అన్ని ఉద్యమాలలో జరిగినట్టే, తెలంగాణా ఉద్యమం లో కూడా కాస్త అతి అనేది జరుగుతూ ఉంది ….నేను ప్రత్యెక తెలంగాణా ని ఆమోదిస్తున్నాను and సమర్దిస్తున్నాను ( నా orkut or facebook profile చదివిన వాళ్ళందరికి ఆ సంగతి తెలుసు) కాని, అతి ప్రవర్తన అనేది ఎప్పుడు చిరగ్గానే ఉంటుంది …
September 17 తెలంగాణా విమోచన దినోత్సవం కి కొద్ది రోజులు ముందుగ campus లో పోస్టర్స్ అంటించారు “తెలంగాణా విమోచనమా? విద్రోహమా? “ అని, ఆ పోస్టర్ రాసిన రచయిత ప్రకారం, అసలు నిజాం పాలన నుంచి తెలంగాణా india లో కలవడమే ఒక పెద్ద తప్పిదంట , india లో కలవగానే తెలంగాణా ప్రజలందరూ “గొర్రెలు పోయే, బర్రెలు వచ్చే” అనుకున్నారట …india లో కలిసిన్దగ్గర నుంచే తెలంగాణా కస్టాలు మొదలయ్యయిత….అంటే నిజం పాలనలో, ఆ దొరతనం లోనే ప్రజలు సుఖంగా ఉన్నరనా ? ప్రత్యెక తెలంగాణా ఉద్యమం అంటే తెలంగాణా ఒక ప్రత్యెక రాష్ట్రము కోసం ఉద్యమం అనుకున్నాడ లేక తెలంగాణా ఒక ప్రత్యెక దేశం అనుకున్నాడా ? రచయిత నిజాం వంశానికి చెందినా వాదాన్న అయి ఉండాలి, లేదా తెలంగాణా లో దొరతనం కోల్పోయిన కుటుంబానికి చెందినా వాడు అయి ఉండాలి అని నా వూహ …
అసలు ప్రత్యక తెలంగాణా ఉద్యమం అంటే భారతదేశం లోంచి విడిపోవడం అన్న feeling ఆంధ్ర వాళ్ళు తీసుకువచ్చారు ….తెలంగాణా ఉద్యమం మొదలవ్వగానే, ఉద్యమానికి వ్యతిరేకంగా సమైక్య ఆంధ్ర కోసం అని “devided we fall, jai india” అంటూ నినాదాలు ఇచ్చారు అసలు నినాదం లో india ఎందుకు వచ్చింది ? , తెలంగాణా ఉద్యమం కాశ్మీర్ ఉద్యమం లాంటిది కాదు, confustion లో ఉన్నవాల్లకోసం మరోసారి “మాకు తెలంగాణా రాష్ట్రము కావాలి, తెలంగాణా దేశం కాదు”
తెలంగాణా ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో ఆంధ్ర నాయకులూ కొంతమంది ఒక పిచ్చి argument తీసారు , ప్రత్యెక తెలంగాణా వస్తే, మళ్ళి నిజాం పాలన తీసుకువస్తారా అని? ఇది ఒక చెత్త argument అని చెప్పడానికి explanation కూడా అవసరం లేదు కదా
ఇక ఆత్మహత్యల పర్వం సాగింది , యువకులకి ఏమొచ్చిందో తెలియదు కాని, ఉద్యమం కోసం బలిదానం పేరుతో ఆత్మహత్యలు చేసుకోడం మొదలు పెట్టారు, ఆత్మహత్యలు చేసుకున్నవారిని తెలంగాణా వీరులుగా చిత్రీకరించడం జరిగింది, ఒక విద్యార్థి దేవతకి మొక్కుగా ఆత్మహత్య చేసుకోడం దుమారం లేపింది, అప్పటికి నాయకులూ , JAC కళ్ళు తెరిచారు, తెలంగాణా ఉద్యమం లోనే అందరు చనిపోతే తెలంగాణా రాష్ట్రము లో ఎవరు ఉంటారు అని ? మొత్తానికి ఆత్మహత్యలు ఆగాయి , లేకపోతే ప్రత్యెక తెలంగాణా రాష్ట్రము లో ఉద్యోగం చేయడానికి యువత ఉండేది కాదు, మళ్ళి పక్క రాష్ట్రము నుంచి ఆంధ్ర వాలు ఉద్యోగం కోసం వచ్చి ఉండే వాళ్ళు !!!
ఉద్యమం అనేది అదుపు తప్పి హింసాత్మక సంఘటనలు జరగడం అనేది ప్రతి ఉద్యమం లో గమనిస్తూ ఉన్నదే ….అలానే తెలంగాణా ఉద్యమం లో తెలంగాణా రావాలి అని ఇక్కడ బస్సులు తగలబెట్టడం జరిగింది, పోటి పది ఆంధ్రా ప్రజలు అక్కడ కూడా బస్సులు తగలబెట్టి బంద్ పాటించారు, ఇక్కడ బస్సులు తగలబెట్టడం లో అర్థం ఉంది …..అక్కడ ఎందుకు తగలబెట్టారు , ఏమి వస్తుందని తగలబెట్టారు అనేది గమనించాల్సిన విషయం .
లగడపాటి అతి ప్రవర్తన గురించి చెప్పక్కర్లేదు, అందరికి తెలిసిందే అది ..
latest అతి ప్రవర్తన O.U లో పొట్టి శ్రీరాములు బొమ్మని తగలపెట్టడం , అసలు తెలంగాణా ఆంధ్రా లో కలిసినపుడు అయన బ్రతికి కూడా లేడు, మద్రాస్ presidency నుంచి ఆంధ్రా విదిపోవాలనేది అయన ఉద్యమ లక్ష్యం ….తెలంగాణా కి ఏదో చెడు చెయ్యడం కాదు , తెలుగు వాళ్ళందరూ ఒక్క రాష్ట్రంగా ఉండాలి అనేది, అప్పటి ఇరువైపులా నాయకులూ అంగీకరించిందే…..కాని కలిసి ఉండటం కన్నా విదిపోతేనే అభివృద్ధి ఉంటుంది అనే నమ్మకం తో మొదలయింది తెలంగాణా ఉద్యమం , ఈ ఉద్యమం లో అయన విగ్రహాలు తగలబెట్టడం అనవసరం , పెట్రోల్ దండగ .
3 comments:
hey you are superb.
every one should read and follow your blog.
కోరుకునేది అభివృద్ధి, కావాల్సింది తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర సాధన, దానికోసం కావాల్సింది ప్రాణ త్యాగాలు కాదు, అవతలి వారి పై దుమ్మెత్తి పోయడాలు అంత కన్నా కాదు..
తెలంగాణాకి ఎవరు అన్యాయం చేయలేదు, ఒక వేళ చేసారు అనుకున్నా ప్రస్తుతం మనకది అప్రస్తుతం..
చాలా తప్పులు జరిగాయి.. అభివృద్ధి ఆగిపోయింది..
ఎవరో కావాలని దానిని ఆపింది కాదు..
మనం పట్టించుకోలేదు..
ఇప్పుడు పట్టించుకున్తున్నాం...
సమైక్యంగా ఉన్నప్పుడే కావాలనుకున్నాం..
తెలంగాణా నాయకులకు కూడ అవకాశమిచ్చాం..
వారు స్వార్తంగానే ప్రవర్తించారు...
ఇప్పుడు తెలంగాణా కావాలనుకునే కాన్సెప్ట్ లొ ఆంధ్ర వాళ్ళను తిట్టుకోవదమనేది లేదు..
తెలంగాణా నాయకులను పొగిడేది లేదు...
కావాల్సింది ప్రత్యేక రాష్ట్రం..
Just Telangana should be separated
We have learned a lot, daffinately we implement, we select good leader, will be moving on.
thankyou :)
"అసలు ప్రత్యక తెలంగాణా ఉద్యమం అంటే భారతదేశం లోంచి విడిపోవడం అన్న ఫీలింగ్ ఆంధ్ర వాళ్ళు తీసుకువచ్చారు ….తెలంగాణా ఉద్యమం మొదలవ్వగానే, ఉద్యమానికి వ్యతిరేకంగా సమైక్య ఆంధ్ర కోసం అని “దెవిదెద్ వె ఫల్ల్, జై ఇందీ” అంటూ నినాదాలు ఇచ్చారు అసలు నినాదం లో ఇందీ ఎందుకు వచ్చింది ? , తెలంగాణా ఉద్యమం కాశ్మీర్ ఉద్యమం లాంటిది కాదు, చొంఫుస్తిఒన్ లో ఉన్నవాల్లకోసం మరోసారి “మాకు తెలంగాణా రాష్ట్రము కావాలి, తెలంగాణా దేశం కాదు”
నిజానికీపరిస్థితిరావడానికి మూలాలు "నరుకుతం, చంపుతం, రోకట్ల దంచుతం, తరిమికొడతం" లలో వున్నాయనుకుంటాను. మొత్తానికి ఇరువైపులవాళ్ళూ అతి చాలానే చేశారు. ఈ Jal చెప్పినదాన్ని ఉద్యమ నాయకులు మొదటినుంచీ పాటుంచుంటే (అంటే ఈనాటికీ కొందరు రెచ్చగొట్టేలా ప్రకటనలుచేస్తున్నారు), ఇటు సీమాంధ్ర వైపునుంచికూడా ప్రకటనలు, "సంఖ్యాబలం మాదే" తరహా బాధ్యతారహితమైన వాగుడు లేకుండా వుండాల్సింది. మేధావుల అండతో నడిచుంటే బాగుండెదనిపిస్తుంది.
Post a Comment