Friday, July 29, 2011

మంతెన సత్యనారాయణ రాజు కూడా వచ్చేస్తే ఎలా ఉంటుంది ?

మొన్న బాబా రామ్ దేవ్ ని , చంద్రబాబు నాయుడిని చూసాక నాకీ ఆలోచన వచ్చింది. మంతెన సత్యనారాయణ రాజు గారు ఎందుకు రాజకీయాలలోకి రాకూడదు అని. రామ్ దేవ్ బాబా ని అందరు టీవీ లో చూసినట్టుగానే , సత్యనారాయణ రాజు గార్ని కూడా టీవీ లోనే చూసారు...ఇద్దరూ యోగా గురించే చెబుతారు. ఇద్దరూ మాట్లాడితే బోర్ కొడుతుంది ( personal view). రామ్ దేవ్ బాబా తో పోలిస్తే సత్యనారాయణ రాజు గారికి ఏమి తక్కువ గడ్డం తప్ప. సత్యనారాయణ రాజు గారి popularity (  ఆయన చెప్పినవి ఆచరించే వారు, ఆయన బాధితులు  ) కూడా చాలా ఎక్కువే




17 comments:

chinni said...

It should be better to add "not intersting" to the options funny,cool,intersting..

SHANKAR.S said...

"మంతెన సత్యనారాయణ రాజు గారు ఎందుకు రాజకీయాలలోకి రాకూడదు అని"
ఎందుకు రాకూడదూ బ్రహ్మాండంగా రావచ్చు. ఇక అప్పుడు ఎన్నికల మ్యానిఫెస్టోలో రెండ్రూపాయలకే కిలో మొలకెత్తిన గింజలు, రేషన్ కార్డుల మీద పది లీటర్ల కాకర రసం వంటి హామీలు కూడా చూడచ్చు. :))

కృష్ణప్రియ said...

@ SHANKAR.S,

LOL

@ సంజు,

:) బాగుంది.

రాందేవ్ గారి వెనక రాఖీ పడుతోంది.. మరి మన మంతెన గారి వెనకో?

Sri Kanth said...

వస్తే కొన్నాల్ల తరువాత, రాఖీసావంతు.. మంతెన సత్యన్నారాయన చాలా సెక్సీ, ఆయన్ను పెళ్ళాడుతా అంటుందేమో చూడాలి.. :-)

సుజాత వేల్పూరి said...

శంకర్ గారు, :-))

సంజు, ఈయన రామ్ దేవ్ లాగా స్పీడుగా, ఆవేశంగా ఉపన్యాసాలు ఇవ్వలేరు

కృష్ణప్రియ, ఈయన వెనకాల కూడా రాఖీయే పడొచ్చు! రాహుల్ ని వదిలేసి రామ్ దేవ్ వైపు రాలేదూ....!

tankman said...

@chinni... thanks for the suggestion and welcome to my blog :)

@shankar ... righto :D

@కృష్ణప్రియ .. ముమైత్ ఖాన్ ఈ మధ్య ఖాళీగా ఉంది కదా ;)

@శ్రీకాంత్ ... ఆయన చెప్పిన ఆహార పద్దతులు ఆచరిస్తేనే పెళ్లి అంటారేమో ...

@సుజాత ...ఆవేశంగా ఇవ్వకపోవచ్చు....నెమ్మదిగా...టీరిగ్గ్గా కూర్చోబెట్టి...వోటు వెయ్యాలి...వీల్లే వెయ్యాలి...ఇలా వోటు వేస్తె రాష్ట్ర రాజకీయ ఆరోగ్యం బాగుపడుతుంది అని నెమ్మదిగా చెబుతారు లెండి ..

కృష్ణప్రియ said...

@ sanju, :)) for your replies. Esp that one to Sujata gaaru. I can just imagine him asking for vote

Mauli said...

ఇప్పుడు మరొ 'ఉప్పు' సత్యాగ్రహము చెయ్యాల్సి రావడము అవసరమా

బులుసు సుబ్రహ్మణ్యం said...

ఈ విధంగా కూడా ఆంధ్ర దేశాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చా ?

శంకర్ గారూ.. కెవ్వు

సుజాత గారి కిచ్చిన జవాబు కి మరో కెవ్వు

SJ said...

m.s.raju garu veg tinamani cheppi ayana nonveg tintarata!nijama??

tankman said...

@కృష్ణప్రియ :)

@Mauli ... ఉప్పు సత్యాగ్రహం కాదు....మినపప్పు సత్యాగ్రహం ( అయన మినపప్పు గుణగణాలు వివరించి, తర్వాత మినపప్పు ని విడిగా కొనడం కన్నా , అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఒక బస్తా కొనేస్తే ఎంత మిగులుతుందో ఒక పావు గంట వివరించారు )

@బులుసు సుబ్రహ్మణ్యం ... thankyou :D

@సాయి ... ఆ విషయం నాకు తెలియదు ... welcome to my blog :)

Avyaya said...

chaalaa baagaa raasaaru mee PERSONAL VIEW nee......manchi cheppe valaki kuda BADITHULU unnaru ante.....koncham ashcharyam gaa undi.......

tankman said...

Avyaya ... thankyou avyaya garu...welcome to my blog :)

Unknown said...

నిజమే కదా మీకు బలే ఆలోచన వచ్చింది.ఇంకా ఆలస్యం ఎందుకు మంతెన గారికి చెప్పండి మరి.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

సంజూ :))) నిజమే అలాగే ఉంది పరిస్థితి ;)

Anonymous said...

//ఇద్దరూ మాట్లాడితే బోర్ కొడుతుంది (personal view)//

బోర్ మాత్రమే కొడుతుందా, నాకైతే ఫుల్ టైంపాస్ అవుతుంది-వీళ్ళ జోక్ షోలను చూస్తుంటే(నాది కూడా personal viewనే)

Anonymous said...

He is not a doctor.He dont have any scienfic knowledge.Following his diet may give bitter results. some of his tips are too dangerus.
1.abandoning salt may lead to hyponetremia.
2.Drinking 5 liters of water water dopits in brain.water toxicity.
3.Leaving non veg leads to vitamin b12 deficiency.
4.Raw vegetables had pesticides which leads slow poisioning.
5.Spourts relese toxins when they are growing.
This list goes on if research is done.