సాంప్రదాయాలను ప్రశ్నించే ఒక బ్రాహ్మణ యువకుడు, సంక్షేమ పథకాల ఆశ చూపి జరుగుతున్న ఇస్లాం మత మర్పిడులని ప్రశ్నించి, రాజ్య ద్రోహం కేసు మీద జైలు కి వెళ్తాడు. తను దున్నుతున్న పొలం కాపాడటంలో ఒక కాపు కుర్రాడు, మతమర్పిడులకి వ్యతిరేకంగా పని చేసే ఆర్యసామాజం కుర్రాడు, కుల అహంకారాన్ని, భూస్వామి తత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెడతాడు. వ్యక్తిగతంగా ఎదురయిన సంఘటనలు, మనిషి ఆలోచన విధానంలో, స్వభావం లో తీసుకొచ్చే మార్పులు, తద్వారా వారే న్యాయం కోసం పోరాటం చేయడం ఇలా సాగే కథ.