గతస్మృతులు , మధురస్మృతులు పేరుతో జ్ఞాపకాలు దాచుకొని, కొన్ని సంవత్సరాల తర్వాత గుర్తుకు తెచ్చుకుని ఆనందించడం చాలా మందికి అలవాటు. పాత సినిమాలలో చిన్నప్పుడు రాసుకున్న ఉత్తారాలు చూసి అలా రింగుల్లోకి వెళ్ళేవాళ్ళు. అలా రింగుల్లోకి వెళ్లడం భలే చూపించే వాళ్ళు. కాని ఉత్తరాల కన్నా ప్రజలు ఫోటోలలో నే ఎక్కువగా జ్ఞాపకాలు దాచుకుంటారు, దాచుకుని కొన్ని సంవత్సరాల తర్వాతా అవి చూసుకుని, ఒకసార్ రింగుల్లోకి వెళ్లి, ఆ టైం లో వాళ్ళ ఆలోచలనలు, అనుభూతులు గుర్తు తెచ్చుకొని ఆనందించొచ్చు అని వాళ్ళ ఆలోచన.
కాకపోతే , అప్పుడెపుడో ఈ అనుభూతిని తిరిగి ఆనందించాలని, ఆ సమయాన్ని జ్ఞాపకం గా మార్చుకోడం లో పడి ఆ సమయంలో ఉన్న అనుభూతిని మిస్ అవుతాం ఉదాహరణ కి మెరుపులు మెరుస్తుంటే అవి చూడకుండా కెమెరా లోంచి పిక్స్ తీయడానికి ట్రై చేయడం. పోనీ ఏమన్నా professional photography నా అంటే అదికాదు, తొక్కలో mobile cam లోంచి ట్రై చేయడం. పోనీ తీసి అందరికి తర్వాత చూపిస్తారా అంటే అది ఉండదు , కంప్యూటర్ లోకి pics upload చేయడం చేతకాదు,.
ముఖ్యంగా పెళ్ళిళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అసలే పురోహితుడు అలా చెయ్యి ఇలా చెయ్యి అని అరుస్తూ ఉంటే, photographer కూడా ఇలా నుంచోండి, పక్కకి కూర్చోండి , నవ్వండి పువ్వండి అంటాడు. అది ఏ అర్థ రాత్రి పెళ్ళో అయితే ఇంకా మజా ఉంటుంది చూడటానికి. పెళ్ళికొడుక్కి, పెల్లికూతురుకి నిద్ర వచ్చేస్తు ఉంటుంది, function hall లో అందరు కుర్చీలు జరిపెసుకుని మీ పెళ్లి కన్నా నా నిద్రే నాకు ముఖ్యం అని వధూవరుల ముందే నిద్రపోతుంటారు. అసలే మగత నిద్ర లో ఉన్న వధూవరులు, హోమం ముందు కూర్చొని, చెమటలు కక్కుతూ, పురోహితుడిని భరిస్తూ ఉంటే, photographer వచ్చి , నవ్వండి అంటాడు, ఆ టైం లో వాళ్ళ నవ్వు చూడాలి, వాళ్ళ జీవితాల మీద వాళ్ళే విరక్తిగా నవ్వుతునట్టు ఉంటుంది. ఈ గోలంతా 20 ఏళ్ళ తర్వాతా ఆల్బం తీసి, చూసుకుని ఆనందిస్తారు . అప్పుడు ఆల్బం తీసి చూడగానే ఆ వాళ్ళకి పెళ్లి అయ్యింది ఇద్దరు ఒక్కటయ్యారు అన్న అనుభూతి గుర్తు వస్తుందో లేదో కాని నా లెక్క ప్రకారం ఆ ఫోటోగ్రాఫర్ మొహం మాత్రం గుర్తువస్తుంది.
జరుగుతున్న event ని ఫోటోలు తియ్యి అంటే ఆ ఫోటోగ్రాఫర్ కి రాదు, ఒక్క నిమిషం ప్రపంచం అంతా వాడికోసం ఆగితే ఒక ఫోటో తీసి, ముందుకు వెళ్ళడానికి మనకి అనుమతి ఇస్తాడు.
ఇక పుట్టినరోజు పండుగాలది ఒక గోల, పాడటం చేతకాకపోయినా birthday song పాడుతునట్టు పెదాలు కదపడం ఒక కళ, అలానే పుట్టినరోజు చేసుకుంటున్న వాడు మన నోట్లో ఇంకా కేకు ముక్క పెడుతుంటే వెంటనే ఫోటో తియ్యకుండా , ముందుకి వెనక్కి జరిగి కింద కూర్చొని ఒక పిక్ తీస్తాడు చూడండి….. అప్పుడు వచ్చే చిరాకు దాచడం కూడా ఒక కళే. ఫ్లాష్ వచ్చేదాకా చేతిలో కేకు నోట్లోకి వదలకుండా పట్టుకుంటారు , పెడితే నోట్లో పెట్టాలి, లేకపోతే మానెయ్యాలి, నోటిదాకా తీసుకు వచ్చి ఆపేస్తారు , మండుతుంది నాకు , ఒకవేళ అది పెద్ద కేకు ముక్క అయితే పర్లేదు, కొంతమంది చిన్న ముక్క తీస్తారు, ఫోటో కోసం pose ఇవ్వడం లో వాళ్ళ వేళ్ళు పేదలకి తాకుతూ ఉంటాయి, వింత వింత గా ఉంటుంది అసలు.
మొన్న బ్రయాన్ ఆడమ్స్ లైవ్ షో ఉంటే వెళ్ళా…అక్కడికి వచ్చిన అభిమానులు mobile camera తో ఎక్కడో 200 అడుగుల దూరం లో ఉన్న బ్రయాన్ ఆడమ్స్ ని , వాళ్ళ స్నేహితులని ఫోటోలు తీస్తూ ఉండిపోయారు, పాటలు ఎంజాయ్ చేయకుండా. కాని ఒక group of friends మటుకు , చాలా ప్రశాంతంగా పాటలని చిన్నగా పాడుతూ మొదలు పెట్టి , అలా అలా నాట్యం చేయడం మొదలు పెట్టారు. ఏదో ఇష్టం వచ్చినట్టు కాకుండా పాటకి తగ్గట్టుగా couples గా విడిపోయి salsa చేయడం మొదలు పెట్టారు. Happy feet movie లో ఒక డైలాగ్ ఉంటుంది dancing is nothing but singing with whole body అని …దాని అర్థం అప్పుడు అర్థమయింది నాకు. ఆ గ్రూప్ కి ఇది గుర్తుండే జ్ఞాపకం. వాళ్ళకి ఈ జ్ఞాపకం గుర్తు తెచ్చుకోడానికి ఫోటోలు అక్కర్లేదు.
ఫోటోలు తీసే వాళ్ళే కాదు, తీయించుకునే వాళ్ళు కూడా హింస పెడతారు. ఏదన్నా మంచి లొకేషన్ ఫోటో తీస్తుంటే అడ్డంగా నుంచొని ఫోటో తియ్యరా నాకు అని , అది కూడా వాడి standard pose and smile తో, జీవితం లో అన్ని ఫోటోలకి అవే వాడతాడు, నాలుగు ఫోటోలు తీస్తే తీసేవాడికి కూడా బోర్ కొట్టేస్తుంది. లొకేషన్ ఎంత బాగున్న pair of eyes staring at the camera will spoil everything. ఇక ఒక గ్రూప్ కి ఫోటో తీస్తుంటే, వెకిలి చేష్టలు కూడా బోర్ కొడతాయి, నాలిక బయటపెట్టడం, పక్కనోళ్ళకి bunny ears పెట్టడం etc etc.
చాలా సార్లు గుర్తుపెట్టుకోవలసిన అంశం మనలో ఉండదు. ఉదాహరణకి ఒక టూర్ కి వెళ్తునపుడు , ఒక మంచి landscape చూసినపుడు, అవి చూసినపుడు ఆనందించిన అనుభూతిని తిరిగి ఆనందించాలంటే వాటిని చూడాల్సిందే. కాని కొన్ని సార్లు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం మనలోనే ఉంటుంది. birthday party కి నా స్నేహితులు ఇంతమంది వచ్చారు, ఇంత గోల చేసాం అన్న విషయం ఫోటోలో పొందుపర్చలేము, అది అనుభూతి, ఆ సమయం లో ఆ అనుభూతిని ఎంజాయ్ చేస్తేనే తర్వాత ఆ ఫోటో చూసినా తిరిగి ఆ అనుభూతి వచ్చేది. వచ్చిన వాడిని సరిగ్గా పలకరించకుండా ఫోటోలు తీసుకుంటే ఎం లాభం, అపుడు పుట్టినరోజు ఈ ఫోటో తీస్తునపుడు ఫోటోగ్రాఫర్ మొహం ఇలా పెట్టాడు అని గుర్తు ఉంటుంది తప్ప ఇంకేం గుర్తుకు వస్తుంది.