కిశోర్ శాంతాబాయి కాళే ఆత్మకథ ఇది. ఇతనేమి ప్రముఖుడు కాదు. మహారాష్ట్ర లోని కొల్హాటి కులానికి చెందినవాడు ( అటు ఇటు గా కొల్హాటి వాళ్ళు అంటే భోగం వాళ్ళతో సమానం ) MBBS పూర్తీ చేసి , ఆ గ్రామానికే తిరిగి వచ్చి తన వారికి వైద్యం అందించిన డాక్టర్ కథ ఇది.
కొల్హాటి కుటుంబం లో ఆడదానిదే పూర్తీ బాధ్యత. సంపాదన , పని తనే చూసుకోవాలి, ఒక మగవాడు బయటకి వెళ్లి పని చెయ్యడం అనేది అవమానం గా భావించే కులం అది. అమ్మాయి రజస్వల అవ్వగానే తన కన్నేరికానికి బేరం కుదురుతుంది. అతనితోనే ఆ అమ్మాయి ఉండాలి , అతను వదిలేసేదాకా ! అలా వదిలివేయబడిన యువతీ తిరిగి అందరి ముందు నాట్యం చేయడం మొదలుపెడుతుంది, ఇంకో మగవాడు తనని కొనే దాకా అది సాగుతుంది. ఇది ఒక cycle. .
పుస్తక పరిచయం లో ఆ కులం గురించి బాగా వివరిస్తారు.
" కొల్హాటి కులం రాజస్థానీ సంచార తెగ. వాళ్ళు పశ్చిమ మహారాష్ట్ర కు వలస వచ్చారు, మొదట్లో గారడీ విద్యలను ప్రదర్శించి పొట్ట పోసుకునేవారు. తర్వాత ఆకర్షణీయమైన డాన్సింగ్ వృత్తిని ఎంచుకున్నారు . ఈ కులానికి చెందినా స్త్రీలని సంగీతం లోనో, నాట్యం లోనో శిక్షణ ఇచ్చి మగవాళ్ళను రంజింప చెయ్యడానికి బలవంతంగా నాట్య వృత్తిలోకి దించుతారు. కులం లోని మగవాళ్ళు ఆడవాళ్ళ సంపాదన మీద బతుకుతారు. తమ అక్క చెల్లె లని , కూతుళ్ళని దాన్సర్లుగా మారుస్తారు. కానే, భార్యల్ని మాత్రం కొల్హతి మగవాళ్ళు ఇల్లు కదలనివ్వరు. కొల్హతి మగవాళ్ళు తమ కులానికి చెందినా ఆడవాళ్ళను పెళ్ళాడటం చాలా అరుదు. సాధరణంగా ఊరూరు తిరుగుతూ వాళ్లకి ఇష్టం అయిన ఆడవాళ్ళను ఎత్తుకెళ్ళి 'మేలిని ' అనే సాధారణ ఉత్సవం ద్వారా ఆమెని కొల్హతి కులస్తురాలిని చేస్తారు. మగవాళ్ళు వాళ్ళకు ఒక చీరను బహుమతిగా ఇచ్చి పసుపుతో నలుగు పెడితే చాలు. ఆమె గర్భవతి అయ్యి బిడ్డను కన్నా తర్వాతే ఆమెను పెళ్ళాడతాడు , లేదంటే ఆమె పారిపోతుందేమో అన్న భయం
పెద్దమనిషి కాగానే 'కన్నెరికం ' కోసం వాళ్ళని అమ్మేస్తారు. వాళ్ళకు కడుపు వచ్చిన తర్వాత ఆ మగవాళ్ళు వదిలేస్తారు . అందుకనే ఎక్కువ మంది కొల్హాటి పిల్లలు తమ తల్లి పేరు పెట్టుకుంటారు. అక్రమ సంతానం అని తెలియజేసే పేర్లతో బడిలో తోటివాళ్ళ అవమానాలు తట్టుకోలేక బడి మానేసే పరిస్థితి "
కాని సమాజం లో వస్తున్న మార్పులని తట్టుకోలేని కొల్హాటి కులస్తులలో కొందమంది మగవాళ్ళు, పని చెయ్యకుండా ఇంట్లోని ఆడవాళ్ళ చేత వ్యభిచారం చేయించడం మొదలు పెడతారు ( మగవాడు పనిచేయ్యకూడదు అన్న సంప్రదాయాన్ని పాటించారు)
అప్పటి సామజిక పరిస్తితుల గురించి బాగా వివరాలు ఉన్నాయి ఈ పుస్తకం లో ...
చివరగా పుస్తకం వెనకాల డాక్టర్ కిశోర్ ని ప్రశంసిస్తూ , రిజర్వేషన్ పేరుతో కాళే లాంటి వాళ్ళకి చదువు, హాస్టల్ సదుపాయాలు అందించిన ప్రభుత్వాన్ని కూడా కాస్త మేచ్చుకోడం నాకు బాగా నచ్చింది.

2 comments:
పుస్తకం చదవదగ్గదిలాగానే వుంది. కానీ మాకు దొరకదు ప్చ్... ఈసారి ఇలా పుస్తకాల గురించి రాస్తే ఎక్కడదొరుకుతుందో కూడా చెప్పండి plz. Online book stores అయితే మరీ మంచిది.
నా దగ్గర ఉంది 2001 ప్రింట్ పుస్తకం...విశాలాంధ్ర లో ఒకసారి చూసినట్టు గుర్తు , పుస్తకం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్లది...
Post a Comment