Thursday, November 17, 2011

అసలు ప్రభుత్వం ఏం చెయ్యాలి అంటే ......

ప్రభుత్వం పనుల్లో ముఖ్యంగా సైన్యాన్ని , law and order ని మైంటైన్ చెయ్యడం . ఇవి కాకుండా ప్రభుత్వం చాలా చేయ్య్యాలి .

బుర్ర పగలకుండా హెల్మెట్ పెట్టుకోమని ప్రభుత్వమే చెప్పాలి, పిల్లలకి పోలియో రాకుండా మందులు ప్రభుత్వమే పంచాలి , దోమలు ఎక్కువకకుండా ఉండటానికి నీళ్ళు నిలువ ఉంచకండి అని ప్రభుత్వమే చెప్పాలి, అలా కాకుండా దోమలు ఎక్కువయితే దోమల మందు ప్రభుత్వమే కొట్టాలి . తక్కువ ధరకే విత్తనాలు, ఎరువులు , కరెంటు , నీళ్ళు ఇచ్చి , ఒకవేళ సరయిన మద్దతు ధర మార్కెట లో లభించకపోతే ప్రభుత్వమే ఆ పంటని కొని, గోదాముల్లో పెట్టుకోవాలి . చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయొద్దని ప్రభుత్వమే చెప్పాలి, పిల్లల్ని చదివించమని చెప్పాలి, వాళ్ళకి ఉచితంగా స్చూల్స్ కట్టాలి,  వాళ్లకి స్కూల్ లో భోజనాలు పెట్టాలి, ఆడపిల్లలని చంపోద్దని చెప్పాలి, మగ పిల్లలని అమ్ముకోవద్దని చెప్పాలి, తాగి డ్రైవ్ చెయ్యొద్దని, ఎయిడ్స్ రాకుండా కండోమ్స్ వాడమని కూడా ప్రభుత్వమే చెప్పాలి, కరువు వరదలు వచినపుడు రుణాలు మాఫీ చెయ్యాలి , NREGA లాంటి ప్రోగ్రామ్స్ మైంటైన్ చెయ్యాలి, నిమ్న కులస్తులకి చదువుకోడానికి స్కాలర్షిప్స్ ఇవ్వాలి, వాళ్ల చదువు పూర్తీ అయ్యాక ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలి, ఇంకా ఫ్రీ గా టీవీలు , తక్కువ ధరకే టాబ్లెట్ ఫోన్స్  అందించాలి, మనం వంట చేసుకుని తినడానికి గ్యాస్ , నడపడానికి కార్లో డీసిల్,  తక్కువ సబ్సిడి కే ఇవ్వాలి ,   ఇవి కాకుండా ఆస్పత్రి వసతులు, గ్రంధాలయాలు , పార్కులు కట్టాలి, మరుగు దొడ్లు కట్టాలి, ఆనకట్టలు కట్టాలి, పేద వారికి ఇళ్ళు  కట్టివ్వాలి, ప్రభత్వ ఉద్యోగులకి కూడా కట్టివ్వాలి , స్థలాలు పంచాలి , ఆడవారికి ముసలి వారికి పన్నులో రాయితి ఇవ్వాలి, అర్తికపన్ను తగ్గించుకోడానికి చిన్నమొత్తాల పొదుపు, ఇందిరా వికాస పత్రం లాంటి ప్రోగ్రాములు పెట్టాలి , యునివేర్సిటీలు , కళాశాలలు పెట్టాలి, అక్కడ రిసెర్చ్ చేసే వాళ్ళకి ఆర్ధిక సహాయం చెయ్యాలి , బస్సులు రైళ్ళు నడపాలి, వాటిలో ముసలివారికి వికలాంగులకి రాయితి కల్పించాలి , వార్డ్ దగ్గరనుంచి , లోక్ సభ దాకా ఎన్నికలు నిర్వహించాలి ....ఇంకా ఇలాంటివి బోలెడు చెయ్యాలి .

ప్రజలుగా మనమేం చెయ్యాలి ? పన్ను కట్టాలి, వోటు వెయ్యాలి . 2009 లో వోటు వేసినవారు 59.7%, మొత్తం పన్ను కట్టే వారు అటు ఇటు గా 2.5% .  అదీ  సంగతి.


8 comments:

Anonymous said...

ఎవరి పిల్లల్ని వాళ్ళే కనాలి అని కూడా గవర్నమేంట్ చెప్పాలి.....: )

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

Nice post.. asking the right questions..

cheekati said...

nice post.. thought provoking..

రాజేష్ మారం... said...

Hmm,. we have to think..

Good post .. and very well said..

subhashini poreddy said...

నువ్వు అన్నాక అలోచిస్తే ఇవన్నీ ఎవరికి వాళ్ళే చేసుకునే పనులు...అయినా ప్రభుత్వం పై రుద్దుతున్నారు అనిపిస్తుంది..:-). ఇవన్ని ప్రభుత్వం చెప్పకపోతే ఒక్కొక్కరినీ ఎవరు పనిగట్టుకుని "educate" చేయాలి మరి? కదా!!!బాగా చెప్పావు సంజు. సరైన, స్పష్టమైన satire.

Anonymous said...

పైన రాసిన వాటికి కారణం సోషలిస్ట్ ఆర్ధిక విధానాన్ని మనం తలకేత్తుకోవటం. ఇంకొంచెం ముందుకు వేళితే వీటీ ములాలు కారల్ మార్క్స్ గారి దగ్గరకు వెళ్ళి ఆగుతాయి.

Anonymous said...

మీరు చెప్పింది కొంతవరకూ నిజమే అయినా, నాణానికి మరో వైపు నుండి కూడా ఆలోచించండి.
పైన చెప్పిన పనులలో కొన్ని ప్రభుత్వమే చెయ్యాలి. ఏదేవుడూ దిగివచ్చి చెయ్యడు కదా!
అందరికీ సరైన అవకాశాలు ఇచ్చి ఉంటే అడుక్కుతినే పరిస్థితి ఎందుకు వస్తుంది?

ఆదాయపు పన్ను కట్టేవాళ్ళు 2.5 శాతమే ఉండచ్చు. కానీ అమ్మకపు పన్ను అందరూ కట్టాల్సిందే.
ఇది కాక ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కట్టే excise duty, customs duty, service tax లాంటివి ఎన్నో ఉన్నాయి.

ప్రభుత్వం తన ఆదాయాన్ని సరిగ్గా ఖర్చు పెట్టాలి.
ప్రజలు సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి.

tankman said...

@kvsv .. :)

@weekend politician, cheekati and rajesh ... thankyou

@subhashini .....వాటిల్లో కొన్ని ప్రభుత్వమే చెయ్యాలి కదా

@unknown ... మీరు చెప్పింది నిజమే , కాని కొన్ని పనులు మాత్రమె సోషలిస్ట్ విధానం లో ఉన్నాయి

@bonagiri ... నేను ప్రభుత్వం చేసే పనులని విమర్శించడం లేదండి , i am a believer of welfare state and keyns economics , నా పాయింట్ ,,,, ప్రజలలో ఎంతమంది ఆక్టివే గా ఉన్నారు అనే