నేను మూడో క్లాసు లో ఉండగా ఒక వెధవ నా చేతిలో ఒక చిన్న కాగితం ముక్క పెట్టి పోయాడు....దాన్లో మాటర్ ఏంటంటే .... నీకు కాళికామాత మాత మంచి చెయ్యాలంటే ఇలాంటివే ఇంకో 18 చిట్టీలు చేసి అందరికి పంపు , లేకపోతే నీకు చదువు రాదు అని .... ఎందుకొచ్చిన గోడవలె అని రాయడం మొదలు పెట్టా ...... మొదటిది రాయడం అవ్వగానే భక్తీ పోయింది....రెండోది రాసే సరికి భయం పోయింది....మూడోది రాస్తూ ఉండగా ముందు boredom , ఆ తర్వాత బద్ద్దకం ఆ వెంటనే నాస్తికత్వం నాలో ప్రవేశించాయి ..... ఈ తంతు ఇక్కడితో ఆగలేదు, ఇంత పెద్దయ్యాక orkut లో scraps పంపకపోతే నాశనం అయిపోతావ్ అని వస్తునాయి .. ఇలాంటివే మరికొన్ని ..
Facebook లోను, SMS లోను కొత్తగా ఒక మెసేజ్ forward అవుతోంది. లోక్పాల్ బిల్ ని ఆమోదించడానికి ప్రభుత్వం 25 కోట్ల మంది భారతీయుల అంగీకారం ఉండాలని condition పెట్టింది అని , అంగీకారం తెల్పదల్చుకున్న వాళ్ళు ఒక నెంబర్ కి (02261550789) missedcall ఇస్తేచాలు అని .... నిజానికి ప్రభుత్వం అలా ఏమి కోరలేదు....అది ఒక NGO వారు చేపట్టిన అభిప్రాయ సేకరణ లాంటిది. లోక్ పాల్ , భారతదేశం లో లంచగొండితనం , అన్న హజారే , ఇలా కొన్ని keywords చదవగానే మెసేజ్ ని forward చేసేస్తారు. ఎవరినా మీకు ఇలా forward చేసారు అంటే ఆ వ్యక్తి sports page, page3 and movie page తప్ప వార్తా పత్రికలో ఇంకేమి చదివే అలవాటు లేదని మనం ఒక అభిప్రాయం ఎర్పరుకోవచ్చు ....
పెట్రోల ధర పెరిగిన ప్రతీ సారీ, ఒక set of forwarded emails వస్తూ ఉంటాయి. నేపాల్ లో పెట్రోల్ 26 రూపాయలు, పాకిస్తాన్ లో 30 రూపాయలు అంటూ ఇంకా కొన్ని దేశాలలో పెట్రోల్ ధరలు ఇచ్చేసి ....మన అవినీతి భారత ప్రభుత్వం , కొన్ని ప్రైవేటు సంస్థలు లాభాలు ఆర్జించడం కోసం ఇలా అధిక ధరలు సామాన్య మానవుడు/ భారతీయుడు మీదకి తోసేస్తోంది అని ......అసలు ఆ మెయిల్ లో ఇచ్చిన ఆయా దేశాల లో పెట్రోల్ ధరలు correct అవునా కాదా మనకి తెలియదు....భారత దేశం రూపాయి విలువ, నేపాల్ రూపాయి విలువ వేరు వేరు అన్న విషయం గుర్తుకురాదు, ప్రతి దేశం లో పెట్రోల్ వనరులు ఉంటాయని, ఆ వనరులు ఆ దేశం కి సరిపోకపోతేనే ఇంకో దేశం నుంచి దిగుమతి చేసుకుంటాయని , అలా ఎక్కువ పెట్రోల్ దుగుమతి చేసుకుంటే పెట్రోల్ ధర (రాయితీ పోగా ) పెరుగుతుందని అర్థం కాదు. భారతదేశం లో పెట్రోల్ retail లో ప్రభుత్వ రంగ సంస్థలు అయిన HP , Indian Oil, BP లదే ఆధిపత్యం అని (Reliance share చాలా తక్కువ ...అది కూడా కేవలం గ్యాస్ మాత్రమే అమ్ముతోంది reliance petrol bunks లో ) , ఇవి ప్రైవేట్ సంస్థలు కావు అన్న విషయం కూడా తెలియదు. పెట్రోల్ ధర పెంపు , సామాన్యుడి మీద భారం, అవినీతి భారత ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల లాభార్జన లాంటి keywords కనబడగానే అందరికి ఆ మెయిల్ forward చేసి, ఒక గొప్ప నిజాన్ని కనుగోన్నవాడిలా పక్క వాడితో మన రాజకీయ నాయకులు ఎంత దుర్మార్గులో మొదలు పెడతాడు.
lunch for Rs 5, dinner for Rs 7 , free electricity etc etc బోలెడు ఇచ్చి ....ఇవన్ని ఎవరికో తెలుసా ...నెలకి 80 వేలు జీతం ఉన్న మన MP's కి అని ఒక sms మీకు కూడా వచ్చిందా..... లంచ్ సంగతి డిన్నర్ సంగతి తెలియదు కాని , member of parliament జీతం మటుకు నెలకి 50వేలు ... 80 వేలు కాదు ...
ఇపుడు Gtalk లో ప్రశాంతంగా ఉంది కాని, అంతకు ముందు yahoo messenger లో రోజు " ఫలానా పిల్లాడికి గుండెల్లో రంద్రం ఉంది ... వైద్యానికి డబ్బులు లేవు , ఈ మెసేజ్ ఎంతమందికి forward చేస్తే యాహూ అన్ని పైసలు ఆ పిల్లవాడికి చేరవేస్తుంది , మానవత్వం తో ఈ మెసేజ్ అందరికి పంపు " అని బాగా వచ్చేవి....మెయిల్స్ కూడా బాగా వచ్చేవి....ఇలాంటి వాటికి వెక్కిరింతగా ...ఒక చిన్నపిల్ల స్కూల్ లో పెన్సిల్ పారేసుకుంది అని , పెన్సిల్ లేకుండా ఇంటికి వెళితే వాళ్ల అమ్మ బాగా కొడుతుంది అని , ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే వచ్చిన డబ్బులతో ఆ పిల్ల పెన్సిల్ కొనుక్కుని దెబ్బలు తప్పించుకోవచ్చని ఒక మెసేజ్ వచ్చింది.....
ఈ మధ్య ఇంకో గోల మొదలయింది....ఈ SMS/scrap next 10 min ఇంకో పది మందికి పంపకపోతే నువ్వు ప్రేమించినవారు నీకు దక్కకుండా పోతారు , పంపిస్తే ఈ ఆదివారం లోగా ఒక మంచి వార్త వింటావు అని ... ఇక్కడ keyword ప్రేమించినవాళ్ళు దక్కకపోవడం .
ఎప్పటికి ఆగుతాయి ఇలాంటివి ?

8 comments:
ఈ పోస్ట్ కి కామెంట్ పెట్టకపోతే నాకేమయినా జరుగుతుందో లేదో మీరు చెప్పలేదు. ఎందుకొచ్చిన గొడవ అని కామెంట్ పెట్టేసా :))))))
25 కోట్ల మంది అభిప్రాయం ఫోన్లో చెప్పాలా? ఫోన్ సౌకర్యం లేని మెజారిటీ పల్లెటూరి ప్రజలకీ, ఆఫీస్లో రెండు మూడు ఫోన్లు పెట్టుకునే పట్టణ వ్యాపారులకీ మధ్య తేడా మన పాలకులకి తెలియదేమో. ఇలా చూస్తే మన దేశంలో 85% మంది దగ్గర ఫోన్లు ఉండవు. ఫోన్లు లేనివాళ్ళు ఫోన్లో చెప్పేదొకటి.
Praveen Sarma http://patrika.teluguwebmedia.in
ఈ మధ్య ఇలాంటి forward mail ఒకటి AOL పేరుతో వచ్చింది. సర్లే కదా అనూరుకుంటే జనాలు reply-all చేసేస్తున్నారు. ఇక వుండబట్టలేక కొంచెం serious tone లో జ్ఞానబోధ గావించాను spam mailsని నిరోధించడానికి I.T. ఎంతడబ్బు ఖర్చుచేస్తోంది సాలీనా, AOL కి అలా forward చేస్తే తప్ప (forward చేస్తే ఎలా తెలిసిపోతుంది అన్నది వేరేవిషయం)ధన సహాయం చేయలెని స్థితిలో వుందా అనే విషయాలగురించి reply-allలో.
good one.
"ఒక చిన్నపిల్ల స్కూల్ లో పెన్సిల్ పారేసుకుంది అని , పెన్సిల్ లేకుండా ఇంటికి వెళితే వాళ్ల అమ్మ బాగా కొడుతుంది అని , ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే వచ్చిన డబ్బులతో ఆ పిల్ల పెన్సిల్ కొనుక్కుని దెబ్బలు తప్పించుకోవచ్చని ఒక మెసేజ్ వచ్చింది"
కేక. సాధారణంగా అమెరికాలో ఒక టీవీప్రకటన వస్తూ ఉంటుంది. ఏదో అఫ్రికా దేశంలో పిల్లలు తిండి లేక మాడిపోతున్నారు. మీరు నెలకి 10 డాలర్లు ఇస్తే వాడికి తిండి, చదువు, ఆరోగ్యం అన్నీ అబ్బుతాయి - ఇలా. వాలువీధి కుప్పకూలిన తొలిరోజుల్లో యూట్యూబులో ఒక పేరడీ విడియో పెట్టారు. ఒక ఇన్వెస్ట్మెంట్ బేంకర్ని ఎడాప్ట్ చేసుకోండి, నెలకి కనీసం మిలియన్ డాలర్లు విరాళం ఇవ్వండి అని.
బాగా చెప్పారు! నేను కూడా ఒకసారి చాలా విరక్తి వచ్చి ఈ పోస్ట్ రాసా! :P
http://madhuravaani.blogspot.com/2010/02/blog-post_11.html
@shankar... :)
@praveen sarma ... our politicians are aware of it but not the ones who are forwarding that message
@indian minerva ... reply all badhitulaa :D
@kottapaali ... thankyou , poni ala tv lo ad vaste evado mosam chestunnadule anukovachu....kaneesam vadikanna labham vastundi kada...ilanti vati valla negative feeling tappa emi ravatledu
@madhuravani .... haha mee katha bagundi :)
Ha ha ha ! Loved this post.
@sujata ... thankyou :D
Post a Comment