అనగనగా ఒక దట్టమైన అడివిలో ఒక ఏనుగు ఉంది . ఒకప్పుడు ఆ ఏనుగే ఆ అడివికి పెద్ద. ఆ ఏనుగు మీద చాలా కథలున్నాయి. అడివిలో ఎవరికీ సహాయం కావాల్సి వచ్చినా ఏనుగు దిక్కే చూసే వారు . ఎక్కడ చూసినా ఏనుగు గురించి గొప్పగా మాట్లాడుకునే వారు. కొంతకాలానికి ఏనుగుకి ఆ గొప్పదనం అలవాటు అయ్యిపోయింది. ఇంకోళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ , తత్వం మాట్లుడుతూ కాలం వెళ్ళబుచ్చుతోంది.
. ఏనుగు గొప్పదనం విన్న ఒక సింహం దాడి చేసి ఏనుగుని ఓడించింది. కొంతకాలానికి సింహం ఆ అడవి వొదిలిపెట్టి వెళ్ళిపోయింది. సింహం చేతిలో ఓడిపోయాక కూడా , ఏమి జరగనట్టు , తన పాత గొప్పదనాల గురించి మిగతా జంతువులులకి చెబుతూ , తత్వం మాట్లాడేస్తూ కూర్చోనేది. ఇంకోల్లతో ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు ఏమి పెట్టుకోకుండా , ఎక్కడికి వెళ్ళకుండా , తన దగ్గరకి ఎవరోస్తే వాళ్ళకి తన పాత గొప్పలు చెబుతూ ఇంకా అడివికి దిక్కు తనే అన్నట్టు ఉండసాగింది. గతం గురించి తప్ప వర్తమానం లో తన గురించి తాను పట్టించుకోక పోవడం వల్ల, ఏనుగు మీద మట్టి , దుమ్ము బాగా పేరుకు పోయాయి. కొవ్వు కూడా పెరగసాగింది. అలా ఏనుగు ఆకారం కొంచం గా పెద్దది అయినట్టుగా అనిపించసాగింది అందరికి . దానికి ఏనుగు పెరుగుదల రేటు అని ముద్దు పేరు కూడా పెట్టుకున్నాయి మిగతా జంతువులు.
ఇంతలో నాలుగు పులుల ప్రభావం అడివి మీద పెరగడం మొదలయ్యింది. అన్ని జంతువులు ఆ పులుల దగ్గరికే వెళ్లడం , వాటి తోనే మాట్లాడటం ఎక్కువయిపోయింది. అడివిలో ఏనుగు ప్రభావం తగ్గిపోతోంది. అంత పెద్ద ఆకారంతో ఉంది కాబట్టి ఏనుగు ప్రభావం కాస్తో కూస్తో ఉంటోంది. మిగతా జంతువులు ఏనుగు దగ్గరికి రావడం తగ్గించేసాయి. ఏనుగుకి పరిస్తితి అర్థం కావడం లేదు. గతం లో తన గొప్పదనం చూసి కూడా ఎవరు తన దగ్గరికి ఎందుకు రావట్లేదో అర్థం చేసుకోలేకపోతోంది.
ఏనుగు ఆరోగ్యం బాగా పాడయిపోయింది. ఇక తనువు చాలిస్తుందేమో అని మిగతా అందరు అనుకుంటూ ఉండగా, ఒక డాక్టర్ వచ్చి ఏనుగుకి సలహా ఇచ్చాడు. లేచి అందరితో కలవాలని, మిగతా జంతువులతో ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు తనకే మేలు చేస్తాయని, లేకపోతే తన్నడానికి ఒక పెద్ద బకెట్ తెప్పించుకోమని. ఏనుగుకి భయం మొదలయ్యింది, గతం గురించి గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన వర్తమానం లో తను గొప్పది కాలేదని గ్రహించింది. డాక్టర్ సలహా పాటించడం మొదలెట్టింది. ముందుగా నది దగ్గరికి వెళ్లి తొండం నిండా నీళ్ళు తీసుకుని ఒంటి మీద ఉన్న కుళ్ళు వదిలిన్చుకోడం మొదలెట్టింది. ఇంకోళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం తగ్గించి, అందరిలో ఒకడిలా ఉండటం మొదలెట్టింది. మిగతా జంతువులతో సంబంధాలు మెరుగయ్యాయి., కొవ్వు తగ్గి కండ పెరగసాగింది., ఏనుగు నడక వేగం పెరిగింది. అడివిలో అన్ని జంతువులు నోళ్ళు తెరిచి చూస్తున్నాయి దూసుకెళ్తున్న ఏనుగుని .
అంతే , అది స్టొరీ , ఇదేమి పంచతంత్రం కథ కాదు , ఇక్కడ ఏనుగు మన దేశం, సింహం బ్రిటన్ , నాలుగు పులులు ఆసియన్ టైగర్స్ , డాక్టర్ మన మన్మోహన్ సింగ్ , ఏనుగు వంటి మీది కుళ్ళు లైసెన్స్ రాజ్, ఏనుగు పెరుగుదల రేటు ఏమో Hindu rate of grwoth. ఇది శశి తరూర్ గారి "Panchatantra 2007: The Elephant who became a tiger" వ్యాసం ఆధారంగా రాసాను. అయన వ్యాసం లో , ఏనుగు వంటి మీద పులి చారలు వచ్చాయి అని ముగిస్తారు, మనకి తెలుగులో పులిని చూసి వాత పెట్టుకున్న నక్క సామెత వల్ల , పులితో పోటి పడుతున్న ఏనుగు అని ముగించా. అసలు వ్యాసం " The elephant, the tiger and the cellphone" అనే పుస్తకం లో మొదటి వ్యాసం, ఇది చదివాకా నేనా పుస్తకం కొన్నాను. ఈ వ్యసం మీద వచ్చే comments అన్ని అసలు వ్యాసకర్త కే అంకితం. కాకపోతే ఆయన ట్విట్టర్ లో బిజీ బిజీ ...
ఆ వ్యాసం కూడా 2007 లో రాసింది...ఇప్పుడు అయితే "డ్రాగన్ తో పోటి పడుతున్న ఏనుగు కథ " అనో " డ్రాగన్ ని చిరాకు పరుస్తున్న ఏనుగు కథ " అనో రాయాలి నిజానికి .
11 comments:
పులులు, ఏనుగు అనగానే ఇది భారత్గురించి అననుకున్నాను. అన్నట్టు ప్రస్తుతానికి ఆసియన్ టైగర్స్‌గా వేటిని పరిగణిస్తున్నారు? చైనా, సింగపూర్, may be మలేసియా, ఆ తరువాత?
మనం మరి అంతగా ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదనుకుంటాను. కొద్దిగా శ్రీలంక మరియు చేసుకుందామా వద్దా అంటూ నేపాలూ మినహాయిస్తే. అదికూడా మనకొంపకి నిప్పంటుకుంటుందనుకున్నప్పుడే. We are better than our neighbours in that regard.
తైవాన్ , సింగపూర్ , సౌత్ కొరియా , హోంగ్ కాంగ్ లని అలా పిలిచేవారు అప్పట్లో...ఇప్పుడు ఎవరు పెద్దగా వాడటం లేదు .
పంచశీల సూత్రాలు అందరికి చెబుతూ , శ్రీలంక లో వేలు పెట్టింది మనమే, పాకిస్తాన్ ని రెండు ముక్కలు చేసింది కూడా మనమే కదా,
బాగుందండీ మీ/తరూర్ గారి అడవికథ.
శశి తరూర్ ఈ మధ్య కథలు చెప్పడం కూడా మొదలెట్టాడా?! రెండో భార్య కాశ్మీర్ కమీషన్ ఏజెంట్‌తో ఇంకా కాపురం చేస్తున్నారా?
వినేవాడు తెలంగానోడైతే, చెప్పేవాడు(కథలు) అదవానీ అన్నట్టుంది! :)) ఇచ్చేది అదవాని, తెచ్చేది విజగశాంతి, సచ్చేది యాదిరెడ్డి, అనుభవించేది ముక్కోడు!
పంచశీల సూత్రాలు అందరికీ చెపుతూ శ్రీలంకలో వేలుపెట్టి రాజీవ్ ని కోల్పోయిందీ , పాకిస్థాన్ ని ముక్కలు చేసిందీ మనమే !!
బాగా చెప్పారు.
Hmmm... forgot this Bangladesh altogether. But weren't we merely supporting their struggle for freedom? :D . We get a different picture if we consider Mujibur Rahman :D
I donno if one's subornance/support should be to the nation or the people in general. Patriotism too is an -ism. Isn't it?
@SNKR ... తరూర్ రెండో భార్య సంగతి తెలియదు కాని, తొండం ఉన్న ఏనుగు కథ కి, ముక్కోడికి భలే లంకె వేసారండి :D
@నీహారిక ...thankyou
@Indian Minerva .. :) " Patriotism too is an -ism. Isn't it?" if you have that question in mind then i am sure u will enjoy views of tagore on it.
I that case, send me the link :D
i dont have a link but i have Argumentative indian book with me :)
రెండు కాదులేండి సంజు, మూడు, మూడో భార్య!
కథలు చెప్పేవారికి వెనుక కథలు కూడా కొద్దిగా తెలుసుకోవాలంటాను, సంజు రాజు గారు. :)
ఐపిఎల్ లలిత్మోడీతో ఏవో లావాదేవీలు చేసి, అమ్మడికి స్వీట్ ఈక్విటీ అని ఓ 70కోట్లు జరూరుగా ఇప్పించాడట, మన తరూర్. మరిపుడు ఏనుగు ఎందుకు నాలుగు బయటి పులులేకాదు, వందల కొద్ది నాయక పులుల పంజాదెబ్బలు తింటోందో కథలుగా చెప్పుకుని, పుస్తకాలు రాసి అమ్ముకుని కమాయిస్తున్నాడేమో.
haha
కథ చాలా బాగుంది. :-)
కాకపోతే నాకు ఒక్కటే డవుటు, ఆసియాలో భారత్ మాట ఎప్పుడు చెల్లుబాటయ్యింది? నాకు తెలిసీ మనల్ని మన చుట్టు పక్కలున్న చిన్న చిన్న దేశాలు కూడా పెద్దగా పట్టించుకున్నట్టు లేదు.
Post a Comment