ఈ వారం అంతా ఎక్కువ సేపు తెలుగు బ్లాగ్స్ చదువుతూ గడిపాను. చాలా మంది రాస్తున్నారు, చాలా రాస్తున్నారు.
కాని అది కాదు అసలు విషయం. తెలుగు బ్లాగర్లంతా కలిసి blogspot.com, wordpress.com లని ఒక social networking site స్థాయికి తీసుకువెళ్ళారు. గ్రూపులు కట్టేశారు.. Orkut లో , facebook లో fake accounts లాగా ఇక్కడ fake bloggers కూడా ఉన్నారు. అంటే ఒకడే బ్లాగర్ నాలుగయిదు ప్రోఫైల్స్ తో ఒక 8 or 9 బ్లాగులు నడుపుతుంటాడు. ఆ కుంభకోణం ఈ మధ్యే బయటపడినట్టుంది….చాలా చర్చ సాగుతోంది ప్రస్తుతం.
ఎవరో ప్రియ ట, గీతాచార్య ట , …మధ్యలో ఆ ప్రియ చచ్చిపోయిందిట …..దీన్లో ఏమి నిజం లేదు అని కొందరు blog-detectives కనిపెట్టాకా, ప్రియదయ్యం పేరుతో ఇంకో బ్లాగ్ స్టార్ట్ అయింది…ఆ ప్రియ చచ్చి ఎలా నరకనికిపోయిందో వివరిస్తూ….మొదట్లో ఈ గోలంతా కుతూహలంగా అనిపించింది కాని తర్వాత బోర్ కొట్టింది…ఇక లైట్ తీసుకున్న…
ఎక్కువ శాతం బ్లాగ్స్ లో కవితలు, కథలు, సొంత అనుభవాలు ఉన్నాయి. కొన్ని బ్లాగ్స్ లో తెలుగు మూవీ గాసిప్స్ పొందుపరుస్తున్నారు…రాజాకీయాల మీద చాలా బ్లాగ్స్ ఉన్నాయి…
ఇక కొంతమంది గ్రూప్ బ్లాగర్లు ఉన్నారు…..అంటే వీరంతా ఒకే రకమైన ఆలోచనా ధోరణి ఉన్నవాళ్ళు, వీళ్ళ బ్లాగ్స్ ఎక్కువగా మతం మీదనో, తెలంగాణా విప్లవం మీదనో, జగన్ మీదనో ఉంటున్నాయి. ఈ గ్రూప్ లో అందరి బ్లాగ్ పోస్ట్స్ ఇంచుమించు ఒకే టాపిక్ కవర్ చేస్తాయి. ఆ టాపిక్ కి ఎవరైనా వ్యతిరేకంగా కామెంట్ పెడితే ..గ్రూప్ మొత్తం గా దాడి చేస్తుంది….కించపరిచే వాఖ్యలు , అప్పుడప్పుడు బెదిరింపులు కూడా వస్తుంటాయి.. బూతులు ఎక్కువగా Anonymous గా కామెంట్ చేయబడతాయి.
ఒక బ్లాగ్ లో అయితే ఆ బ్లాగ్ ఓనర్, ఇంకో బ్లాగ్ ఓనర్ వాదించుకున్న personal emails కూడా పెట్టారు.
మొత్తానికి తెలుగు బ్లాగులు మటుకు మస్తున్నాయి, టీవీ సేరియల్స్ దగ్గరనుంచి , ఫోటోగ్రఫి, తత్వం, వంటల మీద దాకా అన్ని రకాల బ్లాగ్స్ ఉన్నాయి.
11 comments:
ఈ టపా కి ఏమి అని స్పందించాలో తెలియట్లేదు రాజా
ఏమైనా తెలుగు లో కూడా బ్లాగులు వస్తున్నై సంతోషం కదా
santoshamenandi...chaalaa diversified gaa rastunnaru, reading them is a pleasure :)
good summary :)
గీతాచార్యకి నేను ఫోన్ చేశాను. బ్లాగుల్లో చాలా మందికి దూప్లికేట్ ఐడీలు ఉన్నాయని, తాను వాళ్లలో కేవలం ఒకడినినని ఆయన సమాధానం చెప్పాడు. 'ప్రియ దెయ్యంగారు' అనే బ్లాగ్ పెట్టి ఒక వ్యక్తిని అంతలా తిట్టడం బాగాలేదు. దొరకకుండా నటించేవాళ్లు చాలా మంది ఉన్నారు. అలా నటించిన రాము గారి వాయిస్‌ని ఫోన్ నుంచి రికార్డింగ్ చేశాను.
@కొత్తపాళీ.... thankyou
@praveen ... ooh, i didnt know that update, anyway thanks for the comment :)
oka vishayanni mukkalu mukkalu gaa kaakundaa 'total' gaa oke drusti to gamaninchi nuvvu analyse chese teeru baaguntundi. keep it up. ee vishleshana baagundi....
@subhashini ... thankyou
appudeppudo tapassu deni gurinchi chesav...phalinchindaa?ani adigaa.. answer cheppaledu...
@subhashini ....ooh sorry, sarigga chooskoledu, naa pic sarigga ravali ani tapassu modaletta appatlo...adi sangati
>>>ఆ టాపిక్ కి ఎవరైనా వ్యతిరేకంగా కామెంట్ పెడితే ..గ్రూప్ మొత్తం గా దాడి చేస్తుంది….కించపరిచే వాఖ్యలు , అప్పుడప్పుడు బెదిరింపులు కూడా వస్తుంటాయి..
-------
మీరు ఎవరిని అంటున్నారు ?
మా మలకన్న టీం నా ?
@సంకలిని.... రెండు గ్రూపులు ఉన్నాయన్న విషయం కొన్ని బ్లాగ్స్ చదివితే అర్థం అయిందండీ. కానీ ఎవరు ఏ గ్రూప్ లో ఉన్నారో కూడా ఇంకా నాకు క్లారిటీ లేదు ..బ్లాగ్స్ లో కామెంట్స్ ని బట్టి నేను జనరల్ గా చెప్పాను కానీ ...ఫలానా గ్రూపు ని ఉద్దేశించి చెప్పింది కాదు,చాలా వరకు కామెంట్స్ anonymous గా పోస్ట్ చేయడం వల్ల, confusion ఎక్కువయింది.
Post a Comment