Tuesday, April 03, 2012

The దురద

అటు ఇటు గా ఎనిమిదేళ్ళ క్రితం మొదలయ్యింది. ఏంటది అనగా ... చెవుల్లో దురద , వాటి వల్ల నేను పడ్డ బాధలు. రకరకాల వస్తువులు దూర్చే వాడిని , cotton ear buds తప్ప.  ఎందుకంటే వాటిని షాప్ కి వెళ్లి తెచ్చుకోవాలి, మరియు  హాస్పిటల్ లో వాది పారేసిన దూదితో అవి తాయారు చేస్తారు అన్న పుకారు కూడా ఉంది. స్క్రూ డ్రైవర్లు, టూత్ పిక్స్ , పెన్ను రిఫిల్స్ ,  పెన్ను కాప్స్ ( రేనాల్డ్స్ మాత్రమే పడుతుంది చెవిలో), న్యూస్ పేపర్స్ ( అన్నిటి మీద ప్రయోగాలూ  చేసాను, టైమ్స్ అఫ్ ఇండియా బెస్ట్ చెవిలో పెట్టుకుని తిప్పుకోడానికి , తెలుగు పేపర్స్ అస్సలు సౌకర్యంగా ఉండవు, ఇంగ్లీష్ పేపర్స్ లో వరస్ట్ అంటే హిందూ, డెక్కన్ క్రోనికాల్ ), హెయిర్ పిన్స్ , అగ్గిపుల్లలు ( wax వి కావు)   చిన్న చిన్న వైరు ముక్కలు , చీపురు పుల్ల, mobile stylus,  బైకుల తాళం చెవులు ( వీటిలో బెస్ట్ హోండా ఆక్టివా తాళంచెవి, సన్నగా పొడుగ్గా, లోపల గోక్కోడానికి బాగుంటుంది, బజాజ్ బైక్ల తాళాలు బాగుండవు, హోండా బైక్ తాళాలు అయితే ఓకే ) . అన్నిటికన్నా జాగ్రత్తగా రిఫిల్స్ విషయం లో ఉండాలి, రేఫిల్ వెనకవైపు చెవిలో పెట్టుకోవాలి కానీ, నిబ్ ఉన్నవైపు పెట్టుకుంటే , చెవి పైన కూడా గీతాలు పడే అవకాశం ఎక్కువ. అదే సమయం లో గొంతు-చెవి-ముక్కు వైద్యుడి దగ్గరకి వెళ్తే, అతను కంగారు పడే అవకాశం కూడా ఉంది.

ఈ దురదలు మొదలయిన దగ్గర నుంచి , నాకు మనుష్యుల ఆలోచనా విధానం , వ్యసనం గురించి చాల విషయాలు అర్థమయ్యాయి. మొదట్లో దురద ఉంటేనే చెవిలో ఏదన్న పెట్టె వాడిని...నెమ్మదిగా అదొక వ్యసనం అయ్యింది. మందు దొరక్క, సిగరెట్ దొరక్క ప్రజలు ఎందుకంత  బాధ పడతారో అర్థం అయ్యింది.

ఇలా చెవుల్లో అవి ఇవి పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరాలు వచ్చేవి, క్రోసిన్ , నైస్ టాబ్లెట్స్ సేల్స్ పెంచాను బాగా, తర్వాత కొంతకాలం హోమియోపతితో ఉపశమనం లభించినా , ఎక్కువకాలం పని చెయ్యలేదు అది. పోయిన నెల బాగా నొప్పి, జ్వరం ఎక్కువయ్యి ఇక లాభం లేదని, సికింద్రాబాద్ లో Dr. దీన్దయాళ్ ని దీనంగా దర్శించాను, అయన దయతో నా ముక్కులో , నోట్లో, చెవుల్లో కెమెరాలు పెట్టి చూసి ( రూం లో ఉన్న అన్ని అయిదు స్క్రీన్స్ లోను అదే, నా ముక్కులో చెత్త, ఇన్ఫెక్షన్ ఉన్న చెవి, నా నాలిక దాని మీద అంతకు ముందు తాగిన లస్సీ ), వాటిని ప్రింట్ తీసి నా చెతిలో పెట్టి,  నీది ఆయిలీ స్కిన్, దాని మీద చుండ్రు ఉండడం వల్ల ఇలా జరుగుతోంది అని చెప్పి, మందులిచ్చి, చెవిలో ఒక క్లాంప్ పెట్టి,  మళ్ళి ఒక వారం తర్వాత రమ్మన్నాడు, ఈ వారం రోజుల పాటు, ఆ క్లాంప్ వల్ల నా మాటలు నాకే చెవిలో ప్రతిధ్వనించి, ఎదుటి వాడు గట్టిగా మాట్లాడుతుంటే ప్రతిఘటిస్తూ, నాకు కుడి వైపు కూర్చిన మాట్లాడే వాళ్ల మాటలు సరిగ్గా వినబదకపోయినా వినబదినట్టు తలకాయ ఊపుతూ, ఛాన్స్ దొరికినపుడు, అటు వైపు వచ్చి కూర్చొని, చెవిలో ఒక కీచురాయిని మైంటైన్ చేసాను. తర్వాత మళ్ళి డాక్టర్ దగ్గరకి వెళ్తే, అతను రెండు గంటలు లేటుగా Audi కార్ లో వచ్చి, "leave your ears alone" అని చెప్పి పంపించేసాడు.

నిన్నటినుంచి చేతులు చెవుల దగ్గరకి వెళ్ళకుండా చాలా కష్టపడుతున్నాను. చిత్రంగా క్లాంప్ లేకపోవడం వల్ల లేని ఆ గుయ్ మనే శబ్దాన్ని మిస్ అవుతున్నా . 

5 comments:

Subramanya Shastry said...

అబ్బబబ్బ... ఏమి దురద?!? ఏమి రీసెర్చ్‌...

ఒక చిన్ని సందేహం. 'The దురద'ను తీర్చుకోడానికి Times of India పేపరు బెస్ట్ - మిగతావన్నీ వర్‌స్ట్ ఎందుకు? కాగితం నాణ్యతా లేక బ్రాండ్ నాణ్యతా?

Shanti said...

దురద గురించి ఏం రాసావ్ సంజు. కంటికి కట్టినట్టు వివరించడానికి బొమ్మలు కూడా! పుల్ల దూర్చనేల పిదప గోల పెట్టనేల...ఇక నుంచయినా చేతి దురద అదుపులో పెట్టుకుని చెవి బాధ నుంచి ఉపశమనం పొందు.

Anonymous said...

మీకు నిజంగా చెవిలో దురద ఉండ వచ్చు లేదా ఆలాంటి సమస్య ఉన్న వారికి ఉపయోగ పద వచ్చు. ఒక ent డాక్టర్ చెప్పారు. ఖరీదయిన మందులు ఇస్తేనే పేషంట్లకు గురి కానీ ఇలాంటి సమస్యకు పైసా ఖర్చు అవసరం లేని పరిష్కారం ఉంది అన్నారు. నోటిని మూసుకొని నోటిలోనే గాలిని తెచ్చుకోవాలి . ముక్కును మూసుకొని ఆ గాలిని వదలాలి బయటకు వెళ్ళే దారి లేక ఆ గాలి చెవి రంద్రాల నుండి బయటకు వస్తుంది . మొదట్లో కొంచం ఇబ్బంది సమయం చిక్కినప్పుడు నాలుగయిదు సార్లు చేస్తే చెవి క్లిన్ అవుతుంది . ఎవరయినా ent డాక్టర్ ను అడిగితే ఎలా చేయాలో చూపించవచ్చు . సికింద్రాబాద్ జైన సెంటర్( రాజేశ్వర్ టాకీస్ దగ్గర ) లోని డాక్టర్ చెప్పారు ఇది

tankman said...

@తెలుగు భావాలు... కాగితం నాణ్యత బట్టి చెప్పాను. హిందూ పేపర్ మరీ గట్టిగా అనిపిస్తుంది, అసలు చుట్టడం కూడా కష్టం, డెక్కన్ చ్రోనికల్ మరీ మెత్తటి పేపర్, ఒకసారి చుట్టి చెవిలో పెట్టగానే నలిగిపోతుంది. టైమ్స్ అఫ్ ఇండియా అయితే చెవిలో పెట్టుకుని తిప్పడానికి సరిపోయే గట్టితనం, అలా అని చుట్టడానికి కూడా కష్టం కలిగించకపోవడం లాంటి లక్షనాలు కలిగి ఉంది, అందుకే టైమ్స్ అఫ్ ఇండియా

@శాంతి ... అలాగే

@ilam ... మీరు చెప్పింది నిజమే ,

Rajesh R said...

Great Exposure of your feelings and what you done to get rid of that.

At the end you said "Controlling".. appreciate that if you continue..

I would also say same what Deendayal said to you "leave your ears alone"