Sunday, February 05, 2012

మతం Vs సంస్కృతి

మతం అనగా చాలా మందికి confusion లేదు, మతం అంటే అటు ఇటు గా  మనిషికి దేవుడికి మధ్యన ఉండే అమ్బికాదర్బార్ బత్తి అని అందరికి ఒక ఐడియా ఉంది. ఇక సంస్కృతి దగ్గర గొడవ వొస్తోంది.

 సంస్కృతి ని మనకి ఉండే కామన్ అలవాట్లు, ఆచారాలు, నమ్మకాలు, విలువలు, భాష , విధానాలు etc etc . గా చెప్పొచ్చు. మతాల ప్రపంచకీకరణ జరగక ముందు , ఒక మతం ఒక భూభాగానికే పరిమితమయిన కాలంలో సంస్కృతి మీద మతం అధికారం చాలా ఉండేది. అప్పట్లో ఒక వ్యక్తి ఒక పని చేసాడు అంటే మతం ఆదేశించడం వల్ల చేసాడా లేక అక్కడి సంస్కృతి వల్ల చేసాడా అని చెప్పడం కుదిరేది కాదనుకుంటా , of course ఇప్పటికి చెప్పడం కొంచం కష్టమే.

గమనిస్తే ఒకప్పటి తెలుగు పేర్లు అన్ని దేవుడి పేర్ల నుంచో , భారత రామాయణాల నుంచో  direct గా కాపీ కొట్టినవే, వెంకటేశ్వర్లు, వెంకటాచలపతి, అప్పన్న, సింహాచలం, భద్రాచలం, సరస్వతి , లక్ష్మి, హనుమంతు, హనుమాన్లు, రామయ్య, రాముడు, లక్ష్మయ్య , గణపతి ఇలా ఉండేవి, తర్వాత రావులు మొదలయ్యారు బాగా, సుబ్బారావు, అప్పారావు, నాగేశ్వర రావు ... ఇక్కడ పేర్లు direct గా కాపీ కొట్టడం కాస్త తగ్గి , కొంచం complicated అయ్యాయి, తర్వాత రాజేష్, విజయ్ ఇలాంటి పేర్లు మొదలయ్యాయి, ఇది సంస్కృతి ... వెంకటేశ్వర్లు అని ఉంటేనే హిందువు, రాజేష్ అని ఉంటె హిందువు కాదు అని చెప్పలేము.  పేర్లు పెట్టడమనేది సంస్కృతి లోకి వస్తుంది, మతం లోకి కాదు. మన దగ్గర తాత పేరు మనవడకి పెట్టడం సంస్కృతి, రాముడు తన కవల పిల్లలకి తండ్రుల పేర్లేమి పెట్టలేదు, అలా అని రాముడు హిందూ కాదు అని కాదు, తెలుగు వాళ్ళు మొత్తం హిందువులు కాదు అని కాదు, అలాగే మొత్తం భారత దేశం లో కేవలం తెలుగు వాళ్ళు మాత్రమె ఇంటి పేరు ముందు రాసుకుని , తర్వాత అసలు పేరు రాసుకుంటారు ( చివర్లో కులం పేరు వస్తుంది అది వేరే సంగతి) అలా అని తెలుగు వాళ్ళు హిందూ మతం ని follow అవ్వడం లేదు, అని కాదు కదా...అది మన సంస్కృతి అంతే.

అలాగే మనం వాడే దుస్తులు కూడా , సల్వార్ కమీజ్ తెలుగు వస్త్రధారణ లోకి రాదు , సికింద్రాబాద్ మెట్టు గూడా దగ్గర ఉన్న చర్చి ముందు రోడ్ మీద మేరీ మాత కి ఒక చిన్న గుడి లాంటిది కట్టారు, దాన్లో ఆవిడకి పట్టు చీర కడతారు , ఆంధ్రా లో ఉండే చాలా మంది ముస్లిం మహిళలు నల్లపూసలు వేసుకుంటారు,  పెళ్ళికి ముందు engagement లో ఉంగరాలు మార్చుకోడం, పెళ్లి తర్వాత reception , పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్ల తమ్ములు శేర్వాని వేసుకోవాలన్న పద్దతి ఇవన్ని ఒక సంస్కృతి ఇంకోదాని దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నవే. నిజానికి హిందూ సాంప్రదాయాలలో భాగమయిన పట్టు వస్త్రం చైనా నుంచి అరువు తెచ్చుకున్నదే .  ఇలా అని వీళ్ళందరూ వాళ్ల వాళ్ల మతాలని సరిగ్గా నమ్మడం లేదు అని కాదు కదా. సంస్కృతి , ఆచారాలు ,సాంప్రదాయాలు మారుతూ ఉంటాయి కాని మతం మారదు.

కాకపోతే చాలామంది దృష్టిలో మతం, సంస్కృతి ఒకటే. ఒక ముస్లిం అనగానే మీసం లేకుండా గడ్డం పెంచుకుని, తెల్లటి బట్టలు వేసుకుని, నెత్తి మీద skull cap తో ఉండే మగవాడో, లేక బురఖా వేసుకున్న ఆడదే గుర్తొస్తుంది. బ్రాహ్మణుడు అనగానే విభూతి, గుండు , పిలక, చొక్కలేకుండా ధోతి కట్టుకున్న వ్యక్తే గుర్తొస్తాడు.  ఒక క్రిస్టియన్ అనగానే ఆ వ్యక్తీ పేరు మేరి, జేమ్స్ , జాన్ ఇలా పాశ్చాత్య పేర్లు ఉంటాయని, వాళ్ళు బొట్టు పెట్టుకోరని అనుకుంటాము. బొట్టు పెట్టుకొని వారందర్నీ ఆ మతానికి చెందిన వారే అనుకుంటాము. కాని మన వేషభాషలు మన సంస్కృతి మీద depend అయ్యి ఉంటాయి కాని మతం మీద కాదు.

మతం కి సంస్కృతికి ఉన్న తేడా కి నాకు తెలిసిన ఒక వ్యక్తీ పరాకాష్ట. ఒక గట్టి హిందూ వాది , ముస్లిమ్స్ వల్ల భారతదేశానికి నష్టం జరుగుతోంది అని నాతో వాదిస్తూ " jesus christ sanju, why cant u understand my point" అన్నారు. 

సంస్కృతి మీద మతం అధికారం తగ్గుతూ వస్తోంది. ఇంకా తగ్గుతుంది అనే అనుకుంటున్నాను .



5 comments:

ఆ.సౌమ్య said...

good post!
I have been thinking of writing about something like this.
మీరన్నట్టు సంస్కృతికి, సంప్రదాయానికి, మతానికి చాలా తేడా ఉండి. దీన్ని గ్రహించకుండా రెంటినీ మిక్స్ చేసి అనునయించుకోవడం పరిపాటి అయిపోయింది.

ఒక మతం ఆచారావ్యవహారాలన్నీ ఆ ప్రదేశం లేదా రాష్ట్రం యొక్క సంస్కృతిగా గుర్తించడం జరుగుతుంది చాలాసార్లు.

నల్లపూసలు, తాళి కట్టడం, కర్ర సాములు- పులివేషాలు, పప్పుచారు -ఉప్పు చేప, గోంగూర పచ్చడి...ఒక సమాజపు సంస్కృతి. దీనికీ మతానికి, ఏ సంబంధం లేదు.

Ruth said...

హ హ...good one ! నా పేరు Ruth అయ్యినందుకు నాకు తెలుగు రాదనుకుంటారు అందరూ. నేను తెలుగు బ్లాగులు చదువుతుంటే వచ్చి, హా! నీకు తెలుగు చదవటం వచ్చా ??? అని ఘాట్టీగా హాచరపడిపోతారు :)
అంతే కాదు, మేము ఇంట్లో బ్రెడ్ జాం(నైఫు ఫోర్కులతో) తింటామని, క్రిస్మస్ కి వైన్ తాగుతామని, ఇంకా, పెళ్ళికి గౌన్ వేసుకుంటామని ఇంకా చాలా... నా పెళ్ళికి నేను చీర కట్టుకున్నానని, మా ఇంట్లో శుబ్భరంగా ఇడ్లీలు, దోశలు, దిబ్బ రొట్టెలు టిఫిన్లు చెసుకుంటామని, నాకు కొబ్బరి పచ్చడీ అన్నా, గోంగూర పచ్చడీ అన్నా ప్రాణం అని, అంతెందుకు, నేను నా కూతురికి ట్వింకిల్, ట్వింకిల్ కన్నా ముందు చిట్టి చిలకమ్మా, అమ్మ కొట్టిందా నేర్పిస్తున్నానని అని అస్సలు నమ్మలేరు !!!

సుజాత వేల్పూరి said...

రూత్,
నేను అన్నీ నమ్ముతాను, తున్నాను:-)

Indian Minerva said...

హ్మ్మ్మ్... సంస్కృతికున్న ఇంకొక అభిలషణియమైన లక్షణం కాలానుగుణంగా మారగలగటం. ఆమార్పుకు సామాన్యులు కారణంకాగలగటం.

మా ఇంగ్లీషు మాస్టారుని ఒకసారి traditionకీ cultureకీ తేడా ఏంటీ అనడిగితే దాదాపు ఇప్పుడుమీరు చెప్పిందే చెప్పారు.

tankman said...

@sowmya....thankyou

@ruth...u r my blog post personified :)

@indian minerva....righto