"వర్తకం పేరుతో వచ్చి భారత దేశాన్ని బానిసత్వపు సంకెళ్ళతో కేట్టేసిన తెల్ల కుక్కలు " --------- అసలు కత్తి డయలాగు ఇది. కాని దీన్లో మొత్తం నిజం ఉందా ?
FDI , international trade అనగానే , మళ్ళి మిగతా ప్రపంచంతో వర్తకం చేయడం వల్ల భారతదేశం తన స్వయంప్రతిపత్తిని కోల్పోతుందా అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి అని నాకు ఈ మధ్యనే అర్థం అవుతోంది.
వర్తకం చేయడం వల్ల మనం స్వతంత్రాన్ని కోల్పోలేదు . మిరియాలు, ఏలకులు , నల్ల మందు వర్తకం జరిగినంత కాలం బాగానే ఉంది. ఎప్పుడయితే బ్రిటిషు వారికి , ఫ్రెంచు వారికి , కోటలు కట్టుకోడానికి, ఇక్కడ వాళ్ళు సైన్యం మైంటైన్ చేయడానికి అనుమతి ఇవ్వబడిందో , ఎప్పుడయితే ఇంకో భారత దేశ రాజుని ఓడించడానికి వాళ్ల సహాయం తీసుకుని, తమ రాజ్యం లో కప్పం వసూలు చేసుకోడానికి అనుమతి ఇవ్వడం మొదలు పెట్టారో అప్పుడు భారత దేశం స్వతంత్రం కోల్పోడం మొదలు పెట్టింది.
కాని ఇప్పుడు అదే పరిస్థితి ఉందా ? వచ్చిన MNC's కి tax వసూలు చేసే అధికారం , వారి సొంత ఆర్మీ పెట్టుకునే అధికారం లేనంత కాలం , FDI అనేది బానిసత్వంని భారతదేశం మీదకి రుద్దుతుంది అని భయపడక్కర్లేదనుకుంటా .
అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి , ఒప్పుకుంటా . కాని సరయిన పాఠం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి మోసం చేసాడు అని , ఇక ఎవరితోను మాట్లాడను, ఎవరి మాటా వినిపించుకోకుండా చేవుల్లు దూదులు పెట్టుకుని మాత్రమే తిరుగుతా అనడం సరి కాదు , ఎదుటి వాడు నిజం చెబుతున్నాడా లేదా అని తెలుసుకోగలిగే విజ్ఞత తెచ్చుకోవడం సరి అయిన పాఠం