ఎప్పుడిన బస్సు లో కాని, ట్రైన్లో కానీ , లేక పెళ్ళిలో ఎవరితో అన్న టైం పాస్ కి సుత్తి వేస్తునపుడు ...కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తు ఉంటాయి ...అవి విన్నగానే...ఏదో కొత్త జ్ఞానం వచ్చిన ఫీలింగ్ వస్తుంది ....కాని ఆ జ్ఞానం నిజమా కాదా అని చెక్ చేసినపుడు వింత గా అనిపిస్తుంది .... అలంటివి కొన్ని ...
1. NTR వల్ల మన రాష్ట్రం లో కరణాలు తొలగించబడి , పంచాయితీరాజ్ వ్యవస్థ వచ్చింది అనీ, NTR కి అదేదో వూర్లో ఎవరో కరణం తో గొడవ వల్ల , ముఖ్యమంత్రి అవ్వగానే కరణీకం ని రద్దు చేయించాడు అని .....ఎవరిన చెబితే లైట్ తీస్కోండి .... పంచాయితీరాజ్ వ్యవస్థ అనేది NTR తీసుకు వచ్చింది కాదు , భారత రాజ్యాంగం 73 వ సవరీకరణ వల్ల వచ్చింది , అది కేవలం ఆంధ్ర ప్రదేశ్ కి మాత్రమే కాదు , మొత్తం దేశానికి , NTR వల్ల కాదు.
2. పాకిస్తాన్ , ఇండియా విడిపోవడం అనేది గాంధి ఒప్పుకోవడం వల్ల జరిగింది అని , కొంతమంది చెప్పడం గాంధి వల్లే జరిగింది అని , నిజానికి పాకిస్తాన్ ఏర్పాటు ఆలోచన ముస్లిం లీగ్ ది, ముస్లిం లీగ్ ముందు నుంచి ముస్లింలకి వేరే దేశం కావాలి అని పట్టు పట్టుకుని కూర్చొంది, తర్వాత మత ఘర్షణలు చాలా జరిగాయి , తదనంతరం, మౌంట్ బాటెన్ ప్లాన్ ప్రకారం విభజన జరిగింది, ఈ మొత్తం వ్యవహారం లో గాంధీ పాత్ర పెద్దగ ఏమి లేదు, గాంధీ ఒప్పుకోవడం వల్ల్ల ఏమి జరగలేదు, నిజానికి గాంధీ తన అనుచరుడు పట్టాభి సీతారామయ్య ని కాంగ్రెస్ అధ్యక్ష్యుడు గా ప్రచారం చేస్తే , అతని ప్రత్యర్ధి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ కి అధ్యక్షుడు అయ్యాడు, ఒక పార్టీ లోనే తన పంతం నేగ్గించుకోలేని వ్యక్తి , ఒక దేశాన్ని ముక్కలు చేయ్యగాలడా ?
౩. దేశ విభజన మీద ఇంకో కధ ఏంటంటే, స్వతంత్రం వచ్చినపుడు జిన్నా కి స్వంత్ర దేశానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని , అసూయ తో మండిపోయిన నెహ్రు , మౌంట్ బాటెన్ భార్యతో తనకు వున్నా చనువుని ఉపయోగించి, దేశాన్ని రెండుగా విభజించే ఆలోచనని మౌంట్ బాటెన్ కి అందిచాడని, అలాగా అతను ప్రధాన మంత్రి అయ్యాడు అని , నిజానికి దేశాన్ని విభజించే ఆలోచన ముస్లిం లీగే ది, జిన్నా ములిం లీగ్ అధ్యక్షుడు !!! మరి నెహ్రు కి మౌంట్ బాటెన్ భార్యకి మధ్య ఉన్న చనువు శృంగారం అని అంటారు , రుజువులు అయితే ఏమి లేవు.
4. ఎప్పుడినా RSS శాక కి వెళ్ళరా ? అక్కడ "భారత మాట బిడ్డలం, భగత్ సింగ్ తమ్ములం " అని స్లోగన్ కి అరుస్తూ ఉంటారు, అది విని, RSS వాళ్ళేదో , దేశభక్తీ విపరీతంగా ఉన్న హిందువులు , ఇంకా ఆ సంస్థ లోంచే భగత్ సింగ్ స్వాతంత్ర ఉద్యమం లో పాల్గొన్నాడు అని అనుకోకండి , ఆ సంస్థ స్వతంత్రం రావడానికి ముందు ఏర్పడ్డా, స్వాతంత్రోద్యమంలో ఏమాత్రం పాల్గొనలేదు, ఆ సంస్థ ఏర్పాటు చేయబడ్డది హిందువుల కోసం, భారతీయుల కోసం కాదు. ఇంకా భగత్ సింగ్ తనని తానూ ఎప్పుడు హిందువు గా చెప్పుకోలేదు, అతని ఒక సోషలిస్టు , దేవుడిని నమ్మని వాడు , "why i am an atheist" పుస్తకాన్ని రాసాడు .
5. భారత దేశ గొప్పతనాన్ని వివరిస్తూ ...గత 10,000 ఏళ్ళుగా మన దేశం ఇంకో దేశం మీద దాడి చెయ్యలేదని, ఈ విషయం పట్ల ఎంతో గొప్పగా ఫీల్ అవ్వాలని వివరిస్తూ తెగ మెయిల్స్ వస్తుంటాయి మనకి, నిజానికి భారత దేశం అనబడే దేశం ౩౦౦ ఏళ్ళ ముందు వరకు లేనే లేదు , ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలన్నీ సుమారుగా, ఒకప్పుడు వేరు వేరు దేశాలే , అప్పట్లో మనలో మనం కొట్టుకోడం లో బిజీ గా ఉంది, హిమాలయాలని దాటి ఇంకోల్లతో కొట్లాట పెట్టుకోవాలని మన వాళ్లకి అనిపించలేదు , మనం శాంతి కోరే వాళ్ళమా? కొంతకాలం క్రితం వరకు వచ్చిన సినిమాలు చూస్తె తెలుస్తుంది మనం శాంతిని ఎంత కోరుకుంటామో, క్లిమాక్ష్ లో ఫైట్లు లేకపోతే ఆ సినిమా ఆడుతుందా అసలు ? ఇప్పుడు generation ఆడుతున్న video games చూస్తె తెలుస్తుంది మనం శాంతిని ఎంతగా కోరుకుంటామో ....
6. ఇది లేటెస్ట్ ..... ప్రత్యెక తెలంగాణ వస్తే , హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా వాళ్ళు అందరిని తరిమేస్తారు అని , భారతీయులు దేశం లో ఎక్కడ అయిన సరే నివసించే హక్కు ఉంది , ప్రత్యెక తెలంగాణా వస్తే ఇక్కడి తెలంగాణా ప్రజలకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడి నిర్ణయాలు ఇక్కడి ప్రజలకి తేసుకునే అధికారం ఎక్కువగా ఉంటుంది, అంతే !!! హైదరాబాద్ లో గుజరాత్ నుంచి వచ్చిన మార్వాడీలు, మరాఠీలు, మలయాళం వాళ్ళు చాలా మంది ఉన్నారు , వాళ్ళని కూడా ఎవరు తరిమేయ్యారు. తెలంగాణా ఉద్యమం మహారాష్ట్ర లో MNS తరహాలో ఏమి జరగడం లేదు , ఈ ఉద్యమం కేవలం ఉద్యోగాలు, ప్రాజెక్టులు కోసం మాత్రమే , ఆంధ్ర ప్రజల మీద కాదు . KCR ఈ విషయాన్నీ నొక్కి మరీ చెప్పారు .
ఇంటివి చాలా ఉంటాయి, వినగానే నమ్మేసి, ప్రచారం చేయకుండా, ముందు నిజాన్ని తెలుసుకుంటే మంచిది.
3 comments:
good one raa...
Sanjeev super ra....
Place the issues that are happened after independence...
@raju and raghu ...thankyou
try chesta raju rayadaniki
Post a Comment