మా ఫ్రండ్ ది ఫోన్ పోయింది, నోకియా ఫోను, పదహారు వేల ఫోను, ఏడుస్తుంటే iphone కొనుక్కోమని, పోయిన ఫోను ఈ పాటికే జగదీష్ మార్కెట చేరిపోయి ఉంటుందని, దిగులు వొద్దని , వోదరుస్తున్నాం. పోలీసు కంప్లైంట్ ఇవ్వమని వాళ్ళ అమ్మగారు చెప్పారని , ఇవ్వాల్సిందే అని గోల చేస్తుంటే , అది భరించలేక మలక్‌పేట్ పోలీసు స్టేషన్ కి పోయాం.
పొలిసు స్టేషన్ మెట్ల మీదే ఒక వీధి కుక్క దర్జాగా కూర్చోండి, ప్రజలకి పోలీసులు , పోలిసులకి కుక్కలు రక్షణ అని అనుకుని, అక్కడే ఒక పెద్ద గుంపులో నున్చిని మమ్మల్ని సాదరంగా పలకరించి మాట్లాడిన పోలీసు మాట ప్రకారం, పొలిసు స్టేషన్ లో రెండో అంతస్తుకి వెళ్ళాం, పెద్ద పెద్ద ఇనుప పెట్టలు, పెద్ద పెద్ద పొట్టలు ఉన్న పోలీసులని దాటుకుని.
మలక్‌పేట్ పోలీసు స్టేషన్ రెండో అంతస్తు లోనే, పోలీసులు కాపురం ఉంటున్నారు, వెళ్ళగానే ఆరేసిన డ్రాయర్లు, చొక్కాలు, లుంగీలు కనిపించాయి,వాటి పక్కనే ట్రాఫిక్‌కు పోలీసుల విభాగం, ఒక పది పదిహేను వాకీ టాకీలు బల్లమీద పెట్టుకుని, ఏదో తెగ రాసేస్తూ కనిపించారు, వాళ్ళ సెక్షన్ పక్కన రూం లోనే ఫోన్ మిస్సింగ్ కేసెస్ రిజిస్టర్ చేస్తారన్నారు, చిన్న గది, ఆ గది లోంచి లాకప్ కి దారి, చిన్న గదిని ఇంకొంచం చిన్నది చేస్తూ రెండు బల్లలు ఒక బెంచి, బెంచి మీద ఒక దిట్టమయిన పోలీసు బాబాయి, అయన చేతిలో తళతళా మెరుస్తూ ఒక చైను, ఆ చైను కి అటువైపు కింద కూర్చొన్న ఒక డిగ్రీ చదివే వయసున్న కుర్రాడు, అంత చైను వేసారంటే వాడెం శాడిస్టు గాడో అనుకుంటూ ఉంటె, బల్ల వెనక పొలిసు "అబ్బా ఫోను మిస్సింగ్ కేసా , బిజీ గా ఉన్నాము వేరే పనిలో" అన్నాడు, పాపం కంప్యూటర్ తో ఏదో కుస్తీ పడుతున్నాడు, ఒకతన్ని పిలిచి మా సంగతేంటో చూడమన్నాడు, ఇంతలో బెంచి మీద కూర్చున్న పొలిసు బాబాయి ఫోను ఎంత అని అడిగాడు, పదహారు వేలు అని చెప్పగానే, మాకు పని చూడటం మొదలు పెట్టినయాన్ని పిలిచి , "పదహారు వేలంట, మంచి గిరాకి పో " అనేసాడు, అందరం నవ్వుతు ఉంటె, ఆ పొలిసు అడిగాడు, అందరి ఫోన్లు పోయాయా, లేక ఒక్క ఫోనుకి ఇంతమంది వచ్చారా అని, ఇక చేసేది లేక , నేను ఇంకో ఫ్రండ్ బయటకి వచ్చేసాం , ఈ హడావిడిలో లాకప్ కి ఏడు వూచలు ఉన్నాయో లేదో లెక్క పెడదామనుకున్న సంగతి మర్చిపోయాను.
బయట ట్రాఫిక్కుపొలిసు సెక్షన్ దగ్గర నున్చోన్నాం, ఒక వాకీ టాకీ లోంచి ఒక బండ గొంతు తెగ గోల పెడుతోంది, ఎవరు పట్టించుకోట్లా, మాకు మొదట్లో సరిగ్గా అర్థం కూడా అవ్వాలా, జాగ్రత్తగా వింటే తెలిసిందేమిటంటే, ట్రాఫిక్‌కు పొలుసులు ట్రాఫిక్‌ను పట్టించుకోడం మానేసి, అంబ్రెల్లా ల కింద కూర్చుంటున్నారని, దీని వాళ్ళ ట్రాఫిక్ జామ్స్ పెరిగే అవకాశం ఉందని , ఇలాంటి అలవాట్ల వాళ్ళ ట్రాఫిక్ వ్యవస్థ కి నష్టం జరుగుతుందని ఒక పెద్ద పొలిసు గొంతును తెలుగులో ఇంగ్లీషులో చించుకుని చెబుతున్నాడు. అయన ఎప్పుడు ఇలానే క్లాసు వాకీ టాకీ లో పీకుతుంటాడు అనుకుంటా , ఎవరు పట్టించుకోట్లా .
కాసేపటికి మిగతా వాళ్ళు బయటకి వచ్చారు. ఏమయిందిరా అంటే, FIR బుక్ చెయ్యలేదు, కంప్లైంట్ బుక్ చేసి నెంబర్ ఇచ్చడుట, బెంచి బాబాయి అయితే, ఇవన్ని కాదు కాని, నాకో అయిదు వేలు ఇవ్వండి, రేపటికల్లా ఫోన్ సంపాదించి ఇస్తా అని బంపర్ ఆఫర్ కూడా చేశాడుట.
ఇంకేం చేస్తం , స్మార్ట్ ఫోను పోయి డబ్బా ఫోను వచ్చే అని పార్టీ చేసుకుని వచ్చేసాం

4 comments:
హమ్మయ్య...ఇప్పటికి మీకు వ్యవస్థ అర్థం అయ్యింది...
pragnabharathy.blogspot.in
హ్మ్!
:((
@పూర్ణప్రజ్ఞాభారతి .. నా బ్లాగుకి స్వగతం
@sharat n vanajavanamali :)
Post a Comment