పోరాడి గెలిచిన వాడికేం తెలుస్తుంది. పోరాటం అయిపోయాక బహుమతులు, సన్మానాలు , పొగడ్తలు, కొత్త స్నేహాలు, పేరు , కొత్తగా వచ్చే మర్యాద , పెద్దల ఆశీస్సులు , చిరునవ్వులు , మందహాసాలు , గెలవడానికి ఎంత కష్టపడ్డాడో కధలుగా చెబుతూ ఉంటె పైకి కిందకి ఆడించే తలకాయలు , సలహాలు సంప్రదింపుల కోసం వచ్చే ప్రజలు , పండగ చేసుకోడాలూ , వాడి మీద వాడికి నమ్మకం ఉంది కాబట్టి అంత రిస్క్ తీసుకున్నాడు అనే ప్రశంసలు , "ఆ గెలిచాడు చూడు వాడిలా " అని పిల్లలకి ఒక రోల్ మోడల్ అవ్వడం , పార్టీ ఎప్పుడు మామా అనే పలకరింపులు , నీకేంట్రా సక్సెస్ కొట్టావు అనే మాటలు, ....
అదే ఓడిన వాడికి అయితే , పోన్లే మామ ఇంకోసారి చూసుకోవచ్చు బాధపడకు అనే జాలి మాటలు , తర్వాత ఎం చేద్దామనే ప్రశ్నలు , అదిగో వాడిలా అవి ఇవి అంటూ సమయం వృధా చెయ్యకు అని మిగత వాళ్ళకి ఒక ఉదాహరణ అవ్వడాలు , కోరిక ఉండగానే సరి పోదు కదా , తెలివి తేటలు కూడా ఉండాలి కదా అనే వెనక మాటలు , నీకు ఇంక రాదేమోరా ఓడిలేయ్య కూడదా అంటూ డయలాగులు , ఏమయింది ఏమయింది అంటూ అత్యుత్సహపు ప్రశ్నలు , ఎందుకు పోయిన్దంటావు అంటూ ఎంక్వయిరీలు. వీటన్నింటికి సమాంతరంగా ఉండే ఓడిపోయామన్న బాధ , తన మీద తనకున్న నమ్మకానికి పడిన దెబ్బ ,గెలిచిన వాడు నాకన్నా బెట్టర్ అని ఒప్పుకోడానికి అడ్డొచ్చే ego , గెలిచిన వాడి మీద మంట , ప్రజలని దూరం పెట్టాలి అనుకోడం , అలా ఎలా ఓడిపోయాం అని వెంటాడే ప్రశ్న , తర్వాత ఎం చెయ్యాలో అర్థం కాకపోవడం , ప్రజలు ఓటమి గురించి మాటల్డటం మానేస్తే బాగుండు అనుకోడం , ' గెలుపు ఓటమి సమానంగా చూడాలి ' అనే ముష్టి డయలాగులు కొట్టడం , వెధవ నవ్వులు నవ్వడం, నాలా ఎంత మంది ఓడిపోయారు అని వెతుక్కోడం , ఓటమి లోంచి బయటపడటానికి, ' జీవితం , ప్రపంచం చాలా పెద్దవి ' అన్న జ్ఞానోదయం తెచ్చుకోడం.
గెలిచిన వాడికేం తెలుసు, వాడి చుట్టూ తిరిగే ప్రజలకేం తెలుసు ఓడినోడి బాధ . గెలిచిన వాడికన్న, ఓడిన తర్వాత ఇన్ని బాధలు తట్టుకుని మాములుగా ఉండే ఓడినవాడే గొప్ప . అవును ...నేనే గొప్ప :D