మా పెరెట్లో సరిగ్గా నా రూం వెనకాల ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది .....దాని మీద ఒక కోకిల వచ్చి కూస్తూ ఉంటుంది....గత కొద్ది సంవత్సరాలుగా కూస్తూనే ఉంది ....దొంగ ముండ .....నాకు కోకిల అంటే అసహ్యం , చిరాకు, కోపం పుట్టేలా కూస్తుంది ...పొద్దునే లేస్తానా...కూ కూ కూ ....పాటలు వింటుంటే కూ కూ కూ ....ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే కూ కూ కూ ...పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ...కూ కూ కూ ....
నాకు దాని మీద ఎంత చిరాకు ఉందొ ....అది కూడా అంటే కసి తో కూస్తుంది....దాని కూత తెలుగు సీరియల్స్లో ఉన్నట్టు ఉండదు .....దాని గొంతు బొంగురు పోయేలా కూస్తుంది .....మళ్లి ఆ బొంగురు గొంతుతో కూడా కూస్తుంది ....కాసేపు మాములుగా కూస్తుంది ....తర్వాత ఎవరో దాన్ని కొడుతునట్టు కూస్తుంది .....ముందు నెమ్మదిగా తలుపు కొట్టి...తీయకపోతే గట్టిగా frequency పెంచి కొడతాం కదా....అచ్చం అలానే కూస్తుంది....
దాని కూతలకి ఆ మామిడి చెట్టు ఎండిపోయింది ......అది ఎండిపోయింది అని పక్కన ఉన్న కరివేపాకు చెట్టు మీద ఎక్కి కూస్తుంది....నాకు వినబడుతుందో లేదో అని అనుమానం తో కాబోలు ఆ ఎండిపోయిన చెట్టు ఎక్కి కూస్తుంది అప్పుడప్పుడు.
చుట్టూ పక్కల ఏదన్నా కాకి గూడు పెడితే నేను కాస్త ప్రశాంతంగా ఉంటాను ఆ కొద్ది రోజులు ....లేకపోతే మళ్లి కూ కూ కూ ...ఆ కోకిల నా చేతికి దొరకాలి కానీ....దాని రెక్కలు , కాళ్ళు కట్టేసి full sound లో Eminem సాంగ్స్ వినిపించాలి దానికి ...అంత చిరాకు తెప్పిస్తుంది నాకు !!!
4 comments:
kokila pata ante istam unna vallanu choosanu..kavitvam cheppevallanu choosanu..nuvventi..
ila..kokilanu tidutu...haa..??
తినగ తినగ తీపి వెగటు పుట్టు,
వినగా వినగా క్యాసెట్లు అరిగినట్టు,
చేయగా చేయగా చిరాకు వచ్చు పని లోన,
విశ్వదాభిరామ ఇష్కలేసి తోమ!!
బాగుంది కపిత్వం, కాపీ కొట్టేస్తున్నా ఏమీ అనుకోకే :)
@vishal ... thankyou ..emi anukonu copy kottey
Post a Comment