Wednesday, February 23, 2011

జ్ఞాపకాలు

గతస్మృతులు , మధురస్మృతులు పేరుతో జ్ఞాపకాలు దాచుకొని, కొన్ని సంవత్సరాల తర్వాత గుర్తుకు తెచ్చుకుని ఆనందించడం చాలా మందికి అలవాటు. పాత సినిమాలలో చిన్నప్పుడు రాసుకున్న ఉత్తారాలు చూసి అలా రింగుల్లోకి వెళ్ళేవాళ్ళు. అలా రింగుల్లోకి వెళ్లడం భలే చూపించే వాళ్ళు. కాని ఉత్తరాల కన్నా ప్రజలు ఫోటోలలో నే ఎక్కువగా జ్ఞాపకాలు దాచుకుంటారు, దాచుకుని కొన్ని సంవత్సరాల తర్వాతా అవి చూసుకుని, ఒకసార్ రింగుల్లోకి వెళ్లి, ఆ టైం లో వాళ్ళ ఆలోచలనలు, అనుభూతులు గుర్తు తెచ్చుకొని ఆనందించొచ్చు అని  వాళ్ళ ఆలోచన.

కాకపోతే ,  అప్పుడెపుడో ఈ అనుభూతిని తిరిగి ఆనందించాలని, ఆ సమయాన్ని జ్ఞాపకం గా మార్చుకోడం లో పడి ఆ సమయంలో ఉన్న అనుభూతిని మిస్ అవుతాం ఉదాహరణ కి మెరుపులు మెరుస్తుంటే అవి చూడకుండా కెమెరా లోంచి పిక్స్ తీయడానికి ట్రై చేయడం. పోనీ ఏమన్నా professional photography నా అంటే అదికాదు, తొక్కలో mobile cam లోంచి ట్రై చేయడం. పోనీ తీసి అందరికి తర్వాత చూపిస్తారా అంటే అది ఉండదు , కంప్యూటర్ లోకి pics upload చేయడం చేతకాదు,.

ముఖ్యంగా పెళ్ళిళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అసలే పురోహితుడు అలా చెయ్యి ఇలా చెయ్యి అని అరుస్తూ ఉంటే, photographer కూడా ఇలా నుంచోండి, పక్కకి కూర్చోండి , నవ్వండి పువ్వండి అంటాడు. అది ఏ అర్థ రాత్రి పెళ్ళో అయితే ఇంకా మజా ఉంటుంది చూడటానికి. పెళ్ళికొడుక్కి, పెల్లికూతురుకి నిద్ర వచ్చేస్తు ఉంటుంది, function hall లో అందరు కుర్చీలు జరిపెసుకుని మీ పెళ్లి కన్నా నా నిద్రే నాకు ముఖ్యం అని వధూవరుల ముందే నిద్రపోతుంటారు. అసలే మగత నిద్ర లో ఉన్న వధూవరులు, హోమం ముందు కూర్చొని, చెమటలు కక్కుతూ, పురోహితుడిని భరిస్తూ ఉంటే, photographer వచ్చి , నవ్వండి అంటాడు, ఆ టైం లో వాళ్ళ నవ్వు చూడాలి, వాళ్ళ జీవితాల మీద వాళ్ళే విరక్తిగా నవ్వుతునట్టు ఉంటుంది. ఈ గోలంతా 20 ఏళ్ళ తర్వాతా ఆల్బం తీసి, చూసుకుని ఆనందిస్తారు Smile . అప్పుడు ఆల్బం తీసి చూడగానే ఆ వాళ్ళకి పెళ్లి అయ్యింది ఇద్దరు ఒక్కటయ్యారు అన్న అనుభూతి గుర్తు వస్తుందో లేదో కాని నా లెక్క ప్రకారం ఆ ఫోటోగ్రాఫర్ మొహం మాత్రం గుర్తువస్తుంది.

జరుగుతున్న event ని ఫోటోలు తియ్యి అంటే ఆ ఫోటోగ్రాఫర్ కి రాదు, ఒక్క నిమిషం ప్రపంచం అంతా వాడికోసం ఆగితే ఒక ఫోటో తీసి, ముందుకు వెళ్ళడానికి మనకి అనుమతి ఇస్తాడు.

ఇక పుట్టినరోజు పండుగాలది ఒక గోల,  పాడటం చేతకాకపోయినా birthday song పాడుతునట్టు పెదాలు కదపడం ఒక కళ, అలానే పుట్టినరోజు చేసుకుంటున్న వాడు మన నోట్లో ఇంకా కేకు ముక్క పెడుతుంటే వెంటనే ఫోటో తియ్యకుండా ,  ముందుకి వెనక్కి జరిగి కింద కూర్చొని ఒక పిక్ తీస్తాడు చూడండి….. అప్పుడు వచ్చే చిరాకు దాచడం కూడా ఒక కళే. ఫ్లాష్ వచ్చేదాకా చేతిలో కేకు నోట్లోకి వదలకుండా పట్టుకుంటారు , పెడితే నోట్లో పెట్టాలి, లేకపోతే మానెయ్యాలి, నోటిదాకా తీసుకు వచ్చి ఆపేస్తారు , మండుతుంది నాకు ,  ఒకవేళ అది పెద్ద కేకు ముక్క అయితే పర్లేదు, కొంతమంది చిన్న ముక్క తీస్తారు, ఫోటో కోసం pose ఇవ్వడం లో వాళ్ళ వేళ్ళు పేదలకి తాకుతూ ఉంటాయి, వింత వింత గా ఉంటుంది అసలు.

మొన్న బ్రయాన్ ఆడమ్స్ లైవ్ షో ఉంటే వెళ్ళా…అక్కడికి వచ్చిన అభిమానులు mobile camera తో ఎక్కడో 200 అడుగుల దూరం లో ఉన్న బ్రయాన్ ఆడమ్స్ ని , వాళ్ళ స్నేహితులని ఫోటోలు తీస్తూ ఉండిపోయారు, పాటలు ఎంజాయ్ చేయకుండా. కాని ఒక group of friends మటుకు , చాలా ప్రశాంతంగా పాటలని చిన్నగా పాడుతూ మొదలు పెట్టి , అలా అలా నాట్యం చేయడం మొదలు పెట్టారు. ఏదో ఇష్టం వచ్చినట్టు కాకుండా పాటకి తగ్గట్టుగా couples గా విడిపోయి salsa చేయడం మొదలు పెట్టారు.  Happy feet movie లో ఒక డైలాగ్ ఉంటుంది dancing is nothing but singing with whole body అని …దాని అర్థం అప్పుడు అర్థమయింది నాకు. ఆ గ్రూప్ కి ఇది గుర్తుండే జ్ఞాపకం.  వాళ్ళకి ఈ జ్ఞాపకం గుర్తు తెచ్చుకోడానికి ఫోటోలు అక్కర్లేదు.

ఫోటోలు తీసే వాళ్ళే కాదు, తీయించుకునే వాళ్ళు కూడా హింస పెడతారు. ఏదన్నా మంచి లొకేషన్ ఫోటో తీస్తుంటే అడ్డంగా నుంచొని ఫోటో తియ్యరా నాకు అని , అది కూడా వాడి standard pose and smile తో, జీవితం లో అన్ని ఫోటోలకి అవే వాడతాడు, నాలుగు ఫోటోలు తీస్తే తీసేవాడికి కూడా బోర్ కొట్టేస్తుంది. లొకేషన్ ఎంత బాగున్న pair of eyes staring at the camera will spoil everything.  ఇక ఒక గ్రూప్ కి ఫోటో తీస్తుంటే, వెకిలి చేష్టలు కూడా బోర్ కొడతాయి, నాలిక బయటపెట్టడం, పక్కనోళ్ళకి bunny ears  పెట్టడం etc etc.

చాలా సార్లు గుర్తుపెట్టుకోవలసిన అంశం మనలో ఉండదు. ఉదాహరణకి ఒక టూర్ కి వెళ్తునపుడు , ఒక మంచి landscape చూసినపుడు, అవి చూసినపుడు ఆనందించిన అనుభూతిని తిరిగి ఆనందించాలంటే వాటిని చూడాల్సిందే. కాని కొన్ని సార్లు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం మనలోనే ఉంటుంది. birthday party కి నా స్నేహితులు ఇంతమంది వచ్చారు, ఇంత గోల చేసాం అన్న విషయం ఫోటోలో పొందుపర్చలేము, అది అనుభూతి, ఆ సమయం లో ఆ అనుభూతిని ఎంజాయ్ చేస్తేనే తర్వాత ఆ ఫోటో చూసినా తిరిగి ఆ అనుభూతి వచ్చేది. వచ్చిన వాడిని సరిగ్గా పలకరించకుండా ఫోటోలు తీసుకుంటే ఎం లాభం, అపుడు పుట్టినరోజు ఈ ఫోటో తీస్తునపుడు ఫోటోగ్రాఫర్ మొహం ఇలా పెట్టాడు అని గుర్తు ఉంటుంది తప్ప ఇంకేం గుర్తుకు వస్తుంది.

13 comments:

Raj said...

చాలా బాగా చెప్పారు.. హ అహహా హ్హా.. బాగా అబ్జేర్వ్ చేసి మరీ చెప్పినట్లుంది.. గుడ్.

ప్రవీణ said...

బాగా రాసారు...కానీ ఒక్క విషయం..పాపం పెళ్లి చేసుకునే వాళ్ళకు నిద్ర రాదండీ..ముందుంది
Crocodiles ఫెస్టివల్ అన్న సంగతి తేలిక పాపం జోరుగా హుషారుగా వుంటారు..

B'day మాత్రం సూపర్ duper గా రాసారు

tankman said...

@రాజ్ ... thakyou :)

@praveen kolli.... thankyou ...nenu konni 2am , 3.30 am ముహుర్తాల పెళ్ళిళ్ళకి వేల్లనండి...అక్కడ పరిస్తితి అదే...మా cousin అయితే పెళ్లి పీటల మీద ఆవలించాడు విచిత్రంగా ..హహ

sindhu said...

Good post sanju. Naku matram ma wedding photographer face asalu gurtu ledu bt vaadu chesina panulu matram baga gurtunnayi.

Btw photography, pics teesevallu, thiyinchukune vallu gurinchi mention chesi, how can u forget mentioning 'Photo Guru Sam'???

సుజాత వేల్పూరి said...

పెళ్ళిళ్ళలో ఈ మధ్య ఫొటో గ్రాఫర్, వీడియో గ్రాఫర్ల హడావుడి వధూవరుల బంధువులకంటే ఎక్కువగా ఉంటుంది.

మా చెల్లెలి పెళ్ళిలో జీలకర్ర బెల్లం సమయంలో అడ్డుగా నిలబడిన ఫొటో గ్రాఫర్ ని కొంచెం జరగమంటే అతడు " తర్వాత వీడియోలో చూడండి మేడమ్" అన్నాడు నాతో!

అలాగే మరో పెళ్ళిలో అప్పగింతలప్పుడు వధువు ఏడుస్తుంటే వీడియో సరిగ్గా తీయలేదని ఆ వీడియో గ్రాఫర్ "ఏదీ, కొంచెం మళ్ళి ఏడువు తల్లీ, సరిగా తీయలేదు ఇందాక " అన్నాట్ట పెళ్ళికూతురుతో

హాపీ ఫీట్ లో డైలాగ్ నాక్కూడా చాలా ఇష్టం!ఆ బుజ్జి పెంగ్విన్...!

Anyway, nice observation! Some of them are my own experiences too!

కృష్ణప్రియ said...

Totally agreed :) పూర్వం ఏదో ఒకరిద్దరు ఉండేవారు కెమెరా తో.. ఫంక్షన్లలో.. ఇప్పుడు మరీ ప్రతి వాళ్ల చేతుల్లో మొబైల్ కెమెరాల దగ్గర్నించీ digital SLRs దాకా!.. ఎవ్వరికీ అడ్డు రాకుండా.. అతి జాగ్రత్త గా ఒక మూలాన పడి ఉండాలి. :)

krishna said...

@ సుజాత గారు ,
:)

కౌటిల్య said...

"జరుగుతున్న event ని ఫోటోలు తియ్యి అంటే ఆ ఫోటోగ్రాఫర్ కి రాదు, ఒక్క నిమిషం ప్రపంచం అంతా వాడికోసం ఆగితే ఒక ఫోటో తీసి, ముందుకు వెళ్ళడానికి మనకి అనుమతి ఇస్తాడు."

సూపర్గా చెప్పారు...నా ఆధ్వర్యంలో జరిగే పెళ్ళిళ్ళి వేటిల్లో కూడా ఆ కెమేరా వాళ్ళ ఆటలు సాగనివ్వను...ఒక పక్కన నిల్చొని తియ్యాల్సిందే...ః)...

"ఫోటోలు తీసే వాళ్ళే కాదు, తీయించుకునే వాళ్ళు కూడా హింస పెడతారు. ఏదన్నా మంచి లొకేషన్ ఫోటో తీస్తుంటే అడ్డంగా నుంచొని ఫోటో తియ్యరా నాకు అని , అది కూడా వాడి standard pose and smile తో, జీవితం లో అన్ని ఫోటోలకి అవే వాడతాడు,"...

ఇది ఇంకా సూపరు...మా ఫ్రెండ్స్ లో ఇట్టాంటోడు ఒకడున్నాడు..చావదొబ్బేస్తుంటాడు...

tankman said...

@sindhu....sam gurinchi prapanchame nemmadigaa telusukovali :)

@sujatha....ఆ ఫోటోగ్రాఫర్ లో మంచి హాస్యం ఉంది కదా

@కృష్ణప్రియ ...మీరన్నది నిజమే ...mobile camera లకి కూడా ఫ్లాష్ రావడం తో ఎక్కడ చూసిన మెరుపులే మెరుపులు.

@కౌటిల్య ... welcome to my blog ...కెమెరా కనబదితే చేతికి ఇచ్చి ఫోటో తియ్యమని కొంతమంది హింస పెట్టేస్తూ ఉంటారు.

Prasanna Dommu said...

బాగా చెప్పావు అబ్బాయీ.... ప్రకృతిలోని ప్రతీ అందాన్నీ, జీవితంలోని ప్రతీ అనుభూతినీ కెమేరాలో భందించాలి అనుకోటం మన అమాయకత్వం

కానీ తమకోసం కన్నా Facebook, Orkut కోసమే బ్రతికేవాళ్ళకి ఇది అలవాటే

tankman said...

@prasanna... :)

కథాసాగర్ said...

బాగా రాసారు...
పెళ్లి తంతు లో మీరు చెప్పేవన్నీ జరిగేవే...
కౌటిల్య గారు చెప్పినట్లు ఫోటోగ్రాఫర్లు కొన్ని సార్లు మనం చెప్పే విషయాల కన్నా వాళ్ళ క్రియేటివిటి కే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు..
ఈ టపా చదివాక నా పెళ్లి కి ఫోటో గ్రాఫర్ అక్కర్లేదనిపించింది.మనమే ముందుగా ఒక ప్లానింగ్ తో కొందరు క్రియేటివిటి ఉన్న స్నేహితులని సమకూర్చుకుని పెళ్లి మొత్తాన్ని కూడా దూరం నుంచి జూమ్ చేస్తూ వీడియో కవరేజ్ చేసి ...తరువాత అందులో మనకు నచ్చిన స్తిల్ల్స్ ను ఎడిట్ చేసి మనమే ఫోటో ఆల్బం తాయారు చేసుకుంటే సరి.

అయిన టెక్నాలజీ బాగా డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో ఫోటో గ్రఫర్స్ లేకుండానే పెళ్ళిలకు, ఫంక్షన్లకు ఫోటోలు ఈజీ గా కవర్ చేయవచ్చనుకుంటాను.

అయితే ఒక విషయం...
అన్ని మనమే చేసుకుంటే ...ఫోటోగ్రాఫర్లు మాత్రం ఎలా బతుకుతారండి..

tankman said...

@కథాసాగర్ ... లేడీస్ టైలర్ సినెమా లో థం లాగా కదులుతున్న మనుష్యులకి ఫోటోలు తీయలేని వాళ్ళంతా passport size ఫోటోలు తీస్తూ బ్రతికేస్తారు లెండి :)