Wednesday, June 09, 2010

ఏంటో !!!!

ఈ మధ్య నక్సల్స్ వల్ల జరిగిన ట్రైన్ ప్రమాదం తర్వాత చిదంబరం గారు నక్సల్స్ మీద ఆర్మీ ని ఉపయోగించే ఆలోచనని వెలుబుచ్చారు ....దానికి రచయిత్రి అరుంధతి రాయ్ భలే స్పందించారు ....నక్సల్స్ మీద ఆర్మీ ని ప్రోయోగించడం తప్పుట ...నక్సల్స్ విషయం లో ప్రభుత్వం రెండు నల్కుల ధోరణిలో ఉందిట ......ఇక ఆవిడ లెక్క ప్రకారం కసబ్ కి మరణ దండన విధించడం కూడా తప్పు కావచ్చు .......

మానవ బాంబు అనే కాన్సెప్ట్ ని ప్రారభించిన  ప్రభాకర్ మరణిస్తే ...మీడియా ఒక గొప్ప వ్యక్తి మరణించినట్టు గోల చేసింది ...

కువైట్ ని పూర్తిగా ఆక్రమించిన సద్దాం హుస్సేన్ , తన దగ్గర ఉన్న జీవరసాయిన ఆయుధాలని వాడతాను అని బెదిరించాడు కాని , నాటో చేతిలో ఓడిపోయినపుడు , ఉరి తియ్యబడ్డ తర్వాత బోలెడు సానుభూతిని సంపాదించాడు ....ఎందుకు?

నక్సల్స్ చేతిలో ఇద్దరు పోలీసులు చనిపోతే ఆ న్యూస్  నాలుగవ పేజి లో వస్తుంది ....కానీ ఒక నక్షల్ చనిపోతే అది మెయిన్ పేపర్ లో వస్తుంది ....తర్వాత రోజు మానవహక్కుల సంఘాలు గోల చేస్తాయి .... హైదరాబాద్ నగరం లో ఉమేష్ చంద్ర ని నక్సల్స్ చంపినపుడు ఈ మనవ హక్కుల సంఘాలు ఎక్కడ ఉన్నాయి ?

ప్రస్తుతం  యువత కి గాంధీ కన్నా గాడ్సే ఎందుకు గొప్పవాడు అయ్యాడు??

ఆర్యులు తప్ప ఇంకోళ్ళు జీవించడానికి అధికారం లేదని భావించే హిట్లర్ కి హీరో స్టేటస్ ఎందుకు వచ్చింది ??

ఫ్రాన్స్ దేశాన్ని గుప్పెట్లో పెట్టుకోడానికి ప్రయత్నించిన నెపోలియన్ , రోమన్ విషయం లో సీజర్ ని ఎందుకు  గొప్ప వాళ్ళుగా పరిగణించాలి? జీవితాంతం అధికారం కోసం ప్రయత్నించిడం వల్లనా ??

పదవి నిలుపుకోడం కోసం ఎమెర్జెన్సీ ని రెండు సంవత్సరాల పాటు భారత దేశం అంటా విధించిన ఇందిరా గాంధీ విగ్రహాలు  ఎక్కడ పడితే అక్కడ ఎందుకు ఉన్నాయి ??

అంబేద్కర్ కి 1990 లో భారత రత్న రాగా, భారత దేశానికి విదేశాంగ మంత్రిగా చేసినందుకా ఇందిరా గాంధీకి 1971 లోనే భారత రత్న వచ్చింది ??

రాజీవ్ గాంధీ , సర్దార్ వల్లభాయి పటేల్ ....ఇద్దరు భారత దేశానికి సమానంగా సేవ చేశారనా ఇద్దరికీ ఒకటే సారి భారత రత్న ఇచ్చారు ?

మన దేశం లో ...మహాత్మా గాంధీకి ఇంకా భారత రత్న కూడా ఇవ్వలేదు....అలాంటిది ఆయనికి నోబెల్ శాంతి బహుమానం ఎందుకు ఇవ్వలేదని గోల చేశాం ?

3 comments:

enigma said...

OMG !! naku koda iwey opinions.. kanee nenu intha clear ga cheppalenu.. If you dint mind. can I copy those ??

-- Samrat

tankman said...

no problem :)

sindhu said...

Good questions sanju. Nee doubts clarify cheyadaniki oka manchi platform unte baguntundi.