Friday, January 13, 2012

సిటి లో సంక్రాంతి ...

 కోళ్ళ పందాలు , ధాన్యం ఇంటికి రావడం కథల్లోను మూవీస్ లోను ఏవో చూపిస్తారు  . సిటి లో పెరిగితే సంక్రాంతి డిఫరెంట్ గా అనిపిస్తుంది.

అసలు సంక్రాంతి అనగా ...

1. పతంగులు , రకరకాల ఆకారాల్లో దొరుకుతాయి, ఎగురుతాయా లేవా అన్నది వేరే సంగతి. న్యూస్ పేపర్ తో వాటిని తయారు చెయ్యడం , మాన్జాలు కొనడం , లేకపోతే దారాలకి అన్నం, గుడ్డు, ఏవో నూనెలు రాయడం.  పతన్గికి సరిగ్గా కన్నాలు పెట్టి దారం కట్టడం , వాటికి తోకలు పెట్టడం, పోటీలు పెట్టుకోడం, తెగిపోయిన పతంగి వెనుక పోలో మని పరిగెట్టడం , గాలి ఎటు ఉందా అని చూసుకోడం, పతంగి ఎగారేయ్యడానికి, దారం చరక కి చుట్టడానికి ఒక assistant ,  ఇంకోడి పతంగి తెగ్గొట్టి "కాటే " అని గొంతు చించుకుని అరవడం, మన పతంగి తెగ్గోట్టినవాడితో గొడవలు పాడటం, కక్ష సాధించడానికి వాడు ఎగరేసిన పతంగి మీద concentrate చెయ్యడం,  మా బిల్డింగ్ మీద పడింది కాబట్టి మాదే అన్న వాడితో ఇంకో గొడవ ..... పెద్ద తతంగం ఇది..బేసికల్ గా బద్ధకం ఉంది కాబట్టి నేను వీటికి దూరంగా ఉండే వాడిని.

2. చిన్నప్పుడు భోగి మంట పెట్టె వాడిని, ఇప్పుడు GHMC వాళ్ళు రెగ్యులర్ గా చెత్త తీసుకెళ్లడం వల్ల కాల్చడానికి చెత్త లేక బద్ధకం వయసుతో పాటు ఇంకొంచం పెరగడం వల్ల మానేసాను

3. పొద్దునే తలపాగా పెట్టుకుని పీ పీ పీ పీ అని ఊదుతూ, ఒక దూడ వీపు మీద పట్టు చీర కప్పి, దాన్ని తోలుకుంటూ ఒకడు వచ్చేవాడు. డబ్బులిస్తే కాని ఆ వూదడం ఆపడు అని వెంటనే డబ్బులు ఇచ్చి పొమ్మనే వాడిని. మా తాతయ్య డబ్బులిచ్చి ఇంకాసేపు వూదమనే వారు. అక్కడ గొడవ వచ్చేది నాకు ఆయనకీ.

4. అసలే మా కాలనీ రోడ్లు చెండాలంగా ఉంటాయి అని ఏడుస్తూ ఉంటె , సరిగ్గా ఉన్న కాస్త రోడ్డు మీద ముగ్గులేసేసి, ఆ వేసిన ముగ్గుని కాపాడటానికి చుట్టూ ఇటుక రాళ్ళు , కంకర రాళ్ళు పెడ్తున్నారు , ఇదో బాధ.

5. ఇక టీవీ లో , సంక్రాంతి గొప్పదనం, అసలు మకరం అంటే ఏంటి, హరిదాసు, ఇప్పటి వాళ్ళకి ఇవేవి పట్టవు అని ఒకటే గోల.

6. ముగ్గు బొమ్మలు ఉండే SMS లు వస్తాయి. ఒకమ్మాయి ముగ్గు వేస్తూ ఉండే image file తో మెయిల్స్ వస్తాయి. వచ్చిన వాటిని ఇంకోళ్ళకి forward చెయ్యడం.

సంక్రాంతి వ్యవసాయదారుల పండుగ , పంట చేతికొచ్చింది అని వాళ్ల ఆనందం. వారం రోజులు సెలవులు వచ్చాయి అని పిల్లలకి ఆనందం. ఒక హాలిడే వచ్చింది అని మనకి ఆనందం.

2 comments:

రసజ్ఞ said...

హహహ టపా రాసుకోడానికి మనకొక టాపిక్ వచ్చిందని బ్లాగర్లకి ఆనందం. సంక్రాంతి శుభాకాంక్షలండీ!

మాలా కుమార్ said...

సంక్రాంతి శుభాకాంక్షలు .