Saturday, October 15, 2011

Indian Minerva గారి అభిప్రాయాలు పోస్ట్ కి నా పొడిగింపు


ఈ పోస్ట్ ,  అభిప్రాయాలు అని Indian Minerva రాసిన పోస్ట్ కి extension అన్నమాట. దాన్లో మనుష్యులకి ఉండే అభిప్రాయాలు వాటి రకాలు వివరించారు. 

నాకు తెలిసి అభిప్రాయాలలో మరో రకం Generalizations/Sweeping statements. ఉదాహరణకి , అందరు అమ్మాయిలు ఇంతే / all men are pigs , ముస్లిమ్స్ అందరు ఆతంకవాదులు , బ్రాహ్మణులు అందరికి కుల పిచ్చి జాస్తి , ఉత్తరాభారతీయులు తెల్లగా ఉంటారు / దక్షిన భారతీయులు నల్లగా ఉంటారు , తమిళులకి కొంచం పిచ్చి ఉంది , సీమంధ్ర వాళ్ళు అందరు దొంగలు / తెలంగాణా వాళ్ళు అందరు మూర్ఖులు , ఈ మగ జాతి మొత్తం ఆడవాళ్ళని తొక్కి పెట్టాలనే చూస్తుంది , అమెరికా ప్రపంచాన్ని నాశనం చెయ్యాలని చూస్తుంది , భారతదేశం లోని ముస్లిమ్స్ అందరు పాకిస్తాన్ కే సపోర్ట్ ఇస్తారు , గోదావరి జిల్లాల వాళ్ళు తడిగుడ్డతో గొంతులు కోసేస్తారు , నెల్లూరు లో అందరు నేరజాణలే, ఈ యూత్ చెడిపోయింది , తెలుగు వాళ్ళకి భాష మీద గౌరవం అస్సలు లేదు ,  పంజాబు వాళ్ళకి బుర్ర తక్కువ , భారతీయులకి బద్ధకం ఎక్కువ / జపాన్ లో అందరు కస్టపడి పని చేస్తారు , పెళ్లి అనగా బానిసత్వం , రిజర్వేషన్స్ లేకపోతే దళితులకి ఉన్న తెలివితేటలకి వాళ్ళు ఎప్పటికి ఎదగలేరు , కమ్మ్యునిజం లేకపోతే ఈ ప్రపంచం ముందుకు వేల్లేదే కాదు , ఈ పిల్లలు ఎప్పుడు కంపూటర్ల ముందే కూర్చుంటారు, అసలు వీళ్ళకి మనుష్యులతో మాట్లాడటం వస్తుందో రాదో , పుస్తకాలు చదవడం అందరు మానేసారు , etc etc . ఇలాంటివే మరికొన్ని ఇక్కడ

వీటిలో కొన్ని Indian Minerva గారి Fashionable/Radical section లోకి తోసేయ్యోచ్చు. ఏదో టీవీ ప్రోగ్రామ్స్ మీద ఇలాంటి అభిప్రాయాలు ఉంటె పర్లేదు కాని, పోలిటిక్స్ లో ఇలాంటి అభిప్రాయాలు పూర్తీ యదార్థం తెలుసుకోనీకుండా అడ్డుపడతాయి, ఆడవాళ్ళందరూ వంటిట్లో వంట లేకపోతే స్కూల్ టీచర్ గానే పనికి వస్తారు అని చిన్నపటినుంచి వింటూ వస్తున్న వ్యక్తికీ అధికారం ఇస్తే ? అలాగే , ముస్లిమ్స్ అందరు చెడ్డవాళ్ళు అని నమ్మే వ్యక్తి Minister of External affairs అయితే ? సీమంధ్రవాళ్ళు అందరు దొంగలు అని లేదా తెలంగాణా వాళ్ళు మూర్ఖులు అని నమ్మే వ్యక్తీ కి ప్రత్యెక తెలంగాణా సమస్య మీద పెట్టిన కమిటీ లో చోటు వస్తే ?

5 comments:

నీహారిక said...

మీరు ఎపుడూ చాలా వాస్తవంగా వ్రాస్తారు, ! కింగ్ కదా మరి, ఈ కింగ్ ఎపుడూ ఇతరులను గెలిపిస్తాడు, అందుకే సంజూ ఎపుడూ గ్రేటే !!!

నీహారిక said...

స్కూల్ లో నేను బాగా అల్లరి చేస్తున్నానని మా టీచర్ నన్నే "లీడర్" ని చేసేసింది. ఇక అల్లరేం చేస్తాను నా బొంద ???

Indian Minerva said...

Yaa... generalization మర్చిపోయాను. Thank you

Praveen Mandangi said...

రంగు అనేది జెనరలైజేషన్ అని అనుకోలేము. మీరు చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాకి వెళ్ళండి. అక్కడ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ మంది నల్లగా కనిపిస్తారు కానీ జగ్‌దల్‌పుర్ పట్టణంలో ఎక్కువ మంది తెల్లగానే కనిపిస్తారు. అది గిరిజన ప్రాంతం కానీ జగ్‌దల్‌పుర్ పట్టణంలో ఎక్కువగా స్థిరపడింది అగ్రకులాలవాళ్ళు. మొన్న లోహండిగూడ దగ్గర పోలీసులు నన్ను ఇంక్వైరీ చేసినప్పుడు నేను ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చానని చెపితే నమ్మలేదు. వాళ్ళు నా తెల్లని ముఖ ఛాయ చూసి అలా అనుకున్నారు.

tankman said...

@నీహారిక ... thankyou

@indian minerva .. :)

@praveensarma .. thats my point, we cant generalize :D