మీలో ఎవరికైనా తెలిస్తే కాస్త చెప్పండి..నేను కూడా ఆ కోణం లోంచి చదివి అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రశ్నకి సమాధానం నేను ఎప్పటినుంచో వెతుకుతున్నాను కాని నాకు సరిగ్గా అర్థం కాలేదు.
మహాప్రస్థానం కి చలం ముందు మాట చదివి నేను చలం పట్ల చాలా impress అయ్యాను. ఆ తర్వాత చలం పుస్తకాల గురించి నాకు మొదట వచ్చిన review "బూతు పుస్తకాలు" అని. ఆ చెప్పిన వ్యక్తీ పుస్తకాల అభిరుచి మీద నాకు పెద్దగా నమ్మకం లేకపోవడం వల్ల నేను పెద్దగా పట్టించుకోలేదు.
మొదటగా మైదానం చదివాను. మొదట్లో వింతగా అనిపించినా పుస్తకం చివరకి వచ్చేసరికి ....ప్రాణాలు ఇచ్చెంతాలా ఒకరి కన్నా ఎక్కువ మందిని ప్రేమించోచ్చు అన్న విషయం చెప్పదలచుకున్నాడు అనిపించింది. నాకా point మీద కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ... బాగానే ఉంది అనుకున్నాను.
తర్వాత శశిరేఖ చదివాను. ప్రేమ పట్ల confusion లో ఉన్న అమ్మాయి జీవితం మీద కథ అనిపించింది. ఒక వ్యక్తీ ఆదరిస్తున్నా, శ్రుంగారం కోసం ఆరాధిస్తున్నా ప్రేమ అనుకునే అమ్మాయి కథ అనిపించింది. మంచి పుస్తకం అన్న ఫీలింగ్ వచ్చింది.
బ్రాహ్మణీకం మూడో పుస్తకం. మొత్తం ఎలా ఉన్నా , ఎవరమ్మా మీరు అన్న ప్రశ్నకి మేము బ్రాహ్మలం అని తను సమాధానం ఇవ్వడం, బ్రాహ్మణుల మీద ఎప్పటినుంచో ఉన్న కోపం ఒక్కసారిగా బయటకి వచ్చి ఆ ముసలాడు మోసం చేయడం బాగా ఆలోచింపజేశాయి. బాగుంది అనుకున్న చివర్లో ..
కాని అప్పటికే చలం పుస్తకాల మీద ఒక అభిప్రాయం ఏర్పడింది. చలం తన పుస్తకాల ద్వారా love , lust ఒక్కటే అని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడు అనిపించింది. సమాజపు కట్టుబాట్లకి , పెళ్ళికి వ్యతిరేకి అనిపించింది. బ్రాహ్మణీకం, మైదానం ద్వారా చలం మతానికి, కులానికి తనకి ఉన్న వ్యతిరేకత చాటాడు అనిపించింది. కాకపోతే చలం పుస్తాకలలో హీరోయిన్ ఎప్పుడు ముసలి అవ్వదు, కథ మొత్తం తను యవ్వనం లో ఉన్నప్పుడే జరుగుతుంది. బ్రాహ్మణీకం లో తప్ప ఎక్కడా హీరోయిన్ కి పిల్లలు పుట్టరు. తను ప్రేమించిన వ్యక్తీ ఇంకో స్త్రీ తో ప్రేమలో ఉన్నా పెద్దగా బాధపడదు. ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోడం, ప్రేమించిన వ్యక్త్రి గురించి care తీసుకోడం, ఆ వ్యక్తీ తో రోజువారి జీవితాన్ని పంచుకోడం లాంటివి చలం definition of love లో అసలు లేవు. Love is nothing but lust అని చెప్పడానికి బాగా ట్రై చేస్తాడు అనిపించింది.
తర్వాత అరుణ చదివాను. story of a playgirl అనిపించింది. ఆ పుస్తకం లో హీరోయిన్ పెళ్లి అయ్యాక తన పాత ప్రియుడ్ని కలవడానికి వస్తు వస్తు ట్రైన్ లో మరొక వ్యక్తిని ప్రేమలోకి దింపుతుంది. ఏంటో వెరైటీ పుస్తకంఅనిపించింది. ఈ పుస్తకం లో హీరోయిన్ చేసే పనులన్నీ ...ఒక మగవాడు చేసి ఉంటె వాడ్ని స్త్రీలోలుడు, చెడ్డవాడు , నీచుడు, ఆడవాళ్ళని ఒక వస్తువులా వాడుకుంటాడు అని అంటారు. మరి అదే పని ఒక స్త్రీ మగవాళ్ళతో చేస్తే మంచి పని అయిపోతుందా ? అలాంటి స్త్రీని "పురుష లోలి" అనొచ్చేమో ...
ఇంతలో కొంతమంది రంగనాయకమ్మఅభిమానులు పరిచయం అయ్యారు. వాళ్ళు చలం పుస్తకాలు స్త్రీవాదం ని support చేస్తాయని, అది అభ్యుదయ సాహిత్యం అన్నారు. ఇదెక్కడి స్త్రీవాదమో నాకర్థం కాలేదు. స్త్రీవాదం అంటే నేను అప్పటిదాకా సమాన హక్కుల కోసం పోరాటమో, స్త్రీలని తక్కువ చేసి చూడటాన్ని వ్యతిరెంకించడం లాంటివి అనుకున్న. స్త్రీవాదం అంటే proposing open relationships అని తెలియదు. మధ్య మధ్య కొన్ని వాక్యాలు తప్ప మొత్తం కథ లో స్త్రీ స్వేచ్చ అంటే commitment లేకుండా ఆ సమయానికి ఎవరు నచ్చితే వాళ్ళని ప్రేమించడం అని ఉంటుంది. మరి వీళ్ళందరికీ orange మూవీ కూడా నచ్చిందేమో తెలియదు.
ఈ విషయం మీద ఇంకొంచం దీర్ఘంగా ఆలోచించగా అసలు చలం మీద సందేహాలు వచ్చాయి. అసలు ఈ పుస్తకాలు అన్ని వెటకారంగా రాసినవేమో అనిపించింది. అంటే మీ ప్రియురాళ్ళు, భార్యలు ఇలా తిరిగితే ఎలా ఉంటుందో అర్థం అయింది కదా....కాబట్టి ముందు మీరు ఇలా చెడు తిరుగుళ్ళు ఆపండి అని మగవాళ్ళకి సందేశం ఇవ్వాలని అనుకున్నాడేమో అనిపించింది.
చలం మ్యూజింగ్స్ గురించి చాలా విన్నాను. అది చదవాలని ఉంది. కాని అది కూడా ఇలా మిగతా చలం పుస్తకాల లాగే ఉందేమో అని సందేహం. అసలు ముందు చలం సాహిత్యం స్త్రీవాద సాహిత్యం ఎలా అయ్యిందో అర్థం చేసుకుని కాని మిగతా చలం పుస్తకాలని చదవొద్దు అనుకొన్నా ...ఎవరికినా చెబితే ...తెలుసుకుని ఆనందిస్తాను.
19 comments:
ముందస్తుగా చలం రాతల్ని చదివి వాటిని గురించి లోతుగా ఆలోచించాలని ఉద్దేశించి, చదువు మొదలెట్టినందుకు అభినందనలు.
నావి కొన్ని సలహాలు -
1) చలాన్ని ఎలాచదవాలి అని ఇంకెవర్నీ అడక్కండి. ఎవరన్నా చలాన్ని ఇలాగే చదవాలి అని చెబితే అస్సలు నమ్మకండి. ఎవరన్నా అలా చెప్పారూ అంటే వాళ్ళకి చలం 1% కూడా అర్ధం కాలేదని నేను గేరంటీగా చెప్పగలను.
2) చలాన్ని మీ పద్ధతిలోనే చదివి మీకు తోచినట్టే అర్ధం చేసుకోండి. ఆ పద్ధతిలో మీకు అయోమయం (కంఫ్యూజన్) కలిగితే ఆ అయోమయంకూడా మీ అవగాహనలోని భాగమే. తప్పుకాదు.
3) చలం దగ్గర దగ్గర 70 పుస్తకాలు రాశాడు. అందులో చలా మట్టుకి బ్రాహ్మణీకం వంటి చిన్న నవలికలు. కొన్ని కథల సంపుటులు, కొన్ని నాటకాలు ఉన్నాయి. దేనికదే. బిడ్డల పెంపకం, ప్రేమలేఖలు, మ్యూజింగ్స్, ఇలాంటివి కొన్ని నాన్-ఫిక్షన్. ఈ నాన్-ఫిక్షన్లో మీకు వేరే చలం కనబడతాడు. వీటన్నిటిలో దేనికదే.
4) మీరు బహుశా 20లలో ఉన్నారనుకుంటాను. పదేళ్ళ కోసారి మీ వీలుని బట్టి చలం రచనల్ని మళ్ళి చదవండి.
5) ఈ రచనలన్నీ ఆయన సుమారు 1920-1950 ల మధ్య రాశాడు. ఇప్పుడీ ఇరవయ్యొకటో శతాబ్దంలో బతుకుతూ ఆహా మేమే నవ్యాధునికులం అని విర్రవీగేవారి అభిప్రాయాల్ని చూస్తే, చలం ఎప్పుడో 60 - 90 ఏళ్ళ కిందట ఇంత విప్లవాత్మకమైన (సాంఘికంగా) ఆలోచనలు రాసి అక్షరబద్ధం చేశాడని మనం గుర్తు చేసుకోవాలి.
6) వస్తువు సంగతి ఏమైనా, చలం రాసిన తెలుగు వచనం సరళంగా అందంగా హాయిగా ఉంటుంది. చక్కటి తెలుగు వచనం పరిచయం చేసుకోవడానికి చలం రచన మంచి ఉదాహరణ (మ్యూజింగ్స్ తప్ప).
7) ఈ బ్లాగు చూడండి.
కలం కలలు.
నేను కూడా ఈ మధ్య చలం పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. మొదటగా చదివింది మైదానం. అరవై ఏళ్ళ ముందే ఇతను ఇంతలా అలోచించాడంటే నిజంగా అది ఒక అద్భుతమే!
మీ ప్రయాణం అలాగే సాగించండి.
నేను ఓ ఎనిమిదేళ్ళ క్రిందనుకుంటా మైదానం చదివానండీ. కొంచెం నచ్చింది కొంచెం నచ్చలేదు. ఈయన పాత్రల్లో కనిపించే ధైర్యం చాలా నచ్చింది. By the way మనం ఎంతసేపూ నచ్చింది నచ్చింది అని చెప్పడమేనా అసలెప్పుడైనా అలా వుండగలిగేందుకు ప్రయత్నిస్తామా మరీ అంతొద్దనుకుంటే అలా వుండెవారెవరైనా ఎవరైనా తారసపడితే మనతీరెలా వుంటుంది? మావూళ్ళో అప్పట్లో అది దొరకటమే చాలా ఎక్కువ కాబట్టి మిగతావి చదవలేదు.
చలం పుస్తకాలు చదివి మాత్రమే చలాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. అర్థం కానివేవైనా ఉంటే ఇంకొకరిని అడిగి కన్ ఫ్యూజ్ కాకుండా అక్కడితో వదిలేయండి. కొన్నాళ్ళయ్యాక మీకే కొత్త అర్థం తోచవచ్చు.
చలం రాసిన కథలు కొన్ని చాలా బాగుంటాయి. శేషమ్మ,శమంతకమణి తో ఇంటర్ వ్యూ, మణి, ఇంకా చాలా! అవి కూడా వీలైతే చదవండి.
చలాన్ని చదవకుండానే మోసేసేవారి నుంచి, చదవకుండానే ఉత్తి పుణ్యానికి తిట్టిపోసేవారినీ దూరంగా ఉంచండి.
అలాగే చలం పుస్తకాలన్నీ నచ్చాలని రూల్లేదు.ఒకటి చాలా బాగా నచ్చితే మరొకటి మొదట్లోనే బోరు కొట్టవచ్చు. మ్యూజింగ్స్ చదవాలంటే మీకు చాలా ఫ్రీ టైము కావాలి.(my perspective)
ఇవన్నీ నేను ఫాలో అయ్యాను మరి!
<< అసలు ఈ పుస్తకాలు అన్ని వెటకారంగా రాసినవేమో అనిపించింది. అంటే మీ ప్రియురాళ్ళు, భార్యలు ఇలా తిరిగితే ఎలా ఉంటుందో అర్థం అయింది కదా....కాబట్టి ముందు మీరు ఇలా చెడు తిరుగుళ్ళు ఆపండి అని మగవాళ్ళకి సందేశం ఇవ్వాలని అనుకున్నాడేమో అనిపించింది.
========================================
Exactly, నాక్కూడా ఇలానే అనిపించింది మైదానం చదవగానే. జనాలందరూ అదో మహా కావ్యం అంటుంటే .. వెతికి వెతికి చదివా. అది చదివిన తరువాత మిగిలినవి చదవాలి అన్న కోరిక అంతటితో నశించి పోయింది.
నాకు మాత్రం మైదానాన్ని E.V.V గారి జంబలకడిపంబ సినిమాతో పోల్చాలనిపిస్తుంది.
రెండింటి కాన్సెప్టు ఒక్కటే.. ఆడవారు అనుభవించేవి మగవారు అనుభవిస్తే తెలుస్తుంది అందులో బాధేంటొ అని. కాకపోతే, చెప్పేవిధానములో కొంత తేడా ఉంది. ద్వందార్థాలతో నిండింది ఒకటైతే.. ఒక మంచి రచనా కౌశలం కల వ్యక్తి రాసింది మరొకటి.
కాకపోతే,ఒక రచణను అది రచించబడ్డ సమయములో ఉన్న సామాజిక పరిస్థితులనుండి వేరు చేయలేమన్నది నా అభిప్రాయం.
ఆకాలములో చలం అటువంటి రచణలు చేయడం నిజంగానే చాలా ధైర్యముతో కూడిన విషయం. అతని మనసు ఒక లక్షం కోసం పరితపించింది. అది రచణగా జాలువారింది, అది ఏలాంటిదైనా కావచ్చు. అతను చెప్పే విధానం ఏదైనా కావచ్చు, కొంతమందికి తప్పుగా తోచచ్చు, మరికొంత మందికి ఒప్పుగా తోచచ్చు. చలం రచణలను అర్థం చేసుకోవాలంటే బహుషా ఆ కోణములో మాత్రమే చూడాలేమో అనిపించింది నాకైతే.
ప్రస్తుత సమాజ పరిస్థితులకు దాన్ని అన్వయించడమో లేక పాటించాలనుకోవడమో సరికాదు, మొదటి పని ఇబ్బందులకు గురిచేస్తే, రెండవది తీవ్రపరిణామాలకు దారితీస్తుంది.
నేను పైన చెప్పింది, నేను ఎలా అర్థం చేసుకున్నాను అని మాత్రమే కానీ, ఎలా అర్థంచేసుకోవాలి అని మాత్రం కాదని మనవి. మీ దృక్కోణములో ఆలోచించండి అంతే.
నా మట్టుకు నాకు చలం రచణలని అప్పటి సామాజిక పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవాలే కానీ .. విషాల హృదయాలతోనో .. భావజాలాలతోనో కాదని పిస్తుంది.
@కొత్తపాళీ .. link provide చేసినందుకు ధన్యవాదాలు. మీరు చలం గురించి చెప్పిన చాలా విషయాలతో నేను ఒప్పుకుంటాను...అతని non-fiction కూడా చదవాలి ఇక
@శ్రీ :D
@సుజాత ... అయితే ముందు చలం రాసిన కధలు చదివి అప్పుడు మ్యూసింగ్స్ చదువుతాను. thanks for the suggestion :)
@indian minerva .... righto
@srikanth... correct నేనెప్పుడు జంబలకడిపంబ తో పోలిక గురించి ఆలోచించలేదు
కానీ, అన్నిటికంటే mundu చలం రాసిన "చలం" చదివితే బాగుంటుందేమో!
చలం రచనలు చదవడం 'మ్యూజింగ్స్' తో మొదలు పెట్టాను. ఆ పుస్తకం పూర్తి చెయ్యలేకపోయాను. ఇంకా చదవాలి అనేలా అనిపించలేదు. తరవాత 'ప్రేమ లేఖలు' చదివాను. తరవాత నాకు పుస్తకాలూ దొరకలేదు, ఆసక్తి కూడా కలగలేదు. ఎప్పటికైనా కొనుక్కోవాలి. అయితే, చలం రాసిన చిన్న కధలు ఎప్పుడైనా దొరికితే చదవబుద్ధవుతుంది. వీటిల్లో బాగా జ్ఞాపకం ఉండిపోయినది - ఒక వేశ్య కధ ! బొబ్బిలి సంస్థానాన్ని ఫ్రెంచు (French) సేనలు ఆక్రమించుకున్నప్పుడు వాళ్ళకి లొంగకుండా పారిపోదామని ప్రయత్నించే దేశభక్తి పరురాలైన వేశ్య కధ . ఈ కధ మాత్రం చాలా టచింగ్ గా వుండింది. బహుశా మిగిలిన రచనల్లో కూడా అంత డ్రామా వుండొచ్చేమో నాకు తెలీదు.
@afsar ....ooh, చలంది చలం అనే పుస్తకం ఉందని తెలియదు అసలు నాకు ... thankyou and welcome to my blog
@sujatha .. interesting..అయితే చలం రాసిన కథలు కొనాలి
ముందుగా కొత్త పాళి గారి అభిప్రాయం లోని రెండవ పాయింట్ తో నేను కొంచెం ఏకీభవిస్తున్నాను సంజు...
చలం నవలల్లో హీరోయిన్ లు .....అలా బద్దకం గా.....వయ్యారం గా ...వేరే పనేమీ లేనట్టు ప్రియుని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదంతా time waste అంటాం మనం. నిరంతరం....ప్రతిరోజూ ప్రేమ అనే అగ్ని ని తాజా గా వెలిగించుకోవడం అంటాడు చలం. మన నిత్య జీవితం లో మన కెవరికీ ఒకరి కంటె ఎక్కువ మంది మీద కనీసం చిన్న అకర్షణ ఆయినా కలిగి ఉండదా? చలం ఆ చిన్న చిన్న మోహలను(crushes) బాగా ఎక్కువగా వర్ణించాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కాలం లో స్త్రీ- పురుష సంబందాలకు ఇప్పుడున్నంత ఆమోదం లేదు.అందుకే మనసులో కలిగే అలజడులను అపురూపం గా feel అయ్యి...అలాగే చిత్రించాడు. "ఒకరికి ఒకరే " అన్న నియమం తో నడుస్తున్న సమాజానికి ఇవి విపరీతం గా తోచాయి. చలం పేచీ అంతా బహు సంబంధాలను అవలంబించే వారు వాటిని రహస్యం గా ఎందుకు కొనసాగిస్తారు అని. ఒకవేళ ఇలాంటివి express చేయల్సి వస్తే స్త్రీ లకు కూడా ఆ స్వేచ్చ ఉండాలని కలలు కన్నాడు. ఈ పెళ్ళి అనే system ను వ్యతిరేకించమని చెప్పలేదు. ప్రేమ లేని బంధం ఎందుకు అంటాడు. (జీవితాదర్షం చదివావా?) . if వదిలేయాల్సి వస్తే స్త్రీ -పురుషులకు ఒకే న్యాయం వర్తించాలంటాడు. చలం books లో స్త్రీ వాదం ఇదే. ఇక నాకూ ఒక doubt ఉంది.....అందరూ చలాన్ని చదివి........కొన్ని రోజులు కాగానే "నాకు నీ మీద మోహం లేదు" అని పరస్పరం వదిలేసుకుంటే......సమాజం ఎలా ఉంటుంది ?guess చేయి !!! ఈ point దగ్గర చలం books నాకు యే సమాధానమూ చెప్పలేదు.
పాపం ఇక అరుణ అంటావా....బుచ్చిబాబు గారు కోమలి ని అన్నట్లు "అప్పుడే నిద్ర నుండి లేచిన చూపులో...లేక బుధ్ధి మాంధ్యమేమో" అన్నట్లు ..అరుణ కు కూడా యే చిత్త చాంచల్యమో అనుకోక...."పురుషలోలి" లాంటి బిరుదులెందుకు చెప్పు....It wont suit u.
@subhashini ... hehe correct , చలం హీరోయిన్స్ ఎప్పుడు ప్రియుడి సోసం వేచి చూస్తూనే ఉంటారు, ముఖ్యంగా శశిరేఖ ఎపుడు అదే పనిలో ఉండేది.
"కొన్ని రోజులు కాగానే "నాకు నీ మీద మోహం లేదు" అని పరస్పరం వదిలేసుకుంటే......సమాజం ఎలా ఉంటుంది ?guess చేయి !!! ఈ point దగ్గర చలం books నాకు యే సమాధానమూ చెప్పలేదు." మరీ సమాజం స్థాయిలో కాదు కాని , ఒక వ్యక్తి స్థాయిలో సంధానం మటుకు Orange movie లో నాగ బాబు , చరణ్ కి చెబుతాడు. anthropology ప్రకారం, ఒక మనిషి తన బ్రతుకు తను బ్రతకడానికి కావలసిన skills నేర్చుకోడానికి పట్టే సమయం, మిగతా జంతువల కన్నా చాలా ఎక్కువ. అంతకాలం పిల్లల పోషణ బాధ్యతలు continues గా చూస్కోడం ఒక తల్లి వల్ల కష్టం కాబట్టి కుటుంబం, పెళ్లి అనే concepts సమాజం లోకి వచ్చాయని .... కాని మాములుగా చలం హీరోయిన్స్ కి పిల్లలు పుట్టారు కాబట్టి, చలం ఆ విషయం గురించి మాట్లాడి ఉండకపోవచ్చు .
చలాన్ని చదివితే యేమొస్తుంది? ఎంత లాభం అంటే అంకెల్లో చెప్పడం అసాద్యం. మన జీవిత గమనాలను మన జీవితాల గురించి మనకు అశాంతి కలుగుతుంది. మన శరిరంలోను, మెదడులోనూ పేరుకున్న కొవ్వును కరిగించుకొవాలనిపిస్తుంది. ఎందుకు తీస్తున్నామో తెలియకుండా తీసే పరుగులు ఆపి, గుండెలనిండా గాలి పిల్చుకుని రక్తశుద్ది చేసుకోవాలనిపిస్తుంది. స్వేచ్చ, బాద్యత ఒకదానికొకటి విరుద్దమైన విషయాలు కావని, ఒకే నాణానికుండే రెండు వైపులని చలం మనకు పదే పదే గుర్తుచేస్తారు. అలాగే ఆనందనికి వ్యతిరేక పదం త్యాగంకాదు. అవి రెండూ విరుద్ద భావనలు కావు.. ఈ విషయాన్ని అర్దం చేసుకొని హృదయాలను విశాలం చేసుకొమంటుంది చలం సాహిత్యం + చలం జీవితం.
Sanjeev.. Ranganayakamma gaari 'Chalam Saahithyam' chadivaava? Chaala baaga analyse chesaaru thanu. Naaku chalam 'Sthree' and 'Biddala sikshana' chaala nachina rachanalu.
@raghu .. :) welcome to my blog
@ravly.... stree chadavaledu....chala biddala sikshana gurinchi ranganayakamma de edo book lo chadivanu.
ఒక పుస్తకాన్ని ,అది ఒకప్పటి సామాజిక పరిస్థితుల పై వ్రాసిన విషయాలను ఎలా అర్ధ౦ చేసుకోవాలి అని చెప్పడం కన్నా, ము౦దు అప్పటి సమస్యలు తెలియాలి . నావరకు చల౦ ఆనేప్రత్యేకమైన వ్యక్తీ వ్రాసినవి అని తెలియకు౦డా చదివాను, నచ్చాయి. ఇప్పుడు ఆ కధలు, పేర్లు గుర్తు లెవ్వు కాని ఆయన లక్ష్యం అర్ధమయ్యి౦ది. ha ha జ౦బలకిడి ప౦బ సినిమా :) , సమస్య ని చల౦, సినిమా రచయితా ఇద్దరూ వివరి౦చే తీరు పూర్తిగా వేరు. స్ప౦ది౦చిన తీరు కూడా వేరే. చల౦ లో నిస్వార్ధమైన తపన, తపస్సు కనిపి౦చి౦ది.
పోల్చవలసి వస్తే ఆరాధన(చిరంజీవి), సీతాకోక చిలుక, సాగర స౦గమ౦ సినిమాల కన్నా చలం పుస్తకాలే కాస్త సులువుగా అనిపి౦చాయి నాకు :)
ఇప్పుడు ప్రేమ అన్న భావాన్నే అప్పట్లో మోహ౦ అని వివరి౦చారు. ఇప్పుడు ప్రేమవివాహాలు, లేదా ఇద్దరి అ౦గీకార౦తో వివాహాలు జరుగుతున్నాయి కాబట్టి నాయికా నాయకులను, నేటి వివాహబ౦ధ౦ లో ని జ౦టలకు అన్వయి౦చుకు౦టాను నేను . కాకపొతే మైదానాలే వేరు :)
చల౦ రచనలు చదివి జన౦ ఒకరిపై మోహ౦ తగ్గినదని విడిపోవడం జరిగే అవకాశాలు ఉ౦డవు. ఎ౦దుక౦టే చల౦ పూర్తి విశ్లేషణ తో చెప్పా డు . ఇష్టపడిన వారిని వదిలేసినట్లుగా ఆయన ఎక్కడావ్రాయలేదు.సమస్యే లేనపుడు సమాధాన౦ ఎ౦దుకు. ఇ౦కా చల౦ ని చదివిన vaarilO ప్రేమ వైఫల్యాలకి ఆత్మహత్యలు చేసికొనే పిరికివాళ్ళు మాత్ర౦ ఉ౦డరు.
సమస్యలు ఇప్పుడు మగవారికి మొదలయినట్లున్నాయి. గృహ హి౦సా చట్టం పై ఆకాశరామన్న గారు, తాడేపల్లి గారి వాదన చూసి మొదట కాస్త కుడా అర్ధం కాలేదు .కాని సమస్య ఉ౦ది. ఇప్పటివరకు స్త్రీలలొఅ మార్పు తెచ్చిన చల౦ రచనలు , ఇకము౦దు పురుషులలో మార్పు తీసికొని రావాలి.
Physical enjoyment is equally needed for men and women. Only those people who diasagree with it would compare Maidanam with EVV's cibema (comparing skinhead with knees).
Please send Bramhaneekam,stree biddala sikshana book pdf links
Post a Comment