పోరాడి గెలిచిన వాడికేం తెలుస్తుంది. పోరాటం అయిపోయాక బహుమతులు, సన్మానాలు , పొగడ్తలు, కొత్త స్నేహాలు, పేరు , కొత్తగా వచ్చే మర్యాద , పెద్దల ఆశీస్సులు , చిరునవ్వులు , మందహాసాలు , గెలవడానికి ఎంత కష్టపడ్డాడో కధలుగా చెబుతూ ఉంటె పైకి కిందకి ఆడించే తలకాయలు , సలహాలు సంప్రదింపుల కోసం వచ్చే ప్రజలు , పండగ చేసుకోడాలూ , వాడి మీద వాడికి నమ్మకం ఉంది కాబట్టి అంత రిస్క్ తీసుకున్నాడు అనే ప్రశంసలు , "ఆ గెలిచాడు చూడు వాడిలా " అని పిల్లలకి ఒక రోల్ మోడల్ అవ్వడం , పార్టీ ఎప్పుడు మామా అనే పలకరింపులు , నీకేంట్రా సక్సెస్ కొట్టావు అనే మాటలు, ....
అదే ఓడిన వాడికి అయితే , పోన్లే మామ ఇంకోసారి చూసుకోవచ్చు బాధపడకు అనే జాలి మాటలు , తర్వాత ఎం చేద్దామనే ప్రశ్నలు , అదిగో వాడిలా అవి ఇవి అంటూ సమయం వృధా చెయ్యకు అని మిగత వాళ్ళకి ఒక ఉదాహరణ అవ్వడాలు , కోరిక ఉండగానే సరి పోదు కదా , తెలివి తేటలు కూడా ఉండాలి కదా అనే వెనక మాటలు , నీకు ఇంక రాదేమోరా ఓడిలేయ్య కూడదా అంటూ డయలాగులు , ఏమయింది ఏమయింది అంటూ అత్యుత్సహపు ప్రశ్నలు , ఎందుకు పోయిన్దంటావు అంటూ ఎంక్వయిరీలు. వీటన్నింటికి సమాంతరంగా ఉండే ఓడిపోయామన్న బాధ , తన మీద తనకున్న నమ్మకానికి పడిన దెబ్బ ,గెలిచిన వాడు నాకన్నా బెట్టర్ అని ఒప్పుకోడానికి అడ్డొచ్చే ego , గెలిచిన వాడి మీద మంట , ప్రజలని దూరం పెట్టాలి అనుకోడం , అలా ఎలా ఓడిపోయాం అని వెంటాడే ప్రశ్న , తర్వాత ఎం చెయ్యాలో అర్థం కాకపోవడం , ప్రజలు ఓటమి గురించి మాటల్డటం మానేస్తే బాగుండు అనుకోడం , ' గెలుపు ఓటమి సమానంగా చూడాలి ' అనే ముష్టి డయలాగులు కొట్టడం , వెధవ నవ్వులు నవ్వడం, నాలా ఎంత మంది ఓడిపోయారు అని వెతుక్కోడం , ఓటమి లోంచి బయటపడటానికి, ' జీవితం , ప్రపంచం చాలా పెద్దవి ' అన్న జ్ఞానోదయం తెచ్చుకోడం.
గెలిచిన వాడికేం తెలుసు, వాడి చుట్టూ తిరిగే ప్రజలకేం తెలుసు ఓడినోడి బాధ . గెలిచిన వాడికన్న, ఓడిన తర్వాత ఇన్ని బాధలు తట్టుకుని మాములుగా ఉండే ఓడినవాడే గొప్ప . అవును ...నేనే గొప్ప :D

10 comments:
"ఓడిన తర్వాత ఇన్ని బాధలు తట్టుకుని మాములుగా ఉండే ఓడినవాడే గొప్ప".
నిజమేనండీ చాలా బాగా చెప్పారు.
ఓటమిని తట్టుకుని నిలిచిన వాడే గెలిచిన
వాడికంటే గొప్ప.
ప్రపంచములో అత్యంత దయనీయమైన పరిస్థితి ఏమిటంటే పక్కోడి చేత ఉచిత సలహాలూ తీసుకోవాల్సి రావడం, పతోడూ జాలిపడే స్థితిలో ఉండడం.. నిజంగా దాన్ని ఎదుర్కోవడం గొప్పే .. :-D.
బాగుందండి. " ఓడిన తర్వాత మాములుగా ఉండే ఓడినవాడే గొప్ప". బాగా చెప్పారు.
:)
"గెలుపు నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. కానీ ఒక్కసారి ఓడిపోయి చూడు ఈ ప్రపంచమే నీకు పరిచయమవుతుంది"
ఇది ఏదో తెలుగు సినిమాలో చానల్స్ మారుస్తూ అనుకోకుండా విన్నాను ఈ మధ్యే.. చాలా బావుంది కదా !!
నా స్వీయానుభవం ఏంటంటే..
"గెలుపు నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఓటమి నిన్ను నీకు పరిచయం చేస్తుంది.." Go ahead.. feel the pain.. it really helps :)
:) :)
:) సంజు అ౦త బాగా టపా వ్రాయలానుకొ౦టూ , ఓడిపోతూనే ఉన్నా ..
చాలా చక్కని మాట!
ఓడినవారు మామూలు గా ఉన్నా, 'చూడు వీడ్కి అసలు ఏమాత్రం ఓడానని సిగ్గూ, అభిమానం లేవు. హాయిగా పళ్ళికిలిస్తూ తిరుగుతున్నాడు' అని జనాలు అంటూనే ఉంటారు :)
అలాగని పట్టించుకుంటే, గెలిచిన వాడూ సుఖం గా ఉండలేడు. ఒకసారి గెలిచిన వాడు అలాగ గెలుస్తూనే ఉండాలి. ఎప్పుడు వీడి గెలుపుల పరంపర ఆగుతుందా.. ఎప్పుడెప్పుడు 'అదిగో అయిపొయింది ఇక వీడి పని' అని అందామా అని జనాలు చూస్తూనే ఉంటారు
/గెలిచిన వాడికేం తెలుసు, వాడి చుట్టూ తిరిగే ప్రజలకేం తెలుసు ఓడినోడి బాధ . గెలిచిన వాడికన్న, ఓడిన తర్వాత ఇన్ని బాధలు తట్టుకుని మాములుగా ఉండే ఓడినవాడే గొప్ప . అవును ...నేనే గొప్ప :D/
అంతంతే! ఓడేవాళ్ళే గొప్ప, ఇంకా మాట్లాడితే మళ్ళీ మళ్ళీ ఓడేవాడు మరీగొప్ప. :D
" బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్
ఆ ఏరుకే నిశ్చలానందమో, బ్రహ్మానందమోయ్"
అన్నారు.
:)
@రాజి & శిశిర .. thankyou
@srikanth ... righto
@weekend politician ... message received :)
@mauli .. hehe
@కృష్ణ ప్రియ .. మీరు చెప్పింది కూడా పాయింట్
@snkr ... haha బాధ నుంచి సుఖం పొందడం అనేది kind of masochism కదా
:))))
Post a Comment