Saturday, May 29, 2010

లాల్ సలాం

అన్నా అలా రైల్  పట్టాలని పెల్చేస్తే  సామాన్య జనం చనిపోరా ??
"లేదు రా, స్టాలిన్ , మార్క్స్ , లెనిన్ వీళ్ళ ఆత్మలన్నీ కేవలం  బూర్జువాలు మాత్రమే చనిపోయేలా చూస్తాయి"

మరి బాగా దెబ్బలు తగిలి ఆస్పత్రిలో మరణించే వాళ్ళ సంగతి ?
"ఈ బూర్జువ ప్రభుత్వం సరిగ్గా పని చేయడం లేదు అని , వీరి చావులకి కారణం ఆ బూర్జువలె అని  తర్వాత ప్రజలకి చెప్పడానికి పనికి వస్తుంది, CPI ప్రస్తుతం అదే పనిలో ఉంది"

మరి, ఆ ట్రైన్ కూలిపోవడం వల్ల , చిన్న చిన్న వ్యాపరస్తులకి ఇబ్బంది కదా ??
"బూర్జువ ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు ఉపయోగించుకునే వాళ్ళు కూడా బూర్జువాలే , బూర్జువాలకి నష్టం కలిగితే మనం బాధ  పడం"

ఇలా రైల్ పట్టాలని పెల్చేయ్యడం  సమసమాజ ఉద్యమానికి ఎలా ఉపయోగం ??
"మావో , విప్లవం తుపాకీ గొట్టం లోంచి వస్తుంది అన్నాడు , మనం కొంచం ముందుకి వెళ్లి , బొమ్బ్స్, జిలిటెన్ స్టిక్స్ కూడా వాడుతున్నాం"

అన్నా, మనమంతా పేద కుటుంబం లోంచి వచ్చిన వాళ్ళమే కదా , బూర్జువాలు ఉద్యమానికి సహాయం చెయ్యరు , మరి ఈ గన్స్ కి , మొన్న రైల్ పట్టాలని పెల్చేయడానికి వాడిన జిలిటెన్ స్టిక్స్ లాంటి వాటికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి ??
" "!!



2 comments:

Raj said...

పంచింగ్ గా సూటిగా, సుత్తి లేకుండా చెప్పారు.. మంచి విశ్లేషణ..

tankman said...

thaniyou raj