Thursday, May 17, 2012

జొ గబ్బర్ సింగ్ కొ గయా ... సంజొ మర్గయా

నాలుగేళ్ల తర్వాత మా వాడు కలిసి, బ్రతిమలాడి , టికెట్లు తీసుకొచ్చి నన్ను హాల్ లో  కూర్చోబెట్టాడు. పూర్తిగా ఫాన్స్ కోసమే తీసిన మూవీ, మొత్తమంతా ' pawanism ' , అనగా ముక్కడం, స్టేట్ రౌడి కాలం లోని చిరంజీవి హావభావాలు కాస్త మార్పు చేసి చూపించడం, ఇంకా మెడ రుద్దుకోడం.



ప్రతి మూవీ లో సవితి తల్లి పోరు ఉంటుంది కదా...దీన్లో సవితి తండ్రి పోరన్నమాట. దాన్ని భరించలేక మెడ రుద్దుకుంటూ ఇంట్లోంచి పారిపోతే పట్టుకుని హాస్టల్ లో వేస్తె , పోలీసు అవుతాడు. వాళ్ళ వూరికే ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. వూరి పేరు కొండవీడు ( ఏదన్న చిరంజీవి మూవీ గుర్తొస్తోందా ? ) .

  'మోసగాళ్ళకి మోసగాడు ' కాలం నాటి ఒక బ్యాంకు ని కొంతమంది దొంగలు దోచుకుంటారు. అప్పుడే పవన్ కళ్యాణ్ ఎంట్రి, గుర్రమెక్కి వచ్చి, దొంగల్ని పట్టేసుకుంటాడు. ఆ దొంగల్ని పంపించింది లోకల్ యువనాయకుడు ( రక్తచరిత్ర విల్లన్ ) . తర్వాత గబ్బర్ సింగ్ పోలీసు స్టేషన్ కి వస్తాడు, పొలిసు స్టేషన్ పేరుని "గబ్బర్ సింగ్ స్టేషన్ " గా మార్చేసి, మూవీ మొత్తం అయన తుపాకుల్ని ముద్దుపేర్లతో పిలుచుకుంటూ, అయిదేళ్ళ పిల్లాడు  దీపావళి తుపాకీ కాల్చినట్టు , కాల్చేస్తు ఉంటాడు. కూర్చొని మెడ రుద్దుకుంటాడు, కాసేపు నిలబడి రుద్దుకుంటాడు, కాసేపు చిరంజీవి ని కాపీ చేస్తాడు, కాసేపు టపాకి తీసి గోడల్ని, నేలని కాలుస్తూ ఉంటాడు, కాసేపు కుళ్ళు జోకులు, కాసేపు అయన "పవనిసం" మీద ఆయనే జోకులు, కాసేపు హీరోయిన్ కి సైట్ కొట్టడం, కాసేపు విల్లన్ ని బెదిరించడం, కాసేపు జీప్ ని స్కిడ్ చేయించడం, కాసేపు కుటుంబ సెంటిమెంటు, కాసేపు పాటలు, కాసేపు ఓవర్ ఆక్షన్ ,  కాసేపు ఆ వూరి రౌడీలతో కబడ్డీ, అంత్యాక్షరి లాంటి ఆటలు, మిగిలిన టైం లో ముక్కడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇంత బిజీ గా ఉన్నాడు కాబట్టే, ఒక సీన్ లో అయన రాలేక అయన కటౌట్ రిక్షా లో పంపిన్స్తాడు. ఇన్ని విడ్డూరాలు భరించలేక ఆ గుర్రం పారిపోయింది, నేను మాత్రం దొరికిపోయాను.

కథ అంటూ పెద్దగా ఏమి లేదు, స్క్రీన్ ప్లే అస్సలు లేదు, దేనికి లింక్ దొరకదు, వీటి మధ్యలో స్టేషన్ లో అంత్యాక్షరి అనే గొప్ప సీన్. నిజానికి మొదటి మూడు నిమిషాలు బాగానే ఉంది, తర్వాత సాగదీసి పెంట పెట్టాడు. రక్తచరిత్ర విల్లన్ ని మూవీ మొత్తం ఒక సైకో లో చూపించడానికి ట్రై చేసి, అది పండక చివరికి సుహాసినిని చంపించడం లో ఆ పిచ్చి అంటా చూపించారు. డైరెక్టర్ ప్రతిభ ముందు, హీరోయిన్ , అలీ , బ్రహ్మానందం అంతా కొట్టుకుపోయారు. 

మూవీ చూసాక అనిపించింది ... మేము పవన్ కళ్యాణ్ ఫాన్స్ అని చెప్పుకునే వారంతా, నిజంగా పవన్ కళ్యాణ్ కి అభిమానులా లేక , "పవనిసం" కి అభిమానులా అని. నాకు ఖుషి , తొలిప్రేమ పర్లేదు అనిపించాయి కాని, పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేసిన జానీ , ఇంకా జల్సా బాగా నచ్చాయి. కాని జానీ , పవన్ కళ్యాణ్ ఫాన్స్ కే సరిగ్గా నచ్చలేదు. ఏదో ఆక్టింగ్ బాగుంది ఫాన్స్ అంటే అర్థం చేసుకోవచ్చు కానీ, మెడ రుద్దుకున్తున్నాడు కాబట్టి ఫాన్స్ అంటే ...ఏంటో . అయినా ఎవరి అభిమానం వాళ్లది.

14 comments:

Indian Minerva said...

బాబుగారూ మీకు "జానీ" నచ్చిందా!!? :)

ప్రస్తుతం రూములో ఈ గబ్బరుసింగునే చూస్తున్నాను. ఇదే సినిమాహాల్లో చూసుంటే ఖచ్చితంగా వాకౌటు పడుండేది. ఆకామెడీ భరించడం నావల్ల కావడంలేదు. పవన్‌బాబు గారు తెరంతా అయనే అయి కనిపిస్తున్నారు.

నావరకు నాకు జల్సా నచ్చింది. ఖుషీ అంటారా.. అప్పుడెప్పుడో స్టూడెంటుగా ఉన్నప్పుడు నచ్చింది. ఇప్పుడున్న మెచ్యూరిటీకి ఈమధ్య ప్రయత్నిస్తే, గంటన్నరపాటు downloadచేసిన movieని ఇరవయ్యంటే ఇరవై నిముషాల తరువాత delete కొట్టాను.

Mauli said...

/వీటి మధ్యలో స్టేషన్ లో అంత్యాక్షరి అనే గొప్ప సీన్. /

ఈ సీన్ బాగుంది, కాని గబ్బర్సింగ్ చూసాక దబాంగ్ కుడా ఇంత చెత్తగా ఉందా అనిపించింది. థియేటర్ లో చూడ్డం కష్టమే

Krishna said...

purtiga pawan fans ni santrupti parachadanike annaka kuda inkaa ee rankelEndO rambola endo!!??

Rajesh R said...

Yes.. u r not 100% right.
okka fans e chusthe cinemalu naduvavu and fans kosame cinema chesthe producer pani anthe inka..

chivarigaaa.. mee viluvaina samayaanni mee blog ki ketainchi gabbarsingh gurinchi vivarinchinaduku kruthagnathalu..:))

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

Some bloggers posted good reviews about it. I have booked tickets for my family for Saturday show. Thanks for timely warning.

వనజ తాతినేని/VanajaTatineni said...

Title ..adirindi.
migataadi nenu chadavaledu.
Sorry!!

Unknown said...

nuventra cinema gurunchi chepedi.. State motham chepthondi nuvu walk out chesinantha matrana em kadu bochu apatilo lavakusha super hit epudu chusthe nachutada....boku kahanali chepaku nuvu thoka lo ekka...pawanism ante mukadam varake telusu meku pedha pu laga rasaru

Unknown said...

thetre lo chudatam kastamena, ne lantolake collections tho moham piana tapa tapa tapa ane cheputho kodthunadu gabar singh...kevvvv kekaaa..ha ha ha

tankman said...

@indian minerva ... nijangane johnny baguntundandi, light comedy, bit songs, climax tappa movie naaku baga nachindi.

@mauli ధియేటర్ లో చూడటం కష్టమే

@krsna... అంటే పోస్టర్స్ లో He is special తో పాటు, only for fans అని పెట్టి ఉంటె మా లాంటి వాళ్ళం బ్రతికి పోయే వాళ్ళం

@rajesh .. agreed

@krishna's ..... have fun :)

@vanajanamali ... thankyou

@unknown ... నా బ్లాగ్ లో పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా కామెంట్ పెట్టడానికి ఒక ప్రొఫైల్ create చేసి మరీ పెట్టావ్ చూడు .... నీ అభిమానానికి మంచి మార్కులు పడ్డాయ్, పండగ చేస్కో , కలెక్షన్స్ అంటావా .. ra.one కి కూడా వచ్చాయి, బాలకృష్ణ ఫాన్స్ కూడా కలెక్షన్స్ కలెక్షన్స్ అంటారు.

Rajesh R said...

Inko maata.., andariki nachela cinemalu teeyalante kastame..,suppose anand,ala modalaindi,asta chemma movies manaku nachinai., manchi movies.. mari kanisam avi chala mandiki artham kani cinemalu.., so alanti valla kosame ilanti mass movies not only for fans..ganthe.., ee blog needi.., so nee views rase right undi neeku. :)
chiranjeevi eppudo Rudraveena teesadu paisalu rale national award vachindi next year state rowdy teesindu masthu paisalu vachinai...:)
naaku rudraveena nachindi state rowdy nachindi. :)
naku evadaina nachaledante vani cinema assalu chudanu.. ganthe.. ;)

@unknown abhimanam unte chalu verri thalalu vese abhimanam vaddu chinna... ;)

Mauli said...

Sanju,

Unknown పవన్ కళ్యాణ్ కి సపోర్టు గా వ్యాఖ్య వ్రాయలేదేమో

బ్లాగుల్లో 'సినిమాల కెలుకుడు కళ్యాణ్' కి సపోర్టు గా వ్రాసి ఉండొచ్చు :-)

అయ్యా Unknown,

డబ్బులోచ్చిన సిన్మాలు చాలానే ఉన్నాయి, బాగోలేదనగానే తిట్టేస్తావా ఏంటి , కనీసం పేరు కూడా చెప్పుకోలేని అర్భకుడివి.

Praveen Mandangi said...

మా పట్టణంలో మాత్రం ఈ సినిమా ఆడుతోన్న మూడు థియేటర్లకీ ఫుల్ జనాలు ఉన్నారు. నాకు రేపటి ఆటకి టికెట్ దొరికింది.

Praveen Mandangi said...

ఈ రోజు గబ్బర్ సింగ్ సినిమాకి వెళ్తున్నాను.

Praveen Mandangi said...

Watch this photo: https://plus.google.com/111113261980146074416/posts/Lx1jQyi6LfM