గత రెండు సంవత్సరాలుగా సినిమాలు చూడటం బాగా తగ్గిపోయింది....చూసిన సినిమాలు అంటే మర్యాద రామన్న , అలా మొదలయింది . రెండు బాగానే నచ్చాయి .
సరే ఎక్షామ్ ఎలాగు అయిపొయింది అని.... పిలిస్తే వీడు వాడు సినిమాకి వెళ్ళా...మొదటి రోజే అది కూడా. అప్పట్లో శివ పుత్రుడు మూవీ చూసి బాల కి మంచి ఫ్యాన్ ని అయ్యా..... కాని ఈ మూవీ కి వెళ్లడం మాత్రం తిరుగున్న ఫ్యాన్ లో వేలు పెట్టడం లాంటిది అని తెలిసింది.
మూవీ స్టార్ట్ అయింది ....పార్కింగ్ ఇబ్బందుల వల్ల కాస్త లేట్ గానే వెళ్ళాం. ఒక పెద్ద జమీందారు అని బిల్డ్ అప్ ఇచ్చి ....ఒక ముసలాయన షష్టిపూర్తి మహోత్సవాల సీన్ మొదలయింది. విశాల్ చీర కట్టుకుని ఆడ వేషం లో గెంతడం మొదలెట్టాడు. గేన్తుతున్నాడు ....గేన్తుతున్నాడు ....గెంతుతూనే ఉన్నాడు...ఆ తీన్ మార్ మ్యూజిక్ అసలు ఆగటం లేదు ... కాసేపటికి గెంతడం ఆపేసాడు. ఎందుకంటే చుట్టూ ఉన్న ఆడవాళ్ళూ పట్టుకుని కొట్టడం మొదలుపెట్టారు కాబట్టి. వెంటనే ఒక పోలీసు వచ్చి విశాల్ ఏదో పెద్ద గజ దొంగ అన్నట్టు బిల్డ్అప్ ఇచ్చి ...జడ్జి గారింట్లో తాళాలు పోవడం వల్ల బీరువా తలుపులు తీయడానికి విశాల్ ని తీసుకెళ్తాడు. అక్కడ నుంచి విశాల్ ఒక పనికిమాలిన దొంగ ...ఒక్క దొంగతనం చేయడం కూడా చేతాకడు అని తర్వాత 10 నిమిషాల్లో establish చేస్తారు. ఇప్పుడు విశాల్ సవితి తమ్ముడి కారెక్టర్ ఎంటర్ అవుతుంది. అదే ఆర్య . ఆర్య మంచి పనిమంతుడిన దొంగ ...తర్వాత సీన్ లో మళ్ళి తీన్ మార్ డాన్స్ స్టార్ట్ అవుతుంది. ఈ సారి ఆర్య , తన తల్లి ...ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు. అదొక 5 నిమిషాలు సాగింది.
కాసేపటికి అర్థం అయ్యేది ఏంటంటే...అదంతా దొంగల వూరని...మొదటి సీన్ లో వచ్చిన జమిందారు ఆ వూరికి మంచి చేద్దాం అనుకున్తున్నాడని...కాని అతని ఆస్తి అంటా తమ్ముడు మోసం చేసి కొట్టేయడం వల్ల ఆ దొంగలందరికి పురాణం చదివి వినిపిస్తూ .... ఆ వూరికి వచ్చే విదేశీయులకి గైడ్ గా ఉంటూ ఉంటాడు.
ఇప్పటి దాకా కొన్నికామెడీ సీన్లు ఉన్నాయి. అన్నింట్లోనూ మంచిమంచి తిట్లు ఉన్నాయి (మంచి కామెడీ తిట్లు అనగానే జంధ్యాల స్టైల్ కామెడీ తిట్లు అనుకునేరు ....బూతులు బాగా ఉన్నాయి )
మధ్యలో ఆ జమీన్దారుని ఒక పోలీసు అవమానిస్తాడు ( అంటే నాలుగు కుళ్ళు జోకులు వేస్తాడు) ...దాంతో జమీందారు ఒక గుడ్లో కొలనులో 108 సార్లు మునగడం మొదలుపెడతాడు ....అలా మునుగుతూ లేస్తూ ..ఈ అన్నదమ్ములతో చెప్పుకుని బాధపడతాడు. వెంటనే వీళ్ళిద్దరూ వెళ్లి పోలీసు సెక్యూరిటీ తో ఉన్న ఒక గంధపు చెక్కల లారీ ని దొంగతనం చేస్తారు ( దొంగతనం జరగడం వల్ల ఆ పోలీసుని సస్పెండ్ చేస్తారు కదా .....అందుకు ) ...ఆ దొంగతనం జరిగేటప్పుడు ఆర్య దొరికిపోతాడు...విశాల్ మటుకు పోలీసులని బాగా కొట్టేసి లారీ తీసుకుని పారిపోతాడు ...మళ్ళి ఆ లారీ విషయం ఎక్కడా రాదు . డైరెక్టర్ మర్చిపోయాడు.
తర్వాత సూర్య వస్తాడు సీన్ లోకి ....అదేదో NGO program కి అని ....అక్కడ జమీందారు విశాల్ నటనా పటిమని చూడమని సూర్యని అడుగుతాడు. వెంటనే విశాల్ మెల్ల కన్నుతో నవరసాలు పండించడం మొదలుపెడతాడు. చాలా బాగా చేసాడని డైరెక్టర్ అనుకుని ఉంటాడు..కానీ చెత్తలా చేసాడు...ఇంత చెత్తలా నటించడం కూడా జరుగుతుందా అని సూర్య బోలెడు ఆశ్చర్యాన్ని చూపిస్తాడు. ఇంకాసేపు నటిస్తే ఏమౌతుందో అని .....ఆపమని కాళ్ళు పట్టుకుని అడుగుదమనుకుని....అది పెద్ద సభ అని గుర్తొచ్చి కౌగలించుకుని ....నువ్వు చాలా బాగా చేసావని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు.
ఇలా ఇంకొన్ని చెత్త సీన్స్ తర్వాత....కథ అటు ఇటు కాసేపు తిరుగుతుంది.. ఇంతలో అన్నదమ్ములు ఇద్దరికీ చెరో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. ఆర్య కి నచ్చిన అమ్మాయి జమీందారు మోసం చేసిన అతని కూతురు...కొన్ని సెంటిమెంట్ సీన్స్...తర్వాత జమీందారు వేలి ముద్రలు వేసి ( అప్పటిదాకా విదేశీయులతో అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడిన జమీందారు) ఆస్టి గొడవలకి ఫుల్ స్టాప్ పెడతాడు. ఇంకొన్ని బాత్రూం జోకులు, కొన్ని కుళ్ళు జోకులు తర్వాత కధ శివపుత్రుడు స్టైల్ లో సాగుతుంది. అంటే ఒక భయనకరమైన విలన్ ....ఆ విలన్ హీరో కి ఇష్టమైన వాళ్ళని చాలా క్రూరంగా చంపేస్తాడు ...అప్పుడు హీరో పిచ్చి అరుపులు అరుచుకుంటూ వెళ్తూ వెళ్లి విలన్ ని చంపేస్తాడు.
ఇక్కడ హీరోలు ఇద్దరు...అన్నదమ్ములు....వాళ్ళకి ఇష్టమైన వ్యక్తి జమీందారు ....అతన్ని బట్టలు లేకుండా చంపేసి ( కళ్ళు పేలిపోయాయి నావి ) ...అతని ఒక లుంగి చుట్టి ఒక చెట్టుకి వురేస్తారు . ఆర్య వచ్చి అరిచి అరిచి పడిపోతాడు...విశాల్ వొచ్చి అరిచి శవాన్ని కిందకి దింపుతాడు. తర్వాత ఇద్దరు వెళ్లి విలన్ ని చంపేస్తారు అనుకుంటే...ముందు తమ్ముడు వెళ్లి విలన్ చేతిలో తన్నులు తిని వచ్చి ...జమీందారు శవ యాత్ర లో డాన్స్ చేస్తూ ఉంటాడు....ఆ తర్వాత విశాల్ వెళ్లి విలన్ పని పడతాడు.
విశాల్ నటన చూసి మనం భయపడకూడదని...విశాల్ ని ఎప్పుడు ఒక చెత్త మేకప్ లోనే చూపిస్తారు....కాని మూవీ లో అరుపులు చూసి నేను భయపడ్డా ... మూవీ నిండా అరుపులు, కుళ్ళు జోకులు ( కొన్ని జోక్స్ నిజంగానే బాగున్నాయ్ ) , తీన్ మార్ డాన్స్ తప్ప ఇంకేం అనిపియ్యలేదు..... శివ పుత్రుడు చాలా బెటర్ అనిపించింది .

4 comments:
Thanks for sharing the story sanju. Will not dare to watch it on big screen....i hate screams.
అయ్య బాబోయ్! బతికించావ్ సంజూ!! వీలు చూసుకుని ఈ సినిమాకెప్పుడెళదామా అని నేనాలోచిస్తా ఉన్నాను:)
అన్నట్టు, మీరు పోస్టర్ సరిగా చూడకుండానే సినిమాకెళ్ళినట్టున్నారు? బాలా....వాడూ,వీడూ... అంటే ఈ సినిమా బాగోలేదు (means బాలా) అని వాళ్ళే చెప్ప0గ కుడా మీరు సినిమాకెళ్ళి బుక్కయ్యారు:)
@sindhu.. :D
@R.S.Reddy ....ante shiva putrudu choosi baala direction kaasta impression undi asalu
Post a Comment