అనంత పద్మనాభస్వామి నిధుల గురించి తాళపత్రాలలో లభించిన వివరాలు, సేకరించింది ఎవరో తెలుసా ? మన TV9. వీళ్ళు తాళపత్ర గ్రంధాలు బాగా వెతికి అసలు ట్రావెన్కోర్ రాజులకి అన్ని నిధులు ఎలా వచ్చాయో కనుగోన్నారట.
ట్రావెన్కోర్ రాజులు ఆ నిధులన్నీ ప్రజల మీద పన్నులు వేసి సంపాదిన్చారట, ఇంకా యుద్ధాలు చేసి సంపాదిన్చారట....అంటే మంత్రదండంతో సంపాదించారని మనం అనుకుంటాము అని కావొచ్చు. అసలు ట్రావెన్కోర్ రాజులు ప్రతీదాని మీద పన్నులు వసూలు చేసే వాళ్ళంట ...ఆఖరికి గడ్డం మీద కూడా అంట , అయితే భారత దేశం లో జిజియ లాంటి పన్నులు ముస్లిం రాజులు మాత్రమె కాదన్నమాట వాడుకున్నది .
కాని అసలు కామెడీ అది కాదు, తాళపత్ర గ్రంధాలు తాళపత్ర గ్రంధాలు అని అరిచి వెనకాల ట్రావెన్కోర్ రాజుల మీద ఇంగ్లీష్ లో రాసిన ఒక textbook లో మొదటి పేజి, ఇంకా "ది హిందూ", Indian express చూపించాడు, అంటే మన పూర్వీకులు తాళపత్ర గ్రంధాలు ఇంగ్లీష్ లో రాసారనా లేక ది హిందూ ని తాళపత్ర గ్రంధాలలో కలపోచ్చనా...అంతలా అరిచినపుడు కనీసం ఒక తాళపత్రమైనా చూపిస్తే బాగుండేదేమో ..... ఈ మొత్తం ప్రోగ్రాం కి background music చంద్రముఖి లోది ....సావగోట్టాడు ఈ ప్రోగ్రాం తో నన్ను . అందుకే remote మీద అధికారం వదులుకోకూడదు.
1 comment:
Post a Comment