అవును మన సంస్కృతి సంప్రదాయాలు నాశనం అయిపోతున్నాయి ….. పరాయి దేశాల ప్రభావం మనం మీద ఎక్కువ అవుతోంది….ఎంతో గోప్పవయిన మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలని మనం కాపాడుకోవాలంటే మనం కొన్ని పనులు చెయ్యాలి …
1. ఆంగ్లం, తెలుగు కాకుండా సంస్కృతం నేర్పించాలి,
2. ఈ పాంట్లు మానేసి ఊడిపోతున్న సరే పంచ కట్టుకుని తిరగాలి ….అలాగే ఆడవాళ్లు కాళ్ళకి అడ్డం పడుతున్నా సరే ఎంత ఇబ్బందిగా ఉన్న సరే చీరలు, లంగా ఓణి ధరించాలి
3. పంతుళ్ళు అందరు పిలకలతోనే ఉండాలి , schools, universities తీసేసి గురుకుల వ్యవస్థ ని మళ్ళి మొదలు పెట్టాలి ….గురువు గారి ఇంట్లో వంట పని, ఇంటి పని చేసుకుంటూ చక్కగా చదువుకోవచ్చును .
4. సినిమాలు తీసేసి , నాటకానికి ప్రాముఖ్యత ఇవ్వాలి, అందులోను సాగాదీసి పాడే పద్యాలూ ఉన్న వాటికీ ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి
5. ఆడపిల్లల చదువు మానిపిచ్చేసి, ఇంట్లో కూర్చోబెట్టాలి ….నిరుద్యోగ సమస్య కొంత తీరుతుంది ….ఆడవాళ్ళూ చదువుకోవడం వల్ల ఏంటేంటో అభ్యుదయభావాలు , స్త్రీ స్వేచ్చ అవి ఇవి అంటున్నారు ….కాస్త గోల తగ్గుతుంది ….ముఖ్యంగా అరుంధతీ రాయ్ గోల ఉండేది కాదు !!
6. సతి వ్యవస్థని పునురుద్దీకరించాలి …భర్త పోతే భార్యని చితి మీద తోసేయ్యాలి, ఒక్క దెబ్బకి రెండు పిట్టలు …..జనాభా తగ్గుతుంది !
7. ఆంగ్లేయులు తెచ్చిన ఈ మోటర్ వాహనాలు వొద్దు , రోడ్ మీద పేడ వేస్తూ , నెమ్మదిగా వెళ్ళే ఎడ్లబండి ని వాడాలీ , రోడ్ ప్రమాదాలు తక్కువ అవుతాయి .
8. అలాగే ఎలెక్ట్రిక్ బుల్బులకి బదులు లాంతరులు, ఫ్యాన్ల బదులు తాటాకు విసినకర్రలు వాడాలి ….మన పూర్వీకులు అవే వాడేవారు !!
9. పసరు వైద్యం , ఆయుర్వేదానికి ప్రాముఖ్యత ఇవ్వాలి , ఈ టానిక్ ల కన్నా గోమూత్రం మంచిదిట (RSS వాళ్ళు చెప్పారు )
10. తెల్ల వాడు కనిపెట్టిన ఈ కంప్యూటర్స్ అవి వొద్దు, చక్కగా తాటాకుల మీద రాసుకుందాం,
11. ఈ బూట్ల కన్నా కిర్రు కిర్రు అని చప్పుడు చేసే పాదుకలు చాల బెటర్
12, అలాగే అయిదు రోజులు పెళ్ళిళ్ళు జరిపించాలి, మరీ 6 గంటలలో పెళ్లి కానిచ్చేస్తున్నారు, వచ్చినవాళ్లు తినేసి వెళ్లడం మీద ద్రుష్టి ఎక్కువ పెడుతున్నారు
13. నిన్ను నువ్వు నమ్ముకో, నీ భవిష్యత్తు నీ చేతిల్లో ఉంది , if there is a will there is a way…లాంటి తెల్లవాడి దగ్గర నుంచి personality development పేరుతొ తెచ్చుకున్న సొల్లు ని అంతం చెయ్యాలి….. నీ చేతిల్లో ఏమి లేదు , నీ ఖర్మ ఇంతే ….అని చెప్పే మన వేదాంతాన్ని పునరుద్దీకరించాలి.
ఇంకేమన్నా మంచి సలహాలు ఉంటె ఇవ్వండి, RSS వాళ్ళకి, ఇంకా ముసలి వాళ్ళకి చెబుతాను…ఆనందిస్తారు.
No comments:
Post a Comment