Saturday, July 23, 2011

వాడి ఆర్తనాదం ...నాకు మాత్రం శబ్దమే

స్త్రీవాదం మగవాడికి అర్థం కాదు ,
దళితుని అవమానం అగ్రకులస్తునికి పట్టదు,
యూదుల పై ఘోరాలు హిందువు తెలుసుకోడు,
శ్రామికుల సమ్మె పెట్టుబదిదారుకి చిరాకు,
నీగ్రో బాధ తెల్లవాడికి గోల,
హిందీ మీద తమిళుడి బాధ ఉత్తరభారతం లో వింత!!

పక్కవాడు బాధతో అరుస్తూ ఉంటె,
ipod లో పాటలు వినబడటం లేదని విసుక్కుంటూ,
పిజ్జా తినేసి, ప్రపంచం లో ఆకలి అరుపులన్ని,
అజీర్తి పాట్లు అనుకుంటూ ఉంటారు కొందరు .
కాని empathy ఉండాలని చెప్తారు వీళ్ళందరూ

3 comments:

y.v.ramana said...

పోస్ట్ చాలా చాలా బాగుంది.

tankman said...

thankyou yaramana garu

Anonymous said...

నిజమైన empathy అంటే ఏమిటో తెలియని అలాంటివాళ్ళందరికీ నా sympathy:)