ప్రజలు పుస్తకాలు చదవడం మానేసారు అని ...TV పుస్తకాన్ని చంపేస్తోంది అని కొంతమంది బాధ ...కానీ పుస్తకం నిజంగానే చనిపోయిందా ? కావొచ్చు !!!
చిన్నప్పటినుంచి ఏ వారపత్రిక చదివినా, ఏ పుస్తకం చదివినా దాదాపుగా పుబ్లిషేర్ అడ్రస్ రాజమండ్రి అని కాని, ఏలూరు రోడ్, విజయవాడ -2 , అని విండేది ....చాల పుస్తకాలకి అంతే ...కాని మొన్న రాజమండ్రి లో నాకు ఒక్క పుస్తకాల కొట్టు కూడా కనబడలేదు ....ప్రస్తుతం రాజమండ్రి వాళ్ళకి పుస్తకం అంటే textbook లేదా ఆధ్యాత్మిక పుస్తకం అంతే !!! నవల అన్నది కొనుక్కోవాలంటే రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి, విశాలాంధ్ర ఆ వూర్లో మూతపడిందిట , అది సంగతి !!
కాని ఈ విషయం అన్ని చోట్లా నిజం అవ్వడం లేదు , amazon.com, books.rediff.com, flipkart.com , books.indiatimes.com , books.google.com వీటిని చూస్తె పుస్తకం మంచి ఆరోగ్యంగా బ్రతికే ఉంది అని తెలుస్తుంది. kindle, sony ebook reader లాంటి ఎన్నో ebook readers ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నాయి, వీటిల్లో కొన్ని వేల పుస్తకాలూ load చేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ చదువుకోవచ్చు,....నిజంగా పుస్తకం చదవడం అనే లో అలవాటు ప్రజలకి తప్పిపోతే ఇవన్ని రావుగా? కొత్తగా వచ్చిన cell phones అన్నిటి లోను pdf-readers ఉంటున్నాయి, చాలా మంది ఇష్టపడరు కాని, కంప్యూటర్ లో చదివే అలవాటు కొంత మందికి ఉంది ( నేను చదివిన పుస్తకాలలో 70% computer లోనే చదివాను, నాకు పేజి తిప్పుతూ చదవాలంటే బద్ధకం ఎక్కువ, mouse తో scroll చేయడం తేలిక ). ప్రతి ఆదివారం, అబిడ్స్ పాత పుస్తకాలతో,పైరసీ పుస్తకాలతో, అవి కొనడానికి వచ్చే ప్రజలతో సందడిగా ఉంటుంది , చేతన్ భగత్ పుస్తకాలు ( simple language, contemporary topics, comedy and cost is always 95/- ) అసలు ఎప్పుడు పుస్తకాలు చదవని వాళ్ళ చేత కూడా చదివించాయి . ప్రస్తుతం audio books దొరుకుతున్నాయి చాలా పుస్తకాలకి , audio books ని మొబైల్ లో లోడ్ చేసుకుని , నడుచుకుంటూ వేల్తునపుడో , బస్సు లో వేల్తునపుడో కూడా ఒక book complete చేసేయొచ్చు ....ఇప్పుడు చెప్పండి ...పుస్తకం నిజంగా చనిపోయిందా ?
అవును, తెలుగు పుస్తకం పరిస్తితి అదే ...దానికి ఒక కారణం మన దగ్గర ఉన్న పుస్తకాల షాపులు ....ఒకసారి విశాలాంధ్ర వెళ్ళండి , odyssy కి వెళ్ళండి ...తేడా మీకే తెలుస్తుంది customer service లో , విశాలాంధ్ర షాపు లో ఏ పుస్తకాలు ఉన్నాయో అక్కడ పనిచేసే వారికీ కూడా సరిగ్గా తెలియదు ....షాప్ ని 7.30 కల్లా మూసేస్తారు కాబట్టి ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తూ కొనుక్కుని వెళ్ళే అవకాశం లేదు , ఆదివారం వాళ్ళకి సెలవు , ఆ రోజు కూడా కుదరదు , పోనీ english books లాగా తెలుగు books కూడా online shopping option ఉన్నా బాగుంటుంది , అది కూడా లేదు.
ఇప్పుడు తెలుగు చదవడం రాయడం చాలా మందికి రాదు అని ఒక argument, కాని దాన్లో నిజం ఎంత ఉంది, ఈనాడు, స్వాతి, ఆంధ్ర జ్యోతి, సాక్షి circulations చూడండి , ప్రజలకి తెలుగు చదవం వచ్చా రాదా అన్నది తెలుస్తుంది ....పోనీ తెలుగు చదవడం రాయడం రాకపోయినా , దాదాపుగా అందరు తెలుగు లోనే మాట్లాడుకుంటాం, తెలుగులో audio books release చేయడానికి ఏం problem ?
2 comments:
మీరు చెప్పింది సరి ఐనది కాదు అని న బావనా మనదేశం లో కూడా ఇంకా పుస్తకాలు పట్టుకొని చదువుతున్నారు
నేను బ్రిటన్ లో ఉండి వోచ్చినాను అక్కడి దేశం వాళ్ళు ఇంకా పుస్తకాలు చదువుతారు
Telugu News
naa point kooda adenandi....importance taggutondi telugu pustakaniki matrame....migatavatiki koodu
Post a Comment