Friday, July 22, 2011

మావో కి టీ ఇష్టం అనుకుంటా

నిన్న తూములబండ గ్రామం లో నక్సల్స్  ఒక కాఫీ గోడౌన్ ని పేల్చేశారు ..  ఎందుకు కాఫీ గోడౌన్ ? అది పోలీసు స్టేషన్ కాదు, ఒక పెద్ద భూస్వామి ఇల్లు కాదు. గోడౌన్ పేల్చడం వల్ల నష్టం 8 లక్షలు. మరి ఆ కాఫీ పంట పండించిన రైతుల సంగతేమిటి ? లేక కాఫీ తాగడం పెట్టుబడిదారితనమా ? లేక చైనా టీ బాగా ప్రసిద్ది పొందినది కాబట్టి, చైనా కమ్యునిస్టు దేశం కాబట్టి ....భారతీయులు అందరు కూడా కాఫీ కాకుండా టీ తాగితే మనలో కూడా కమ్యునిస్టు భావజాలం పెరుగుతున్దనా?  లేక  నక్సల్స్ కొత్తరకం బాంబుల్ని కొని వాటిని test చేస్తున్నారా ?

http://www.thehindu.com/news/national/article2277670.ece

10 comments:

Indian Minerva said...

ఈ ప్రజాఉద్యమం గతితప్పి ప్రజా వ్యతిరేకౌద్యమంగా పరిణమించి చాలా ఏళ్ళే అయ్యింది కాబట్టి దీన్ని ఆ దోవలోనే చేపట్టిన ఇంకొక పెడపని అనుకోవచ్చునేమో.

Sri Kanth said...

అప్పుడెప్పుడో ఒక కొటేషను రాసా.. (ఆకాశరామన్న అనే బ్లాగుపేరుతో..)..

తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళే అనేవాడు మూర్కుడు అయితే.. తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళే ఉండడం పెట్టుబడిదారుల కుట్ర అనే వాడు మార్క్సిస్టు అని.

ఏదో సరదాగా, మాటా మాటా ఇచ్చిపుచ్చుకునే క్రమములో అలా వచ్చేసింది. వీరికి మాత్రం అది సరిపోయేలా ఉంది.

Indian Minerva said...

@Srikanth M గారు : ఎప్పటినుండో డౌటు కమ్యూనిజానికీ సోషలిజానికీ తేడా ఏమిటి?

అసలు సోషలిజం గురించి తెలవాలంటే ఏ పుస్తకం చదవాలి. Das Capitol అని చెప్పొద్దేం.

ఇదికూడా తెలీని నేను The Fatal Conceit: The Errors of Socialism (The Collected Works of F. A. Hayek) చదివితే అర్ధం అవుతుందా. దయచేసి తెలుగులో చెప్పగలరు.

SHANKAR.S said...

"काफी" नुक्सान हुआ

tankman said...

@srikanth .... హహ ...రంగనాయకమ్మ ఇది చదివితే బాగా బాధపడుతుంది :)

@indian minerva ... fatal conceit is a good read...it requires patience and determination to complete it :)

@shankar.s ... hehe

Sri Kanth said...

@Indian Minerva,

దీని గురించి కొంత క్లుప్తంగా నేను ప్రమాదవనం బ్లాగులో ఒక టపాకు కామెంటుగా వ్రాశాను. అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను చూడండి...

కమ్యూనిజం-సోషలిజం

కమ్యూనిజం, సోషలిజం అనే పదాలు సమానార్థకాలు కావు.

1.కమ్యూనిష్టులు తమను తాము సోషలిష్టులుగా భావిస్తారు. కానీ సోషలిష్టులు తాము కమ్యూనిష్టులుగా భావించరు.

2.సోషలిష్టులూ, కమ్యూనిష్టులూ ఇరువురూ కూడా ఉత్పత్తి వనరుల ఉమ్మడి యాజమాన్యాన్నే కోరుకుంటారు.


3.సోషలిష్టులు శాంతియుత మరియు చట్టబద్దమైన పద్దతుల ద్వారా ఈ పరిణామం జరగాలని కోరుకుంటే, కమ్యూనిస్టులు బలవంతంగా విప్లవంద్వారా జరగాలని కోరుకుంటారు.

4.సోషలిజం మార్క్స్ బోధనల కనుగుణంగా ఉండవచ్చు ఉండకపోవచ్చు. కానీ కమ్యూనిజం మాత్రం మార్క్స్ మరియు లెనిన్ బోధనల ప్రాతిపదిక మీదే ఆధారపడుతుంది.

5.సోషలిజం చాలావరకు ప్రజాస్వామ్య విధానాలను అనుసరించి పరిపాలన జరగాలని చెప్తుంది.

6.కమ్యూనిజంలో ప్రజాస్వామ్య పద్ధతులకు (ఇంతవరకూ ప్రపంచంలో కమ్యూనిజం పేరుతో ప్రభుత్వాలు ఏర్పడిన దేశాల అనుభవంలో) అంతగా గౌరవం లేదనే చెప్పాలి

Sri Kanth said...

ఈ కిందిచ్చిన లింకులను ఒక సారి చూడండి. అవన్నీ తెలుగులో వివరణ ఉన్నవే..

కమ్యూనిజం

లెనిన్ చరిత్ర, మరో పార్శ్వం గూర్చి చరిత్ర కారుల వాదన

ఇంకా కొంత సమాచారం కావాలంటే నా బ్లాగులో నేను రాసిన ఒక టపా చదవండి.

నరేంద్ర మోడీ Vs హిట్లర్, స్టాలిన్, మావో – ఇదేం పోలికరా నాయనా..!!

tankman said...

@indian minerva ....srikanth gave the basic differences between those two..i think it would help you to understand more easily if you know the little background of it.

మీకు మార్క్స్ తెలుసు కదా...ఆయన అప్పటిదాకా ఉన్న మానవ చరిత్ర మీద అవగాహన తెచ్చుకోడానికి పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు .ఆయన ప్రకారం ...మనుష్యులు ఆదిమ మానవులుగా ఉన్నప్పుడు కలిసి వేటాడి , కలిసి పంచుకుని తినేవారు ...తరువాత మన భోజనం కి వేట మీద కన్నా వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడటం మొదలవడం తో , ఎవరి దగ్గర ఎక్కువ భూమి ఉంటి వాడు బలవంతుడు అవ్వడం మొదలెట్టాడు ....అందుకే అప్పట్లో భూమి కోసం బాగా యుద్ధాలు జరిగాయి...ఇది రెండవ దశ ... మూడవ దశ లో పారిశ్రామీకరణ జరిగి ...ఎవరు వస్తువులని ఉత్పత్తి చేస్తాడో ..వాడు బలవంతుడు అయ్యాడు ...ఇది మాక్స్ కాలం దాకా జరిగిన మానవ చరిత్ర ..అంటే సుమారుగా 19th century వరకు ...కాని మార్క్స్ అప్పటిదాకా జరిగిన చరిత్రని చదివి అర్థం చేసుకుని వూరుకోలేదు ...నోస్త్రడమాస్ లాగా భవిష్యత్తుని వూహించడం మొదలు పెట్టాడు ...పారిశ్రమీకకరణ వల్ల ప్రజలు పెట్టుబదీదారులు , శ్రామికులుగా విడిపోతారని, పరిస్రమీకకరణ వల్ల middle class కూడా lower class లోకి జారుకుని శ్రామిక వర్గం బాగా పెరుగుతుంది అని , అప్పుడు ఆ శ్రామికులంతా కలిసి విప్లవం తీసుకువచ్చి , ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుని , శ్రామికవర్గ నియంతృత్వ ప్రభుత్వాన్ని (proletariat dictatorship)ఏర్పాటు చేసి , పరిశ్రమలన్నీ జాతీయం చేసి , production and distribution of goods ని ప్రభుత్వమే చూసుకుంటుంది .... అలా కొంతకాలానికి ప్రజల మధ్య ఆర్ధిక వ్యత్యాసం తగ్గిపోతుంది ....ఈ stage socialism ... socialism లో key point ...govt controls the production and distribution of goods, govt owns the factories and all ...no private property ... 1991 ముందు మంది socialistic pattern of society అంటారు కదా ...ఇదే అన్న మాట ...

అలా సోసిఅలిసం లో ఆర్హిక అసమానతలు తగ్గాక ...ప్రభుత్వం అవసరం ఇక ఉండదు ...మార్క్స్ మాటల్లో చెప్పాలంటే state will wither away అంటాడు ...ఇక్కడ state అంటే rough equivalent of govt , ...అది కమ్మ్యునిసం ...ఈ stage లో ప్రజలు వాళ్ల శక్త్రి కొలది పని చేస్తారు, అవసరం కొలది జీతం తీసుకుంటారు (work according to your ability and getpaid acc to ur need) ...kind of utopia లాంటిది ...అక్కడితో మానవ సమాజ ఎదుగుదల ఆగిపోయి , సర్వేజనా సుఖినోభవంతు జరుగుతుంది :)

ఇక కమ్మ్యునిస్తులు అందరు దీనిని ఒప్పుకోరు ... మార్క్స్ ప్రకారం, పరిశ్రమీకకరణ జరిగి శ్రామికులు విప్లవం తీసుకు వచ్చి అలా అలా కమ్మ్యునిసం వస్తుంది అని నమ్మేవారు socialists. మార్పు విప్లవం ద్వారా కాకుండా..నెమ్మదిగా జరిగి అలా కమ్మ్యునిసం రావాలి అనేవాల్ల్లు Fabian socialists. అసలు పారిశ్రామీకరణ జరిగి శ్రామికులే విప్లవం చేయక్కర్లేదు...పరిశ్రామీకకరణకి ముందే ..రైతులే విప్లవం తీసుకువచి ...సోసిఅలిసం ..అలా కంమ్యునిసం రావాలి అని నమ్మేవాళ్ళు maoists. వీల్ల్లంతా కమ్మ్యునిస్తులే...అంటే private property ఉండొద్దు అని వాదించే వాళ్ళే, ఈ వ్యవస్థ బాలేదు , కంమ్యునిసం రావాలి అని నమ్మేవల్లె...కాకపోతే ఆ కమ్మ్యునిసం ఎలా రావాలి అన్న దాన్లో వీళ్ళలో కొన్ని బేధాభిప్రాయాలు ఉన్నాయి ...ప్రస్తుతం ఏ దేశము కమ్మ్యునిసం స్టేజి కి వెళ్ళలేదు...communist nation అని చెప్పుకునే వాళ్ళందరూ ... సోసిఅలిసం అనగా proletariat dictatorship లో ఉన్నవాళ్ళే...పేరు మాత్రం అలా పెట్టుకుంటారు ...

Indian Minerva said...

@sanju -The king!!! మరియు Srikanth M గారు: మీరిచ్చిన సమాచారానికి కృతజ్ఞతలు. మీరిచ్చిన లింకులు చదువుతున్నాను. ఈ కమ్యూనిజమంతా ఒక utopian సమాజాన్ని లక్ష్యించిగాకుండా వున్నదని ఊహించి కొనసాగడం కొంచెం మింగుడుడలేదు మొదట్లో. మీరిచ్చిన లింకులు చదువుతున్నాను. ప్రస్తుతానికి The Road To Serfdom - P Hayek చదివి ఆతరువాత ఈ Fatal conceit చదవాలని నిర్ణయించుకొన్నాను. సరే ఇవన్నీ కమ్యూనిజం పై విమర్శలు మరియు ఆ సిధ్ధాంతాల్లోని లోపాల గురించి చర్చించేవి. While I agree 'against-communism' if fine, I would like to read a few 'for-communism' books too. If there is one from a neutral basis I guess that could complete whole learning thing. Feel free to reach me at gmail: arun dot 1202. Thank you once again.

tankman said...

@indian minerva.... if possible try reading ranganayakamma books, she is pro-communist, if you want to get neutral basics of marxism m and liberalism try reading any of the basics of political science books like "Introduction to political theory" by Gauba .