Monday, August 15, 2011

ఆగస్టు 15 వచ్చింది....రోజా కూడా వచ్చింది..

భారతీయులు, స్వాతంత్రదినోత్సవం రోజు కచ్చితంగా చేసే పని, ఒక దేశభక్తి మూవీ చూడటం. నేను పుట్టి, నాకు ఊహ తెలిసి, అసలు స్వాతంత్రదినోత్సవం అంటే ఏంటో అర్థం అయ్యే టైం నుంచి , ప్రతీ సారీ టీవీ లో రోజా మూవీ వస్తుంది. ఈ రోజు జనగణమన విన్నా ..వినకపోయినా....నాగమణి నాగమణి పాట వినకతప్పట్లేదు....అరవిందస్వామి చేసుకున్న పుణ్యం వల్ల మనమంతా ఈ రోజు మూడు రంగుల జెండాని , అరవిందస్వామి మొహాన్ని కచ్చితంగా చూస్తాం .

ఆ  తర్వాత నా ఖర్మకాలి కృష్ణవంశి ఖడ్గం మూవీ వచ్చింది...అది కూడా దేశభక్తి సినిమా కిందే పరిగణిస్తున్నారు. వెకిలి చేష్టలతో కిం శర్మ, చెక్క మొహం వేసుకున్న శ్రీకాంత్, అబ్బో పండగే పండగ ...ఇక హిందీ చానల్స్ లో చూస్తె ...బోర్డర్ లాంటి మూవీస్ వస్తుంటాయి...

ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే.....పాకిస్తాన్ విషయం లేని దేశభక్తి మూవీ ఏదన్నా ఉందా అని ? దేశభక్తి అంటే శత్రుదేశాన్ని దుమ్మెత్తి పోయ్యడమేనా?

పోనీ ఇది కాదు అంటే....భారతదేశం ఎంత గొప్పది...మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ఎంత ఉన్నతమైనవి ...అంటూ మొదలు పెడితే...అలా అలా సాగి ..అది ఇస్లాం ని తిట్టడం తో ముగుస్తుంది. ఇది RSS theme ....నీకు దేశభక్తి ఉందంటే మిగితా మతాలని తిట్టాలి అంటాడు...ఇక్కడ కూడా పక్కనోల్లని తిట్టడం ఉంటుంది.

ఇక  గాంధీ, నెహ్రు, భగత్ సింగ్ , నేతాజీ etc etc ...ఈ పేర్లన్నీ ఉపన్యాసాలకే పరిమితమయ్యాయి.....the legend of bhagat singh లాంటి మూవీస్ వచ్చినా....అవి తెల్లవాడు మనల్ని ఎలా దోచుకున్నాడో అంటూ మొదలయ్యి...గాంధీ చాలా చెడ్డవాడు అని conclude చెయ్యడం తో ముగుస్తుంది.

అంటే తిట్టుకోడం లేకుండా దేశభక్తి అనే అనుభూతిని అనుభవించే అవకాశం లేదా ?




5 comments:

subhashini poreddy said...

ఆలోచించాల్సిన విషయమే...!!అనుభూతి ని అనుభవించడానికి ఎన్నో విషయాలున్నాయి.....మనకు స్వేచ్చను ఇచ్చిన ఫ్రీడం ఫైటర్స్...మన దేశం ఏయే రంగాలలో ముందు ఉందో చెప్పే స్టాటిస్టిక్స్....మన భిన్నత్వం లో ఏకత్వం....ఏమీ లేకున్నా ఆప్యాయత కు కొదువ లేని అనుబంధాలు...మన మేధస్సు...మన గత కాలపు చరిత్ర....వేద విజ్ఞానం....మన కర్మ సిద్ధాంతం.....మన వివాహ వ్యవస్థ....ఇలాంటివి పదే పదే గుర్తు తెచ్చుకోవడమే పరిష్కారం !అన్నింటిలో లోపాలు ఉంటాయి.లోపాలే వెదుకుతూ పొతే చివరికి అదే మన పెద్ద లోపం అవుతుంది.:-). సో...కాంప్ర మైస్ r చేంజ్ !!

tankman said...

:)

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

:))

Mauli said...

పాకిస్తాను వాళ్ళని తల్చుకొనని స్వాత౦త్ర్య దినోత్సవం కోసం పోరాడుతున్నారన్నమాట . మ౦చి కాన్సెప్ట్, ఆల్ ది బెస్ట్ :)

Sri Kanth said...

స్వాతంత్రమంటేనే పరపీడనుంచి మనల్ని విముక్తం చేసుకోవడం అని కదా. కాబట్టి, ఇప్పటికీ మనకు పీడలా దాపురించిన వాటిని తిట్టుకోవడములో తప్పులేదు. ఎవరినీ తిట్టకుండా స్వంతంత్రోత్సవాన్ని జరుపుకోవడం కుదరదేమో (హీన పక్షం బ్రిటీషు వాల్లని).