కేశవ రెడ్డి రచన ఇది. చిన్న పుస్తకం , మహా అయితే ఒక రెండు గంటలలో అయిపోతుంది . కాని కాస్త refreshing గా అనిపించింది . తను పెంచుకునే సుక్కల పంది మీద ఒక పేద ముసలివాడి ప్రేమ, అడవిలో ఆ పంది పిల్లల్ని పెట్టడం ...వాటిని చూసి ముసలివాడు చంద్రుని తో "నువ్వు మబ్బుల్లో ఉంటె ఎంత? పోతే ఎంత? నీకు లాంటి లాంటి వాళ్ళు ఇక్కడ మరో పది మంది ఉన్నారు " అని అరవడం .....కాస్త విచిత్రంగా అనిపించినా ....ముసలివాడి ఆనందాన్ని బాగా express చేయగలిగాడు ....అడవిలోని జంతువల మనస్తత్వాల గురించి .....అడివి లో గొడ్లు కాచుకునే వాళ్ళ అనుభవాల గురించి ...తనకున్న చిన్న ఆస్తి మీద ముసలివాదికున్న మమకారం ...ఖర్మ ని తిట్టుకుంటూ కూర్చోకుండా ఫలితం గురించి మరో మార్గం లో ప్రయత్నించడం ....తనకు దేని మీద ఎక్కువ ప్రేమ ఉందొ తెలుసుకుంటూ ఉండటం ...తద్వారా తనని తాను తెలుసుకుంటూ ముందుకు వెళ్లడం ...చివరకు ఏమి మిగాలకపోయినా నిరాశ పడకుండా రేపు మీద ఆశతో ఆదమరచి నిదరపోవడం .....బాగా రాసాడు !!
1 comment:
ఈ పుస్తకం ఇప్పుడు కినిగెలో ప్రింటు మరియు ఈఃపుస్తకంగా లభిస్తుంది. వివరాలు ఇక్కడ
Post a Comment