Tuesday, December 28, 2010

50 !!

15 సంవత్సరాలలో 51 సార్లు రక్తదానం చేయడం గురించి విన్నారా ? నేను ఆ మనిషిని కలిసాను కూడా…అతని పేరు రాధాకృష్ణ.

1993 లో అతనికి accident అయ్యిందిట ….అప్పుడు రక్తం బాగా పోయి …చాలా కష్టం అయిందిట ఆటను బ్రతకడమే …so ఈయన 1995 నుంచి రక్తదానం చెయ్యడం మొదలుపెట్టారు …హైదరాబాద్ లో రక్తదాన శిబిరాలు బాగా నిర్వహించారు …హైదరాబాద్ లో ఏ బ్లడ్ బ్యాంకు లోకి అయినా ఈయనకి ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది …technicians అందరికి ఈయన తెలుసు ( ఆయనకి ఇచ్చే special treatment నేను స్వయంగా చూసా ) …మొదటిసారి ఈయనని కలిసినపుడు ఈయన గురించి తెలుసుకుని నా friend కూడా రక్తదానం అప్పటినుంచే మొదలుపెట్టాడు …..blood donation మీద ఎమన్నా doubts , భయాలు ఉంటె…ఈయనతో మాట్లాడితే చాలు….ఓపిగ్గా చెప్తారు …ఈయన దగ్గరే ఒక మంచి database ఉంది blood doners గురించి …ఎవరికీ అవసరం అయినా…ఆ blood group ఎవరికిన ఉంటె ఈయనే call చేసి అడుగుతారు …patient relatives కి మంచి సపోర్ట్ ….ఈయని అడిగితే చాలు …మిగతా విషయాలు ఆయనే చూసుకుంటారు….doners కి moral support గా అక్కడే కూర్చోంటారు….ఈయన సొంత ఖర్చులతో విజయవాడకి doners ని తీసుకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి Smile

సచిన్ టెండూల్కర్ 50 సార్లు సెంచురీలు కొట్టాడని  భారతరత్న ఇచ్చేద్దామని ప్రజలు గోల మొదలు పెట్టారు ….ఈయన ఆ 50 ని దాటేసారు మరి !!!

ఒకవేళ మీకు రక్తదానం చేయాలని కుతూహలంగా ఉండి , ఎక్కువగా చేసే అవకాశం రాలేదని అనిపిస్తుంటే….మీరు హైదరాబాద్ లోనే ఉంటే కనుక ...ఈయనకి ఒకసారి కాల్ చేసి చెప్పండి…మీ బ్లడ్ గ్రూప్ అవసరం రాగానే ఆయనే మీకు కాల్ చేసి పిలుస్తారు …రాధాకృష్ణ గారి నెంబర్ 9866676530,

మీకు రక్తదానం గురించి ఇంకా information కావాలంటే …ఈ లింక్ చూడండి …

http://dare2questionnow.blogspot.com/2010/12/pl.html

No comments: