ఇబ్రహింపట్నం అవతల రాచకొండ అనే ఒక ఊరుంది. అక్కడో పెద్ద కోట కూడా ఉంది, చాలా పాత కోట, చాల పెద్ద కోట, గోల్కొండ కన్నా పెద్దది. ఆ కోటలో లంకెబిందెలు ఉన్నాయని ప్రజల నమ్మకం. కోట మొత్తం బంగారు నాణేల కోసం , నిధులు కోసం తవ్విన గుర్తులు కనిపిస్తాయి. ఇప్పటికి అక్కడ తవ్వకాలు సాగుతున్నాయి.
కోటకి ఆవలి వైపు, ఎవడో నిధి కోసం తవ్వడం మొదలు పెట్టాడు, తవ్విన చోట ఒక పెద్ద శివలింగం బయటపడింది. బయటకి తీసుకు వచ్చి రోడ్ పక్కన పెట్టాడు . ఇది జరిగి అటు ఇటు గా ఒక ఇరవయి రోజులింది.
కోట చూద్దామని నిన్న బయలుదేరాం ఫ్రండ్స్ అందరం. ఆ చుట్టుపక్కల తెలిసిన ఒక ఫ్రండ్ కూడా వచ్చాడు. తిన్నగా శివలింగం దొరికిన చోటుకి తీసుకెళ్ళాడు . అక్కడో చిన్న సైజు జాతర లాంటిది నడుస్తోంది. దొరికిన శివలింగం పైన చిన్న టెంటు లాంటిది వేసారు. శివలింగం సైజు హుండీ ఒకటి ఎదురుగా పెట్టారు . టీవీ వాళ్ళు ఎవరో వచ్చి ఇంటర్వ్యూ కూడా తీస్కున్తున్నారు.
విషయం ఏమిటంటే , అక్కడ ఒక దాని మీద ఒకటిగా రాళ్ళూ పేర్చిన వారికీ మనసులో కోరికలు నెరవేరుతాయని పుకారు స్టార్ట్ అయ్యింది. మాతో వచ్చిన ఫ్రండ్ చెప్పాడు, ఆ నమ్మకం పోయినవారం వచ్చినపుడు లేదంట. సో ఫ్రెష్ నమ్మకం.
మాతో పాటు వచ్చిన ఇంకో స్నేహితుడి పెళ్లి వచ్చే సంవత్సరం అయినా కావాలని , రాళ్లు పేర్చి , దండం పెట్టి వచ్చాం .

No comments:
Post a Comment