Thursday, February 10, 2011

మనవాళ్ళు ఉత్త వెధవలోయ్

భారతదేశం లో కొంతమందికి  భారతదేశం ఉన్న పరిస్తితిని తిట్టుకోవడం ఎక్కువ. అది ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కోసారి భారతదేశ భవిష్యత్తు మీద ఆశ పోతుంది.
ఇండియా గెలవడం కష్టం.
ఈ వ్యవస్థ కుళ్ళిపోయింది
ఈ దేశం ఇక బాగుపడదు
we don’t deserve democracy , dictatorship is right for us.
ఇండియన్స్ కి అంత సీన్ ఉందా?
ఇలాంటి నిరాశ పరిచే statements బోలెడు చెబుతారు  నిరాశావాదులు

కొంతమంది ఉంటారు ….వీరికి రాజకీయాలు పెద్దగా తెలియవు…పాటల ప్రోగ్రామ్స్ మధ్యలో చానల్స్ మారుస్తూ మారుస్తూ ఏదో ఒక సెకండు న్యూస్ చూస్తారు, లేదా పేపర్ లో స్పోర్ట్స్ పేజి కి వెళ్తూ వెళ్తూ పొరపాటున మెయిన్ పేజి లో ఏదో స్కాం అనో, లేక లంచం అనో ఏవో అలంటి పదాలు చూస్తారు, సాయంత్రం స్నేహితలుతో మాత్రం ఈ దేశం పాడయిపోయింది మామా …ప్రత్రీ రాజకీయనాయకుడు ఒక దొంగే ….ఇలాంటి కబుర్లు వస్తాయన్నమాట …వీళ్లో రకం..

ఇక RSS వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రతి సమస్య కి పరిష్కార మార్గం హిందువులంతా ఒకటయ్యి ముస్లిమ్స్ ని , క్రిస్త్రియన్స్ ని ఇండియా లోంచి తరిమేయ్యడం …ఏ సమస్య అయినాసరే క్రిస్టియన్ మిషనరీస్ వల్లనే వస్తోంది…హిందూ మతం ని నాశనం చేయడానికి వాటికన్ సిటీ డబ్బులు పంపిస్తోంది….మన ఖర్మ కాలి, వాటికని సిటీ ఇటలీ లో ఉండటం, రాజీవ్ గాంధీకి ఒక ఇటలీ అమ్మాయి నచ్చడం…తర్వాత కాంగ్రెస్ వాళ్ళు సోనియాగాంధి నాయకత్వం కోరడం…..దీనికి పై పెచ్చు మన పాత ముఖ్యమంత్రి YSR ఒక క్రిస్టియన్ కావడం ….అసలు కేంద్రం లోను రాష్ట్రము లోను క్రిస్టియన్ పాలన నడుస్తోంది అన్న వాదన విని విని చెవులు వాచిపోయాయి.

ఇంకో వర్గం ఉంది….వీళ్ళు కూడా దేశం నాశనం అయిపోతుందనే నమ్ముతారు….నాశనం అయిపోడానికి కారణం మటుకు మన సంస్కృతీ సంప్రదాయాలని మనం మర్చిపోవడం కారణంగా చెప్తారు…..కులాంతర వివాహాలు, ఆడవాళ్ళు  ఉద్యోగాలు చేయడం , పిల్లలు పరాయి దేశాలలో చదువుకుని అక్కడి పడమటి సంస్కృతిని ఇక్కడకి తీసుకువస్తున్నారని, ఈ మదర్స్ డే , లవర్స్ డే లాంటివి జరుపుకుంటూ , ప్రేమ పేరుతో వెధవ వేషాలు వేస్తూ, తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వకుండా కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటూ హిందూ సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని …మన దేశం నాశనం అయిపోడానికి గల కారణాలలో సినిమాలు కూడా ఉన్నాయి అని వీరు గట్టిగా నమ్ముతారు.ఇప్పుడు వస్తున్నా సినిమాలలో బట్టలు విప్పి చూపడం తప్ప ఏముంది చెప్పు అంటూ !! ( వీళ్ళు మాత్రం జయ మాలిని, జయ చిత్ర డాన్సులు చూసిన్వల్లె, రాజ్కపూర్ మూవీస్ ని తెగ మెచ్చుకున్న వాళ్ళే …జయమాలిని వాళ్ళతో పోలిస్తే ఇప్పటి ఐటెంసాంగ్ లో డాన్స్ చాలా బాగుంటుంది. వాళ్ళ లాగా వెకిలి డాన్సులు కావు ) ఇంట్లో పొద్దున్న లేచినదగ్గర నుంచి భక్తీ టీవీ పెట్టేసి, తర్వాత మంతెన సత్యనారాయణ రాజు ప్రోగ్రాం ఫాలో అవుతారు usual గా ఈ గ్యాంగ్ అంతా ..

తొందరగాళ్ళు ……వీళ్ళకి అన్నిటికి తొందరేక్కువే ..అసలు మన దేశం ఎందుకు తొందరగా డెవలప్ అవ్వడం లేదు అని వీళ్ళ బాధ, ..ఎమన్నా అంటే …నేను చిన్నప్పుడు చదువుకున్నాను భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని …ఇప్పటికి అదే అంటున్నారు ….
ఈ దేశం ఎప్పటికి అభివుద్ది చెందుతుంది….అమెరికా చూడండి , ఇంగ్లాండ్ చూడండి అంటూ వాదిస్తారు. ఒక మనిషి కాని , ఒక దేశం కాని అభివృద్ధి చెందాలంటే ముందుగా కావలసింది స్వతంత్రం. ఒక బానిస ఎప్పుడు శిఖరాగ్రాలని అందుకోలేడు. అలాగే పరాయి పాలన లో ఉన్న ఒక దేశం కూడా అభివృద్ధి చెందలేదు. అమెరికా కి స్వతంత్రం వచ్చి 234 సంవత్సరాలు అయింది , ఇంగ్లాండ్ కాని , ఫ్రాన్స్ కాని, చైనా కాని ఎప్పుడు పరాయి పాలన లో లేవు ..మరి మన దేశం ? ఈ వచ్చే అగుస్ట్ కి మన దేశం వయసు 64సంవత్సరాలు మాత్రమె. 200 ఏళ్ళు పరాయి పాలనలో దోచబడిన దేశం , 64 సంవత్సరాలలో , 234 సంవత్సరాలు వయసున్న దేశం తో పోల్చి తిట్టడం ఎమన్నా బాగుందా? ఇంత పెద్ద దేశం, ఇన్ని రకాల బాషలు, మతాలూ, సంస్కృతులతో …ఇంకా ఒక పక్క కాశ్మీర్ , అస్సాం వాళ్ళు మాది భారతదేశం కాదు అని గోల పెడుతున్న, ఈ దేశం ఇంకా ఒక్కటిగా ఉంది ఇంత అభివృద్ధి సాధించింది. అది చిన్న విషయం అని నేను అనుకోవడం లేదు.

సంపాదకులు …..వీళ్ళతో అసలు సమస్య అంతా . వార్తలని ఎలా పేపర్ లో ‘ సర్డుతారు ‘ అంటే …బస్సు దోపిడీ మొదటి పేజి లో ఉంటుంది ….పోలీసులు RDX పట్టుకున్న సంగతి 8 వ పేజి లో ఉంటుంది . ఒక నక్సల్ చనిపోతే ఆ శవం ఫోటో మొదటి పేజి లో పడుతుంది….. ఇంకో బూటకపు ఎన్కౌంటర్ అంటూ, అదే ఒక నక్సల్ దాడి లో పది మంది పోలీసులు చనిపోతే అది 4 వ పేజి లో చిన్న డబ్బాలో ఉంటుంది. ఎన్నో సార్లు హైదరాబాద్ లో వినాయకచవితికి ముందు మందుపాతరలు పట్టుకోవడం జరిగింది, అది ఎప్పుడు మొదటి పేజి లో పడదు. బెదిరింపులు ఉన్నా నక్సల్ ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ల గురించి జిల్లా edition లో మాత్రమే పడుతుంది. లోక్ సభ లోనో అసెంబ్లీ లోనో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు గురించి ఎక్కువ మాట్లాడారు. పోయిన సంవత్సరం NRI లకి వోటు హక్కు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది , దాని గురించి చర్చ పెద్దగా ఏమి జరగలేదు. అదే మైకులు విరగోట్టే విషయాలు మటుకు మర్చిపోకుడా ప్రింట్ చేస్తారు. మొదటి పేజి ఒకసారి చూసి చివర్లో స్పోర్ట్స్ పేజి లోకి వెళ్ళిపోయే సగటు భారతీయుడు మటుకు ఇలాంటి వాళ్లా ఈ దేశాన్ని ఏలుతోంది, నేను వోటు వెయ్యకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏమి లేదు అనుకుని ఆనందిస్తాడు. ఈ సంపాదకీయులకి bad news is the best news . భారతదేశం పట్ల నిరాశని పెంపొందించడం లో వీళ్ళ పాత్ర చాలా ఉంది.

చివరగా మన ప్రియతమ మార్క్సిస్ట్ల గురించి చెప్పడం మర్చిపోకూడదు. వీళ్ళకి ప్రతి సమస్య కి కారణం ఈ పెట్టుబడీదారి వ్యవస్థ మరియు అమెరికా కుతంత్రం. చివరికి కాలుష్యానికి కారణం కూడా పెట్టుబడీదారి వ్యవస్థ అనే చెబుతారు. అంటే చైనా లో ఫ్యాక్టరీ గొట్టాల నుండి ఆక్షిజన్ వస్తుందా? ప్రతీ సమస్యకి పరిష్కారం కార్మిక నియంతృత్వం తీసుకురావడమే. SEZ మీద తెగ అరుస్తారు, మరి చైనా లో SEZ లు 1980 ల నుంచి ఉన్నాయి  కదా అంటే మాట్లాడరు .. ఇక నాకు కొంతమంది కమ్యునిస్టులు తగిలారు …..USSR ఎందుకు కూలిపోయింది అని అడిగితే….అసలు USSR ఎక్కడ కూలిపోయింది అని నన్ను అడిగారు…..ఇంకో కమ్యునిస్ట్ అయితే మార్క్స్ ప్రతిపాదించిన సోషలిజం  కి ప్రజాస్వామ్యానికి కి తేడా లేదని అడ్డంగా వాదించాడు. 1947 లో స్వాతంత్రం వచ్చింది అని దేశమంతా పండగ చేసుకుంటూ ఉంటే “ yeh aazaadi jhooti hai “ (ఈ స్వతంత్రం నిజం కాదు , ఇంగ్లాండ్ లో బూర్జువాలు, ఇండియా బూర్జువాలు కలిసి ఆడుతున్న నాటకం అని బెంగాల్ వీధుల్లో అరుచుకుంటూ పరిగెత్తారు )చైనా భారతదేశం మీద దాడి చేసినపుడు , పెట్టుబడీదారి వ్యవస్థ నుంచి భారతదేశాన్ని కాపాడటానికే చైనా వస్తోంది అని ఆనందించారు. వాళ్ళలో జ్యోతి బసు ఒకడు.  వీళ్ళు పుస్తకాలు చదువుతారు కానీ కేవలం ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు ప్రింట్ చేసినవే చదువుతారు. రూం లో కూర్చొని నాలుగు కమ్యునిస్ట్ పుస్తకాలు చదివేసి, ప్రపంచం లో సమస్యలకి కారణాలు వీళ్ళకి అర్థం అయిపోయాయి అని…వాటికి పరిష్కారాలు కూడా వీరికి తెలుసనీ, ఎందుకు మిగతా ప్రజలు వీరిని అర్థం చేసుకోట్లేదో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటారు . జన గీతిని వోద్దనుకుంటూ , వీరికి వీరే హేచ్చనుకుంటూ కలలో జీవిస్తారు వీరు , కలవరింత కోరుతుంటారు వీరు !!
అలా అని భారతీయులు అన్నింట్లోనూ పూర్తీగా అభివృద్ధి సాధించేసాం అనడం లేదు నేను ….అభివృద్ధి జరగాల్సింది ఇంకా ఉంది , అలా అని ఇప్పటిదాకా ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు అని అంటే ఒప్పుకోలేను. ఒక చెడుని చూసి మొత్తం అంతా అదే అనడం బాలేదు అంటున్నాను, అన్నం ఉడికిందా లేదా చూడటానికి ఒక్క మెతుకు చూస్తె సరిపోతుంది అన్న లాజిక్ ప్రతీ విషయం లో పని చెయ్యదు అంటున్నాను.  మనవాళ్ళు ఉత్త వెధవలోయ్ అని కన్యాశుల్కం లో గిరీశం లాగా అంత తక్కువ చేసి మాట్లాడక్కర్లేదని నా ఉద్దేశ్యం.

12 comments:

ఇందు said...

సంజీవ్ గారు...మీ టపా టైటిల్ చూసి ఎవరినన్నా దులిపే ప్రోగ్రాం ఏమో అనుకున్నా! కానీ ఒకసారి చూద్దాం అనిపించి వచ్చి చూసా! చాలా బాగా వ్రాసారు! ఇంత టపానా? అనుకున్న నేనే...అలా అలా చదివేస్తూ వెళ్ళిపోయా! మీ టపాలో ఒక సగటు మనిషి ఆవేదన ఉంది.దేశం గురించి అవగాహన ఉంది.ఎదుటివాళ్ళని-దేశాన్ని తిడుతూ తాము మాత్రం ఏదో ఉధ్ధరించేసినట్టు పోస్ పెట్టి హాయిగా కాలక్షేపం చేస్తూ అదే సంఘసేవ అనుకునేవాళ్ళకి ఈ టపా చూస్తే అన్నా కొంచెం తెలిసొస్తుందేమో!

మార్పు అనేది అందరిలోను రావాలి.అభివృధ్ధి అభివృధ్ధి అని జపం చేస్తే అభివృధ్ధి జరగదు.దానికోసం శ్రమ పడాలి.ఊరికే కూర్చుంటే అన్నీ రావు కదా!అలాగె ఎవరో మనల్ని బాగు చెయట్లేదు అనుకునే కంటే మనం ఏం చేస్తున్నాం అన్నది ముందు ఆలోచించాలి.చెతనైతే చేయగలగాలి...లేదంటే చేసేవారికి సహకరించాలి.హ్మ్! ఇంత చెప్పినా మనోళ్ళు మారతరా? అబ్బే! మీరు చెప్పినట్టే...మనోళ్ళు ఉత్తి వెధవాయలోయ్!

SHANKAR.S said...

సెగట్రీ...
ఎప్పుడూ నెగెటివేనా.... అప్పుడప్పుడు కుసింత పాజిటివ్ సైడ్ కూడా సూడాల
మూడో క్లాసులో మార్కులు తక్కువొచ్చిన పిల్లకాయని సూసి ఈడు బాగుపడడ్రా అని ఆళ్ళ ఇంట్లో వాళ్ళంటే ఇంకాడు జీవితం లో పనికిరానోడనేనా..అలాగని ఆ ఇంట్లోవొళ్ళని ఉత్త యదవల కింద జమేసెయ్యలేం కదా.

enigma said...

kummesaw sanju..

Anonymous said...

చాలా బాగా రాశారు.

Indian Minerva said...

బాగుంది.

tankman said...

@enigma ... thankyou
@anu .... thankyou and welcome to my blog
@indian minerva ....ధన్యవాదాలు :)
@ఇందు ....నేను చెప్పదలచుకున్నది మీరు nutshell లో చెప్పెసేరు ...నా పోస్ట్ కి చివరిమాట గా మీ కామెంట్ సరిపోతుంది :)
@shankar ... నా బ్లాగ్ కి విచ్చేసినందుకు ధన్యవాదాలు ...మీ సెగట్రీ ని అడిగా అని చెప్పండి :)

Wamsee said...

Good points.
Interesting Narration. :)

Correction needed: China was not a free country, it was under British regime until 1950.

tankman said...

@wamsee .... china was never under british regime, though it lost two opium wars and subsequently hongkong to british, it was never ruled by british. Till 1912 or so it was under monorchy, after that it became republic and ruled by KMT, then in 1949 it came under chairman Mao rule

Wamsee said...

@sanj..

yes, you are right.
China was never under the British regime.

subhashini poreddy said...

bharatha desham lo prastutam unna janaalandaru paina nuvvu cheppina edo oka vargam loki vastaru laa undi !!ala raani neelanti okariddaru ila analyse cheyagalaru n blogullo raayagalaru....:-)baagundi sanju...keep it up.

tankman said...

@subhashini .... thankyou

Unknown said...

Good one and interesting bro