Saturday, February 12, 2011

ఓ తెలుగు బ్లాగర్లారా …..

తెలుగు బ్లాగర్లకి నమస్కారం,

నేను ఈ మధ్యనే తెలుగు బ్లాగు ప్రపంచం లో అడుగు పెట్టాను. చాల మంది తెలుగు బ్లాగర్లు మస్తు రాస్తున్నారు. కానీ నాదొక విన్నపం . తెలుగు లో బ్లాగు పోస్టులు రాసేటప్పుడు అంకెలని కూడా తెలుగు లిపి లోనే రాస్తున్నారు . ౧ , ౨, ౩, … ఇలా . మా తెలుగు మీడియం లో కూడా మాకు తెలుగు లో అంకెలు నేర్పలేదు. ఈ తెలుగు అంకెలు చదవడం కష్టంగా ఉంది. నేనే కాదు అందరు ఈ అంకెలు చదవడానికి ఇబ్బంది పడుతున్నారనే నా నమ్మకం . కాబట్టి అంకెలు మాత్రం తెలుగులో రాయకుండా చూడవలసిందిగా కోరుతున్నాను.

5 comments:

వజ్రం said...

కావాలని అలా చేస్తుండిఉండరండీ.బ్లాగర్ ఎడిటర్లో టైప్ చేసే వాళ్ళుకానీ బరాహ మొదలైన సాఫ్ట్ వేర్ వాడే వాళ్ళకి బై డిఫాల్ట్ తెలుగు నంబర్స్ టైప్ అయ్యి పోతాయి.లేఖినిలో అయితే ఆ సమస్య ఉండదు.

oremuna said...

తొమ్మిది సింబల్స్ గుర్తు పెట్టుకోలేరా? అదే వర్డ్ ప్రెస్ మేడ్ ఈజీలయితే బట్టీపట్టేయమూ!

రాజ మల్లేశ్వర్ కొల్లి said...

hey Bro.., These are our Telugu numbers..., I felt ashamed when a Gujarati Math Professor asked me to identify them. So, every telugu guy should know these numbers.

tankman said...

@వజ్రం ... మీరన్నది నిజమేనండి. పోస్ట్ రాస్తూ రాస్తూ అలానే అంకెలని కూడా వదిలేస్తునట్టున్నారు. నేను తెలుగులో రాసేటప్పుడు నాకు అదే సమస్య ఉంది. లేఖిని లో లేదన్నారుగా ఇక నుంచి అది వాడటానికి ప్రయత్నిస్తాను.

@oeremuna ... కష్టం మాష్టారు. ఇప్పుడు మళ్ళి పలక మీద అంకెలు దిద్దడం కష్టం అండి :)

@మల్లేశ్వర్ ...ఇప్పుడు ఆ అంకెలు ఎవరు వాడుతున్నారు చెప్పండి. పురావస్తు శాఖ వాళ్ళు శిలా ఫలకాల మీద ఉన్న అంకెలని గుర్తించడానికి తప్ప. అయినా ఆ అంకెలు గ్రందికానికి చెందినవి. మనం గ్రాంధికం అనగా తెనుంగు వాడం కదా...మనం మాట్లాడేది తెలుగు. తేనెలొలికే తెలుగు ... భయపెట్టే గ్రాంధికం కాదు మనది.

మీ ముగ్గురికి నా బ్లాగు లోకి ఆహ్వానం :)

సమూహము said...

సమూహము ఇప్పుడు అత్యంత వేగవంతముగా బ్లాగర్ యొక్క పోస్టులను చూపిస్తుంది.ఎంత వేగంగా ఉందో మీరే ఒకసారి పరీక్షించండి.మీరు మీ పోస్ట్ ను ప్రచురించిన తరువాత ఒకసారి సమూహము (http://www.samoohamu.com ) వెళ్లి చూడండి.సమూహములో మీ పోస్ట్ టైటిల్ కనిపిస్తుంది.
బ్లాగ్ మిత్రులనుండి సలహాలను , సూచనలను ,విమర్శలను ఆశిస్తున్నాము .