Friday, November 25, 2011

వాల్మార్ట్ కిరాణా & జనరల్ స్టోర్స్

వాల్మార్ట్ వస్తే మన కిరాణా & జనరల్ స్టోర్స్ మూత పడతాయా ? ఇన్ని మోర్ సూపర్ మార్కెట్స్ ఉన్నా చావని కిరాణా కొట్టు , వాల్మార్ట్ కి తల వంచుతుందా ?

pepe jeans, reebok , nike , adidas , peter england , van heusen and pan america brands రావటం వల్ల , మన చర్మాస్ , kumar shirts, jc brothers, bommana brothers, neerus , పుచ్చల సిల్క్స్ , రాజమండ్రి లో సినిమాలు , టీవీ సీరియల్ పేర్లతో చీరలు అమ్మే దుకాణాలు నడవడం మనేసాయా?

పది సంవత్సరాల క్రితం కంపూటర్లు వల్ల ఉన్న ఉద్యోగాలు పోయి, నిరుద్యోగం పెరుగుతుంది అన్న వాదన నిజమయినదా ? అప్పుడు ప్రజలు భయపడినట్టే  జరిగిందా ?

ఇలా వాల్మార్ట్ రాగానే అలా ప్రజలంతా అక్కడికి వెళ్లి ఉప్పులు పప్పులు కొంటారా ? ఎక్కడో ఉండే వాల్మార్ట్ కి వెళ్లి VAT తో కలిపిన బిల్ కడతారా లేక ఇంటిదగ్గర కిరాణా కొట్టులో బిల్ లేకుండా కొంటారా ?


11 comments:

Saahitya Abhimaani said...

"...ప్రజలు భయపడినట్టే జరిగిందా....." ప్రజలు ఎప్పుడూ ఇలాంటి వాటి గురించి భయపడలేదు. ప్రజలను తమ ఊహా భయాలతో ఉద్రేకపరచాతానికి ఒక పార్టీ ఆ పార్టీ తైనాతీలు మాత్రమె ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయి.

నిన్న టి వి నైన్ లో ఇదొక వార్తగా చెప్పకుండా, ఫలానా ఫాలానా పార్టీలు వ్యతిరెకించినా సరే ఈ బిల్లు పాస్ చేసారు అని ఒకటే గోల. 500+ సభ్యులు ఉన్న లోక్ సభలో గట్టిగా ఇరవై మందికూడా సభ్యులు లేని పార్టీ వద్దంటే మానేయ్యాలా, వాళ్ళు ఇమ్మంటేనే ఇవ్వాలా? ఇక మెజారిటీ సభ్యులు దేనికి?

Saahitya Abhimaani said...

మనకున్న వామపక్ష మీడియా (మీడియాలో ఉన్న వాళ్ళ సానుభూతిపరులు, కోవర్టులు) నాణానికి రెండో వైపు పట్టించుకోరు.

చిన్న రిటైల్ దుకాణదారులు అదేమీ పెద్ద విషయం కాదన్నట్టుగా చేస్తున్న మోసాలు:

1 తూకాల్లో మోసాలు.
2 చిల్లరగా కొనుక్కునే తిండి వస్తువులు, బియ్యం, పప్పులు వగైరాలో కల్తీ
3 ఇష్టం వచ్చిన లాభాలు వేసుకుని వినియోగదారుని దోచుకోవటం. ఎంత తక్కువ కొనేవాడు వెళ్తే అంత ఎక్కువ రేటు వెయ్యటం.
4 పాక్ చేసిన వస్తువులతోపాటు తయారీదారు ఇచ్చే ఉచితాలు దాచేసి ఇవ్వకపోవటం, అడిగి గోల చేసే వాళ్లకు కూడా కంపెనీ నుంచి రాలేదు అంటూ మోసగించటం
5 పనివేళలు, శలవలు లేకుండా తమ దగ్గర పనిచేసే వాళ్ళను కాల్చుకు తినటం.
6 బిల్లు వ్రాయకుండా టాక్స్ ఎగ్గొట్టటం, మనదగ్గర మాత్రం ఆ టాక్స్ వసూలు చెయ్యటం.
7 నకిలీ వస్తువులు అంటగట్టటం
8 దొంగ లెక్కలు వ్రాసి ఆదాయపు పన్ను ఎగవేయ్యటం.
9 బాగాలేని వస్తువు తిరిగి ఇవ్వటానికి వెళ్ళిన వినియోగదారుడిని, నా దగ్గర కొనలేదు ఫో అనటం, దీనిని నివారించటానికి ముందుగానే బిల్లు ఇవ్వ మంటే ఇవ్వకపోవటం, పైగా టాక్స్ అంటూ బూచిని చూపింఛి భయపెట్టటం. ఆ టాక్స్ అప్పటికే మనం కట్టే రేటులో కలిపేసే ఉంటుంది, బిల్లు ఇవ్వ కుండా ఆ టాక్స్ మొత్తం కూడా జేబులో వేసుకోవటం, దీనికి తనకొచ్చే లాభంల్ నుంచి ఒకటో రెండో శాతం సేల్స్ టాక్స్ వాళ్ళ చేతులు తడపటం ఈ అవినీతి ఎవరు అంతం చెయ్యగలరు!
9 తన కొట్టు కొద్దిగా ఎదగగానే, పక్కన ఉన్న లేదా కొత్తగా వచ్చిన కోట్లను అక్కడనుంచి తరలింప చేసే యత్నాలు, చాలా సార్లు లోకల్ గూండాలతో కలిసి ఈ పనులు చేయించటం

ఇంకా ఇలా చాలా.....

ఇవన్నీ ఇప్పుడు వచ్చే లేదా రాబొయ్యే మాల్స్ లో జరగవని కాదు, రెండిటిల్లో వినియోగదారునికి ఏమిటి పెద్ద తేడా??

చైనా నుంచి వెల్లువలా వస్తున్న చెత్త సరుకులు ముఖ్యంగా ఎలెక్ట్రానిక్ మరియు ఎలెక్ట్రికల్ వస్తువుల గురించి ఎవ్వరూ వ్రాయరు. వీటివల్ల మన దేశీయ పరిశ్రమలు,అందునా కుటీర పరిశ్రమలు మూతపడే స్థితి వచ్చింది.

మనకున్నంత "Misplaced sympathies" ముఖ్యంగా ఆసమర్ధుల మీద, అసాంఘిక శక్తుల మీద, టెర్రరిస్టుల మీద, విదేశీ ఇజాల మీద ప్రపంచంలో మరి ఏ ఇతర సమాజం లోనూ ఉండి ఉండదు.

నీహారిక said...

చైనా సరుకులు వద్దనుకుంటే ఇక్కడ ఆ సరుకులు, ఆ నాణ్యతతో, ఆ రేటుతో అందించగలగాలి కదా???

మీకోసం బ్లాగులో చైనా కి సంబందించిన ఫోటోస్ పెట్టారు చూడండి, అలా పద్ధతిగా మనం ఎప్పుడు ఉంటాం?

మంత్రులందరూ పర్యవేక్షణ పేరిట ఇతరదేశాలకు వెళ్తూనే ఉంటారు, కానీ జనం మారనిదే ఎవరు మాత్రం ఏం చేస్తారు?

అందరికీ ఎవరో వచ్చి ఏదో చేయాలనే ద్యాసే కానీ మనమేమి చేస్తున్నాం అని ఒక్కరు కూడా ఆలోచించకపోవడమే భారత దేశం చేసుకున్న దౌర్భాగ్యం !!!

Mauli said...

హ హ, వాల్మార్ట్ వస్తున్నది ఇప్పుడు అయినా, వచ్చే ముందే ప్రభుత్వం లో పెద్దలంతా కుమ్ముక్కయ్యి NMART ని దేశం లో వదిలారు(ఒకరు ప్రతిభా పాటిల్ తమ్ముడు ) . ఇప్పటికే గ్రామస్థాయి లోకి నెట్వర్క్ మార్కెటింగ్ చేసేసారు. ఒక నాలుగైదు సంవత్సరాలు వాళ్ళ దగ్గరే సరుకులు కొనాల్సి వచ్చేలా సెట్ చేసేసికొన్నారు గిఫ్టులు ఆస చూపి. కిరానా వ్యాపారులు కి పోటి ఉంటుంది కాని వాల్మార్ట్ దెబ్బ వీళ్ళ దాకా రాదు. తర్వాతి తరం అదే వ్యాపారం చెయ్యలేక పోవచ్చు నేమో, స్వయంకృతాపరాధమే అంతా.

tankman said...

@sivarama prasad ..... "Misplaced sympathies" totally agreed with it sir

@niharika .. :)

@mauli ... NMART & AMWAY చాలా ఉన్నాయి కదండీ

Indian Minerva said...

ఈ విషయంలో రెండు వాదనలూ validగానే అనిపిస్తున్నాయిగానీ. ఈ సోకాల్డు చిన్నవ్యాపారులేమో మోసాలుచెయ్యటం మానరు. అంటే వీళ్ళు మనకు ఏ మేలు చెయ్యరు వీళ్ళ మేలు కోసం మాత్రం మొత్తం దేశం కదిలిరావాలి. I think, this is quite common in our country. Consider the case of govt. employees, they don't show much of an efficiency (most of them) yet they oppose privatization. From a consumer point of view, I don't care who sells me as long as I'm being fooled.

మా వీధి చివరున్న బేకరీవాడికి MRP అంటే ఏమిటి? దానికంటే ఎక్కువధరకంటే ఎక్కువధరకి ఎందుకు అమ్మలేవు? అన్నవిషయంలో చాలావాదనలు సాగాక విసిగిపోయి బిగ్‌బజార్‌లొ కొంటున్నాను పాలు,కూల్‌డ్రింక్సూ, ఇతరములూనూ.

Saahitya Abhimaani said...

"చైనా సరుకులు వద్దనుకుంటే ఇక్కడ ఆ సరుకులు, ఆ నాణ్యతతో, ఆ రేటుతో అందించగలగాలి కదా???

రూపాయి వస్తువు ఐదు పైసలకి ఇస్తున్నాడు కదా అని నాణ్యం ఏమీ లేకపోయినా,చౌక అని చూసుకుని(వెర్రివాడిలా స్నేహ హస్తం ఇచ్చిన అప్పటి ప్రధానిని వెన్నుపోటు పొడిచి మన మీద దాడి చేసిన దేశం, ప్రస్తుతానికి అరుణాచల్ వరకూ వాళ్ళదే అని చూపించుకుంటున్న దేశం-తరువాత్తరువాత ఎక్కడిదాకా వాళ్ళ దేశం అని ప్రచారం మొదలుపెడతాడో మరి!!-మన మీద టెర్రరిస్టు దాడులు చేస్తున్న దేశానికి సహాయం చేస్తున్న చైనా) వస్తువులు ఎగబడి కొనేవాళ్ళు, ఈ మార్టుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం.చైనా "గొప్ప" వస్తువుల ఫొటోలు చూపిస్తే వాటి తలతన్నే ఫొటోలు బోలెడున్నాయి. అది కాదు పాయింటు ఇక్కడ. చైనా వాడు అలా తన చెత్త సరుకుల్ని "చౌక" ఎర పెట్టి మన మీద ఎందుకు డంప్ చేస్తున్నాడు అని, నేను తప్ప ఎవరూ ఆలోచించటంలేదు బాధ పడుతున్న తెలివిగలవాళ్ళు ఆలోచించటం మొదలు పెట్టాలి కదా మరి.

మనకి మనం ఒక దేశంగా అలోచించగల సమయం ఎక్కడున్నది. అలా ఎప్పుడో ఒక వెయ్యి సంవత్సరాల క్రితమో అంతకన్న ఎక్కువ సమయానికి ముందో విదేశీ దురాక్రమణలు జరగని రోజుల్లో, ఆ తరువాత బ్రిటిష్ వాళ్ళకి బానిసత్వం చెయ్యని రోజుల్లో ఉన్నది. అప్పుడు మన ఆలోచనలు సవ్యంగానే ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత శొషలిజమనీ దాన్ని తిరగేసి బోర్లేసి ఇంకా అనేకానేక పనికి రాని విదేశీ భావాల బానిసలను చేశారు. ఇప్పుడు ఎవడు రూపాయికి కిలో బియ్యం ఇస్తాడా అని చూడటమే నేర్పారు, పైగా అవ్వి సంక్షేమ పథకాలుట!ఇప్పుడిప్పుడే ఈ తరహా ఆలోచనలు మెల్లిగా మార్తున్నాయి. ప్రజలు కూడా ఆలోచించే అలవాటు చేసుకుంటున్నారు.

కొన్నీ పార్టీలు వాళ్ళు ప్రభుత్వంలో లేనప్పుడు విమర్శించిన విషయాలు, తాము పవర్లోకి రాంగానే అవ్వే కార్యక్రమాలు కొనసాగిస్తాయి. ఈ ద్వంద వైఖరి పోవాలి. ప్రభుత్వ ఏమి చేసినా ప్రజల ఉపయోగార్ధం చెయ్యాలి కాని తమ ఇజాలను మన నెత్తి మీద రుద్దటానికి కాదు.


ప్రజలు, ఓటెయ్యటం ఇన్సల్టుగా అనుకుని ఆరొజు సినిమాకి వెళ్ళే మన డ్రాయింగ్ రూం మేధావుల కన్నా ఎంతో తెలివిగలవాళ్ళు. వాళ్ళకి ఏమికావాలో అది తీసుకుని వాళ్ళకి ప్రమాదం అనుకున్నది వెంటనే తన్ని తగలేస్తారు.దీనికోసం పార్లమెంటులో పదోవంతు సభ్యులు కూడా లేని పార్టీలు ప్రజల తరఫున వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నట్టుగా భ్రమ కలిగించటం మానుకోవాలి. వాళ్ళ అల్లరి మరీ హాస్యాస్పదం అయిపోయింది. వాళ్ళ తండ్రి దేశంలో సంస్కరణల పేరిట వస్తున్నవి అన్నీ మంచిట, మన దేశంలో ప్రజా వ్యతిరేకమట. దీనికి రైట్ వింగ్ అని పేరెట్టుకున్న ఒక పార్టీ, ప్రతిపక్షం అంటే ప్రభుత్వం ఏమి చేసినా సరే వ్యతిరేకించాలి అన్న "మానియా" నుంచి బయటపడే పరిపక్వత ఇంకా రాని పార్టీ లోపాయికారీ మద్దతు. చిత్రం!

ఏది ఏమైనా ప్రస్తుతం చిన్న షాపులు వాళ్ళ పొట్ట కొడుతున్నారు ఈ మార్టులు వచ్చి అన్నప్పుడు, ఈ సో కాల్‌డ్ చిన్న షాపులు వినియోగదారుల పొట్ట దశాబ్దాలుగా కొడుతూనే ఉన్నారు. ఆ విషయం కూడ చర్చకి రావాలి. చిన్న పచారి కొట్లకు మద్దతుగా ప్రజలు ఎందుకు రావటం లేదు, మాల్స్/మార్టుల వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అన్న విషయం ఊరికే అల్లరిగా వ్యతిరేకించే వాళ్ళు, వాళ్ళకి అలవాటు లేని పనైనా సరే, ఆలోచించి తీరాలి.

సారీ సంజీవ్ గారూ, మీరు వ్రాసిన వ్యాసం కన్నా నా స్పందన ఎక్కువ అయిపోయింది.

Unknown said...

అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల ప్రకారం చైనా వాళ్ళ వస్తువులు మన దేశం లోకి కీపలు తెప్పలుగా వచ్చి పడుతున్న మాట వాస్తవం. కానీ క్వాలిటీ గురించి ఆలోచించే భారతీయ్లు చైనా వాళ్ళ వస్తువులని ఏవో ఆట బొమ్మలు చిన్న చిన్న వస్తువులు తప్ప మిగ్లిన వాటిని తిరస్కరిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి చైనా వారి మోటార్ సైకిల్. ఇంకొక విషయం. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మాస్ ప్రొడక్షన్ లో మునిగి ఉంది. దానితో పాటుగా వాళ్ళకి సరియైన ఎక్కౌంటింగ్ సిస్టమ్ లేదు. మన దేశంలో చచ్చుదో పుచ్చుదో ఒక ఎక్కౌంటింగ్ వ్యవత ఉంది అందుకే మన వాళ్ళు తయారుచేసే వస్తువు యొక్క మూల్యాన్ని లెక్కలోకి తీసుకొని దానికి రేటు ఫిక్స్ చేస్తారు. అందుచేత మన ఆర్థిక వ్యవస్థ సరియైనది. ఇంకా చైనా విషయానికి వస్తే, సరియైన ఎక్కౌంటింగ్ లేక పోవడం తో వస్తువు యొక్క విలువని మదింపు చేయక ఎంతకీ తోస్తే అంతకి తెగనమ్ముతున్నారు. ఇది నేచురల్ రిసోర్సెస్ ఉన్నంతవరకూ బాగానే నడుస్తుంది. ఎప్పుడయితే దేశీయంగా రిసోర్సెస్ తగ్గడం మొదలుయావుతుందో దాని వలన బయటి నుండి ముడి సరుకులు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు తమ వద్ద తగిన ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడతారు. ఆ పైన తాము తయారు చేసే వస్తువుల నాణ్యతా సరిగా లేని కారణం గా వాటిని ఎవరూ కొనరు. ఆ స్థితిలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఈ రోజు మన కన్నా ఎక్కువ విదేశీ మారకం చైనా వద్ద ఉండవచ్చుగాక కానీ ఎప్పుడయితే బయటి నుండి రిసోర్సెస్ ని కోనాల్సి వస్తుందో అప్పుడు చాలా కష్టమవుతుంది.

Unknown said...

అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల ప్రకారం చైనా వాళ్ళ వస్తువులు మన దేశం లోకి కీపలు తెప్పలుగా వచ్చి పడుతున్న మాట వాస్తవం. కానీ క్వాలిటీ గురించి ఆలోచించే భారతీయ్లు చైనా వాళ్ళ వస్తువులని ఏవో ఆట బొమ్మలు చిన్న చిన్న వస్తువులు తప్ప మిగ్లిన వాటిని తిరస్కరిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి చైనా వారి మోటార్ సైకిల్. ఇంకొక విషయం. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం మాస్ ప్రొడక్షన్ లో మునిగి ఉంది. దానితో పాటుగా వాళ్ళకి సరియైన ఎక్కౌంటింగ్ సిస్టమ్ లేదు. మన దేశంలో చచ్చుదో పుచ్చుదో ఒక ఎక్కౌంటింగ్ వ్యవత ఉంది అందుకే మన వాళ్ళు తయారుచేసే వస్తువు యొక్క మూల్యాన్ని లెక్కలోకి తీసుకొని దానికి రేటు ఫిక్స్ చేస్తారు. అందుచేత మన ఆర్థిక వ్యవస్థ సరియైనది. ఇంకా చైనా విషయానికి వస్తే, సరియైన ఎక్కౌంటింగ్ లేక పోవడం తో వస్తువు యొక్క విలువని మదింపు చేయక ఎంతకీ తోస్తే అంతకి తెగనమ్ముతున్నారు. ఇది నేచురల్ రిసోర్సెస్ ఉన్నంతవరకూ బాగానే నడుస్తుంది. ఎప్పుడయితే దేశీయంగా రిసోర్సెస్ తగ్గడం మొదలుయావుతుందో దాని వలన బయటి నుండి ముడి సరుకులు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు తమ వద్ద తగిన ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడతారు. ఆ పైన తాము తయారు చేసే వస్తువుల నాణ్యతా సరిగా లేని కారణం గా వాటిని ఎవరూ కొనరు. ఆ స్థితిలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఈ రోజు మన కన్నా ఎక్కువ విదేశీ మారకం చైనా వద్ద ఉండవచ్చుగాక కానీ ఎప్పుడయితే బయటి నుండి రిసోర్సెస్ ని కోనాల్సి వస్తుందో అప్పుడు చాలా కష్టమవుతుంది.

Anonymous said...

బయట దేశాల మార్టులు ఉండాలా వద్దా అనేది తరవాత, ముందర అసలు విచిత్రమేమంటే ఈ మార్టులను వ్యతిరేకించేవారే చైనా వస్తువులు వాటి అందాలు, చవుక, పద్దతి అంటూ ఎలిగెత్తి అరుస్తున్నారు. ఏవండోయ్ చైనా మన దేశం కాదు... పైగా మిత్ర దేశం కూడా కాదు....మనకు స్వతంత్రం వచ్చిన కొత్తల్లొనే కుతంత్రంతో మనని మింగాలని చూసిన దిక్కుమాలిన ద్రోహ బుద్ధి గల దేశం. వాళ్ళ వస్తువులను కొనడమంటే మన డబ్బులతోనే మన శత్రువులను బలపరచటం అన్నమాట. స్వతంత్ర ఉద్యమంలో విదేశీ [బ్రిటీష్] వస్తువులను త్యజించి వాళ్ళకు బుద్ధి వచ్చేట్లు[ఆదాయం పోయేటట్లు]చేశారు మన నాయకులు మరియు ప్రజలు.

మన దేశం యొక్క కొనుగోలు శక్తి ఎక్కువ. అందుకని అనేక దేశాలు ఎగపడుతున్నాయి. అవే ఈ మార్టుల గోల. ఏది ఏమైనప్పటికీ ఈ రకంగా బయట వ్యాపారస్తుల వలన మన దేశం వారు "యజమాని హోదా నుండి క్రింది స్తాయి ఉద్యోగులుగా" మారకుండా చూడాల్సిన బాధ్యత మన దేశం మీద తప్పకుండా వున్నది. అంటే మన దేశ ప్రజల ఆర్ధిక సావలంబన, స్వాతంత్రం వేరే వారి చేతిలో పెట్టే పొరబాటు "మళ్ళీ" చెయ్యకుండా జాగ్రత్తగా వుండాలన్నమాట.

tankman said...

@శివప్రసాదు గారు ..... చైనా చైనా అని ఎవరిన అంటే ఆ మాత్రం స్పందన ఉండాలి లెండి , లేకపోతే ప్రజలు సోశాలిసం కరెక్ట్ అని అనుకునే ప్రమాదం ఉంది :)

@రవీంద్రనాథ్ .... కొత్త పాయింట్ చెప్పారు and welcome to my blog

@radhakrishna ... :)