Industrialization , globalization వల్ల ఆదివాసులు తమ ఆదాయాన్ని , సంస్కృతిని కోల్పోతున్నారు కాబట్టి , అవి చాలా చెడ్డవని ఈ మధ్య ప్రచారం బాగా జరుగుతోంది. Avatar , ఉరిమి కధాంశాలు కూడా అవే . ఇప్పుడు మీడియా , మూవీస్ పెరిగి మనకి ఈ సమస్య గురించి ఎక్కువగా వినడం జరుగుతోంది అని, పరిశ్రమలలో వచ్చిన మార్పుల వల్ల పూర్వం కూడా ఇలాంటి బాధలు సమాజం లో కొందరు పడ్డారని, చాలావాటిని మనం నిర్లక్ష్యం చేసామని నా గట్టి నమ్మకం . ఉదాహరణకి ...
paperless office కోసం తాపత్రయ పడుతూ , మనం కాగితం పరిశ్రమని దెబ్బ కొడుతున్నాం
ఈమెయిలు వాడకం ఎక్కువయిపోయి , పోస్టల్ డిపార్టుమెంటు ని దెబ్బ కొట్టాం
వాహనాలు ఎక్కువగా వాడటం వల్ల , ఎడ్లబడ్ల తాయారు చేసే వారు నష్టపోతున్నారు
మొబైల్ ఫోను ల్యాండ్ లైన్ ని, ల్యాండ్ లైను ఫోను టెలిగ్రాఫ్ ని, టెలిగ్రాఫ్ పావురాల్ని నాశనం చేసేసాయి ,
చైనా నుంచి వచ్చిన కాగితాన్ని బాగా వాడుతూ , దేశి పరిశ్రమ అయిన తాళపత్ర పరిశ్రమని నాశనం చేసారు మన పూర్వీకులు.
మొబైల్ ఫోన్లు ఎక్కువయ్యాక , డబ్బా రేడియోలు కొనడం మానేసారు
బ్రాడ్బాండ్ నెట్ చవకగా రావడంతో , ఇంటర్నెట్ కేఫ్ లు మూత పడుతున్నాయి
డిష్ టీవీ , కేబుల్ టీవీ పరిశ్రమని తోక్కిపెట్టాలని చూస్తోంది
రెడీమేడ్ బట్టల పరిశ్రమ , సందు చివరి టైలర్ కడుపు కొట్టింది
టూత్ బ్రుష్ ల వల్ల , వేప పుల్లలకి, బొగ్గు పొడికి ఆదరణ తగ్గింది
హోమియోపతి , అలోపతి హడావిడిలో మనం అయోర్వేదాన్ని , పసరు మందులని మర్చిపోయాం , అలాగే భూత వైద్యుల్ని కూడా
తుపాకి పరిశ్రమ కత్తి పరిశ్రమని, బాణాల పరిశ్రమని , ఈటెల పరిశ్రమని మాయం చేసేసింది
టీవీ , మూవీలు వచ్చాక నాటకరంగాన్ని పట్టించుకోడం బాగా తగ్గింది
చైనా నుంచి తెచ్చుకున్న పట్టు ని , మన భారతీయ దేవుళ్ళకి కూడా తొడిగి అదే మన సాంప్రదాయం , సంస్కృతి అన్న భ్రమ లో బ్రతుకుతున్నాం
కంప్యూటర్ పిచ్చి లో పడి Typewriters ని పట్టించోకవట్లేదు ఎవరు ..
అసలు వాహనాల ఉత్పత్తి పెంచి , ప్రజలకి నడిచే అవసరం తగ్గించి, తద్వారా చెప్పులు తక్కువుగా అరిగేల చేసి , చెప్పులు కుట్టేవాళ్ళ కడుపు కొడుతున్నాయి Honda, Hundai, Bajaj లాంటి సంస్థలు.
రోడ్డు మీద కుక్కలని , అడివిలో పులుల్ని , పశ్చిమ కనుమలలో అంతరించుకుపోతున్న కప్పల గురించి ఆలోచించే మనం , వీటి మీద ఎందుకు మౌనం గా ఉంటున్నాం ?

1 comment:
Super bro......
Post a Comment