"వర్తకం పేరుతో వచ్చి భారత దేశాన్ని బానిసత్వపు సంకెళ్ళతో కేట్టేసిన తెల్ల కుక్కలు " --------- అసలు కత్తి డయలాగు ఇది. కాని దీన్లో మొత్తం నిజం ఉందా ?
FDI , international trade అనగానే , మళ్ళి మిగతా ప్రపంచంతో వర్తకం చేయడం వల్ల భారతదేశం తన స్వయంప్రతిపత్తిని కోల్పోతుందా అనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి అని నాకు ఈ మధ్యనే అర్థం అవుతోంది.
వర్తకం చేయడం వల్ల మనం స్వతంత్రాన్ని కోల్పోలేదు . మిరియాలు, ఏలకులు , నల్ల మందు వర్తకం జరిగినంత కాలం బాగానే ఉంది. ఎప్పుడయితే బ్రిటిషు వారికి , ఫ్రెంచు వారికి , కోటలు కట్టుకోడానికి, ఇక్కడ వాళ్ళు సైన్యం మైంటైన్ చేయడానికి అనుమతి ఇవ్వబడిందో , ఎప్పుడయితే ఇంకో భారత దేశ రాజుని ఓడించడానికి వాళ్ల సహాయం తీసుకుని, తమ రాజ్యం లో కప్పం వసూలు చేసుకోడానికి అనుమతి ఇవ్వడం మొదలు పెట్టారో అప్పుడు భారత దేశం స్వతంత్రం కోల్పోడం మొదలు పెట్టింది.
కాని ఇప్పుడు అదే పరిస్థితి ఉందా ? వచ్చిన MNC's కి tax వసూలు చేసే అధికారం , వారి సొంత ఆర్మీ పెట్టుకునే అధికారం లేనంత కాలం , FDI అనేది బానిసత్వంని భారతదేశం మీదకి రుద్దుతుంది అని భయపడక్కర్లేదనుకుంటా .
అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి , ఒప్పుకుంటా . కాని సరయిన పాఠం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి మోసం చేసాడు అని , ఇక ఎవరితోను మాట్లాడను, ఎవరి మాటా వినిపించుకోకుండా చేవుల్లు దూదులు పెట్టుకుని మాత్రమే తిరుగుతా అనడం సరి కాదు , ఎదుటి వాడు నిజం చెబుతున్నాడా లేదా అని తెలుసుకోగలిగే విజ్ఞత తెచ్చుకోవడం సరి అయిన పాఠం

4 comments:
బాగా చెప్పారు. ఈ ఎఫ్ డి ఐ అంతా చైనా నుంచి మాత్రమె అని ఒక చిన్న సవరణ చేస్తే, గోల గోలగా ఇప్పుడు అరిచే వాళ్ళల్లో చాలా భాగం నోళ్ళు మూసుకు ఊరుకుంటారు.ఎందుకని అలా మూసుకుంటారో, ఆ కారణమే దేశానికి ఎంతో ప్రమాద కారి.
బిజెపి ఎందుకు ఈ విషయంలో ఆడిపోతున్నది? వాళ్లకి ఉన్న మద్దతుదారుల్లో ఎక్కువమంది ఈ చిన్న దుకాణదారులే.
నా ఉద్దేశ్యంలో ఒక విషయం గురించి మాట్లాడుకునేప్పుడు, ఒక ఇజం మీది భ్రమతో మాత్రమె ఆలోచిస్తే మంచిది కాదు. అలాగే ఎ పార్టీ అయినా తమకు విరాళాలు ఇచ్చేవాళ్ళు, తమకు మద్దతు ఇచ్చే వాళ్ళ గురించి మాత్రమె ఆలోచిస్తే తప్పు. పూర్తీ జన బాహుళ్యానికి జరిగే నష్టాలు ఏమిటి, ఊహా జనితమైనవి కాకుండా), నిజమైన చర్చ నిస్పక్షపాతంగా ఆలోచించి ఆ చర్చ జరపాలి. అప్పుడే ఒక ఏకాభిప్రాయం ఏర్పడుతుంది . లేకపోతె ఈ చర్చల పేరిట జరిగే అల్లరి ఎప్పటికీ పోదు.
ఈ విషయంలో నాకో అనుమానం. ఈ FDIలు ఇక్కడి వ్యాపారస్తులనుండి పోటీని పూర్తిగా తొలగించుకున్నాక ఒక్కసారిగా రేట్లు పెంచేస్తే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోగలం? ఒకప్పుడు మనం తిరస్కరించిన terminator seeds వంటివాటిని వీళ్ళు ఇక్కడ విస్తరింపజేస్తే మన పరిస్థితి ఏమిటి? ఉద్యోగాలు కల్పించలేని ప్రభుత్వాలు, ఇలా ఉపాధి అవకాశాలనుకూడా కాలరాయడం ఏమాత్రం న్యాయం? వినియోగదారుడు హెచ్చుధరలనుంచి ఉపశమన్మ్ లభిస్తుందన్న ఒక్క విషయంతప్ప దీనివల్ల మన లాభం చేకూరే విషయాలింకేమున్నాయి?
@శివరామప్రసాదు .... కరెక్టుగా చెప్పారు సర్
@indian minerva ...FDI అనగానే, విదేశీ కంపెనీ ఒకటి వచ్చి , ఆ రంగం లో ఉన్న జాతీయ సంస్థలని తుడిచిపెడుతుంది అన్నది ఊహా జనితమయిన కమ్యునిస్టు ఆలోచన . ఆటోమొబైల్ రంగం లో హోండా భాగం ఎంత ? మారుతి బాగం ఎంత? బజాజ్ భాగం ఎంత ? అలాగే , బ్యాంకింగ్ రంగం లో సిటి బ్యాంకు ఎంత మార్కెట్టుని ఆకట్టుకోగలిగింది? పూర్తిగా విదేశీ సంస్థల అధీనం లో ఉన్న సెల్ ఫోన్ మార్కెట్ లో , micromax కేవలం ఒక్క సంవత్సరం లో 4% share ని ఎలా సాధించగలిగింది ? ... vodafone, docomo లాంటి విదేశీ సంస్థలు వచ్చినా , airtel కే ఎందుకు ఎక్కువమంది subscribers ఉన్నారు ?
FDI అనగానే , ఆ రంగం లో ఆ సంస్థ తన ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేయ్యోచు అని కాదు కదా....కిరాణా కొట్టు వాడయినా, వాల్మార్టు అయినా MRP ని follow అవ్వవలసిందే ...
ప్రభుత్వమే అందరికి ఉద్యోగాలు కల్పించాలి అంటే , మనం అందరం employment exchange లో రిజిస్టర్ అయ్యి , చకోర పక్షుల్లా కూర్చోవాలి. భారత దేశం లో 1991 ముందు , 91 తర్వాత నిరుద్యోగ శాతం చూడండి మీకే అర్థం అవుతుంది liberalization మంచిదా కాదా అని
Good one!!!
Post a Comment