ప్రస్తుతం జరుగుతున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శన లో కొన్నా ఈ పుస్తకాన్ని . ఈ పుస్తకం పేరు చూసి స్టాల్ లోకి వెళ్లి మిగతా పుస్తకాలు చూస్తుండగా, అక్కడి వ్యక్తీ తో మాటలు మొదలయ్యి, ఆయనే పరవస్తు లోకేశ్వర్ అని తెలిసాక ఆనందించా చాలా. ఇదే మొదటి సరి ఒక రచయితని కలవడం. పుస్తకం కొని అయన autograph తీసుకుందామనుకున్న మొదట్లో, కాని, మాటల మధ్యలో ఆయన నా పేరు అడగడం, వెంటనే నా ఇంటిపేరు అడగడం తో కాస్త చిరాకేసింది. ఇంటి పేరు ఎందుకు అసలు ? నా కులం గురించి ఎందుకు అసలు? ఫలానా కులం అయితే ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారా ?
నిజం చెప్పాలంటే, కాస్త అదే చిరాకు మీద పుస్తకం మొదలు పెట్టా. ఒకసారి అటు ఇటు తిరగేస్తే కమ్యూనిస్ట్ కంపు కాస్త అనిపించింది. సర్లే, కొన్నాం కదా అది చదవడం మొదలు పెట్టాక పుస్తకం చాల నచ్చింది. రచయిత , అతని స్నేహితుడు , ఒక Honda Activa మీద ఛత్తీస్గఢ్ లో పది రోజుల పాటు తిరిగినప్పటి అనుభవాలు , ఆ తర్వాత మరో స్నేహితుడితో రెండు సంవత్సరాల తర్వాత మరల తిరిగిన అనుభవాలు.
ఛత్తీస్గఢ్ చరిత్ర, సాంఘిక స్తితిగతులు, నక్సల్ ఉద్యమం , కొత్తగా ఏర్పడిన రాష్ట్రము పట్ల ప్రజల ఆనందం., గిరిజనులు , ఎక్కడి నుంచో వచ్చి అక్కడ స్థిరపడి పోయిన వాళ్ళు, భూత వైద్యుల మధ్య ఒక అలోపతి డాక్టర్ కస్టాలు, చాలా బాగా కవర్ చేసారు.
ఇదే నేను చదివిన మొదటి travelogue. నచ్చింది. కాకపోతే రచయిత భాష విషయం లో కాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేది అనిపించింది. కాసేపు తెలంగంగా యాస, కాసేపు text book లాంగ్వేజ్, కాసేపు నాటకాల భాష, కాసేపు ఉర్దూ, మధ్య మధ్య లో ఇంగ్లీష్ సూక్తులతో కాస్త వింతగా అనిపించింది. హిందీ , ఉర్దూ వాక్యాలకి పక్కన అనువాదం కూడా ఇస్తే బాగుండేది.
ఇక, మధ్య మధ్య లో రచయితే ఆలోచలనలు కాస్త చిరాకు పెట్టాయి, తెలంగాణా ఉద్యమం జరుగుతున్నతీరుమీదకాని,గిరిజనులలోదొంగతనాలు లాంటివి ఉండవు అన్న ఉద్దేశ్యాలు ముఖ్యంగా నాకు నచ్చలేదు . Of course ,అయన పుస్తకం అయన ఇష్టం, నా బ్లాగు నా ఇష్టం .
కాకపోతే, రచయిత ఎంత చిరాకు పెట్టినా , పుస్తకం లో చెప్పిన విషయాలు చాల విలువయినవి , పుస్తకం బోర్ కొట్టలేదు. అన్నిటికి మించి కేవలం 6 లీటర్లు tank capacity ఉన్న , Honda Activa మీద చత్తీస్ఘడ్ లాంటి వెనక బడిన రాష్ట్రాన్ని చుట్టారంటే , రచయిత ధైర్యానికి నా సలాం .

5 comments:
i wanted to buy that book from a long time..can you tell me which stall it's available in?
160680847, 9392698814 these numbers are mentioned in the book regarding getting copies
పుస్తకంలో వింతగా ఒకదాని నుండి ఒకదానికి వాక్యానికీ వాక్యానికీ మారిపోతూ సాగిన భాష గురించి, కొన్ని చోట్ల చాలా తేలిగ్గా వెలువరించిన అభిప్రాయాల గురించి - నాకు కూడా మీకు అనిపించినట్లే అనిపించింది.
అయితే, పుస్తకం వల్ల చాలా ఆసక్తికరమైన వివరాలు తెలిశాయి - ముఖ్యంగా శంకర్ నియోగి, గిరిజనుల రాజు ప్రవీర్ చంద్ వంటి వారి గురించి.
@S, ప్రవీర్ చంద్ అంటే కాకతీయు వంశస్తుల చిట్టచివరి రాజు?
oremuna: Yes.
Post a Comment