ చేతిలో ఉంది కాబట్టి, అవినీతి అంతం అవ్వడానికి , అన్న హజారే కి సపోర్ట్ గా ఒక మిస్సేడ్ కాల్ చేసి, ఎన్నికలలో వోటు కాదు, న్యూస్ ఛానల్ వాడి SMS సర్వేలు కి వోట్లు వేస్తె సమాజం బాగుపదిపోతుందని వాళ్ళకో SMS పంపి, అర్రెర్రె ఆవేశం లో పంపించేసనే, 3 రూపాయలు వదిలింది , ఇది SMS package లో రాదే అని నాలిక కరుచుకుని, చ్చా దుప్పటి తీస్తే ఇలాంటి వాయిమ్పే అవుతుంది, నేను ఇక తియ్యను అని ముసుగుతన్నేస్తుంది.

మళ్ళి ఎవరో వచ్చి లేపుతారు.




Bloody surnames!

Surnames or family names are plague the world don't want to get rid off. I am not wrong. I don't say people should be ashamed of announcing their family names, but I believe it should not have more priority than our first names.

Some don't like surnames because their surnames are funny. Like the family name " kakku" , some names are pretty embarrassing. Some are hard to pronounce and some are hard to spell ( I am a victim of this category family names),  but mostly they reveal a lot about our ancestors, where they lived, what's our caste and sub caste. I don't mind if the person gets some knowledge out of my surname, but usually his behavior and treatment towards me changes after that. It could be in a negative way or in positive, if he wants to hate me or like me, it should be based on me but not on my surname.  Of course it might be essential to reveal it when one is searching for bride or groom, but absolutely unnecessary when you are in a party and socializing.

Why can't they have the confidence that their first names, their behavior and  their looks are  enough to make nice impression. Of course many think even their surname is not good enough so bring out the caste in small talk too.

I am not all will support my views on this but there is one guy whose support i can count on. That guy is late M.K.Gandhi,  just because his family name is homonym with surname of indira gandhi's husband . Of course there are  other reasons why some people dislike him, but this should not be one of them.