తెలుగు బ్లాగర్లలో కొన్ని గ్రూపులు ఉన్నాయండి. ఎందుకో సరిగ్గా తెలియదు కానీ అవి బాగా గొడవ పడుతున్నాయి . ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ ని ఏదో ఒకటి అనడం జరుగుతూనే ఉంది.
ఈ గొడవ మధ్యలో … ఎలా ఇరుక్కుందో కాని రామాయణం లో సీత దేవి వచ్చి ఇరుక్కుపోయింది. గొడవ మధ్యలో ఆవిడని పెట్టేసారు. అసలు రావణుడు ఆమెని ఎన్ని సార్లు చేరిచాడు అన్న శీర్షిక తో ఒక టపా వచ్చింది. ఆ పోస్ట్ లో రామాయణం మీద కొన్ని ప్రశ్నలు వేయబడ్డాయి. పురాణాల మీద చర్చ లాంటిది ఏమో అనుకున్నా . కాని కామెంట్స్ లో చూస్తె , అద్వాని దేశం లోని ముస్లిం సోదరులందరికి క్షమాపణ చెప్పేదాకా ప్రాణాలని సైతం లెక్క చెయ్యనని ఆ బ్లాగ్ ఓనర్ చెప్పడం జరిగింది. మధ్యలో ఈ అద్వాని ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. చాలా మంది ఆ title బాలేదని మార్చవలసిందిగా కోరారు.
ఇది లింకు http://ramyamgakutirana.blogspot.com/2011/02/blog-post_8919.html
బ్లాగు ఓనరు గారు, ఆ శీర్షిక తో ఎందుకు రాయాల్సి వచ్చిందో తర్వాతి పోస్ట్ లో వివరిస్తూ…ఈ గ్రూపుల మధ్య జరిగిన గొడవలో ఒక బ్లాగు లో స్త్రీలని కించపరిచే కామెంట్స్ ఇచ్చారని., ఎవరికి రాని అభ్యంతరం తనకి కలిగిందని అందుకే “రావణుడు సీతాదేవిని ఎన్ని సార్లు చేరిచాడు “ అన్న పేరుతో పోస్ట్ రాసానని వివరించారు. ( నాకు లాజిక్ సరిగ్గా అర్థం కాలేదు కాని ఇది ఆవిడ ఇచ్చిన reason)
http://ramyamgakutirana.blogspot.com/2011/02/blog-post_11.html
సరే,ఈ గ్రూప్ గొడవలలో తనని లాగారని సీతదేవి బాధపడింది. అగ్ని లో దూకి తన శీలం నిరూపించుకుని , చివరికి మహారాణి అయ్యి అంతా బాగుంది అనుకున్న సమయం లో ఒక చాకలి వాడు ఏదో అన్నాడని తన భర్త వదిలేశాడని. ఇప్పుడు ఈ పోస్ట్ చదివి మళ్ళి అలంటి ప్రోగ్రాం ఎమన్నా పెడతాడని తన భయంట. ఇలా అని ఆవిడ నా కల లోకి వచ్చి చెప్పింది. . …నిజంగా రాముడు మళ్ళి సీతని వదిలేస్తాడెమో అని నేను టెన్షన్ పడుతూ ఉంటే రాముడు వచ్చాడు కల లోకి … అప్పుడంటే ఏదో అలా అయిపొయింది. ఇలా ఎవరెవరో కొట్టుకుంటూ నా భార్యని మధ్యలోకి లాగితే నేనేం చెయ్యను. నేను మటుకు నా భార్యను ఈ సారి విడిచే సమస్యే లేదు. మీ బ్లాగుల్లో ఎం చేస్కుంటారో చేస్కోండి అని తేల్చి చెప్పి వెళ్ళిపోయాడు. హమ్మయ్య అనుకున్న.
ఇంతలో రావణాసురుడు వచ్చాడు. మామూలుగా రాలేదు . ..అరుస్తూ వచ్చాడు. ఇలా రావణుడు సీతని ఎన్ని సార్లు చేరిచాడు అన్న ప్రశ్న తో తన మీద rapist అనే ముద్ర పడే అవకాశం ఉందని. తను సీతని ఎలాగో ఒక లాగ ముందు పెళ్లి చేసుకున్దామనుకున్నాడని, అందుకే ఎత్తుకోచ్చినా అశోక వనం లోనే పెట్టాడని, ఆఖరికి ఒక బొమ్మ రాముడి తల తీసుకు వచ్చి సీతని మోసం తో అయినా సరే పెళ్లి చేసుకున్దమనుకున్నాడు కాని తనని rape చేసే ఉద్దేశ్యాలు తనకి ఏ మాత్రం లేవని …తానేమి చీపు లిక్కరు తాగి అమ్మాయిలని చెరిచే రకం కాదని, ఎందుకలా తన image నాశనం చేయడానికి ప్రయత్నిస్తునారని లబో దిబో అన్నాడు. పాపం అయన చెప్పింది కూడా పాయింట్ కదా…వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటే కొట్టుకున్నారు. అసలే ఒక ఆడదాని కోసం కొడుకులని , తమ్ముళ్ళని , రాజ్యాన్ని చివరికి ప్రాణాలు కూడా పోగొట్టుకున్న వాడిగా పేరు తెచ్చుకున్న వాడు. ఇప్పుడు rapist అన్న ముద్ర కూడా పడితే ఎలా ?
ఇంతలో సదరు బ్లాగ్ ఓనరు గారు ఇంకో పోస్ట్ పెట్టారు …ఈ సారి దాని టైటిల్ “ రావణుడిని చూసి సీత మోమైత్ ఖాన్ లా ఎందుకు నవ్వింది ? “ అని .ఆ బ్లాగ్ పోస్ట్ లో స్వయంవరం లో రావణుడిని చూసి సీత నవ్విందని (మోమైత్ ఖాన్ లాగా ), అందుకు రావణుడు చాలా బాధ పడ్డాడని , ఆ బాదే యుద్ధం గా మారిందని అన్నారు. ఇది నిజంగా రామాయణం లో కొత్త ట్విస్టు.
http://ramyamgakutirana.blogspot.com/2011/02/blog-post_12.html
మళ్ళి సీత , రాముడు , రావణుడు అందరు కలలోకి వస్తారు. లేదా మోమైత్ ఖాన్ అన్నా వస్తుంది అనుకుంటే విచిత్రంగా శూర్పణఖ వచ్చింది. నీకేమయింది అని అడిగితే “ చూసావ చూసావ ఆ రాముడు నన్ను కాదన్నాడని, లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసాడని నేను బాధతో ఏడుస్తూ వెళ్తే కదా రావణుడు సీతని ఎత్తుకొచ్చింది అనుకున్నాం ఇన్నాళ్ళు . ఇప్పుడు చూడు ఆ సీతని kidnap చేయడం నా ఏడుపు చూసి కాదన్నమాట. ఆవిడ ఎప్పుడో చూసి నవ్విందట అందుకంట …..ఇన్ని రోజులు మా అన్న నా మీద ప్రేమతో చేసాడనుకుని ..ఏదో తెలుగు మూవీస్ లో అన్న చెల్లెళ్ళ సెంటిమెంటు పాటలు పాడుకుంటూ గడిపేశా . …నా కోసం కాదన్నమాట. ఆ మోమైత్ ఖాన్ నవ్వుతున్న ఫోటో 10 prints తీయించి వాడి మొహాల ముందు పెడతా …అప్పుడు కాని వాడి తిక్క కుదరదు” అంటూ …తన అన్నని తిడతా ఉంది. నాకు తెలుసు రావణుడు నా కల చుట్టుపక్కలకి వస్తే చెల్లెలి చేతిలో దొరికిపోతాడని ఎక్కడో కూర్చొని పది బుర్రలు గోక్కుంటూ ఏంటి ఈ బ్లాగు గోల అనుకుంటూ ఉన్నాడని
.
77 comments:
"....ఎక్కడో కూర్చొని పది బుర్రలు గోక్కుంటూ ఏంటి ఈ 'బ్లాగు గోల' అనుకుంటూ....." This is very funny.
ఆవిడ అభిప్రాయాలు ఆవిడకి ఉంటాయి. అందులో తప్పేముంది? ఇప్పటి వరకు వంటలు, వార్పులు, కుటుంబ విషయాల మీదే శ్రద్ధ పెట్టిన మహిళా బ్లాగర్లు కొత్త విషయాలు వ్రాయడం సంతోషించాల్సిన విషయమే కదా.
ప్రవీణ్ గారూ, నాకు మీరంటే ఎంత ఇష్టమో సార్ :-) మాటల్లో పెట్టలేను నిజంగా :-). లవ్ యు టు ద కోర్
LOOOOOOOOL ... just reading all of your posts ... refreshingly different!
Good ones...!!!!
సంజీవ్ గారు...అరిపించారు...కేక!!!
@ప్రవీణ్:ప్రవీణ్ గారు...మీరు చేసిన వ్యాఖ్యలు ఒకసారి సరిచూసుకోవాలని మనవి.ఎవరి బ్లాగులు వారి ఇష్టం.ఆడవాళ్ళు/మగ వాళ్ళు వంటల గురించే రాసుకుంటరో..కుట్లు-అల్లికల గురించే రాసుకుంటారో....పాటలు-కవితలె రాసుకుంటారో...వారిష్టం.మీరెవరు ఇలా రాయాలి అలా రాయాలి అని రూల్స్ పెట్టడానికి? బ్లాగు అన్నది ఒక కాలక్షెపం.కొంతమందికి సీరియస్ కావొచ్హ్చు.అది ఎవరి ఇష్టాఇష్టాలకు సంబంధించినది.మీరెవరు అల ఎందుకు రాస్తున్నరు ఇలా రాయొచ్చు కదా అని చెప్పడానికి? మీరు ప్రతి బ్లాగులో తెగ సపోర్ట్ చేస్తున్న తమ ప్రియతమ బ్లాగరు అయిన సదరు మహిళ కూడా తన ఇష్టం వచ్చినట్టు వ్రాసుకోవచ్చు.కాని అశ్లీలంగ,అసహ్యకరంగ,నిస్సిగ్గుగ...'చెరచడం' లాంటి అభ్యంతరకర పదజాలంతో బ్లాగు వ్రాయడాన్ని మీరు సమర్ధిస్తున్నారా? ఇతర బ్లాగరుల కుటుంబసభ్యులని కించపరుస్తు ఆ మతిలేని పిచ్చిది అందరి మీద పడి కరుస్తుంటే మీరు దానికి వంత పాడుతున్నారా? ఇదేనా మీరు అందరు బ్లాగర్లని వెళ్ళమనె మార్గం? ఇదేనా మీరు కోరుకుంటున్న అభ్యుదయం? ఒక్కసారి సరిగ్గా కళ్ళు 'తెరిచీ' ఆ మహాతల్లి నీచాతినీచంగా వ్రాస్తున్న పోస్టులను చదివి అప్పుడు వ్రాయండి వ్యాఖ్యలు. అంతవరకు దయచేసి ఇలాంటి మతిస్థిమితం లేని వ్యాఖ్యలు చేయకండీ!!
sarma ji ur support to such a blogger is highly objectionalble on behalf of hindus
Who is Sarmaji here, Astrojyod sir?! That fake guy above? :))
కింగూ, ఒక పిచ్చిగోలతోనే చస్తుంటే, ఇక ఆవిడ తలాతోక లేని వాగుళ్ళ మీతా చర్చలు, భాష్యాలు కూడానా? ఆవిడకు అద్వానీ వాళ్ళిట్లో వుండే రోకలి తలకు చుట్టాలట, మరి మీరు లాహోరెళ్ళి తేగలరా? చెప్పండి.
@shiva .. :) welcome to my blog
@praveen ... మహిళలు కొత్తవిషయాలు మీద రాస్తుంటే అది మంచి పరిణామమే. ఆ బ్లాగు ఓనరు గారు తనకి రాజకీయాల లోకి ప్రవేశించాలని ఉనట్టుగా కూడా రాసారు. అది కూడా సంతోషకరమైన వార్తే . కాని ఇలా ఎవరో ఏదో అన్నారని పురాణాల లో పాత్రలని ఏదో ఒకటి అంటే కష్టమే. ఆవిడ ఇలానే రాజకీయాలలో కీలక పాత్ర వహిస్తే విచిత్రంగా ఉంటుంది. అసంబ్లీ లో ఏదో అన్నరాని , అసెంబ్లీ ముందు కూర్చొని, సీత ముమైత్ ఖాన్ లో నవ్విన్దనో, అనసూయ పక్కిన్టాయనకి కన్ను కొట్టిన్దనో అంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా. ఆవిడకి నిజంగా సీత నచ్చక అలా అంటే ప్రజల reaction ఇలా ఉండదు. ఆవిడని ఎవరో ఏదో అన్నారని సీతని మధ్యలో ఇరికించడం ఎంతవరకు సమంజసం మీరే చెప్పండి. in fact i am agnostic but still i find it irritating...its not a good idea to through mud on someone who is mythical, because of silly reasons.
@kumarN .. welcome to my blog :)
@style ... thankyou
@astrojoyd ....welcome to my blog sir..
@snkr ... ఏ రోకలి అయితే ఏంటి చెప్పండి మాస్టారు, A.P లో ఉండే రోకళ్ళు చాలు లెండి.
బాగా చెప్పారండీ..
@bharadwaj .. thankyou :)
thankyou raj
ఒకరిద్దరు చేసే విమర్శలకి హిందూ మతం కూలిపోతుందనుకోను. సీతాదేవి గురించి అలా వ్రాసిన అమ్మాయి నాస్తికురాలు కాదు. బిపాసా బసు మీద ఒక్క హిందువైనా కోర్టు కేసు వెయ్యలేదు, ఒక ముస్లిం కోర్టు కేసు వేశాడు, ముస్లింలకి ఉన్న మతాభిమానం హిందువులకి లేదు అని ఆమె నాకు పంపిన మెయిల్లో వ్రాసింది. ఆమె వ్యతిరేకిస్తున్నది హిందూ సమాజంలోని హిపోక్రిసీని కానీ హిందూ మతాన్ని కాదు. ఆమె తన వ్యక్తిగత అభిప్రాయాలు వ్రాసుకుందని ఆమెని ఇంత అడ్డంగా తిట్టాలా?
@praveen ....తిట్టడం చాలా పెద్ద మాటండి. నేను తిట్టలేదు తనని. ఏదో సరదాగా నా బ్లాగ్ లో ఏదో రాసుకున్నా అంతే ...ఇది తిట్టడం కాదు...విమర్శనాత్మక పరిశీలన అనుకోవచ్చు
మీరు తిట్టకపోవచ్చు. మత పరిరక్షకులమని చెప్పుకుంటూ మహిళలని అడ్డమైన తిట్లు తిట్టే బ్యాచ్ ఉంది. ఒక మహిళని తిడుతూ ఇన్ని కామెంట్లు వ్రాయడం చూస్తోంటే వాళ్లు పనిలేనివాళ్లు అనిపిస్తోంది. ఆ బ్యాచ్వాళ్లకి ఒక మహిళ సపోర్ట్ ఉంది. హరి గారి బ్లాగ్‌లో నేను ఆంధ్రా బ్యాంక్ గురించి వ్రాసానని ఆమె బజ్‌లో వ్రాసింది. నాకేమీ అంత మతిమరుపు లేదు, నేను వ్రాయని విషయాలు వ్రాసానని వాదించొద్దు అని సమాధానం చెప్పాను. ఈ లింక్ చూడండి: http://www.google.com/profiles/113352906292796986132 ఒక్క మహిళ సీతాదేవిని విమర్శించినంతమాత్రాన హిందువులు సీతాదేవిని భక్తితో కొలవడం మానేస్తారా? దేవాలయాలు, మస్జీదులు అజ్ఞానానికి నిలయాలని నాస్తికులు విమర్శిస్తున్నంతమాత్రాన జనం దేవాలయాలకి వెళ్లడం మానేస్తున్నారా? అలాంటప్పుడు సీతాదేవి గురించి ఆ పోస్ట్ వ్రాసిన మహిళని అంతలా విమర్శించడం అవసరమా? అలాగైతే రాముడు శంభూకుడిని చంపాడు కనుక రాముడు అగ్రవర్ణ ఫాసిస్ట్ అనేవాళ్ల సంగతి ఏమిటి? హత్యలు చెయ్యడం కంటే చెరచబడడం పెద్ద విషయమా? శంభూకుని విషయంలో రాముడి పై విమర్శలు కంటే సీతాదేవి రావణాసురుని చేతిలో చెరచబడింది అని నీహారిక గారు వ్రాసిన విషయాన్ని భూతద్దంలో చూడడం ఎందుకు?
@praveen .... హరి గారు ఎవరో సుజాత గారు ఎవరో , వాళ్ళ బ్లాగ్స్ ఏంటో కూడా నాకు తెలియదండి ...నేను ఈ మధ్యనే తెలుగు బ్లాగ్స్ ఎక్కువగా చదువుతున్నాను ..కాబట్టి ఆ విషయం గురించి నేను ఏమి మాట్లాడలేను.
ఇక నీహారిక గారి బ్లాగ్ విషయానికి వస్తే, "సీతాదేవి గురించి ఆ పోస్ట్ వ్రాసిన మహిళని అంతలా విమర్శించడం అవసరమా?" అని మీరు అడుగుతున్నారు. ఎవరో ఆవిడని తిడుతున్నారని కూడా అన్నారు, ఆ తిట్టే బ్యాచ్ కూడా నాకు తెలియదు. నా లాంటి అప్పుడప్పుడు బ్లాగ్స్ రాస్తూ , అప్పుడప్పుడు ఇంకొకరి బ్లాగ్స్ చదివేవాళ్ళకి ఒకటే ప్రశ్న వస్తుంది. ఎవరో ఆవిడని అంటే, ఆవిడ సీతా దేవిని అనడం ఎందుకు అని ?
చాకలి వాడి మాట విని భార్యని వదిలేశాడని రాముడికి పేరు ఉంది, ఆ అంశం మీద చాలా మంది రచయితలు రాశారు.( నీహారిక గారి లేటెస్ట్ బ్లాగ్ పోస్ట్ లో ఇదే విషయం ఎత్తుకున్నారు) కాని వాళ్లెవరు రామాయణ కథని మార్చలేదు. అదే రామాయణాన్ని ఇంకో కోణం లోంచి చూసారు. కానీ నీహారిక గారి బ్లాగ్ కథనే మారుస్తోంది. రావణాసురుడు సీతని చేరచడం, సీత ముమైత్ ఖాన్ లా నవ్వింది అనడం, ఆ ద్వేషం తో రావణుడు సీతని ఎత్తుకేల్లాడు అనడం ...ఇవి కథని మారుస్తున్నాయి. ఇలా కథని మార్చడానికి da vinci code బుక్ లో లాగా ఏవో ఆధారాలు దొరికాయి కాబట్టి మారుస్తున్నా అర్థం చేసుకోవచ్చు. కాని ఎవరో తనని అన్నారని, అప్పుడు ఎవరు తనకి సపోర్ట్ ఇవ్వలేదని, కాబట్టి ఇప్పుడు సీతని తిదతానని, మధ్యలో అద్వాని క్షమాపణ చెప్పాలి అని ....ఏంటో సరిగ్గా లేదు మాస్టారు.
రామాయణం నిజంగా జరిగిందా లేదా అనే సంగతి కొంత సేపు పక్కన పెట్టి ఈ కొంత సేపు నిజంగా జరిగిందనే అనుకుందాం. రావణాసరుడు సీతని అనేక రోజుల పాటు తన దగ్గర బందీగా ఉంచాడు. ఈ అనేక రోజుల్లో ఒక్కసారి కూడా చెరచలేదంటే అది అనుమానించే విషయమే అవుతుంది. ఒకవేళ నిజంగా చెరిచినా అది పెద్ద విషయం అనుకోవద్దు. పాచి పళ్ల... సామెత స్టైల్లో శీలం పోవడం ప్రాణం పోవడంతో సమానం అనుకోవాల్సిన పని లేదు. శీలం అనేది పెద్ద ఇష్యూ ఏమీ కాదు కనుక రావణాసురుడు సీతని చెరిచాడు అని వ్రాసిన మహిళని అంతలా తిట్టాల్సిన పని లేదు అనే నమ్ముతాను.
మీరు కొత్త అని నాకు తెలియదు. బ్లాగులు చదివుతూ రెండు మూడేళ్ల తరువాత సొంత బ్లాగ్ పెట్టేవాళ్లు ఉంటారు కదా. అందుకే మీరు బ్లాగులకి కొత్త అనుకోలేదు. నీహారిక గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు కానీ ఆవిడ మతం గురించి వ్రాయడం కొత్తే. నేను మతం గురించి నా అభిప్రాయాలు వ్రాస్తే సంబంధం లేని విషయాలు వ్రాస్తున్నానని ఆరోపణలు చేసారు. ఇప్పుడు సొంత అభిప్రాయాలు వ్రాస్తున్నందుకు నీహారిక గారిని తిడుతున్నారు. హరి గారి బ్లాగ్‌లో నీహారిక గారికి సపోర్ట్ ఇచ్చానని పాత స్టైల్లోనే నాపై దాడికి దిగారు. హరి గారి బ్లాగ్‌లో నేను ఆంధ్రా బ్యాంక్ గురించి వ్రాసానంటూ బజ్‌లో పచ్చి అబద్దాలు వ్రాయడం చూసినప్పుడు చెవిలో ఇంత పెద్ద పువ్వులు పెట్టడం ఏమిటా అని అనుకున్నాను. నేనేమీ భయపడలేదు. అబద్దాలు చెప్పేవాళ్లని జీవితంలో చాలా మందిని చూశాను కానీ ఇంత ఓపెన్‌గా చెవుల్లో పువ్వులు పెట్టేవాళ్లని చూడడం జీవితంలో అదే మొదటిసారి. రామాయణం అనేది కథ. అది నిజంగా జరగలేదు. అందుకే రామాయణాన్ని సంస్కృతంలో ఒకలాగ, తెలుగులో ఒకలాగ, తమిళంలో ఒకలాగ వ్రాసారు. ఎక్కువ మంది సంస్కృత రామాయణాన్నే ప్రమాణంగా భావిస్తారు. రామాయణం నిజంగా జరిగిందని ఒకరు నమ్మొచ్చు, ఒకరు నమ్మకపోవచ్చు. ఒకరు రామాయణాన్ని మార్చి వ్రాస్తే బాగుంటుందనుకోవచ్చు, ఒకరు యథాతథంగా ఉండాలనొచ్చు. నిజంగా జరిగిందో లేదో తెలియని ఒక ఇతివృత్తం గురించి ఒక మహిళ ఏదో వ్రాస్తే దాన్నో పెద్ద విషయంగా తీసుకోవడం ఎందుకు?
కంటికి కనిపించేవే నిజాలు అనుకోడం మూర్ఖత్వం .... దానికోసం అందరు పూజించే దేవతలని అనరాని మాటలు అనడం మహా పాపం ..
ఏవండీ ప్రవీణుగారూ...మీకు అసలు బుధ్ధి ఉందా? ఏమిటి ఆ మాటలు సీతాదేవి మీదా?? అసలు మీకు హిందూమతం మీద నమ్మకం లేనప్పుడు ఊరుకోండి..అంతే గానీ ఇలాంటి వెధవ పనులు చేయకండీ....శీలం పెద్ద విషయం కాదా! అవునులేండీ మీరు రాసే కధల్లో నిజంగానే శీలం పెద్ద విషయం కాదు. అయినా మీకు అసలు శీలం అంటే తెలుసా? సీతమ్మ ఎంతటి శీలవతో తెలుసా? ఛీ!! ఎందుకండీ మీరూ ఉన్నారు...రాళ్ళ్ళు రప్పులూ ఉన్నాయి.వాటికి మీకు తేడానే లేదు.ఛి! మీలాంటి వాళ్లతో మాట్లాడటం....మంచి చెప్పలని చూడటం మాదే బుధ్ధి తక్కువ.మీరు,ఆ సదరు మహిళా బ్లాగరు, ఆ పత్తలేకుండా పోయిన 'మోళీ అనే గోళీ....మీరంతా చెబితే వింటారా?
నాకు దేవుని మీద నమ్మకం ఉందా, లేదా అనేది ఇక్కడ సెకండరీ విషయం. ఒక మహిళని అంతలా తిట్టడం అవసరమా అని డౌటొచ్చు ఇక్కడ వ్రాసాను. చెరచబడడం అనేది ఆడదాని తప్పు కాదు కాబట్టి సీతాదేవి పవిత్రురాలే. శీలం అనేది పెద్ద ఇష్యూ కాదనే నమ్ముతాను. ఒక స్త్రీ మీద పురుషుడు బలవంతం చేసి ఏదో చేస్తే ఆమె శీలం పోయింది అనుకోవడం ఫార్స్.
నిజమే చెరచబడ్టంలో ఆడ్వారి తప్పేమీ లేదు.కానీ మీరన్న ఇంకో వ్యాఖ్య చాల్ చండాలంగా ఉంది.
>>'రావణాసరుడు సీతని అనేక రోజుల పాటు తన దగ్గర బందీగా ఉంచాడు. ఈ అనేక రోజుల్లో ఒక్కసారి కూడా చెరచలేదంటే అది అనుమానించే విషయమే అవుతుంది'
ఏవిటండీ ఇది>? అసలు మతి ఉండే ఈ వ్యాఖ్యలు చేస్తునారా? రావణుడు సీత అనుమతి లేనిదే కనీసం తాకను కూడ తాకకూడదని మట్టిపెళ్ళతో సహా తీసెఉకెళ్ళాడుగానీ...కనీసం చెతితో తాకి తీసుకెళ్ళ్లేదు కూడా! అంతటి నీతి ఉన్నవాడు రావణాసురుడు.మీకు ఆయనకున్న కామన్ సెన్స్ కూడ లేదనుకుంటా. రక్షసుడికంటే వక్రంగా ఆలొచిస్తున్న మిమ్మల్ని ఇక ఏమనాలో! ఏమని పిలవాలో!
ఇక ఎప్పటిలాగే మీ ప్రియతమ బ్లాగరు అయిన ఆ నీహారికా గారు అసలు ఆడదే కాదు.ఆమె అలా అయిఉంటే అంత బరితెగించి వ్రాయదు.అయినా అమె ఇప్పటిదాకా తన బ్లాగులో తిట్టింది మహిళలనే!సహ బ్లాగరుల భార్య-పిల్లలనె.ఇక ఇప్పుడు ఒక బ్లాగరు అమ్మగారిని అడ్డం పెట్టుకుని వెధవ వేషాలు వేస్తోంది.ఇక ఆ మహాతల్లికి మీ ఘనమైన,వెనుతిరగని సపోర్టు ఒకటి మా ఖర్మకి.
చస్తున్నాం....రొజు పొద్దున్నె లెచి ఈ దరిద్రపు బ్లాగుల గోల చూడలెక.ఇకనైనా ఆపంది మీ వెర్రిమొర్రి భావజాలపు విషం కక్కె ప్రయత్నాలు. అభుదయం,ప్రగతి అంటే ఇలా అందరి మీదా పడి కరవడం కాదు.సిగ్గు,శరం,మానం,మర్యద అనే విషయాలు పరిశీలించి మంచి నడవడిక నేర్చుకోండి.
సీతా దేవి మహిళ కాదు మరి .. ఆవిడ ఇక్కడ లేదు అడగదు అనే ధైర్యం తో ఇన్ని మాటలు మాటడుతున్నారు కొంత మంది ..
ఇది మన భారత దేశానికీ పట్టిన ఖర్మ ఎవరం ఏమి చెయ్యలేము ..
పాడిందే పాడరా పాచిపళ్ల... సామెత స్టైల్లో ఆమెని మీరు పిచ్చిది అని ఎన్నిసార్లు అన్నారో మీకే గుర్తు లేదనుకుంటాను. ఒకే అబద్దాన్ని పది సార్లు చెప్పే హిట్లర్ స్టైల్‌ని మీరు నమ్ముతున్నారు.
హెహ్హెహ్హె! భలే ఉన్నది సామెత :)))))))))))
ఏమంటివి ఏమంటివి? నీహారిక పిచ్చిది కాదనియా? హెంత మాటా...హెంత మాటా....ఇది పిచ్చి పరీక్షయే కానీ....చచ్చు పరీక్ష కాదే! కారాదే! హ్హెహెహ్హెహెహీ!
మరి పిచ్చోళ్లని పిచ్చి అనక 'అమ్మాయీ...'మంచి అమ్మయీ ...'అమాయకురాలైన అమ్మయీ అని అందురా? చాల్చాల్లెద్దురురు....మీరు మరీను! పది మంది 'పిచ్చీ అని ఒక్క మనిషి 'మంచీ అంటే...ఆ పిచ్చి ఎవరికో మరి? అహ ఎవరికి అంటా?
చూడండీ...మీరు ఎంత వెనకేసుకొచ్చినా పిచ్చోళ్ళని పిచ్చోళ్లే అంటారు.ఇక్కడ ఎవరూ అబధ్ధాలు చెప్పటలెదు.మీరేంతో అందరికీ తెలుసుగా మహాశయా!ఇంకా వాదింతురా? వాదించుకొనుము.
అవును.నా స్టైలే వేరు :)) ఐతే ఏవిటట? రోజు బ్లాగులు తెరిచి ఈ పిచ్చి గోల చూడలేక ఒళ్ళుమండి వ్రాస్తున్న కామెంట్లు ఇవి. అయినా మీ ఇస్టైలు ముందు మా స్టైలు ఎంతలేండీ!!
అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డ్‌లా ఉన్నాయి మీరు నీహారిక గారిని తిడుతున్న తిట్లు. నీహారిక గారు స్త్రీవాది కాదు అని నేను ఇంతకు ముందు వ్రాసాను. స్త్రీవాదానికి, స్త్రీల హక్కుల అడ్వొకసీకి మధ్య తేడా ఉంది. కేవలం స్త్రీవాదం రంగు పులుముకోవడానికి నీహారిక గారికి సపోర్ట్ ఇవ్వాల్సిన పని లేదు. స్త్రీవాదం విషయంలో నా protagonist గుడిపాటి వెంకటాచలం గారు. అంతే కానీ నీహారిక గారు కాదు. సీతాదేవి విషయంలో మీరు ఆమెని అంతలా విమర్శించడం బాగాలేదు అనే అంటున్నాను.
సంజు ది కింగ్ గారండీ,
పాపం ప్రవీణ్ మొత్తుకుంటున్న ఆ సుజాతని నేనేలెండి! ప్రవీణ్ ఏ బ్లాగులో ఐనా రిలవెంట్ గా కామెంట్ రాస్తే చూసి చచ్చిపోవాలని ఉందని నా బజ్ లో రాస్తే ఇక్కడికొచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇందులో నేను ఏ బ్లాగర్ పేరూ ఎత్తలేదు.
హరి బ్లాగ్ కూడా కాదు, ఏ బ్లాగులో అయినా సరే రిలవెంట్ గా కామెంట్ రాస్తే చూడాలని నా కోరిక!
అక్కడ ఆయన ఎక్కడెక్కడ ఇర్రిలవెంట్ గా కామెంట్స్ రాశాడో నేను రుజువులు చూపించాను.అవి కాదట, ఫ్రెష్ గా రుజువు చేయాలట.ఎన్న్ని లెక్కపెట్టను?
చూడండి ప్రవీణ్, బ్లాగర్లు అనేకమంది మిమ్మల్ని పచ్చిగా తిట్టేవాళ్లుండొచ్చు,. కానీ మీరు వయసులో నాకంటే చిన్న అయినా నేను కనీసం ఏకవచనంలో సంబోధించను కూడా లేదు. మీకు ఇచ్చిన మర్యాద నిలుపుకునే ప్రయత్నం చేయండి. మీ బెదిరింపు ఈ మెయిల్స్ నా వద్ద పని చేయవు.
మీరు చెప్పేవి, ప్రతిపాదించేవి వాదాలు ఇజాలు కానే కావు. మీకసలు ఏ సబ్జెక్టూ పూర్తిగా కాదు కదా సగం కూడా తెలీదు! మీ స్వంత అభిప్రాయాలని పులిమి ప్రతి దాన్నీ మసి పూసి మారేడు కాయ చేయాల్ని ప్రయత్నిస్తే బయటపడేది మీ అజ్ఞానమే!
ఇక్కడ కూడా చెప్తున్నా, ఒక్క పది మంది బ్లాగర్ల చేత,అందరికీ తెలిసిన మీ కామెంట్స్ రిలవెంట్ గా ఉంటాయని అనిపించండి చాలు!
ఇహ ఇంతటితో ముగించండి! నేను ఏ బాచ్ కీ సపోర్ట్ కాదు. ఈ విషయంలో మీరు కలలు కంటూ వాటిని ప్రచారం చేస్తే మీకు మతి స్థిమితం లేదనుకుంటారు జనం!
ఇంకోసారి నా పేరెత్తి పిచ్చి రాతలు రాస్తే మర్యాద దక్కదు.
మీకు ఇలా చెప్తే అర్థం కాదు, తిట్లతో మొదలెట్టే వాళ్ళుంటారు చూడండి, వాళ్ళైతే మీకు సరిగ్గా అర్థమయేట్లు చెప్తారు.
సంజూ థె కింగూ, నా కామెంట్లేవి? ఇదన్యాయం. :) అంతలా గింజుకుపోతున్నారు ఎందుకబ్బా?!!
You used filthy words such as rabid dog on Niharika. How can you justify yourself?
@snkr.... మీవి, ఇంకొన్ని కామెంట్స్ కూడా టాపిక్ ని దాటి వేరే బ్లోగ్గేర్స్ ని జంతువుల పేర్లతో...దాన్లోను రోగాలు ఉన్న జంతువుల పేర్లతో సంబోదించడం వాళ్ళ ఆ కామెంట్స్ మాత్రమే డిలీట్ చేశాను...ఏమి అనుకోకండి. :)
@సుజాత గారు, నా బ్లాగు లోకి మీకు ఆహ్వానం పలుకుతున్నా ... మొత్తానికి మీ బ్లాగు చూడటం జరిగింది మీరు కామెంట్ చేయడం వాళ్ళ ..ఇక హరి గారి బ్లాగ్ కూడా తెలిస్తే, నిన్న ప్రవీణ్ గారు పెట్టిన కామెంట్ ని పూర్తిగా అర్థం చేసుకోడానికి నాకు వీలవుతుంది. పెట్టకపోయినా పర్లేదులెండి ఎందుకంటే హరి గారి బ్లాగ్ లో ఆంధ్రా బ్యాంకు ఉందొ లేదో తెలియదు కానీ, ప్రస్తుతం చర్చిస్తున్న విషయానికి దానికి పెద్దగ సంబంధం లేదనే అనుకుంటున్నాను.
@ప్రవీణ్ ... తనకి కోపం వచినపుడల్లా సీతాదేవి మీద పోస్టు రాయడం ఆవిడ అలవాటు అయితే , సీతా దేవిని అన్న వాళ్ళ మీద కోపం తెచ్చుకోవడం మిగతా వాళ్ళ అలవాటు అనుకోండి. రెండు గ్రూప్ కొట్టుకుంటూ ఉంటే సీతని , అద్వానిని మధ్యలోకి లాక్కురావడం మీకు పొరపాటు అనిపియడం లేదా చెప్పండి . నీహరికి గారు స్త్రీవాది కాదు అంటున్నారు, మరి ఏంటో మీరే చెప్పండి , సంస్కృత రామాయణం అయిన, తెలుగు రామాయణం అయినా, హిందీ ది అయినా ఆఖరికి రామాయణ విష వృక్షం అయినా అసలు కథ ని అలానే ఉంచి , కొన్ని extra పిట్ట కథలు జత చేయడంమో, కొన్ని అతిశయోక్తి అలంకారాలు మార్చడమో, లేక కొత్త వాఖ్యానాలు పెట్టడమో జరిగింది. కాని నీహారిక గారు అసలు కథని మార్చేసి వాటి మీద వాఖ్యలు చేస్తున్నారు,
నీహారిక గారి విషయంలో మీరు హుందాగా సమాధానం చెప్పారు కానీ మిగితావాళ్లు నోటికొచ్చినట్టు తిట్టారు. సీతాదేవి విషయంలో కథని మార్చి వ్రాసుండొచ్చు. కానీ శీలం పెద్ద ఇష్యూ అనుకుని అలా వ్రాసిన మహిళా బ్లాగర్ని అంతలా ఎందుకు తిడుతున్నారు? స్త్రీకి శీలమే ప్రధానం అనే భూస్వామ్య భావజాలాన్ని అప్హోల్డ్ చేస్తున్నారు.
"నాకు తెలుసు రావణుడు నా కల చుట్టుపక్కలకి వస్తే చెల్లెలి చేతిలో దొరికిపోతాడని ఎక్కడో కూర్చొని పది బుర్రలు గోక్కుంటూ ఏంటి ఈ బ్లాగు గోల అనుకుంటూ ఉన్నాడని"
Hilarious Post!!
Sunju...The Great!!
@Praveen, please Don't Argue with any one, Let me do my work.
@Style
>>> రావణుడు సీత అనుమతి లేనిదే కనీసం తాకను కూడ తాకకూడదని మట్టిపెళ్ళతో సహా తీసెఉకెళ్ళాడుగానీ...కనీసం చెతితో తాకి తీసుకెళ్ళ్లేదు కూడా!
I don't want to take part in the debate. But this is just for your information.
Valmiki Ramayan says as follows.
vaamena siitaam padmaakSiim muurdhajeSu kareNa saH |
uurvoH tu dakSiNena eva parijagraaha paaNinaa || 3-49-17
saH= he; padma akSiim siitaam= lotus, eyed, at Seetha; vaamena kareNa eva muurdhajeSu= with left, hand, thus, head-hair; dakSiNena paaNinaa uurvoH tu = with right, hand, thighs, but; parijagraaha= grabbed.
He that Ravana grabbed the lotus-eyed Seetha on lifting her up with his left hand at her plait of hair at nape, and with his right hand at her thighs.
సంజూ కింగ్,
నేనూహించలేదు. నిజమే, మీరన్నట్లు ఆ జంతువులు ఎంత మనస్థాపం చెందివుంటాయో! ప్రవీణ్ గారి ఆవేదన అర్థమైంది. :D
/స్త్రీకి శీలమే ప్రధానం అనే భూస్వామ్య భావజాలాన్ని అప్హోల్డ్ చేస్తున్నారు./
భూస్వామ్యం అంటే అదా! నేనికేంటో అనుకున్నా, ప్చ్.. సామ్యవాదులు.. Self goal. :P
Niharika. I am not just talking behalf on you. Can't you think that it's behalf on truth? Do you remember what did you read in your childhood about Giordano Bruno who sacrificed himself for the truth? They want to make chastity (శీలం) as vital issue by criticising your thesis on Seeta. So, I replied to them.
సుజాత గారు చేస్తున్నది జస్ట్ బ్లాక్‌మెయిలింగ్. ఉదాహరణ చెపుతాను. ఉదయం నా ఆఫీస్‌కి ఒక కస్టమర్ వచ్చాడు. వెయ్యి రూపాయల విషయంలో అతనికి, నాకు గొడవయ్యింది. అతను బయటకి వెళ్లిపోయే ముందు పక్క ఆఫీస్ డోర్ ముందు నిలబడి వాళ్లకి వినిపించేలా కేకలు వేశాడు. వాళ్ల వ్యాపారానికి, నా వ్యాపారానికి సంబంధం లేదు, వాళ్ల దగ్గర కేకలు వెయ్యకు అని నేను అతనితో చెప్పాను. బ్లాగుల్లో జరిగిన విషయాల గురించి బజ్‌లో చాడీలు చెప్పడం అలాగే ఉంది. మీ సంబంధం లేని విషయాలు వ్రాయలేదు. మతం గురించి చర్చ జరుగుతున్నప్పుడు మతానికి సంబంధించిన విషయాలే వ్రాసాను. ఫలానావాళ్లు తమ మనోభావాలు దెబ్బతీశారు అని వాదించడానికి గుంట నక్కలా కాచుకు కూర్చునే వర్గం ఉంది. నీహారిక గారు సీతాదేవి గురించి తన అభిప్రాయం వ్రాసినప్పుడు ఆ వర్గంవాళ్లే ఆమెని అడ్డమైన తిట్లు తిట్టారు. హరి గారు బ్లాగ్‌లో చర్చ జరుగుతున్నది ఆ విషయం గురించే.
ఓహో షాపు దగ్గర కూడా జనాలు ఎక్కేస్తుంటారా ?
అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డ్ అంటే ఏమిటో సుజాత గారికి తెలుసనుకుంటాను. సీతాదేవి టపా గురించే అక్కడ చర్చ జరిగినా ఆ విషయం తెలియనట్టు నటించి గతంలో చేసిన పాత ఆరోపణలే చేశారు. రామాయణం ఒక పురాణమే కానీ చరిత్ర కాదు. అది సంస్కృతంలో ఒకలా, తెలుగులో ఒకలా, తమిళంలో ఒకలా వ్రాసి ఉంది. అలెక్సాండర్ గురించి ఇండియాలో వ్రాసినా, బ్రిటన్‌లో వ్రాసినా చరిత్రకారులు ఒకేలా వ్రాస్తారు. కానీ పురాణం అలా వ్రాయాలని రూలేమీ లేదు. నిజంగా జరిగిందో లేదో తెలియని ఒక ఘట్టం గురించి ఒక మహిళ ఏదో వ్రాసిందని ఆమెని అలా తిట్టొద్దు అని నేను చెపుతోంటే నా గొంతూనూ అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డ్ అయిపోయిందేమోనని నాకూ అనుమానమొస్తోంది.
బజ్‌లో సుజాత వ్రాసిన అబద్దపు టపాని ఇప్పటి వరకు 7గురు మెచ్చుకున్నారు. 70 మంది మెచ్చుకున్నా నాకు నష్టం లేదు. హరి గారి బ్లాగ్‌లో ఆంధ్రా బ్యాంక్ గురించి ఎక్కడ వ్రాసానో చూపించండి చూద్దాం. నేనేమీ సన్యాసంలో కలిసిపోతానని చాలెంజ్ చెయ్యను. నేను అక్కడ నిజంగా అలా వ్రాయలేదు కనుక ఆ అవసరం నాకు రాదు. నేను చాలెంజ్ చెయ్యకపోయినా నిజంగా సన్యాసంలో కలిసిపోవలసింది ఎవరో తెలుస్తూనే ఉంది కదా. ఒక అబద్దాన్ని పది మంది చేత చెప్పిస్తే అది నిజమవుతుంది కదా. వంద మంది చేత చెప్పించినా అబద్దాలకి భయపడాల్సిన పని లేదు.
/అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డ్ అంటే ఏమిటో సుజాత గారికి తెలుసనుకుంటాను/
ఆమెకే కాదు, అందరికీ తెలుసు. చూస్తున్నాంగా!
నాకు తెలుసు, శ్రీనివాస్‌కు తెలుసు, స్టైల్‌కు తెలుసు, హరికి తెలుసు, సంజూ ద కింగుకు తెలుసు... తెలుగు బ్లాగర్లందరికీ తెలుసు. తెలియనిది ఒక్కడే ఒక్కడు. అతడే ..అతడే సాంబారుగాడు ఉరఫ్ వాణీపుత్రుడు. ఆయనకు తెలియచెప్పాల్సిన బాధ్యత ఓ స్త్రీవాదిగా, ఓ శీలరహితసామ్యవాదిగా, భూస్వామ్య వ్యతిరేకవాదిగా, నాస్థికవాదిగా, అన్నీవెరసి కామ్రేడు గా మీ భుజస్కందాలమీద వుంది. ఆయనను అనుగ్రహించండి, తెలుగు బ్లాగర్లెవరూ రసహృదయులు కాదని వాపోవుచున్నారు.
నేను అప్పటికీ సుజాత గారికి చెప్పాను ... కానీ వినలేదు ఎం చేస్తాం. ఇక ప్రవీణ్ సుజాత గారిని ఇంకో ఇష్యు వచ్చేదాకా వదలడు ...వి కాంట్ పీక్ ఎనీ తింగ్
గూగుల్ లో క్రింది పదాలు కాపీ పేస్ట్ చేసి చూడండి ఎన్నిలింక్స్ వస్తాయో
praveen sarma బ్యాంక్
నేను హరి గారి బ్లాగ్‌లో ఆంధ్రా బ్యాంక్ గురించి ఎక్కడా వ్రాయలేదు. గూగుల్ బజ్‌లో నా సొంత ప్రొఫైల్‌లో HDFC, IDBI బ్యాంక్‌ల గురించి వ్రాసుకున్న మాట నిజమే. నన్ను తిడుతూ కామెంట్లు వ్రాసినప్పుడు వీళ్లకి సమాధానం చెప్పడం కంటే వేరే పనులు చూసుకోవడం బెటర్ అనుకుని కంప్యూటర్ ఆఫ్ చేసి బ్యాంక్ పనులు చూసుకోవడానికి వెళ్లిన మాటా నిజమే. అంతే కానీ మతం, నాస్తికత్వం గురించిన టాపిక్‌లలో బ్యాంక్ గురించిన విషయాలు వ్రాయలేదు.
నా ఫేవరిట్ సబ్జెక్టైన నాస్తికత్వం విషయంలో అసంగత ప్రస్తావనలు ఎందుకు వ్రాస్తాను? సీతాదేవి టాపిక్ వ్రాసినామె నాస్తికురాలు కాకపోయినా అది మత విమర్శకి సంబంధించిన అంశం కనుక ఆ అంశం మీద ఇంటరెస్ట్ చూపాను. నా ఫేవరిట్ టాపిక్‌లలో అసంగత ప్రస్తావనలు వ్రాయాల్సిన అవసరం నాకేమిటి?
@నీహారిక ... thankyou నీహారిక గారు, నా బ్లాగు లోకి స్వాగతం.
@హరి, శ్రీనివాస్ ... welcome to my blog
@snkr ... hehe
@praveen .. "స్త్రీకి శీలమే ప్రధానం అనే భూస్వామ్య భావజాలాన్ని అప్హోల్డ్ చేస్తున్నారు" ఓహ్ మీరు మహా కమ్యునిస్టు అన్నమాట, నేను లిబెరలిస్ట్ ని ప్రవీణ్ గారు ..కాబట్టి మీరు నేను వాదిన్చుకునే విషయాలు మున్ముందు చాలా వస్తాయి అనుకుంటున్నాను . :)
hai sanju
@ ప్రవీణ్ ...ఈఅసంగత అనే పదం ఎక్కడ నేర్చుకున్నావ్ ఈ మద్య తెగ వాడుతున్నావు
లిబరల్ వ్యవస్థలో మతాన్ని కేవలం వ్యక్తిగత విషయంగా పరిగణిస్తారు. ఇండియాలో అలా కాదు. మతం గురించి వ్యవస్థీకృత అభిప్రాయాలకి భిన్నమైన అభిప్రాయాలు చెపితే మా మనోభావాలు దెబ్బతిన్నాయని వాదించడానికి ఎదురు చూసే గుంట నక్కలు ఉన్నారు. విచిత్రమేమిటంటే మద్యం దుకాణాలకి, మాంసం దుకాణాలకి దేవుళ్లు, దేవతల పేర్లు పెట్టినప్పుడు మనోభావాలు దెబ్బతినవు. కానీ రాముడు నాన్-వెజ్ తిన్నాడు అని ఎవరైనా అంటే అప్పుడు మనోభావాలు దెబ్బతింటాయి.
నీ తెలివి తెల్లారినట్టే ఉంది ... రాముడు మాంసాహారం తింటాడు ప్రవీణు
గతంలో తెలుగు బ్లాగుల్లోనే ఎవరో వ్రాసారు, రాముడు నాన్-వెజ్ తిన్నాడని. అయితే ఏమిటట, ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలా అంటూ చెప్పిన వ్యక్తిని విమర్శించారు. ఇప్పుడు ఒకామె అంత కంటె కాంట్రొవర్శియల్ విషయం వ్రాసింది. అది ఇతరుల దృష్ఠిలో కాంట్రోవర్సీ కావచ్చు కానీ నేను పెద్ద విషయమనుకోను.
నువ్వు పెద్దవిషయం అనుకున్నా నిన్ను జనం పెద్దగా పట్టించుకోరులే ప్రవీణు :D
ప్రవీణ్ అన్నాయి నువ్వు స్త్రీవాదివి కదా! మరి అందరు స్త్రీలని తిట్టే ఆమెని ఎనకేసుకోస్తండావ్ ఏందీ నీ కత
@ప్రవీణ్ గారూ
ఏ లిబరల్ వ్యవస్థలో మతాన్ని వ్యక్తిగత విషయంగా పరిగణిస్తారు? ఏ దేశం? ఏ మతం? కొంచం వివరిస్తారా తెలుసుకోవాలని ఉంది.
లక్కరాజు గారు ముళ్ళ కంప మెడ మీద గుడ్డలు ఆరేస్తున్నారు మీరు కొంచెం చూసుకోండి
@మమామియా గారూ
సారీ అండ్ థాంక్స్.
@ప్రవీణ్ గారూ
sorry to get into your thought process.
సంజూ.. పోస్టు అదిరిపోయింది.
ప్రవీణ్ వచ్చాడా ఇక్కడికీ....నీ పోస్టుకి సహస్రకామెంట్ ప్రాప్తి రస్తు...
హహహ. సంజూ గారూ, కత్తిలా ఉంది పోస్ట్.
ఆవిడ వ్యక్తిగత అభిప్రాయాలు ఆవిడ రాసుకుంది. పురాణాలని ఖూని చేస్తుంది. ఆవిడని ఎవరూ తిట్టకూడదు. మరి కరసేవకులు, అద్వానీ వ్యక్తిగతంగా ఫీల్ అయ్యారు. మరి దానికెందుకు ఈవిడ అద్వాని వచ్చి క్షమాపణ చెప్పాలంటుంది?
@మామామియా, లక్కరాజు, పద్మ గార్లకి ....నా బ్లాగు కి ఆహ్వానం :)
@రక్తచరిత్ర ...మీ భావ వ్యక్తీకరణ లో మీరు వాడిన భాష చాలా ఘాటుగా ఉండటం వాళ్ళ ఆ రెండు కామెంట్స్ డిలీట్ చేసాను, ఏమి అనుకోకండి :)
@సుధ .....thankyou , ప్రవీణ్ చాలా active గా blogging చేస్తున్నారు :)
I am not active nowadays. I didn't read most of the blogs except few like Niharika's blog and Hari's blog. బ్లాగులు ఉన్నదే వ్యక్తిగత అభిప్రాయాలు వ్రాసుకోవడానికి. వ్యక్తిగత అభిప్రాయాలు వ్రాసుకునేవాళ్లపై విషం చిమ్మితే అది తాలిబాన్ తరహా వాదం అవుతుంది.
Recently I posted in "The Invincible Rebel Road" blog supporting blasphemy. ఒకరిద్దరు తమ అభిప్రాయలు చెప్పుకున్నంతమాత్రాన మత వ్యవస్థ కూలిపోదు. మతాన్ని నమ్మాలో, లేదో ఎవరికి వారే వ్యక్తిగతంగా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఈ సోకాల్డ్ ప్రజాస్వామిక దేశంలో లేదు.
@ప్రవీణ్ ... ఈ చెరసాల శర్మ ప్రొఫైల్ కూడా మీదే అనుకుంటున్నాను :)
/*మతాన్ని నమ్మాలో, లేదో ఎవరికి వారే వ్యక్తిగతంగా నిర్ణయించుకునే స్వేచ్ఛ ఈ సోకాల్డ్ ప్రజాస్వామిక దేశంలో లేదు.*/
మీరు మత మార్పిడుల గురించి చదివారా ఎప్పుడయిన ?మధ్య మధ్య లో RSS వాళ్ళు అరుస్తుంటారు చూడండి అది ..మన దేశం లో ఏ మతం ని follow అవ్వాలో నిర్ణయించుకునే స్వేచ్చ ప్రజలకి ఉంది, ప్రజలు క్రిస్టియానిటీ లోకి మారుతున్నారు, ఇస్లాం లోకి మారుతున్నారు, బౌద్ధ మతం లోకి కూడా మారుతున్నారు. ఆ స్వేచ్చ మనకి ఉంది. ప్రజాస్వామ్యం లో ఆ స్వేచ్చ లేకపోతే communist system లో ఉంది అని నమ్ముతున్నారా...అక్కడ వాళ్లకి మాట్లాడే అధికారం కూడా లేదు, cultural revolution గురించి చదివే ఉంటారు, అది ఎలా అంతం అయిందో చదవండి ఒకసారి.
వ్యక్తికీ స్వేచ్చ అక్కర్లేదని నమ్మే communism కన్నా, ఇంకోళ్ళకి చెడు చేయనంత వరకు వ్యక్తి స్వేచ్చ ని allow చేసే liberal వ్యవస్థ చాలా బెటర్
సంజు గారు మీరు చేయాలనుకుంటుంది చర్చ
కానీ అతగాడు చేసేది రచ్చ
చూసే వాళ్లకి ఎక్కుతుంది పిచ్చ
చివరికి మీకు విసుగొచ్చి అంటారు "ఛ"
కామెంట్లు నచ్చకపోతే కామెంట్ మోడరేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ రచ్చ చేసేది కెలుకుడు బ్యాచ్వాళ్లే. మూతపడిన ప్ర.పీ.స.స. బ్లాగ్‌లో కామెంట్లు చదివితే తెలుస్తుంది. ఆన్లైన్లో ఎవడూ ఏమీ పొడవలేడు. No one can stab any other one either he is left-wing communist or right-wing RSS activist.
మూతపడిన బ్లాగ్ లో కామెంట్లు ఎలా చదువుతారు ప్రవీణు :-O
ఆన్లైన్లో ఎవడూ ఏమీ పొడవలేడు నిజమె కానీ వాళ్ళ ఊరి బ్యాంక్ లో మన చుట్టాలు పనిచేస్తూ ఉంటె పొడవగలమా?
ee charchalenti....ee comment lu enti? ni blog vedika paine ayinaa....ivanni ela bharistunnav sanju......chala rojula taruvata ni blog chusi shock ayya!!!niku chala opika ekkuva laa undi...!!
@subhashini....telugu blog world is the most happening place le :)
సంజు గారు,
పోస్ట్ బాగుంది. ఈ రోజే సంకలిని నుండి మీ బ్లాగ్ చూశాను.
@ఫ్రవీణ్:
నాదీ అదే కోరికండీ. ఏదైనా బ్లాగ్ లో మీనుండి సంబద్దమైన వ్యాఖ్య చూడాలని కోరుకుంటున్నా. ఎప్పుడూ టక్కరిదొంగలా నలుగురికీ నచ్చినదీ... అనే పాడుకునేకంటే, మనలో ఏమి తేడా వుంది అని సరిచూసుకోవడం ఎవ్వరికైనా ఎప్పటికైనా అవసరం... బాధిస్తే క్షమించండి.
రెండు నెలల క్రితం నీహారిక గారి బ్లాగ్ చూసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఆ బ్లాగ్ చూస్తే, వారి ఐడీ ఎవరో హాక్ చేసి బ్లాగ్ నడిపిస్తున్నారేమో అని సందేహం వస్తుంది. బ్లాగ్లోకంలో ఎవరో ఏదో సందర్భంలో ఒక వ్యాఖ్య చేశారని వారు ఇంత ఆవేదన చెందడం ఎంత వరకు సమంజసమో అర్థం కావడం లేదు. త్వరలో మరింత రమ్యమైన కుటీరానికి అందరికీ స్వాగతం పలుకుతారని ఆశిస్తూ...
యజ్ఞ
@yagna....thanks for the comments and welcome to my blog :)
@Sanju
1.వ్యక్తికీ స్వేచ్చ అక్కర్లేదని నమ్మే communism కన్నా, ఇంకోళ్ళకి చెడు చేయనంత వరకు వ్యక్తి స్వేచ్చ ని allow చేసే liberal వ్యవస్థ చాలా బెటర్
Well said.
2.ప్రవీణ్ మాట్లాడేవేవీ సంధర్బోచితాలు కావని కొట్టిపారేయలేం. కొన్ని లాజిక్కులు బాగానే తీస్తాడు, కానీ కొండవీటి చాంతాడులా లాగుతూనే ఉంటాడు.
ఇహ నీహారిక విషయానికి వస్తే ఒకవేళ ఆమె బ్లాగు, ఆమె ఇష్టం అనుకుని సీతాదేవిని చిత్రంగా చిత్రీకరించదలచినప్పుడు కామెంట్లను డిసేబుల్ చేసేదియుండె. ఎవరూ ఆమెని కెలికడం, ఆమె మళ్ళీ తన విశ్వరూపం చూఫాల్సిన అవసరం వచ్చేవికావేమో?
Post a Comment