ఆహ్ మధ్యతరగతి బ్రతుకులు, మధ్యతరగతిలో ప్రేమలు ఆప్యాయతలు , మధ్యతరగతి కలలు , మధ్యతరగతి ఉదాసీనత , middle class mentality ఇలా బోలెడు చదివా .
అసలు అందర్ని వదిలేసి, ఈ మధ్యతరగతి వెనకాలే ఎందుకు పడతారు ? ముందు కార్ల్ మార్క్స్ పడ్డాడు, capitalism లో మధ్యతరగతి కుచించుకు పోతుంది అని, కానీ మధ్యతరగతి పెరిగి, పెద్దదయ్యి ఒక దుప్పటి కప్పుకుని పడుకుంది. నిద్రపోవట్లేదు, కేవలం ముసుగుతన్ని పడుకుని , బారిస్టర్ పార్వతీశం లండను వెళ్ళకముందు చేసినట్టు, దేశాకాలవైపరిత్యాల గురించి తన పగటి కలల మధ్యలో ఆలోచిస్తూ ఉంటుంది. మంచం మీద నల్లులు ఉన్నాయా, పక్కలో కప్పలు ఉన్నాయా, దుప్పటి వాసన వేస్తోందా లాంటి విషయాలు పట్టించుకోకుండా అలా ఉంటది. మధ్యలో అన్న హజారే లాంటి వాళ్ళు, సత్యమేవ జయతే ప్రోగ్రాం తో అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు, లేపి, దుప్పటి కంపుకోడుతోంది, మార్చుకో అని చెప్తారు, వెంటనే ఒకసారి దుప్పతిలోంచి మొహం బయట పెట్టి, ఎవరా అని చూసి, దుప్పటి వాసన చూసి, అర్రే ఇంత కంపులో కులాసాగా కునుకు తీస్తున్నాన అని బుడుగు లెవెల్లో బోలెడంత హాశ్చర్యపోయి , కాసేపు దుప్పటి మొత్తం తేరి పార చూసుకుని , ఈ తీగని సవరించాలి, ఈ అపశ్రుతి సరిచెయ్యాలి అని పాడుకుంటూ లేచి, ఎన్నాళ్ళు ఈ కంపులో మేముండాలి, అని నారాయణమూర్తి లెవెల్ లో అరిచి, ఒకసారి చుట్టూ చూసి, సామజిక అసమానతలు ఉన్నాయి, ఇలా ఉంటె ఎలా అని ఒక ప్రశ్న వేసేసి, తనకన్నా ధనికులు, తనకన్నా పేదవాళ్ళకి డబ్బు పంపిణి చేసేస్తే సమాజం లో అందరు తనలనే తయారయ్యి నిద్ర లోకి ప్రశాంతంగా జరుకోవచ్చని సెలవిచ్చి, మొబైల్ లో వచ్చిన ఫార్వర్డ్ SMS ఒకసారి చూసుకుని, మిగతావాళ్ళకి అది ఫార్వర్డ్ చేసి, ఎలాగు మొబైల్ చేతిలో ఉంది కాబట్టి, అవినీతి అంతం అవ్వడానికి , అన్న హజారే కి సపోర్ట్ గా ఒక మిస్సేడ్ కాల్ చేసి, ఎన్నికలలో వోటు కాదు, న్యూస్ ఛానల్ వాడి SMS సర్వేలు కి వోట్లు వేస్తె సమాజం బాగుపదిపోతుందని వాళ్ళకో SMS పంపి, అర్రెర్రె ఆవేశం లో పంపించేసనే, 3 రూపాయలు వదిలింది , ఇది SMS package లో రాదే అని నాలిక కరుచుకుని, చ్చా దుప్పటి తీస్తే ఇలాంటి వాయిమ్పే అవుతుంది, నేను ఇక తియ్యను అని ముసుగుతన్నేస్తుంది.
మళ్ళి ఎవరో వచ్చి లేపుతారు.

4 comments:
Nice one!
నేను ఇంకా గట్టిగ ముసుగు తన్ని పడుకున్నాను. లేదు లేదు పడుకున్నట్టు నటిస్తున్నాను. ముసుగు తీస్తే ఏమి చూడాల్సివస్తుందో అని.
రాసిన తీరు చాలాబాగుంది.
superb sanjuuuuuuu:-)
Post a Comment