తెలుగు లలిత కళా తోరణం పేరు మర్చి రాజీవ్ లలిత కళా తోరణం గా పేరు మార్చాలని ఒక ప్రతిపాదన వచ్చింది …కాంగ్రెస్ పార్టీ కి ఇది అలవాటే , అధిష్టానం ద్రుష్టి ఆకర్షించాలి అంటే , రాజీవ్ గాంధీ పేరు మీదనో, ఇందిరా గాంధీ పేరు మీదనో ఏదో ఒకటి చెయ్యడం. అలా దేశం మొత్తం మీద నెహ్రు, మహత్మా గాంధీ విగ్రహలకన్నా ఇందిరా గాంధీ , రాజీవ్ గాంధీ విగ్రహాలు ఎక్కువయ్యాయి,
భవిష్యత్తులో కాంగ్రెస్ చేపట్టే కార్యక్రమాల పేర్లు ఇలా .ఉండచ్చేమో !!
1. పుట్టిన మగబిద్దకి రాజీవ్ అనీ, అమ్మాయికి ఇందిరా అని పేరుపెడితే వారికి ఇటలీ లో చదువు ఉచితంగా చెప్పించాబడుతుంది .
2. అచ్చు ఇందిరా గాంధీకి ఉన్నట్టు జుట్టు నెరిసిన వృద్ధులకి ఉచిత వైద్య సదుపాయం
3. కరెన్సీ నోట్ల మీద మహాత్మా గాంధీ బొమ్మ బదులు ఇందిరా గాంధీ బొమ్మ ఉండాలి
4,బంగాళా ఖాతం పేరు మర్చి రాజీవ్ సముద్రం చేయాలి
5. హిందూ మహాసముద్రం, ఇందిరా మహాసముద్రం గా పిలవబడాలి
6. తే.రా.స , కాంగ్రెస్ కలిసున్న కాలం లో కే.సి.ఆర్ గారు, సోనియా గాంధీ తెలంగణా దేవత అని సేల్వచ్చారు ….కాబట్టి సోనియా జాతర కూడా జరపబడాలి .
7. తమ రాష్ట్రం పేరును ఇందిరా రాష్ట్రము గానో, రాజీవ్ రాష్ట్రము గానో మార్చుకున్న రాష్ట్రానికి ఎక్కువ నిధులు అందించాబడతాయి .
etc etc…
No comments:
Post a Comment