Wednesday, February 02, 2011

సీ గాన పెస్సూనాంబగారికు,

 

సీ గాన పెస్సూనాంబగారికు ,

ఇది లౌ లేటరు రాస్తున్ననన్నామాట . బాబాయి ఇచ్చిరా అంటే రెండు జేల్ల సీతకి ఇచ్చానే అలాంటిదన్నమాట . బాబాయి కి కూడా కొంచం రాయటం వచ్చనుకో. నేను వచ్చినంత కాదనుకో, అయినా నేనేం చిన్న వాడినా! లేకపోతే చితకవాడినా !

నీ కసలెం రాదుకదా ! నీకు బాహా రావటం కోసం కుంచెం కుంచెం రాస్తాను. లేకపోతే బోలెడు ఇంకా చాలా రాసేయగాలను.

లౌ లేటరు అంటే ప్రేమించుకోవడంట . బాబాయి చెప్పాడు. నాకు తెలియదు అనుకో.

బామ్మ రామకోటి రాస్తుంది. ఏమి తోచక, బాబాయి లౌ లేతరులు రాస్తాడు. బాబాయికి పని దొరకలేదుట కదా . ఇలా అని నాన్న అన్నాడు. అయిన పని దొరుకుతున్దేమితి? గోళీలు అయితే దొరుకుతాయి గాని,

బామ్మ బొత్తిగా మతి మరుపుమనిషి . అట్లా అని బామ్మే అంటుంది.అంటే మనం ఆకులు బొత్తిగా పెడటమే అట్టా అన్నమాట. మర్చిపోకుండా రాసిన మాటే సాయంకాలం దాకా రాసుకుంటుంది.అందుకని రామకోటి అంటారు దాన్ని.

ఆమ్మ ఏమి రాయదు . అమ్మకి పాపం గుడిన్తాలు కూడా రావు. అందుకని రోజు నాన్న తలకి బొబ్బర్నూనే రాస్తుంది. నేను ఒద్దన్న “ఉహు “ వినదు. ప్రైవేటు చెప్పి అయినా రాస్తుంది. పాపం చదువు రాదుకదా అందుకని నేను వూరుకుంటాను .

ప్రేమ గుడ్డిదని బాబాయి చెప్పాడు. బామ్మ కళ్ళజోడు నేను పెట్టుకునేటప్పుడు తీసికెళ్ళి పోతానే అప్పుడు బామ్మ గుడ్డిది అయిపోతుంది కదా అట్టాంటి దాన్నమాట. మనం ప్రేమించుకోనకపోతే నారాయణ కొట్టు దారి కూడా గుడ్డి అవుతుంది.

బాబాయి కాయితాల మీద రాస్తాదనుకో ! నేను పలక మీద గుండ్రంగా రాయాలిత. ప్రేమించుకునే వుత్తరాలు టీసుకోరత. ప్రేమంటే అచ్చంగా ఇంచ్చేయడంట .

ఇహ ప్రైవేటు మాస్టారు వచ్చినా పలక ఉండదన్న మాట. నువ్వు అవకతవకగా రాసి నా పలక ఇచ్చేకూడదు సిన్మాలోలాగా త్యాగం ఇచ్చేయడం అన్నమాట.

(పలక రెండు వైపులా నిండిపోయిన్దోచ్)

**** బుడుగు సీ గానపెసూనాంబ కి రాసే ప్రేమ లేఖ ఇలా ఉంటుంది అని శ్రీ రమణ వూహ . అయన పుస్తకం లోంచే ఇది.

5 comments:

Sudha Rani Pantula said...

హారి బుడుగూ,
ఇదంతా ఆ రమణ చెబితే రాసేవనుకున్నాను.ఈ రమణ బాబు దగ్గర్నుంచి ఎత్తుకొచ్చిన ఉత్తరమా.బావుందిలే.అల్లప్పుడు కూడా నువ్విలాగే చేసావుగా.
పక్కింటావిడ చేసిన టిఫిన్ తీసుకొచ్చి..పక్కింటిపిన్నిగారు ఇచ్చారే .ఇంకా ఆవిడకి తెలీదనుకో...అన్నావుగా.
పాపం ఈ శ్రీ రమణగారికింకా తెలీదన్నమాట..

Anonymous said...

adbhutamga rasaru.aayi adenandi ikkada post chesaru.mullapudi vari budugu andulo seeganapesunambaku
andulo love letter ..oho..mattaramga undi

tankman said...

@సుధ ...అవును, నాకిచ్చిన సంగతి శ్రీ రమణ కి ఇంకా తెలియదు, అయినా ప్రతీదీ పెద్దవాళ్ళకి చెప్పి చెయ్యడానికి నేనేమన్నా చిన్నవాడినా , చితకవాడినా?

@శ్రుతి .. thankyou :)

Sudha Rani Pantula said...

బురుగూ...మలేమోనే..నీకు పిచిక భాష,చిక భాష, కభాష బోల్డు భాషలొచ్చు కదా..తెలుగు భాష రాదేం...నువ్విచ్చిన ఈ ఉత్తరంలో అన్నీ తప్పులున్నాయిట.పలక మీద హోంవర్కు చెయ్యమని చెప్తే ఉత్తరం రాసావని,నీకు, ఆ బెత్తం తోనే మీ బాబాయికి ప్రెవేటు చెప్పేస్తానన్నాడు మానాన్న.మలేం చేత్తావ్...ఇట్లు సీగాన పెసూనాంబ.

tankman said...

@sudha ...పలక మీ నాన్నకి చూపించావా? జాటర్ డమాల్ !!